
భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలి
రాజాపేట : రాజాపేట మండలాన్ని భువనగిరి డివిజన్‌లోనే కొనసాగించాలని కోరుతూ మండల కేంద్రంలో బుధవారం మండల సర్పంచ్‌ల ఫోరం ఆధ్వర్యంలో వినాయకుడికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగాం డివిజన్‌లో ఆలేరు, రాజాపేట మండలాలను కలపొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చామకూరు గోపాల్‌గౌడ్, మెండు శ్రీనివాస్‌రెడ్డి, గుంటి కష్ణ, గుర్రాల బాలమల్లు, మర్ల సిద్దిఎల్లయ్య, కోరుకొప్పుల శీరీష, ఉప్పరి లావణ్య, నాయకులు దాచపల్లి శ్రీనివాస్, ఉప్పరి నరేష్, కోరుకొప్పుల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.