
సాక్షి, భువనగిరి : పీసీసీ పదవిపై తనకు ఆశలేదని, ఆ పదవిపై ఉత్సాహం ఎవరికైనా ఉంటే వారికే ఇవ్వమని చెపుతానని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పీసీసీ కంటే ముఖ్యమైన ఎంపీ పదవిని భువనగిరి ప్రజలు తనకు ఇచ్చారని, వారికి సేవ చేస్తానని పేర్కొన్నారు.
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకోసం పోరాడినట్లుగా ప్రజలకోసం పోరాడుతానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపొందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు శుభాకాంక్షలు తెలిపారు. అధికారం అండతో కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఉరుకొమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment