కారు బోల్తా.. హైదరాబాదీ మృతి | one dies as car turns turtle in ananthapur district | Sakshi
Sakshi News home page

కారు బోల్తా.. హైదరాబాదీ మృతి

Published Tue, Oct 6 2015 9:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

one dies as car turns turtle in ananthapur district

పామిడి (అనంతపురం): అనంతపురం జిల్లాలోని పామిడి-కల్లూరు మధ్య జాతీయ రహదారిపై మంగళవారం కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో హైదరాబాద్‌కు చెందిన హరికుమార్(43) అనే వ్యక్తి మృతిచెందాడు. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు... భూభారత్ అనే ప్రైవేటు సంస్థలో హరికుమార్ పని చేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా సొంత కారులో స్నేహితుడు శ్రీధర్‌తో కలిసి మంగళవారం హైదరాబాద్ నుంచి కదిరిలో నిర్వహిస్తున్న రైతు క్షేత్ర అవగాహన సదస్సుకు వెళ్లారు. అక్కడ రైతులతో సమీక్ష అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యారు.
పామిడి- కల్లూరు మధ్య గడ్డిమోపుతో వెళ్తున్న మోపెడ్‌ను తప్పించబోయిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ముందు సీట్లో బెల్టు లేకుండా ప్రయాణిస్తున్న హరికుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పామిడి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. గార్లదిన్నె పోలీసులు కేసు నమోదు చేశారు. కారు నడుపుతున్న శ్రీధర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో సురక్షితంగా బయట పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement