చిత్తూరు: శ్రీవారిని దర్శించుకుని తిరిగి వస్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయట పడ్డారు. చిత్తూరు జిల్లాకు చెందిన నలుగురు భక్తులు ఆదివారం శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని తమ ఏపీ 03 బీహెచ్ 5918 నెంబరు గల వాహనంలో తిరుగు పయనమయ్యారు.
మార్గ మధ్యంలోని వినాయకస్వామి ఆలయం సమీపంలో వాహనం అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తాకొట్టింది. అదృష్టవశాత్తూ ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.