వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)ఇప్పటికే ప్రకటించగా ఆ వాదనను తాజాగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. కరోనా వైరస్ మనుషుల్లో దోమల ద్వారా సోకదని మొదటిసారిగా ధ్రువీకరించారు. జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్ కోవ్–2 వైరస్‌కు దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరి సోకే సామర్ధ్యం లేదని ప్రయోగాత్మకంగా రుజువైందని అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు సీఫెన్ హిగ్స్ వెల్లడించారు. దోమల్లో ప్రధానమైన ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ అల్బోపిక్టస్, క్యూలెక్స్ క్విన్‌క్వెఫాసియాటస్ రకాలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలిందన్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి రక్తాన్ని పీల్చినప్పటికీ ఈ రకం దోమలు ఆరోగ్యవంతుడికి ఈ వ్యాధిని వ్యాప్తి చేయలేక పోయాయని గుర్తించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment