Mosquitoes
-
బీమా సొమ్ముకు దోమ కాటు!
దేశంలో బీమా సొమ్మును దోమలు ఖాళీ చేస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లలో దోమల కారణంగా వచ్చే వ్యాధులది మూడో స్థానమంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దోమలతో వచ్చే రోగాల కేసులు అంతకంతకూ పెరుగుతుండగా.. అదే స్థాయిలో ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లూ రెట్టింపవుతున్నాయి. సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఆరోగ్య బీమా సంస్థ పాలసీ బజార్ ఇటీవల క్లెయిమ్స్‌పై దేశవ్యాప్తంగా అధ్యయనం చేసింది. దేశంలో హెల్త్ పాలసీలకు సంబంధించి ఏ ఏ వ్యా«ధులకు సంబంధించి క్లెయిమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై చేసిన సర్వేలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకొచ్చాయి. బీమా సంస్థలు నమోదు చేసిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌లలో దాదాపు మూడింట ఒక వంతు సీజనల్ అంటు వ్యాధులకే అవుతున్నాయని సర్వేలో తేలింది.వీటిలోనూ డెంగీ, మలేరియా తదితర సాంక్రమిత వ్యాధులదే అగ్రభాగంగా ఉంది. ప్రతి పది పాలసీల్లో 4 వరకూ దోమకాటుతో వచ్చే వ్యాధులవేనని పాలసీ బజార్ వెల్లడించింది. జూలై, ఆగస్ట్‌లలో ఎక్కువగా.. దోమకాటు కారణంగా క్లెయిమ్‌లు ఎక్కువగా రెండు నెలల్లోనే జరుగుతున్నాయి. జూలై, ఆగస్ట్‌లో వచ్చే క్లెయిమ్స్ దరఖాస్తుల్లో 60 శాతం వరకూ దోమకాటు వ్యాధులవే ఉన్నాయి. సెప్టెంబర్ లోనూ ఈ తరహా దరఖాస్తులు ఎక్కువగా వస్తున్నాయని సర్వేలో తేలింది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ దోమల బెడద ఎక్కువగా ఉందనడానికి ఇదే నిదర్శనంగా చెప్పొచ్చు. పాలసీ బజార్ ద్వారా నివేదించిన ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల అధ్యయనం ప్రకారం.. సీజనల్ వ్యాధుల క్లెయిమ్‌లలో డెంగీ, మలేరియా వంటి సాంక్రమిత వ్యాధులు 15 శాతం ఉన్నాయి. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల చికిత్సకు సాధారణంగా రూ.50,000 నుంచి రూ.1,50,000 వరకూ ఖర్చవుతోంది. జీర్ణకోశ వ్యాధులదీ అదే దారి.. వర్షాకాలంలో వచ్చే మరో అనారోగ్య సమస్య స్టమక్ ఫ్లూ వంటి జీర్ణకోశ వ్యాధులకూ క్లెయిమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీనికి మలేరియాతో సమానమైన చికిత్స ఖర్చులుంటాయి. సీజనల్ క్లెయిమ్‌లలో 18 శాతం ఈ వ్యాధికి సంబంధించినవే. కాలానుగుణ అనారోగ్య క్లెయిమ్‌లలో మరో 10 శాతం వివిధ అలెర్జీలకు సంబంధించినవి ఉన్నాయి. అదే విధంగా.. చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు, బ్రోన్కైటిస్ కారణంగా వచ్చే క్లెయిమ్‌లు 20 శాతం, సీజనల్ వ్యాధులకు మరో 12 శాతం క్లెయిమ్స్ జరుగుతున్నాయి. అయితే వీటి చికిత్స ఖర్చు రూ.25,000 నుంచి రూ.లక్ష వరకు మాత్రమే. సీజనల్ వ్యాధులకే ఎక్కువగా క్లెయిమ్‌లు దేశంలో సీజనల్ వ్యాధుల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ వీటి బారిన ప్రజలు ఎక్కువగా పడుతున్నారు. దీనివల్ల క్లెయిమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ వస్తోంది. ఇంతకు ముందు ఇళ్లల్లోనే చికిత్స పొందేవారు. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పెరగడం వల్ల ఏ చిన్న అనారోగ్యం వచ్చినా.. క్లెయిమ్ చేసుకోవచ్చనే ధీమాతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రులకు వస్తుండటం సానుకూల పరిణామంగా చెప్పొచ్చు. – సిద్ధార్థ్ సింఘాల్, పాలసీబజార్ ఇన్సూరెన్స్ హెడ్ -
డ్రోన్ల ద్వారా దోమలను కనిపెడదాం
సాక్షి, అమరావతి: ‘దోమలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను డ్రోన్ల ద్వారా గుర్తించి, ఆ ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మందు పిచికారి చేసి.. వాటిని చంపేసే వ్యవస్థను 2019కి ముందు ఉపయోగించాం. మళ్లీ అదే వ్యవస్థను తీసుకు వచ్చి డ్రోన్లతో దోమలను చంపేయాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో బుధవారం వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు రాష్ట్రంలో 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపారు. తొమ్మది మంది డయేరియాతో చనిపోయారన్నారు. ఈ నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల నియంత్రణకు 2014 నుంచి 2019 మధ్య అనుసరించిన విధానాలను మళ్లీ అనుసరించాలని వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. దోమల నియంత్రణకు అధునాతన సాంకేతిక పద్ధతులను వినియోగించాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో కలుషిత తాగునీరు, పారిశుధ్య లోపం, దోమల నివారణకు చర్యలు తీసుకోక పోవడం వల్లే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. రక్షిత తాగునీరు, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల బారినపడే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, వారిపై వైద్య, ఆరోగ్య శాఖ మరింత దృష్టి పెట్టాలని సూచించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే మాత్రం ఉపేక్షించబోనన్నారు. సీజనల్ వ్యాధుల నివారణలో మూడు శాఖలు సమన్వయంతో పని చేయాలని, అప్పుడే ఫలితాలు వస్తాయన్నారు. శాఖల మంత్రులు, అధికారులు దీనిపై ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని చెప్పారు. ఈ సమీక్షలో మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, మూడు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు సమయం లేదు మళ్లీ వింటా.. రాష్ట్రంలో త్వరలో వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల ప్రక్రియ మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ఫీజులు ఖరారు చేయడంతో పాటు, కొత్త వైద్య కళాశాలల్లో తరగతుల ప్రారంభం, ఇతర అంశాల్లో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నించగా ప్రస్తుతం సమయం లేదని, మళ్లీ వింటానని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పులివెందుల, ఆదోని, మార్కాపురం, ఆదోని, పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించాల్సి ఉంది. ఈ తరుణంలో ఆయా వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ నుంచి అనుమతులు రాబట్టడంతో పాటు, తరగతులు ప్రారంభించడానికి వీలుగా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వసతులు కల్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా అమరావతిపై శ్వేత పత్రం విడుదల చేసిన సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దోమలు అధికంగా ఉన్న 20 వేల ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో డ్రోన్లతో మందును పిచికారి చేస్తూ దోమలు లేని ప్రాంతాలను సున్నాకు తీసుకుని రావాలని ప్రణాళిక రచించామని చెప్పారు. -
ఒకేసారి 4 వేరియంట్ల దాడి
ఈ సీజన్లో తెలంగాణకు ‘డెంగీ’ ముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. కేసుల తీవ్రత ఈసారి ఎక్కువగా ఉంటుందని తెలిపింది. దేశంలో డెంగీ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఉన్నట్టు పేర్కొంది. ఈ మేరకు డెంగీ తీవ్రతపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. డెంగీలోని నాలుగు ప్రధాన వేరియంట్లు తెలంగాణలోనే కనిపిస్తున్నాయని వెల్లడించింది.డీఈఎన్‌వీ1, డీఈఎన్‌వీ2, డీఈఎన్‌వీ3, డీఈఎన్‌వీ4 ప్రభావం ఎక్కువగా ఉంటున్నట్టు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. కొన్నిసార్లు రెండుమూడు వేరియంట్లు కూడా ఒకేసారి దాడి చేసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించింది. ఫలితంగా డెంగీ బాధితులు తీవ్రమైన ఇబ్బందులు పడతారని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఆస్పత్రుల్లో అవసరమైన కిట్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 500కు పైగా డెంగీ కేసులు వెలుగు చూడడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్వైద్య పరీక్షలే కీలకం ⇒ డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్లెట్ కౌంట్, డెంగీ స్ట్రిప్ టెస్ట్, సీరమ్ టెస్ట్ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య,ఆరోగ్యశాఖ చెబుతోంది. ⇒ విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి. ⇒ ప్లేట్లెట్లు 20 వేలలోపు పడిపోతే అది ప్రమా దకరంగా భావిస్తారు. 15 వేల కన్నా తగ్గితే డెంగీ షాక్, డెంగీ మరణాలు సంభవిస్తాయి. ⇒ డెంగీ జ్వరం వస్తే తీవ్రతను తగ్గించేందుకు చల్ల ని నీటిలో స్పాంజీని ముంచి శరీరాన్ని తుడ వాలి. ⇒ ఎలక్ట్రాల్ పౌడర్, పండ్ల రసాలు రోగికి ఇవ్వాలి. దీనివల్ల జ్వర తీవ్రత తగ్గి ప్లేట్లెట్లు అదుపు లోకి వస్తాయి. ఇంకా తగ్గకుంటే వైద్యుని వద్దకు తీసుకెళ్లాలని వైద్య,ఆరోగ్యశాఖ సూచించింది. ⇒ వైరల్ ఫీవర్ నుంచి దూరంగా ఉండాలంటే ఫ్రైడే ను డ్రై డేగా పాటించాలి. ⇒దోమలు కుట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా దోమల మందులు వాడాలి. ⇒స్కూల్ పిల్లలకు దోమలు కుట్టకుండా పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ⇒కాచి వడగాచిన నీటిని తాగాలి. వైరల్ ఫీవర్ వస్తే విపరీతంగా మంచినీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి. దీనివల్ల ప్లేట్లెట్లు పడిపోకుండా ఉంటుంది.డెంగీ లక్షణాలు⇒డెంగీతో ఉన్నట్టుండి తీవ్రజ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది.⇒కళ్లు తెరవడం కూడా కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. ⇒చర్మంపై దద్దుర్లు అయినట్టు కనిపించడం, కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. ⇒అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది.ముందుగా గుర్తిస్తే ప్రమాదమేమీ ఉండదుఇక డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చని డాక్టర్లు అంటున్నారు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. ముక్కు నుంచి కానీ, మలం ద్వారాగానీ, బ్రష్ చేసేటప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధికంగా రక్తస్రావం అయితేనే ప్రమాదకరమని చెబుతున్నారు. మహిళలకు పీరియడ్స్ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అధికంగా అయ్యే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దాన్ని వారు గుర్తించాలని సూచిస్తున్నారు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ దోపిడీ...ఏటా డెంగీ జ్వరాలతో బాధపడేవారిని ప్రైవేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. డెంగీ విషయంలో సాధారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే 20 వేల వరకు ప్లేట్లెట్ల సంఖ్య తగ్గినా నష్టంలేదని, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు 50 వేల వరకు ప్లేట్లెట్లు తగ్గినా ఇబ్బంది లేదని వైద్య నిపుణులు అంటున్నారు. చాలా కేసుల్లో సాధారణ జ్వరానికి చేసే వైద్యమే సరిపోతుందని అంటున్నారు. కానీ అనేక ప్రైవేటు ఆస్పత్రులు 50 వేలకు పైగా ప్లేట్లెట్లు ఉన్నా ఐసీయూలో ఉంచి అదనంగా ప్లేట్లెట్లు ఎక్కిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. నాలుగైదు రోజులు ఉంచుకొని రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి. సాధారణ విష జ్వరాలకు కూడా నాలుగైదు రోజులు ఆస్పత్రుల్లో ఉంచుకొని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. డెంగీ ఉన్నా లేకపోయినా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నాయని, ప్లేట్లెట్లు ఎక్కువున్నా తక్కువ చూపిస్తున్నాయన్న ఫిర్యాదులు సర్కారుకు చేరాయి. -
ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు
పశ్చిమబెంగాల్లో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తనను కుట్టిన దోమలను బ్యాగ్‌లో నింపి వాటిని ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఈ విచిత్ర సంఘటన పుర్బా బర్దామన్ జిల్లాలో శుక్రవారం వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్లో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళకోట్‌లోని కుర్తుబా గ్రామానికి చెందిన మన్సూర్ అలీ షేక్.. తనను కుట్టిన దోమలను సేకరించి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. డెంగీ కేసులతో ఆందోళన చెందిన మన్సూర్.. భయంతో తనను కుట్టిన 25, 30 దోమలను చంపి వాటన్నింటిని ఓ పాలిథిన్ బ్యాగ్‌లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ జుల్ఫికర్ అలీ మన్సూర్‌ను చూసి ఎమర్జెన్సీ కేసు అనుకున్నాడు. కానీ అతని బ్యాగులో దోమలను చూసి వైద్యుడితోపాటు ఆసుపత్రి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తన పరిస్థితిపై మన్సూర్ మాట్లాడుతూ.. ‘నా దుకాణం పక్కనలో నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. దీంతో ఆ చుట్టుపక్కల దోమల బెడద ఎక్కువగా ఉంది. దీంతో వాటి బారి నుంచి రక్షించుకునేందుకు నన్ను కుట్టిన దోమలను చంపి కవర్లో వేసి ఆసుపత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు ఆ దోమలను పరీక్షించి సరైన వైద్యం అందిస్తారని ఇలా చేశాను’ అంటూ పేర్కొన్నాడు. అలాగే తమ ప్రాంతంలోని డ్రెయిన్‌ను వెంటనే శుభ్రం చేయాలని కోరాడు. ఈ ఘటనపై మంగళకోట్ అధికారి సయ్యద్ బసీర్ స్పందిస్తూ.. తక్షణమే ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని బ్లాక్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఆ ప్రాంతంలో దోమల సమస్యను అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, అలాగే నిలిచిపోయిన నీటి నివారణకు, దోమల నివారణ మందులను, బ్లీచింగ్ పౌడర్‌ను పంపిణీ చేస్తామని చెప్పారు. -
రాజమౌళి ఈగలాగ.. దోమలు కూడా రివెంజ్ తీర్చుకుంటాయా?
వర్షాకాలం వచ్చేసింది.. ఈ సీజన్లో దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే దోమలు మనుషులనే ఎందుకు కుడతాయి? ఎంతమంది ఉన్నా అదేపనిగా కొందరినే ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేస్తాయి? మరికొందరిని మాత్రం అస్సలు కుట్టవు ఎందుకో? ఇలా మనలో మనమే చాలాసార్లు ప్రశ్నలు వేసుకుంటుంటాం. అయితే నిజానికి ఈ విషయంలో దోమలకేమీ పక్షపాతం ఉండదట. దీని వెనుక సైన్స్ ఉందంటున్నారు పరిశోధకులు. మనకు నచ్చిన ఆహారాన్ని తీసుకున్నట్లే దోమలు కూడా వాటికి నచ్చిన వాళ్ల రక్తం తాగేస్తాయి. అంతలా దోమలను ఆకర్షించే అంశాలేంటి? దీని వెనకున్న స్టోరీ ఏంటీ చదివేద్దాం. ► సాధారణంగా దోమల్లో మగదోగమలు మనిషిని కుట్టవు. ఇవి చెట్ల రసాలపై ఆధారపడి జీవిస్తాయి. ఆడదోమల్లోనే మనిషిని కుట్టేందుకు అవసరమైన ముఖ విన్యాసం ఉంటుంది. అందువల్ల ఇవే మనిషి రక్తాన్ని పీలుస్తాయి.అట్లాగని రక్తం వీటి ఆహారం అనుకోవద్దు. కేవలం గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్ దోమలకు మనిషి రక్తం ద్వారా లభిస్తుంది. దీనికోసమే అవి మనుషులను కుడతాయి. Yesterday, we visited Kyenjojo SS who are making mosquito repellent Vaseline.In 2021, Uganda had the 3rd highest global burden of malaria cases (5.1%) and the 7th highest level of deaths (3.2%). In creating this Vaseline, the students are looking to prevent rather than cure. pic.twitter.com/97EEujl6Tl— Investors Club Ltd Ug (@InvestorsClubUg) July 12, 2023 ► ఏ, బీ బ్లడ్ గ్రూపుల వారితో పాటు ఏబీ పాజిటివ్ ఉన్న బ్లడ్ గ్రూపుల వారిని దోమలు ఎక్కువగా కుడతాయని కొన్ని అధ్యయానాలు చెబుతున్నాయి. ఎందుకంటే వీరి శరీరం నుంచి వచ్చే ఒక రకమైన వాసనను పసిగట్టి దోమలు అటాక్ చేస్తాయట. ► చర్మంపై సహజంగా లభించే యాసిడ్ల వచ్చే వచ్చే వాసనకు దోమలు ఆకర్షితమం అవుతాయని రాక్ ఫెల్లర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. ► ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేవారి శరీర ఉష్ఱోగ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు దోమ కాటుకు గురికాక తప్పదట. Imagine not killing a mosquito that is sitting on your arm sucking your blood pic.twitter.com/jv7ts5uSvt— greg (@greg16676935420) July 17, 2023 ► కార్బన్ డై ఆక్సైడ్ అంటే దోమలుకు అమితమైన ఇష్టం, ఎకువగా సిఓ2 వదిలేవాళ్ళ చుట్టూ దోమలు వాలిపోతుంటాయట. ► గర్బవతులు, ఒబేసిటీతో బాధపడేవారి రక్తంలో మెటబాలిక్ రేట్స్ అధికంగా ఉంటాయట. అందుకే వీరిని దోమలు టార్గెట్ చేస్తాయట. ► చెమట ఎక్కువగా వచ్చేవారిలో లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా రసాయనాల వల్ల దోమలు కుడతాయి. ► అంతేకాకుండా నల్లరంగు దుస్తులు ఎక్కువగా వేసుకుంటే దోమలు అట్రాక్ట్ అవుతాయట. దోమతెరల్లో ఎన్నో వినూత్న రకాలు, ఇవి ట్రై చేయండి The mosquitoes in Haiti would just fold it back https://t.co/RJi3hXsrQG— 💲LEX💲 (@Zoboylex) July 17, 2023 -
ఇది మీ ఇంట్లో ఉంటే.. దోమలు వాటంతట అవే చస్తాయి
-
మానవాళికి డెంగీ ముప్పు!
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా మానవాళికి డెంగీ ముప్పు పొంచి ఉంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా దోమలు, వైరస్ల వ్యాప్తి పెరగడమే ఇందుకు కారణమని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇటీవల వెల్లడించింది. దశాబ్దకాలంగా డెంగీ, జికా, చికున్ గున్యా వంటి ఆర్బోవైరస్‌ల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు భారీగా పెరిగాయని ప్రకటించింది. ఏడాదికి 100 మిలియన్ల నుంచి 400 మిలియన్ల వరకు ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయని ప్రకటించింది. ప్రస్తుతం జనాభాలో దాదాపు సగం మందికి డెంగీ సోకే ప్రమాదం ఉందని హెచ్చరించింది. డబ్ల్యూహెచ్‌వో వెల్లడించిన కొన్ని ముఖ్యమైన వివరాలు... ♦ అటవీ నిర్మూలన, పారిశుధ్యం, పట్టణీకరణ, నీటిపారుదలలో సమస్యలు దోమలవ్యాప్తికి ప్రధాన కారణం. ♦ ముఖ్యంగా అవపాతం(వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి ద్రవీకరించడం), ఉష్ణోగ్రత పెరుగుదల, అధిక తేమ వంటివి దోమల అవాసాలకు అనుకూలంగా ఉన్నాయి. ♦ ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరంలో డెంగీ కేసులు సుమారు 0.5 మిలియన్ నమోదవగా, 2019 నాటికి 5.2 మిలియన్లకు పెరిగాయి. 2023లోనూ ఇదే ఉధృతి కొనసాగుతోంది. ♦ ఈ ఏడాది దాదాపు 129 దేశాలు డెంగీ బారినపడే ప్రమాదం ఉంది. ఇప్పటికే 100కి పైగా దేశాల్లో డెంగీ వ్యాప్తి కనిపిస్తోంది. ♦ ఈ ఏడాది మార్చి చివరి వరకు ప్రపంచవ్యాప్తంగా 4,41,898 డెంగీ కేసులు నమోదవగా, 119 మంది మరణించారు. ♦ చికున్ గున్యా దాదాపు అన్ని ఖండాల్లో విస్తరించింది. ప్రస్తుతం సుమారు 115 దేశాల్లో దాని ప్రభావం ఉంది. -
చనిపోయిన దోమలను తీసుకుని కోర్టుకు హాజరైన గ్యాంగ్‌స్టర్
ముంబై: చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా నింపుకుని కోర్డుకు వచ్చాడు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా. వాటిని జడ్జికి చూపిస్తూ దోమతెర కావాలని కోరాడు. సదరు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. అతనిపై మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్డావాలాని 2020లో పోలీసులు అరెస్టు చేసి నావీ ముంబైలోని తలోజా జైల్లో పెట్టారు. ఈమేరకు లక్డావాలా సెషన్ కోర్టులో దోమతెర కావాలంటూ అప్పీల్ పెట్టుకున్నాడు. అందుకోసం అని కోర్టుకి చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్లో వేసుకుని తీసుకువచ్చి...కోర్టులో చూపిస్తూ తాను తన సాటి ఖైదీలు వీటితో ఇబ్బందిపడుతున్నామని చెప్పాడు. పోలీసులు భద్రతా దృష్ట్యా దోమతెరలు అందించడం లేదని వాపోయాడు. ఐతే కోర్టు ఆ ఆపీల్ని తిరస్కరించింది. దోమతెరకు బదులు ఓడోమోస్ వంటి దోమల నివారిణులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అంతేగాక జైలు అధికారులు దోమల బెడద అరికట్టే చర్యలను తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పలు ఫిర్యాదులు గతంలో కోర్టు ముంగిటకి వచ్చాయి. ఐతే వాటిలో కొందరికి దోమతెర వెసులుబాటు కల్పించారు కానీ కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వడం లేదు. (చదవండి: దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...) -
డెంగీ, చికున్‌గున్యా వ్యాధులకు చెక్.. ఐసీఎంఆర్ శుభవార్త
పుదుచ్చేరి: డెంగీ, చికున్‌గున్యా వ్యాధులతో సతమతమవుతున్న భారతీయులకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త శుభవార్త తెచ్చింది. ఈ రెండు వ్యాధుల వ్యాప్తికి కారణమయ్యే వైరస్లులేని లార్వాలను మాత్రమే ఉత్పత్తిచేసే ఆడ ఎడీస్ ఈజిప్టీ జాతి దోమలను ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి)లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వ్యాధికారక వైరస్లు ఉన్న మగ దోమలు ఈ ఆడదోమలతో కలిస్తే వైరస్‌రహిత లార్వాలు ఉత్పత్తి అవుతాయి. వీటిల్లో వైరస్లు ఉండవుకనుక వాటి నుంచి వచ్చే దోమలు డెంగీ, చికున్‌గున్యాలను వ్యాపింపచేయడం అసాధ్యం. డబ్ల్యూమేల్, డబ్ల్యూఅల్బీ వోల్బాకియా అనే రెండు కొత్త జాతుల ఆడ ఎడీస్ ఈజిప్టీ దోమలను శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు. ఇందుకోసం వీరు గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధనలో మునిగిపోయారు. అయితే, ఈ ప్రయోగానికి జనబాహుళ్యంలోకి తేవడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తి అధికంగా ఉన్న జనావాసాల్లో ప్రతీ వారం ఈ రకం ఆడదోమలను వదలాల్సి ఉంటుందని ఐసీఎంఆర్, వెక్టర్ కంట్రోల్ రీసెర్చ్ సెంటర్(వీసీఆర్సీ–పుదుచ్చేరి) డైరెక్టర్ డాక్టర్ అశ్వనీ కుమార్ చెప్పారు. చదవండి: దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో.. -
ఈ మగ దోమలు చాలా మంచివి.. యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట
కాలిఫోర్నియా వీధుల్లో త్వరలో కోట్లాది దోమలు ‘బజ్ బజ్’ అంటూ తిరగబోతున్నాయి. అంటే అక్కడ దోమలు ఎక్కువయ్యాయని అనుకునేరు. అస్సలు కాదు. బ్రిటన్‌కు చెందిన ఆక్సెటిక్ కంపెనీ జన్యుపరంగా మార్పు చేసిన మగ దోమలను వదలబోతోంది. ఇప్పుడీ అవసరం ఏం వచ్చిందని అనుకుంటున్నారా? కాలిఫోర్నియా ప్రాంతంలో వేడి పెరిగి ఇటీవల దోమల బెడద పెరుగుతోందట. వాటిని నియంత్రించేందుకు బ్రిటన్ కంపెనీ మగ దోమల్లో జన్యుపరమైన మార్పు చేసి వదలబోతోంది. బయటి ఆడ దోమలతో ఈ దోమలు కలవడం వల్ల పుట్టబోయే ఆడ దోమలు.. మార్పు చేసిన కొత్త జన్యువు వల్ల యవ్వనంలోకి వచ్చేలోపే చనిపోతాయట. జికా, చికెన్‌గున్యా, యెల్లో ఫీవర్‌ను వ్యాప్తి చేసే ఏడిస్ ఎజిప్టీ దోమలను నియంత్రించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. దీనికి అమెరికా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇటీవలే అనుమతిచ్చింది. కాలిఫోర్నియా పెస్టిసైడ్ రెగ్యులేషన్ డిపార్ట్మెంట్ అనుమతి రావాల్సి ఉంది. అయితే కాలిఫోర్నియా ప్రజలకు ఈ విషయం చెప్పలేదని, వాళ్ల అనుమతి తీసుకోలేదని కొందరు అంటున్నారు. చదవండి👉 ప్రపంచంలోనే సన్న భవనం -
అచ్చం రక్తంలాగే ఉండే బీట్రూట్ జ్యూస్.. తాగితే దోమలు ఖతం
మనుషులకు అతిపెద్ద శత్రువులు దోమలే. రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తూ లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి దోమలను నిర్మూలించడంపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు.. బీట్రూట్ జ్యూస్ ఆధారంగా రక్తంకాని రక్తాన్ని సృష్టించారు. అందులో విషపూరిత పదార్థాలను కలిపి దోమలను హతమార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ కీటకనాశనుల ప్రమాదం నుంచి.. ప్రస్తుతం మనం దోమలను హతమార్చేందుకు మస్కిటో రిపెల్లెంట్లు, రసాయనాలు కలిపిన అగరుబత్తులు వంటి వాటిని వినియోగిస్తున్నాం. వాటిలో విషపూరిత పదార్థాలు దోమలను చంపడమో, మనుషులను కుట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడమో చేస్తాయి. కానీ ఆ రసాయనాలు మనుషులకు కూడా హానికరమేనని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. స్వీడన్‌కు చెందిన ‘మాలిక్యులర్ అట్రాక్షన్’స్టార్టప్ శాస్త్రవేత్తలు.. మనుషులకు హానికలగకుండా దోమలను ఆకర్షించి చంపే విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ‘మలేరియా’వాసనతో.. మలేరియా వ్యాధి సోకినవారి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవులు.. మన రక్తంలోని ఎర్రరక్త కణాలను ఆక్రమించి, విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ‘హెచ్‌ఎంబీపీపీ’అనే రసాయనమే దీనికి కారణం. దోమలు ఈ వాసనకు విపరీతంగా ఆకర్షితమవుతాయి. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్తోనే దోమలకు చెక్‌పెట్టవచ్చని తేల్చారు. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ బీట్రూట్ జ్యూస్‌లో కలిపి.. అచ్చం రక్తం లక్షణాలను పోలి ఉండేలా.. అంతే సాంద్రత, రంగుతో బీట్రూట్ జ్యూస్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దానిలో దోమలను ఆకర్షించే ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్‌ను, మొక్కల ఆధారిత విష పదార్థాలను కలిపారు. దీనిని దోమలు ఉన్న చోట పెట్టారు. హెచ్‌ఎంబీపీపీ వాసనకు ఆకర్షితమైన దోమలు రక్తంకాని రక్తాన్ని పీల్చుకున్నాయి. విషపదార్థం ప్రభావంతో కాసేపటికే అన్నీ చనిపోయాయి. అయితే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ రకం దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యాయని.. వివిధ మాలిక్యూల్స్‌ను ఉపయోగించడం ద్వారా ఇతర వ్యాధులను వ్యాప్తిచేసే దోమలనూ చంపవచ్చని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ ప్రకటించింది. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మనుషులకు హానికలగకుండా.. ‘‘దోమల నిర్మూలన కోసం వినియోగించే రసాయనాలను గాలిలో స్ప్రే చేయడమో, రిపెల్లెంట్ పరికరాలతో ఆవిరిగా మార్చడమో చేస్తుంటారు. వాటిని మనం కూడా పీల్చుకుంటుంటాం. ఆ విష పదార్థాలు మన శరీరంలో చేరి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అదే మేం రూపొందించిన పద్ధతిలో దోమలు వాటంతట అవే వచ్చి విషపూరిత పదార్థాన్ని పీల్చుకుని చనిపోతాయి. మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. పైగా ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..’’అని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ సీఈవో లెచ్ ఇగ్నటోవిజ్ వెల్లడించారు. దోమలకు బ్యాక్టీరియా ఎక్కించి.. దోమల నియంత్రణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో డెంగీకి కారణమయ్యే దోమల నియంత్రణపై ఇండోనేషియాలో చేసిన ప్ర యోగం దాదాపు విజయవంతమైంది. శాస్త్రవేత్తలు దోమల్లో డెంగీ వైరస్‌ను వ్యాప్తిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘వొల్బాచియా’ బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ దోమలను పలు ప్రాంతాల్లో వదిలారు. ఆ బ్యాక్టీరియా ఇతర దోమలకూ వ్యాపించి.. డెంగీ కేసులు తగ్గాయి. -
దోమకాటు: బోదకాలు, చికున్ గున్యా, కాలా అజర్.. ఇంకా
వానాకాలం వచ్చిందంటే వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. కానీ ఇదే సమయంలో మనిషికి ప్రమాదకరమైన దోమల్లాంటి కీటకాల విజృంభణ పెరుగుతుంది. అనాది కాలంగా దోమకాటు మనిషికి ప్రాణాంతకంగా ఉంటోంది. ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం పెరిగిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అందుకే దోమలే కదా, అని తీసిపారేయకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లాంటి ఉష్ణమండల దేశాల్లో, జనాభా అధికంగా ఉండే దేశాల్లో దోమలు పలురకాలుగా చెలరేగుతుంటాయి. వీటివల్ల రకరకాల వ్యాధులు సంభవించడమే కాకుండా, వీటిలో కొన్ని వ్యాధులు ప్రాణాంతకాలు కూడా! ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం దోమకాటుకు భారత్‌తో సహా దక్షిణాసియాలో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. సో.. అజాగ్రత్త అస్సలు పనికిరాదు. దోమలు.. వ్యాధులు మనిషి రక్తాన్ని నేరుగా పీల్చే దోమలు అదే రక్తంలోకి పలురకాల సూక్ష్మ క్రిములను ప్రవేశపెడతాయి. దీంతో మనిషిలో పలు రకాల వ్యాధులు ప్రబలుతుంటాయి. భారత్‌లో దోమల ద్వారా వ్యాపించే కొన్ని ప్రమాదకరవ్యాధుల వివరాలు ఇలా ఉన్నాయి.. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వ్యాపిస్తుంది. ఉదయం, సాయంత్ర వేళ్లలో అనాఫిలస్ దోమకాటు వల్ల ప్లాస్మోడియం సోకుతుంటుంది. సోకిన తర్వాత అధిక జ్వరం, విపరీతమైన చలి, తలనొప్పి, విపరీతమైన చెమటలు, కండరాల నొప్పి లాంటి లక్షణాలు బయటపడతాయి. పిల్లలు, గర్భిణులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవారు, తరచూ ప్రయాణాలు చేసేవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని దశాబ్దాల క్రితం అతం్యంత ప్రాణాంతక వ్యాధిగా పరిగణించేవారు. ప్రస్తుతం చికిత్స అందుబాటులో ఉంది. తగ్గడానికి క్లోరోక్వినాన్ మందును వాడతారు. బోదకాలు ఒకప్పుడు భారత్‌లో పలు ప్రాంతాల్లో విపరీతంగా కనిపించేది. వుచరేరియా అనే పరాన్నజీవి వల్ల, క్యూలెక్స్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. మనిషి లింఫాటిక్ వ్యవస్థలో పరాన్న జీవి చేరుకొని రక్తం నిండా దాని లార్వాని కోట్ల సంఖ్యలో విడుదల చేస్తుంది. దీనివల్ల లింఫ్ వ్యవస్థ దెబ్బతిని కణజాలాలు వాయడం, చర్మం బిరుసెక్కడం, అవయవాల్లో అనవసర ద్రవాలు చేరడం సంభవిస్తుంది. దీనివల్ల క్రమంగా వైకల్యం వస్తుంది. చికున్ గున్యా ఇది కూడా వైరస్ ద్వారా సోకుతుంది. ఏడిస్ దోమ కాటుతో సంక్రమిస్తుంది. తలనొప్పి, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి, దద్దుర్లు కనిపిస్తాయి. లక్షణాలు వారం పాటు ఉండి తగ్గినా, నొప్పులు మాత్రం నెలల పాటు కొనసాగుతాయి. డెంగ్యూతో ఈ వ్యాధి లక్షణాలకు పోలిక ఉంటుంది. రక్తపరీక్షద్వారా నిర్ధారిస్తారు. కాలా అజర్ లెస్మోనియాసిస్ పరాన్నజీవి వల్ల సాండ్‌ఫ్లై కాటుతో సంక్రమిస్తుంది. వారాల పాటు తగ్గని జ్వరం, ప్లీహం ఉబ్బడం, రక్తహీనత, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి. తొందరగా చికిత్స అందకపోతే రెండేళ్లలో మరణించే ప్రమాదం ఉంటుంది. ఈ జ్వరం తగ్గిన తర్వాత చర్మం మీద దద్దుర్లు వస్తుంటాయి. జపనీస్ ఎన్సెఫలైటిస్ ఇది వైరస్ ద్వారా క్యూలెక్స్ దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు వస్తాయి. ముదిరినప్పుడు మెదడుపై ప్రభావం చూపుతుంది. దీంతో మూర్చరోగం కూడా రావచ్చు. చిన్నపిల్లల్లో ప్రాణాంతకంగా మారుతుంది. డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటి. డెంగ్యూ వైరస్ ద్వారా సోకుతుంది. సోకిన 3–14 రోజుల్లో అధిక జ్వరం, వాంతులు, కీళ్లనొప్పులు, దద్దుర్లు లాంటి లక్షణాలు బయటపడతాయి. తగ్గడానికి నిర్దిష్టమైన మందులు లేవు. లక్షణాలను బట్టి మందులు వాడతారు. దాదాపు వారంలో తగ్గుతుంది. కానీ ఒక్కోసారి జ్వరం చాలా ఎక్కువైతే చర్మం కింద రక్తనాళాలు చిట్లడం లాంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటప్పుడు ఆస్పత్రిలో చేరాల్సిఉంటుంది. దోమల ద్వారా వచ్చే వ్యాధులను తేలిగ్గా తీసుకోకూడదు. ఉదాహరణకు మలేరియా దాదాపు 90కిపైగా దేశాల్లో కనిపిస్తుంది. ఏటా దాదాపు 50 కోట్లమంది దీని బారిన పడుతుంటే, వీరిలో 27 లక్షల మంది మరణిస్తుంటారు. దోమల ద్వారా ఏటా 250 కోట్ల మంది పలు వ్యాధులబారిన పడుతున్నట్లు అంచనా. అందువల్ల ఇవి సోకిన తర్వాత చికిత్స కన్నా నివారణే మంచి మార్గమని నిపుణుల సలహా. చదవండి: National Nutrition Week: ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే! -
అదుపులో 'డెంగీ'!
సాక్షి, అమరావతి: తొలకరి జల్లులు మొదలయ్యాయంటే డెంగీ జ్వరాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. గత ఏడాది వరకు ఎక్కడ చూసినా డెంగీ బాధితులే. అలాంటిది ఈ ఏడాది డెంగీ జ్వరం కాస్త అదుపులోకొచ్చింది. గతంతో పోలిస్తే జ్వరాల తీవ్రత చాలా తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదు కాలేదని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం కేసులు కూడా నమోదు కాలేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది డెంగీ తీవ్రత బాగా తక్కువగా ఉంది. నవంబర్ 30 వరకూ ఇదే తరహాలో నియంత్రణ చేయగలిగితే ఈ ఏడాది డెంగీ బారి నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలున్నాయి. నవంబర్ చివరి వరకు కార్యాచరణ ► నవంబర్ నెలాఖరు వరకు డెంగీ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. ప్రతి గ్రామాన్ని మున్సిపాలిటీ, ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖలు జల్లెడ పడుతున్నాయి. ► కాలనీల్లో, ఇంటి ముందర గుంటలు లేకుండా చూడటం, నీరు నిల్వ లేకుండా చేయడం, ప్రతి ప్రాంతంలో ఎంఎండీసీ (మొబైల్ మలేరియా, డెంగీ సెంటర్స్)ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ► డెంగీ లార్వా (గుడ్డు) దశలోనే విచ్ఛిన్నం చేసేందుకు పాత టైర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు, టైర్లు వంటి వాటిని పరిసరాల్లో లేకుండా చేస్తున్నారు. ► అన్ని ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్ట్ కిట్లు అందుబాటులో ఉంచారు. డెంగీ వలన వచ్చే ప్రమాదంపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. నియంత్రణకు మరిన్ని చర్యలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా తగ్గాయి. నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా లార్వా దశలోనే దీన్ని నియంత్రించడం వల్లే కేసులు తగ్గాయి. రానున్న నెల రోజులు కీలకం. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ దోమలు వృద్ధి అయ్యే అవకాశం తక్కువ. – డా.అరుణకుమారి, ప్రజారోగ్య శాఖ సంచాలకులు -
దోమలతో కరోనా రాదు
వాషింగ్టన్: కోవిడ్–19 వ్యాధి దోమల ద్వారా వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో)ఇప్పటికే ప్రకటించగా ఆ వాదనను తాజాగా శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. కరోనా వైరస్ మనుషుల్లో దోమల ద్వారా సోకదని మొదటిసారిగా ధ్రువీకరించారు. జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ఈ పరిశోధన ఫలితాలు ప్రచురితమయ్యాయి. కోవిడ్–19 వ్యాధికి కారణమయ్యే సార్స్ కోవ్–2 వైరస్‌కు దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరి సోకే సామర్ధ్యం లేదని ప్రయోగాత్మకంగా రుజువైందని అమెరికాలోని కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుడు సీఫెన్ హిగ్స్ వెల్లడించారు. దోమల్లో ప్రధానమైన ఈడిస్ ఈజిప్టై, ఈడిస్ అల్బోపిక్టస్, క్యూలెక్స్ క్విన్క్వెఫాసియాటస్ రకాలపై చేసిన ప్రయోగాల్లో ఈ విషయం తేలిందన్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి రక్తాన్ని పీల్చినప్పటికీ ఈ రకం దోమలు ఆరోగ్యవంతుడికి ఈ వ్యాధిని వ్యాప్తి చేయలేక పోయాయని గుర్తించామని వివరించారు. -
డెంగీని దూరం పెట్టే దోమలు!
డెంగీ పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది దోమే. ఈ దోమలు గనక డెంగీ కారక వైరస్‌ను తమ శరీరంలోకి రానివ్వకపోతే వ్యాధన్నదే లేదు. ఇదే అంశాన్ని ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్త ఒమర్ అక్బరీ ఓ విన్నూతమైన ప్రయత్నం చేశారు. డెంగీ వైరస్‌ను దూరంగా పెట్టేలా దోమలను డిజైన్ చేశారు. అంటే ఈ దోమలతో డెంగీ అస్సలు వ్యాపించదన్నమాట. పీఎల్ఓఎస్ పాథోజెన్స్ జర్నల్‌లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. నాలుగు వెరైటీల డెంగీ వైరస్‌లను దూరంగా పెట్టేలా కొత్త రకం దోమలును డిజైన్ చేశారు. డెంగీని వ్యాప్తి చేసే ఆడ దోమల్లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేశారు. దీంతో ఆడదోమ రక్తం పీల్చుకోగానే ఈ యాంటీబాడీ పనిచేయడం మొదలవుతుంది. ఈ రకమైన దోమల సాయంతో అన్ని దోమజాతుల్లోనూ ఈ యాంటీబాడీ ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చునని ఒమర్ అక్బరీ తెలిపారు. మనిషి రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన జన్యువులను దోమల్లోకి ప్రవేశపెట్టి అవి వ్యాధులను అడ్డుకునేలా చేయడం ఈ పరిశోధన తాలూకూ విశేషం. దోమల ద్వారా వచ్చే ఇతర వ్యాధులను కూడా ఈ పద్ధతితో అడ్డుకోవచ్చునని అంచనా. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం ఉష్ణమండల ప్రాంతాల్లో డెంగీ సమస్య కొన్ని లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. ఆసియా, లాటిన్ అమెరికాల్లో ఈ వ్యాధి కారణంగా చాలామంది పసిపిల్లలు మరణిస్తున్నారు కూడా. ప్రస్తుతం ఈ వ్యాధికి సరైన చికిత్స లేకపోగా.. లక్షణాలను నియంత్రిస్తూ వేచి ఉండటమే ప్రస్తుతం ఆచరిస్తున్న పద్ధతి. -
కుట్టకుండా కాదు.. పుట్టకుండా..
సాక్షి, హైదరాబాద్ : డెంగీ నియంత్రణ చర్యలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శ్రీకారం చుట్టింది. దోమల ఉత్పత్తికి బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది. రేడియేషన్ ద్వారా పునరుత్పత్తి లేని మగ దోమలను ఉత్పత్తి చేసి, వాటిని ఆడ దోమలపైకి వదలడం ద్వారా వ్యాప్తిని అడ్డుకోవాలనేది దీని ఉద్దేశం. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం కీలకమైన నివేదిక విడుదల చేసిందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అంటే జన్యుమార్పిడి దోమలను ఉత్పత్తి చేయడం ద్వారా, క్రమంగా దోమలన్నింటినీ నిర్మూలించాలనేది దీని ఉద్దేశమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఇదిలావుంటే గతేడాది బ్రిటన్‌కు చెందిన ఒక ప్రముఖ సంస్థ దోమల ద్వారా వచ్చే వ్యాధులను నివారించేందుకు ఇలాంటి ప్రతిపాదనను భారత ప్రభుత్వానికి దరఖాస్తు చేసిందని వ్యవసాయంలో జన్యు మార్పిడి నిపుణులు డి.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. జన్యుమార్పిడి పద్ధతి కావడంతో దీనికి కేంద్రం అనుమతి ఇవ్వలేదని ఆయన వివరించారు. స్టెరైల్ క్రిమి టెక్నిక్‌ను మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. ఈ సాంకేతికతను మానవ వ్యాధులపై ప్రవేశపెట్టడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నిస్తోంది. మగ దోమలను సేకరించి వాటిని తమ లేబొరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్ల దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారు. అయితే ఇదంతా ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉంది. సాధ్యాసాధ్యాలపై అస్పష్టత ఉన్నా అందుబాటులోకి వస్తే మాత్రం ఆశించిన ఫలితం ఉండనుంది. దోమల స్టెరిలైజేషన్ ఎలా? మున్ముందు ప్రపంచ జనాభాలో సగం మందికి డెంగీ ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు. ‘డెంగీ నివారణకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నా, దోమల నియంత్రణకు చేపడుతున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడంలేదు. అందువల్ల కొత్త విధానాలు చాలా అవసరం. ఇందులో దోమల స్టెరిలైజేషన్ పద్ధతి ఆశాజనకంగా ఉంది’ అని ఆమె ఆ నివేదికలో అభిప్రాయపడ్డారు. డెంగీ, చికున్‌గున్యా, జికా వంటి వ్యాధులను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రయత్నాల్లో భాగంగా రేడియేషన్ ఉపయోగించి మగ దోమలను పునరుత్పత్తి రహితంగా చేసే సాంకేతికతను అందుబాటులోకి తీసుకురావాలని సూచించింది. స్టెరైల్ క్రిమి టెక్నిక్ మొదట అమెరికా వ్యవసాయశాఖ అభివృద్ధి చేసింది. పంటలు, పశువులపై దాడి చేసే కీటకాలు, తెగుళ్లను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా ఉపయోగించారు. మానవ వ్యాధులపై పోరాడటానికి ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆరోగ్య రంగానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాల విశ్లేషణ ప్రకారం జన్యుమార్పిడి, రేడియేషన్ ద్వారా స్టెరిలైజేషన్ చేయడంలో ప్రసిద్ధి చెందిన ఏదో ఒక సంస్థను ఎంచుకుంటారు. ఆ సంస్థ మగ దోమలను సేకరించి వాటిని తమ లేబరేటరీలో వాటి గుడ్ల ద్వారా అనేక రెట్లు దోమలను సృష్టిస్తుంది. వాటిని రేడియేషన్ పద్ధతిలో స్టెరిలైజేషన్ చేయడం ద్వారా వాటిలో పునరుత్పత్తి లక్షణం పోతుంది. అనంతరం వాటిని దోమలున్న ప్రాంతాల్లో విడుదల చేస్తారని నిమ్స్ ప్రముఖ వైద్యులు డాక్టర్ గంగాధర్ అభిప్రాయపడ్డారు. దీన్నే జన్యుమార్పిడి దోమల ఉత్పత్తి అంటారని ఆయన వివరించారు. పట్టణీకరణ వల్లే... వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటివరకు 40 వేల మందికి పైగా డెంగీ పరీక్షలు చేస్తే, వారిలో పావు వంతు మందికి డెంగీ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తున్నది. దేశంలో రెండో స్థానంలో తెలంగాణ ఉందని కేంద్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో డెంగీ నివారణ పద్ధతులపై రాష్ట్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం వేగవంతమైన ప్రణాళికలేని పట్టణీకరణ, పెరిగిన తేమ, విస్తరించిన వర్షాకాలం, వాతావరణ పరిస్థితులలో వైవిధ్యం ఫలితంగా డెంగీ విజృంభిస్తోంది. అలాగే పేలవమైన నీటి నిల్వ పద్ధతులు దోమల వ్యాప్తికి అనుకూలంగా ఉంటున్నాయి. 2019లో భారతదేశంలో గణనీయంగా డెంగీ కేసులు పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. -
డెంగీ మహమ్మారిని మట్టుబెట్టలేరా?
సాక్షి, హైదరాబాద్ : డెంగీ విజృంభించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే తీవ్రంగా స్పందించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. నెలరోజుల్లోగా డెంగీని అదుపు చేయలేకపోతే వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సమన్లు జారీ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. వైద్య, ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీలు దాఖలు చేసిన కౌంటర్లల్లోని విషయాలు పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ‘డెంగీ, చికున్ గున్యా, స్వైన్‌ఫ్లూ వంటి విష జ్వరాలు వచ్చాక మందులు వేయడం కంటే ప్రాథమిక దశలోనే వాటి నివారణకు చర్యలు తీసుకోవాలి. కోటి మందికిపైగా జనాభా ఉన్న నగరంలో 150 పోర్టబుల్ ఫాగింగ్ మిషన్లు ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతోంది’.. అని వ్యాఖ్యానించింది. డెంగీ వంటి విషజ్వరాలతో జనం అల్లాడుతున్నారని, ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని పేర్కొంటూ హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ఎం.కరుణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం తోపాటు, హైకోర్టుకు న్యాయవాది రాపోలు భాస్కర్ రాసిన లేఖను కూడా పిల్‌గా పరిగణించిన హైకో ర్టు బుధవారం మరోసారి విచారించింది. కౌంటర్ వ్యాజ్యా ల్లోని అంశాలను పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం.. డెంగీ అదుపుకాకపోగా కేసుల సంఖ్య పెరిగినట్లుగా ప్రభుత్వం కౌంటర్లో పేర్కొనడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ 5,914 కేసులు నమోదు అయ్యాయి. సెప్టెంబర్ తొలి వారంలో 138 కేసులు నమోదైతే 23వ తేదీ నాటికి ఆ సంఖ్య 309కి పెరిగింది. 22 రోజుల్లో రోగుల పెరుగుదల అక్షరాలా 200 శాతం... అని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఏజీ చెప్పిన లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 22 బ్లడ్ బ్యాంక్‌లున్నాయి. ఇదేమైనా కేంద్రపాలిత ప్రాంతమా? బ్లడ్ బ్యాంక్‌ల సంఖ్య పెంపు అంశంపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలి’అని పేర్కొంది. లార్వా దశలోనే అంతం చేయాలి.. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నందున మురికివాడల్లో దోమలవ్యాప్తి మరింత పెరగకుండా ఫాగింగ్ ఎక్కువగా చేయాలి. డ్రోన్ల సహాయంతో దోమల్ని లార్వా దశలోనే అంతం చేస్తే బాగుంటుందేమో ఆలోచన చేయం డి. రాపిడ్ డయోగ్నస్టిక్ టెస్ట్ కిట్స్ ద్వారా 80% మేరకు ఫలితాలున్నాయని చెబుతున్నారు. ఎలీసా పరీక్షలకు ప్రైవేట్ లేబరేటరీల్లో రూ. 3,500 వరకూ ఖర్చు అవుతుంది. ఈ పరీక్ష కోసం ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చే ఆలోచన చేయాలి. పత్రికల్లో వస్తున్న వార్తల ప్రకారం చూస్తే రోగులకు సరైన వైద్యం అందడం లేదనిపిస్తోంది’అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్ వాదిస్తూ.. విషజ్వరాలపై ప్రజల్లో అవగాహన కోసం రోడ్ల కూడళ్లల్లో ప్లెక్సీలు ఏర్పాటు చేశామని తెలిపారు. తదు పరి విచారణ అక్టోబర్ 23కి వాయిదా పడింది. -
గ్లోబల్ వార్మింగ్ డెంగీ వార్నింగ్!
డెంగీ, జికా, మలేరియా, చికున్‌గున్యా, ఎల్లో ఫీవర్, ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధులు ఇవే. ఈ వ్యాధులన్నింటికీ మూలకారణం దోమల సంతతి విపరీతంగా పెరిగిపోవడమే. ఇలా దోమలు పెరిగిపోవడానికి, పర్యావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందట. మానవ చరిత్రలో తిమింగలం కంటే ప్రమాదకరమైనది దోమేనని ప్రముఖ చరిత్రకారిణి తిమొతి వైన్గార్డ్ కొత్త పుస్తకంది మస్కిటో.. ఏ హ్యూమన్ హిస్టరీ ఆఫ్ అవర్ డెడ్లీయస్ట్ ప్రిడేటర్ పుస్తకంలో వెల్లడించారు. ఇందులో దోమలు ప్రపంచ దేశాలకు విస్తరించడానికి, వాతావరణంలో వస్తున్న మార్పులకి సంబంధం ఉందని విశ్లేషించారు. 100 దేశాలకు డెంగీ... వాతావరణంలో వస్తున్న మార్పులు దోమల కారణంగా విస్తరించే వ్యాధులు అనే అధ్యయనంలో ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డెంగీ మొదటి స్థానంలో ఉంది. ముఖ్యంగా దక్షిణ యూరప్ దేశాల్లో వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా దోమలు పెరిగిపోయి డెంగీ వ్యాధి ప్రబలుతోందని ఆ అధ్యయనానికి నేతృత్వం వహించిన యాకూబ్ చెప్పారు. ‘భూమి వాతావరణం వేడెక్కిపోతున్న కొద్దీ దోమల సంఖ్య పెరిగిపోతుంది. ఆడదోమలు గుడ్లు పెట్టడానికి వేడి పరిస్థితులు ఉండాలి. వాతావరణం పొడిబారిపోవడం, కాలం కాని కాలంలో వర్షాలు, అడ్డగోలుగా పట్టణీకరణ వంటి కారణాలతో దోమలు ఎక్కువైపోతున్నాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో దోమలు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణం ఉంది’అని ఆయన వెల్లడించారు. 1970కి ముందు కేవలం 10 దేశాల్లో మాత్రమే డెంగీ వ్యాధి ఉండేది. ఇప్పుడు 100కిపైగా దేశాలకు విస్తరించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఆ్రస్టేలియా, కండోడియా, చైనా, బంగ్లాదేశ్, మలేసియా వంటి దేశాల్లో డెంగీ వ్యాధి బాగా విస్తరించింది. 200 కోట్లకు బాధితులు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల్ని అదుపు చేయలేకపోతే వాతావరణంలో వస్తున్న 17 మార్పుల కారణంగా 2050 నాటికి ప్రపంచంలో సగం జనాభా ఉండే ప్రాంతాల్లో దోమలు బాగా వృద్ధి చెందుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2050 నాటికి డెంగీ సహా వివిధ రకాల వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి సోకే అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. జీవో కవచం... దోమలు మన రక్తం వాసనని పసిగట్టి కుట్టడానికి మీదకి వస్తాయి. ఈ రక్తం వాసనని పసిగట్టకుండా దోమల్ని నివారించడానికి గ్రాఫిన్ ఆక్సైడ్ (జీవో) అనే అతి సన్నని పదార్థంతో తయారు చేసిన రక్షణ కవచాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేనున్నారు. గ్రాఫిన్‌లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అణుపరిమాణం అంత సన్నగా ఉంటుంది. రబ్బరులా సాగే గుణం, ఉక్కు కంటే 200 రెట్లు గట్టిగా ఉంటుంది, రాగి కంటే సుల భంగా దేనితోనైనా కలిపేసే అవకాశం కూడా ఉంది. గ్రాఫిన్‌తో అభివృద్ధి చేసిన అతి పల్చటి కవచం దోమలు మనిషి ఒంటిపై రసాయనాలు గుర్తించకుండా కాపాడుతుందని బ్రౌన్ వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్ రాబర్ట్ హర్ట్ వెల్లడించారు. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా దోమకాటు నుంచి తప్పించుకోవచ్చన్నారు. మీకు తెలుసా?... - దోమ ఒక్కసారి కాటుతో 0.001 నుంచి 0.1 ఎంఎల్ రక్తాన్ని పీలుస్తుంది. - దోమలు వాటి బరువు కంటే మూడు రెట్లు ఎక్కువ రక్తాన్ని పీలుస్తాయి. - మగ దోమలు శాకాహారులు. ఆడదోమలు మాత్రమే మనుషుల్ని కుడతాయి. ఎందుకంటే ఆడదోమలు గుడ్లు పెట్టడానికి అవసరమైన ప్రొటీన్లు మనుషుల రక్తం నుంచే తీసుకుంటాయి. - ‘ఓ’గ్రూప్ రక్తం ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. - ప్రపంచంలో ఐస్‌ల్యాండ్ మాత్రమే దోమలు లేని దేశం. - మానవ శరీరంలో రక్తాన్ని అంతా 12 లక్షల దోమలు పీల్చగలవు. - దోమలు వాసనల్ని పసిగడతాయి. కొన్ని రకాల వాసనలకు అవి దూరంగా ఉంటాయి. తులసి ఆకులు, నిమ్మకాయలు, వెల్లుల్లి, బంతిపూల వాసన వస్తే దోమలు దూరంగా పారిపోతాయి. - ఆడదోమలు ఒకేసారి 300 గుడ్లు పెట్టగలవు. - దోమల జీవిత కాలం 2 నెలలలోపే. మగ దోమలు 10 రోజులు, ఆడదోమలు 6 నుంచి 7 వారాలు జీవించి ఉండగలవు. -
పల్లెల్లో పచ్చదనం, పరిశుభ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామసీమలను పచ్చదనం, పరిశుభ్రతకు కేంద్రాలుగా మార్చేందుకు ప్రభుత్వపరంగా కార్యాచరణ సిద్ధమైంది. గ్రామపంచాయతీల్లో పచ్చదనం, పరిశుభ్రత ప్రధాన అంశాలుగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలతోపాటు వాటి అమలుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. నగరాల్లో పౌరులకు అందుబాటులోకి వచ్చే సౌకర్యాలన్నీ కూడా పల్లె ప్రజలకు కూడా అందేలా మార్పు తీసుకురావాలని నిర్ణయించింది. గ్రామాల్లోనూ పూర్తిస్థాయిలో పారిశుధ్యం, వీధి దీపాలు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దీనిని పకడ్బందీగా అమలు చేసేందుకు కార్యక్రమాలను రూపొందించింది. పంచాయతీల్లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రచార కార్యక్రమాలకు సంబంధించి గతంలోనే సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వీటిని తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, జెడ్పీపీ సీఈవోలు, జిల్లా పంచాయతీ అధికారులకు పీఆర్ శాఖ కొన్ని రోజుల క్రితం ఒక మెమోను కూడా జారీ చేసింది. పచ్చదనం, పరిశుభ్రతకు సంబంధించిన పనుల పర్యవేక్షణను గ్రామపంచాయతీ, సర్పంచ్‌లతోపాటు ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు చేపట్టాలని సూచించింది. అన్ని గ్రామాల్లో ఎంపీడీవోలు, ఈవోపీఆర్లు, డీపీవోలు, డీఎల్పీవోలు విస్తృతంగా పర్యటించి ప్రభుత్వం నిర్ణయించిన కార్యక్రమాలు పక్కాగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. పంచాయతీల్లో ’డ్రై డే’.. గ్రామ పంచాయతీల్లో దోమల వృద్ధి లేకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ’డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు, వాటి చుట్టూ ఉన్న పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని ఇదివరకే పీఆర్ శాఖ సూచించింది. ఈ–పంచాయతీలు... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని గ్రామ పంచాయతీలను ఈ–పంచాయతీలుగా మార్చే క్రమంలో సాంకేతికంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న వనరులు, సామగ్రిని ఉపయోగించుకోవడంతోపాటు మెరుగైన సాంకేతికతలను అనుసరించే దిశలో చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఆన్లైన్లో వివిధ కార్యకలాపాల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పంచాయతీల్లో ఆన్లైన్ డేటా ఎంట్రీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, పంచాయతీ మాడ్యుల్స్‌ను అప్లోడ్ చేయడం వంటివి పూర్తిచేయాలని జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)ను పీఆర్ శాఖ ఆదేశించింది. భవన నిర్మాణ అనుమతులు, లే అవుట్ల పర్మిషన్లను ఆన్లైన్లోనే జారీ చేసేందుకు వీలుగా సాంకేతిక పరమైన వసతులు సమకూర్చుకోవాలని సూచించింది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, భూరికార్డుల మ్యుటేషన్లు, ట్రేడ్ లైసెన్స్‌ల జారీ వంటి వాటిని ఆన్లైన్లోనే అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంది. గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా అక్కడే రిజిష్టర్ చేసేలా చూడాలని సూచించింది. పంచాయతీ కార్యదర్శులకు పనితీరు సూచికలు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. -
పంచాయతీల్లో ‘డ్రై డే’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణను చేపట్టనున్నారు. దోమలు వృద్ధి చెందకుండా నిరోధించేందుకు వారానికి ఒకరోజు ‘డ్రై డే’నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పంచాయతీ సిబ్బంది వారానికి ఒకరోజు ఇంటింటికి వెళ్లి డ్రై డే పాటించాల్సిన ప్రాముఖ్యతను వివరిస్తారు. ఇళ్లు.. వాటి చుట్టూ పరిసరాల్లోని గుంటలు, తొట్టెలు, పాత టైర్లు.. తదితరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసేలా ప్రజల్లో చైతన్యం కల్పిస్తారు. కలెక్టర్లు, డీపీవోలకు ఆదేశాలు.. పంచాయతీల్లో పారిశుధ్యం, హరితహారం, వీధిలైట్లు, పన్నుల వసూలు తదితరాలకు సంబంధించి గత నెలలో సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలకు కొనసాగింపుగా జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ శాఖ మరిన్ని ఉత్వర్వులిచ్చింది. ఈ ఆదేశాలను అన్ని గ్రామ పంచాయతీలకు పంపించి, వాటిని కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ రాజ్ కమిషనర్ నీతూ కుమారి ఇటీవల ఉత్తర్వులిచ్చారు. రాష్ట్రంలోని అన్ని పల్లెలను పచ్చదనం, పరిశుభ్రతతో కూడిన గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా అన్ని జిల్లాల్లో మూడు నెలల ప్రత్యేక కార్యాచరణను చేపట్టాలని గతంలోనే ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వివిధ రూపాల్లో విస్తృత ప్రచార కార్యక్రమాలు (క్యాంపెయిన్) చేపట్టాలని సూచించింది. కార్యక్రమంలో భాగంగా 90 రోజుల పాటు ప్రతీ గ్రామ పంచాయతీలో వివిధ చర్యలు చేపట్టాలని నిర్దేశించింది. తాజా ఆదేశాలు... అన్ని గ్రామాల్లోని రోడ్లను ప్రతిరోజూ శుభ్రపరచాలి. చెత్తను డంపింగ్ యార్డులకు తరలించాలి. ఘనవ్యర్థాల నిర్వహణ షెడ్ నిర్మించి ఉంటే కంపోస్ట్ తయారీకి చర్యలు ప్రారంభించాలి. ఠి రోజు విడిచి రోజు మురుగుకాల్వలు శుభ్రపరచాలి. ఖాళీ ప్రదేశాల్లో పొదలు, తుప్పలను తొలగించాలి. ఠి ఉపయోగించని బావులను పూడ్చాలి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా వాటిని పూడ్చేయాలి. ఠి స్కూళ్లు, ఆస్పత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, మార్కెట్లు శుభ్రపరిచేందుకు ఒకరోజు కేటాయించాలి. ఠి రాష్ట్రం లోని 12,751 పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేయాలి. ఠి రైతులు తమ పొలాల్లోని గట్లు, బావుల చుట్టూ మొక్కలు నాటేలా చూడాలి. ఠి గ్రామాల్లోని అన్ని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి. ఠి గ్రామ పంచాయతీల పరిధిలో జరిగే వివాహాలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. -
దోమలకు చెక్ పెట్టే బ్యాక్టీరియా..
ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్స్ వాడినా దోమల బెడద తప్పడం లేదా? మీ సమస్యకు విస్కాన్సిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. మట్టిలో ఉండే ఓ బ్యాక్టీరియా అత్యంత సమర్థంగా దోమలు దూరంగా పారిపోయేలా చేయగల రసాయనాన్ని సృష్టిస్తోందని వీరు గుర్తించారు. ఈ రసాయనం డీడీటీ కంటే చాలా శక్తిమంతమైందని అంచనా. డీడీటీతో దోమల నివారణ జరుగుతున్న కొన్ని ఇతర సమస్యల కారణంగా ఈ రసాయనంపై చాలా దేశాల్లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీనోరాబ్డస్ బుడపెస్టెనిసిస్ అనే బ్యాక్టీరియా కీటకాలను ఎలా చంపగలుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనం దోమలు దూరంగా పారిపోయేలా చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్న రసాయనం డీడీటీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావశీలి అని కూడా ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ఈ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దోమలు రక్తం పీల్చకుండా మాత్రమే నిరోధిస్తోందని.. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దోమలు పారిపోయేలా చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. -
దోమ కుట్టకుండా.. రూ.6 వేల కోట్లు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్!!. ఇక కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న వ్యయం దీనికి అదనం. దోమల ద్వారా వచ్చే వ్యాధుల నివారణకయ్యే ఆసుపత్రి ఖర్చులు, వాటికోసం వాడే మందులు ఈ లెక్కలోకి రావటం లేదు. ఎందుకంటే మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యాతోపాటు కొత్తగా జికా, వెస్ట్ నైల్ వంటి వైరస్ల వ్యాప్తికి దోమలు కారణమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు ఎందరో!!. అందుకే దోమల నివారణకు ఇళ్లలో లిక్విడ్ వేపరైజర్స్, ఏరోసోల్స్, ఇన్సెన్స్ స్టిక్స్, క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్ వంటి ఉత్పత్తులు వినియోగిస్తున్నారు. సగం కుటుంబాల్లో.. దోమల నివారణ ఉత్పత్తులు ఇప్పుడు పల్లెలకూ పాకాయి. కిరాణా దుకాణాలు, జనరల్ స్టోర్స్, మందుల షాపుల్లో విరివిగా లభిస్తున్నాయి. అటు కంపెనీలు సైతం విభిన్న రకాల్లో వీటిని తయారు చేస్తూ కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. బ్రాండెడ్ కంపెనీలు ఈ ఉత్పత్తుల తయారీకి ఏళ్ల తరబడి శ్రమిస్తున్నాయి. పరిశోధన, పరీక్షల అనంతరం వీటిని విడుదల చేస్తున్నాయి. భారత్‌లో 28 కోట్ల కుటుంబాల్లో.. 13.4 కోట్ల కుటుంబాలు అన్ బ్రాండెడ్ ఉత్పత్తులను వినియోగిస్తున్నట్లు గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా చెప్పారు. దేశంలో చిన్నాచితకా యూనిట్లు తయారు చేసిన నకిలీ ఇన్సెన్స్ (అగర్బత్తీలు) వ్యాపారం ఏటా రూ.500 కోట్లు ఉంటోందని ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. ఇక కాయిల్స్ చవకగా దొరుకుతాయి కాబట్టి వీటికి ఎక్కువ గిరాకీ ఉంటోందని వెల్లడించారు. బ్రాండెడ్ కంపెనీల కాయిల్స్ వ్యాపారం రూ.2,220 కోట్లుగా ఉంది. ఇదీ భారత మార్కెట్.. దేశవ్యాప్తంగా ఇళ్లలో వాడుతున్న దోమల నివారణ ఉత్పత్తుల మార్కెట్ రూ.6,000 కోట్లు. ఏటా ఈ మార్కెట్ 10 శాతం వృద్ధి చెందుతోంది. వీటిలో కాయిల్స్ వాటా అత్యధికంగా 37 శాతం ఉంది. లిక్విడ్ వేపరైజర్స్ 34 శాతం, ఏరోసోల్స్ 14, ఇన్సెన్స్ స్టిక్స్ 11 శాతం వాటా కైవసం చేసుకున్నాయి. మిగిలిన వాటాను క్రీములు, మ్యాట్స్, ఆయిల్స్ వంటి ఉత్పత్తులు దక్కించుకున్నాయి. చిత్రమేంటంటే వీటన్నిటిలో టాప్–5 బ్రాండ్స్ ఏకంగా 80 శాతం మార్కెట్‌ను చేజిక్కించుకున్నాయి. దోమల నివారణ ఉత్పత్తుల రంగంలో గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్, ఎస్సీ జాన్సన్, రెక్కిట్ బెన్కిసర్, జ్యోతి ల్యాబొరేటరీస్, డాబర్లు అగ్రశ్రేణి కంపెనీలుగా కొనసాగుతున్నాయి. గోద్రెజ్‌కు చెందిన గుడ్‌నైట్ బ్రాండ్ ఏటా రూ.2,500 కోట్ల వ్యాపారాన్ని చేస్తూ టాప్ వన్ స్థానంలో ఉంది -
నగరవాసులకు నరకం
శీతాకాలం.. సీజనల్ వ్యాధులతో పాటు డెంగీ, మలేరియా వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.. అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టిసారించండి ..దోమలపై దండయాత్ర చేయండి .. ఇది ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారార్భాటాలు. దోమలపై దండయాత్ర ఏమో కానీ దోమలే ప్రజలపై దండయాత్ర చేస్తున్నాయి.. సాయంత్రం 6 గంటల నుంచి దోమల మోత నగరవాసుల చెవుల్లో ధ్వనిస్తోంది. ఈగల సైజులో ఉన్న దోమలతో కాసేపు ఆరుబయట ఉండలేని పరిస్థితి నెలకొనడంతో నగరవాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. సాక్షి,అమరావతిబ్యూరో: విజయవాడ నగర విస్తీర్ణం 61.33 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అందులో 83 కిలోమీటర్లు మేజర్ డ్రెయిన్లు, 258 కిలోమీటర్ల మేర మీడియం, 982 కిలోమీటర్లు మేర మైనర్ డ్రైయిన్లు విస్తరించి ఉన్నాయి. వీటిలో దాదాపు 55 చోట్ల మస్కిటక్ష బ్రీడింగ్ పాయింట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దోమల నివారణకు ఏటా సుమారు రూ.1.25 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ నిధులతో గంబూషియా చేపలను కాలువల్లో, డ్రెయినేజీల్లో వదలడం, దోమల లార్వాను నిర్మూలించేందుకు మందును స్ప్రే చేయడం వంటివి చేయాల్సిఉంది. కానీ అధికారులు మాత్రం ఆదిశగా పనిచేయడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. డ్రెయినేజీల్లో పేరుకుపోయిన సిల్ట్ నగరంలోని డ్రెయినేజీలు సిల్ట్‌తో నిడిపోవడంతో పొంగి మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. ఆయా ప్రదేశాల్లో దోమల లార్వా పెరిగి ఉత్పత్తి చెందుతున్నాయి. దీనికి తోడు నగరంలో నత్తనడకన సాగుతున్న స్ట్రామ్ వాటర్పనుల్లో పురోగతి లేదు. గోతులు తీసి వదిలేశారు. ఆ గోతుల్లో నీరు నిల్వ ఉండి డెంగీ ఈడిస్ రకం దోమ వృద్ధిచెంది డెంగీ జ్వరాలు విజృంభిస్తున్నాయి. నగరంలోని పటమట, కృష్ణలంక, హైస్కూల్ రోడ్డు, పంటకాలువ రోడ్డు, వన్‌టౌన్‌లోని జెండా చెట్టు సెంటర్, మీసాల రాజేశ్వరరావు రోడ్డు , మొగల్రాజపురం, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, డీవీమినార్ , ట్రెండ్‌సెట్ మాల్ నుంచి మెట్రో పాలిటన్, పాలిటెక్నిక్ కళాశాల, రామవరప్పాడురింగ్ రోడ్డు ప్రాంతాల్లో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నిత్యం కాలువల్లో నీరు పొంగి ప్రవహిస్తోంది. పలు చోట్ల మ్యాన్‌హోల్స్ పొంగడంతో దుర్వాసన వెదజల్లుతోంది. వేధిస్తున్న సిబ్బంది కొరత నగరంలో మలేరియా నివారణకు 347మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా 225 మంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది కొరత కూడా వేధిస్తుండటంతో పనిభారం పెరిగి పూర్తిస్థాయిలో సేవలు అందించడంలేదు. దోమల నివారణపై నగర పాలక సంస్థ ప్రజల్లో కనీస అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. సాయంత్రం వేళ కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. పాఠాలు నేర్వరేం.. గత ఏడాది నగరంలో దోమల దండయాత్రతో ప్రజారోగ్యానికి ప్రమాదం ఏర్పడింది. సీజనల్ వ్యాధులు విజృంభించాయి. నగరంలో సుమారు లక్ష మందికి వైరల్ జ్వరాలు సోకాయి. డెంగీ, మలేరియా వ్యాధులతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. సీజనల్ వ్యాధుల విజృంభణతో పేదవర్గాలపై అదనపు భారం పడింది. కాయకష్టం చేసి సంపాదించిన డబ్బును వైద్యం కోసం వెచ్చించారు. ఈ ఏడాది గడచిన రెండు మాసాల్లో 450 పైగా డెంగీ, మలేరియా జ్వరాల కేసులు నమోదయినట్లు ఆరోగ్యశాఖ పరిశీలనలో తేలింది. గత నాలుగేళ్ల గణాంకాలు చూస్తే 2015లో 322 కేసులు, 2016లో 550 కేసులు, 2017లో 300 కేసులు నమోదయినట్లు అధికారిక గణాంకాలు చెపుతున్నాయి. అన ధికారిక లెక్కలు చూస్తే ప్రైవేటు ఆసుపత్రుల్లో వేలల్లో కేసులు నమోదు అయ్యాయి. నివారణకు చర్యలు చేపట్టాం నగరంలోని అన్ని డివిజన్లలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే విద్యా సంస్థల్లో దోమలు పెరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాల్వలు, డ్రెయిన్లలో ఎంఎల్ ఆయిల్‌బాల్స్ వినియెగిస్తున్నాం. దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాల సాయంతో రెండురోజులకోసారి ఫాగింగ్ చేస్తున్నాం. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ దోమలు పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. – నూకరాజు, బయాలజిస్ట్ -
దోమల నివారణకు గోద్రెజ్ అగర్బత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న గోద్రెజ్ తాజాగా గుడ్‌నైట్ బ్రాండ్‌లో ‘నేచురల్స్ నీమ్ అగర్బత్తి’ పేరిట దోమల నివారణ స్టిక్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వేప, పసుపు మిశ్రమంతో ఈ ఉత్పాదనను తయారు చేశారు. రెండేళ్ల పరిశోధన అనంతరం నేచురల్స్ నీమ్ అగర్బత్తిని మార్కెట్లోకి తెచ్చినట్లు గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఈ స్టిక్స్ 100 శాతం సహజ సిద్ధమైనవి. ఒక్కో బత్తి మూడు గంటల వరకు కాలుతుంది. 10 స్టిక్స్‌తో కూడిన ప్యాక్ ధర రూ.15. దేశంలో దోమల నివారణ ఉత్పత్తుల విపణి రూ.6,000 కోట్లుంది. ఇందులో గుడ్‌నైట్ వాటా రూ.2,500 కోట్లు’ అని వివరించారు. -
ఏసీ బస్సుల్లో దోమల రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో : సిటీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా...దోమలు ఉండవచ్చు తస్మాత్ జాగ్రత్త. సాధారణ దోమల సంగతి సరే సరి. పగటిపూట డెంగీ వంటి ప్రమాదకరమైన దోమలు కుట్టే అవకాశం లేకపోలేదు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే (222 ఎల్) ఏసీ బస్సులో కొందరు ప్రయాణికులు ఇదే భయాందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ దోమల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తుందంటూ సిబ్బందితో ఘర్షణకు దిగారు. పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బస్సులో ఎలాంటి ఫిర్యాదు బాక్సు లేకపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. ఒక్క ఎల్బీనగర్–లింగంపల్లి రూట్లోనే కాదు. ఏసీ బస్సులు రాకపోకలు సాగించే అన్ని రూట్లలో దోమల బెడద తీవ్రమైందంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల, రోడ్లపైన ఉండే కాలుష్యకారకాల వల్ల బస్సుల్లోకి దోమలు చేరుకుంటున్నాయి. ప్రతి రోజు బస్సులను శుభ్రం చేయకపోవడం కూడా మరో కారణం. దీంతో ప్రయాణికులను దోమలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు మెట్రో రాకతో ఏసీ బస్సులకు ఆదరణ తగ్గుముఖం పట్టగా దోమల స్వైరవిహారం అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మెట్రో రైలు కంటే కూడా ఎక్కువ చార్జీలు చెల్లించి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసినప్పటికీ సరైన సదుపాయాలు ఉండడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా బస్సుల నిర్వహణ పైన ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు చాలా బస్సుల్లో ఏసీ సరఫరా కూడా సరిగ్గా ఉండడం లేదు. శుభ్రం చేయడం లేదు నగరంలోని మూడు ప్రధాన రూట్లలో 120 ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం, కొండాపూర్, హైటెక్‌సిటీ వైపు కొన్ని బస్సులు, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ నుంచి లింగంపల్లి, హైటెక్‌సిటీ, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాలకు మరి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తుండగా సికింద్రాబాద్, బేగంపేట్, జేఎన్టీయూ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి కొన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులు మినహా మిగతా బస్సుల నిర్వహణ అస్తవ్యవస్థంగా ఉంది. ఎప్పటికప్పుడు బస్సులను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త,చెదారం పేరుకుంటోంది. సీట్ల అడుగున ఏ మాత్రం శుభ్రం చేయడం లేదని, దీంతో దోమలు తిష్ట వేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఎయిర్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో బస్సులోని అన్ని మూలల్లోనూ ప్రతి రోజు శుభ్రం చేయాల్సి ఉండగా ఆ పని సక్రమంగా జరగడం లేదు. మరోవైపు నెలకోసారి కెమికల్ వాషింగ్ చేస్తారు. కానీ కొన్ని డిపోల్లో 2 నెలలు దాటినా కెమికల్ క్లీనింగ్ చేయకపోవడం గమనార్హం. ఆర్టీసీలో బస్సుల శుభ్రతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఈ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లు తక్కువ సిబ్బందితో బస్సులను నిర్వహిస్తున్నారు. దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందనే విమర్శలు ఉన్నాయి. డెంగీ రావచ్చు... ‘‘ ఏసీ బస్సుల్లో విండోస్ మూసి ఉంటాయి. కానీ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కానీ దోమలు అదే పనిగా కాళ్లకు కుట్టేస్తాయి. పగటి పూట డెంగ్యూ దోమలు తిరుగుతాయి కదా.అందుకే భయంగా ఉంది.’’ అంటూ ఎల్బీనగర్ నుంచి బంజారాహిల్స్‌కు బయలుదేరిన ఒక ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎన్ని డబ్బులైనా ఫరవాలేదులే ప్రశాంతంగా వెళ్లొచ్చుననుకుంటే ఈ దోమల బెడద ఇబ్బందిగా ఉంది’. అంటూ వెంకటేశ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ ఎల్బీనగర్ నుంచి జీవీకే వరకు రూ.60 చార్జీ తీసుకుంటారు. కానీ ఏసీ సరిగ్గా రాదు. ఎక్కడ చూసినా చెత్త, దోమలు కనిపిస్తాయి. కండక్టర్,డ్రైవర్లు తమకు సంబంధం లేదంటారు. ఇలాగైతే ఎలా...’’ లక్ష్మణ్ అనే ప్రయాణికుడి ప్రశ్న ఇది. ఇలా ఉండగా, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, డిపో నుంచి బయటకు వచ్చిన తరువాత రోడ్లపైన ఉండే దోమలు బస్సుల్లోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి శ్రీధర్ ‘సాక్షి’తో చెప్పారు. త్వరలోనే అన్ని బస్సుల్లో ఆల్ అవుట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల బాక్సు లేదు దోమల బెడదపైన ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నాను. కానీ బస్సులో బాక్సు లేదు. కండక్టర్ ఒక అధికారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాను. కానీ అతడు ఫోన్ ఎత్తడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. – జానయ్య, ఎల్బీనగర్ చాలా నిర్లక్ష్యం ఇది కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. పేరుకే ఏసీ బస్సులు. కానీ ఏ మాత్రం శుభ్రంగా ఉండడం లేదు. ఆ బస్సుల్లో వెళ్లడం కంటే ఆర్డినరీ బస్సులు నయమనిపిస్తుంది. – వెంకన్న గౌడ్. దిల్సుఖ్నగర్ -
స్వైన్‌ఫ్లూ కలకలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా 20 మంది మృతిచెందారు. అధికారులు మాత్రం 12 మందే మరణించినట్లు చెబుతున్నారు. ఒక్క ఉస్మానియా ఆసుపత్రిలోనే స్వైన్‌ఫ్లూతో 10 మంది మరణించినట్లు అక్కడి వైద్యులు చెబుతున్నారు. చలికాలం ప్రారంభం కావడంతో స్వైన్‌ఫ్లూ మరింత విజృంభిస్తుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు అన్ని జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. ఎన్నికల సమయం కావడంతో కిందిస్థాయి వైద్య సిబ్బందిని కూడా ఉపయోగించుకోవడంతో గ్రామాలు మొదలు కార్పొరేషన్ల వరకు అంతా అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. దీంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఫలితంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కాగా, వైద్య, ఆరోగ్య శాఖ తొలిసారి అన్ని జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. స్వైన్ ఫ్లూ నియంత్రణను పర్యవేక్షించేందుకు నలుగురు అధికారులతో కూడిన ప్రత్యేక నోడల్ బృందాన్ని ఏర్పాటు చేశారు. 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు.. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, కోరంటి ఫీవర్ ఆసుపత్రులతో పాటు 30 జిల్లాల్లోని 37 ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేటెడ్ వార్డులను అందుబాటులో ఉంచారు. ఈ ఆసుపత్రుల్లో మొత్తం 467 పడకలను సిద్ధం చేశారు. వైరస్ నిర్ధారణ పరీక్షలను నారాయణగూడ ఐపీఎంతో పాటు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నమూనాలు సేకరించేందుకు అవసరమైన కిట్స్‌ను అందుబాటులో ఉంచారు. స్వైన్ ఫ్లూ సోకిన వారి కోసం లక్ష డోసుల వసల్టావీర్ టాబ్లెట్లు, సిరప్ సిద్ధంగా ఉంచామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు. చలికాలంలో హెచ్1 ఎన్1 వైరస్ వ్యాపించకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించామన్నారు. ఇందుకు వైద్యులు, నర్సులు తదితర పారామెడికల్ సిబ్బందికి అవసరమైన మాస్కులు, టీకాలు, ఇతర ఔషధాలు సిద్ధం చేశామని చెప్పారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన రోగులకు తక్షణం పరీక్షలు నిర్వహించి, తదుపరి చికిత్సకు గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించినట్లు వివరించారు. -
దోమల దండు!
సాక్షి, అమరావతి బ్యూరో : గ్రామాల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. పంచాయతీల్లో పాలన పడకేయడంతో పారిశుద్ధ్యం మచ్చుకైనా కన్పించడం లేదు. దీంతో దోమలు విజృంభించి ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. వ్యాధులు ప్రబలకుండా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌లు తూతూమంత్రంగా ముగించారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిశుభ్రత మెరుగుదల, దోమల నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదనే విమర్శలొచ్చాయి. కనీసం చెత్తను తొలగించే వారు లేకపోవడంతో డంపింగ్ పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. ఓ వైపు పంచాయతీ కార్యదర్శుల కొరత, మరో వైపుప్రత్యేకాధికారుల నియామకం చేపట్టకపోవడంతో ప్రజలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో స్పెషల్ డ్రైవ్‌లు నామమాత్రంగా చేపట్టి అధికారులు చేతులు దులిపేసుకున్నారు. పారిశుధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం వరకే అధికారులు పరిమితం అయ్యారు తప్పితే... పారిశుద్ధ్యం మెరుగునకు, దోమల నియంత్రణకు చర్యలు తీసుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉన్నా పట్టించుకునే వారు కరువయ్యారు. కాల్వల్లో పూడిక తీయకపోవడంతో మురుగు పేరుకుపోయి దోమలకు నిలయంగా మారింది. చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రత తాండవిస్తున్నా ఆలకించే నాథుడే లేకుండా పోయాడు. దోమలపై యుద్ధం చేస్తున్నామని అధికారులు చేసిన ప్రకటన కేవలం కాగితాలకే పరిమితమైంది. జిల్లా వ్యాప్తంగా 973 పంచాయతీలుండగా వీటిని క్లస్టర్లుగా ఏర్పాటుచేసి 592 మంది ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించింది. అలాగే పంచాయతీల పాలనలో కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సిన కార్యదర్శుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కొరవడిన స్పష్టత... ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2011–12లో సర్పంచుల పదవీకాలం ముగియడంతో అప్పటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి పంచాయతీలను క్లస్టర్లను ప్రాతిపదికగా తీసుకుని ప్రత్యేక అధికారులను నియమించారు. రెండేళ్ల పాటు పంచాయతీల్లో అధికారుల పాలన కొనసాగింది. అప్పట్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వానికి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనపై స్పష్టత కొరవడింది. ముందుగా పీహెచ్సీ వైద్యులు, పశు వైద్య శాఖ అధికారులు, ఎంఈఓలను నియమించింది. తీవ్ర విమర్శలు రావడంతో వీరిని తొలగించింది. నిధుల విడుదల ఏదీ..? పంచాయతీల్లో పాలన కోసం 14వ ఆర్థిక సంఘం నిధులను వినియోగిస్తున్నారు. జిల్లాలో సుమారు రూ.64 కోట్ల మేర నిధులున్నా వీటిని వినియోగించేందుకు అవకాశం లేకుండా ఉంది. ప్రత్యేక అధికారుల నియామకంతో పాటు చెక్ పవర్‌ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ఆదేశాలు కాగితాలకే పరిమితమయ్యాయి. సీఎఫ్ఎంఎస్ విధానంలో వేలిముద్రలు నమోదు కావాల్సి ఉంది. గ్రామాల్లో దోమలు స్వైర విహారం... గ్రామాల్లో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికే డెంగీ కేసులు నమోదై.. ప్రజలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు. మలేరియా, టైఫాయిడ్ విజృంభిస్తున్నా ప్రభుత్వంలో చలనం కనిపించడం లేదు. పంచాయతీలో పాలనలో ఆ శాఖ మంత్రికి పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతోనే ఈ సమస్య ఉత్పన్నమైందని పదవీకాలం ముగిసిన సర్పంచులు ఆరోపిస్తున్నారు. నిధులు డ్రా చేయడానికి అవకాశం.. ఈ విషయమై డీపీఓ విక్టర్‌ను వివరణ అడగగా నిధులు డ్రా చేసుకునేందుకు ప్రత్యేక అధికారులకు అవకాశం కల్పించామన్నారు. -
ఊరికి జ్వరమొచ్చింది..
రామాయంపేట(మెదక్): ఊరు మంచం పట్టింది. వైద్యసేవల్లేక ఊరు ఊరంతా విలవిలలాడుతోంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో చికున్ గున్యా వణికిస్తోంది. గ్రామంలో 400 మంది చికున్‌గున్యాతో బాధపడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరపీడితులే. సరైన వైద్యసేవలు అందుబాటులో లేకపోవడంతో 15 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొందరు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకున్నా ఫలితం లేదు. గ్రామంలో పారిశుధ్యం లోపించింది. రోడ్లపై ఎక్కడ చూసినా మురుగునీరే. ఇళ్ల మధ్య నుంచే మురుగునీరు పారుతోంది. దోమలు విజృంభిస్తున్నాయి. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవని, కేవలం రెండు, మూడు మందు బిళ్లలు ఇచ్చి పంపుతున్నారని బాధితులు వాపోతున్నారు. మా దృష్టికి రాలేదు.. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటేశ్వర్రావును ‘సాక్షి’ఫోన్లో సంప్రదించగా గ్రామంలోని పరిస్థితి తమ దృష్టికి రాలేదన్నారు. వారికి చికున్ గున్యా వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఇటీవల కొందరు గ్రామంలోని పీహెచ్సీకిరాగా, తమ సిబ్బంది చికిత్స చేసి పంపారని పేర్కొన్నారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. -
దోమ దెబ్బ
సాక్షి, సిటీబ్యూరో: ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు సిటిజన్ల వెన్నులో వణుకుపుట్టిస్తున్నాయి. వాతావరణంలో మార్పులకు తోడు ఇళ్ల మధ్య మురుగు నిల్వ, చెత్తా చెదారంతో డెంగీ, మలేరియా దోమలు విజృంభిస్తున్నాయి. నీరు, ఆహార కాలుష్యంతో నగరవాసులు డయేరియా, విషజ్వరాల బారినపడుతున్నారు. వాంతులు, విరేచరాలతో పాటు దగ్గు, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రులు సహా నగరంలోని పలు కార్పొరేట్ ఆస్పత్రులకు రోగులు పోటెత్తుతున్నారు. వర్షాలు తగ్గిన తర్వాత డయేరియా కేసులతో పాటు ఇతర సీజనల్ వ్యాధుల బారిన పడిన బాధితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది, ఈ సీజనల్ వ్యాధుల విషయంలో నగరవాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. చాపకింద నీరులా డెంగీ, మలేరియా నగరంలో మలేరియా, డెంగీ దోమలు చాపకింద నీరులా విజృంభిస్తున్నాయి. గత నెలలో ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే 417 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో ఇప్పటి వరకు 70పైగా కేసులు, ఉస్మానియాలో కేవలం వారం రోజుల్లోనే 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఫీవర్‌లో 14 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ జిల్లా పరిధిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 179 కేసులు నమోదు కాగా, ఈ నెలలో 46 కేసులు నమోదయ్యాయి. 274 మలేరియా కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క ఆగస్టులోనే 31 కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు స్పష్టం చేశారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి నీటిని వేడి చేసి, చల్లారిన తర్వాత తాగాలి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పూల కుండీలు, వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. – డాక్టర్ సుదర్శన్‌రెడ్డి, జనరల్ ఫిజిషియన్ -
దోమలకు దోమలే విరుగుడు..!!
టౌన్స్విల్, ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాలోని ఓ నగరంలో గత నాలుగేళ్లుగా ఒక్క డెంగీ వ్యాధి కేసు నమోదు కాలేదు. దోమలకు దోమల్నే ప్రత్యర్థులుగా వినియోగించిన శాస్త్రవేత్తలు ఈ విజయాన్ని సాధించగలిగారు. కొన్ని దోమల్లోకి వోల్బాచియా బ్యాక్టీరియాను చొప్పించడం ద్వారా డెంగీ వ్యాధిని వ్యాప్తి చేసే దోమలను నాశనం చేశారు. ఈ పద్దతిని తొలిసారిగా ఆస్ట్రేలియాలోని టౌన్స్విల్ పట్టణంలో ప్రవేశపెట్టారు. ఇది విజయం సాధించడంతో జికా, మలేరియా దోమలను కూడా హతమార్చేందుకు ప్రయత్నాలను ప్రారంభించారు. బ్రెజిల్‌లోని రియో డి జెనీరోలో జికా దోమలను చంపడమే లక్ష్యంగా అతి త్వరలో కొన్ని ప్రత్యేక దోమలను(వోల్బాచియా బ్యాక్టీరియా ప్రభావితమైనవి) వదలనున్నారు. కొలంబియాలోని మెడ్లిన్, ఇండోనేషియాలోని యోగ్యకార్టాల్లో సైతం ఈ మేరకు సన్నహకాలు జరుగుతున్నాయి. టౌన్స్‌విల్‌లో డెంగీపై విజయం సాధించడానికి ప్రధాన కారణం. చిన్నపెద్ద తేడా లేకుండా అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడమే. విద్యార్థులు సైతం వోల్బాచియా దోమలను వదిలేందుకు ఆసక్తిని కనబర్చారు. దోమలను వదిలిన నాటి నుంచి టౌన్స్‌విల్‌లో ఒక్కటంటే ఒక్క డెంగీ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ఈ దోమలను ప్రపంచవ్యాప్తంగా అందించడం ద్వారా డెంగీ వ్యాధిని పూర్తిగా అరికట్టవచ్చనే భావన వ్యక్తం అవుతోంది. -
‘విమానంలో దోమలున్నాయంటే.. కొట్టారు’
సాక్షి, న్యూఢిల్లీ : విమానంలో దోమలు ఉన్నాయని చెబితే తనపై ఇండిగో క్రూ సభ్యులు చేయి చేసుకున్నారని ఓ ప్రయాణీకుడు ఆరోపించారు. లక్నో నుంచి బెంగళూరుకు బయల్దేరిన విమానంలో దోమలు ఎక్కువగా ఉన్నాయని తాను క్రూ సభ్యులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే, ప్రత్యామ్నాయం చూపడానికి బదులు క్రూ బృందం తనతో వాగ్వాదానికి దిగి, చేయి కూడా చేసుకుందని డా. సురభ్ రాయ్ ఆరోపించారు. తనను బెదిరించి, విమానంలో నుంచి దించేసి అవమానించారని అన్నారు. -
బోద.. తీరని బాధ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫైలేరియా సమస్య తీవ్రంగా ఉంది. వైద్య, ఆరోగ్య శాఖ తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 47,476 మంది ఫైలేరియా బాధితులు ఉన్నారు. వీరిలో బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సమస్యతో బాధపడేవారు 46,476 మంది, వరిబీజంతో సతమతమయ్యేవారు 1,042 మంది ఉన్నారు. పరిసరాల అపరిశుభ్రతతో వృద్ధి చెందే క్యూలెక్స్ దోమకాటు బోదకాలు వ్యాధికి కారణమవుతోంది. మనిషి శరీరంలోకి క్రిమి (పారాసైట్) నెమ్మదిగా వ్యాప్తి చెందుతూ మూడు రకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. బోదకాలు (లింపోడెమ ఫైలేరియా) సోకినవారి కాలు పెద్దగా మారుతుంది. పురుషుల్లో వరిబీజం (హైడ్రోసెల్), మహిళల్లో రొమ్ముల బరువు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఫైలేరియాను నిర్లక్ష్యం చేస్తే రోజురోజుకూ కాలు పెద్దగా మారి నడవలేని స్థితికి చేరుతుంది. ఫైలేరియా సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు ఆరోగ్యశాఖ ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తుంది. ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసి ఒకేసారి నాలుగు వేల మంది రక్త నమూనాలను సేకరిస్తారు. ఫైలేరియాకు కారణమయ్యే క్రిమి మనుషుల రక్తనాళాల్లోకి రాత్రిపూట మాత్రమే విస్తరిస్తుంది. దీంతో రాత్రి తొమ్మిది నుంచి 12 గంటలలోపు మాత్రమే రక్త నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. కాలివేళ్ల నుంచి ఈ రక్త నమూనాలను తీసుకుంటారు. పరీక్షలో 40 కంటే ఎక్కువగా పాజిటివ్ అని వస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా భావిస్తారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగామ, మహబూబాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉంది. ఈ 5 జిల్లాల్లోని 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిని సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతం (హై రిస్క్ జోన్)గా వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలు వాడాలి.. ఫైలేరియా సోకే ప్రాంతాల్లోని వారు వరుసగా ఐదేళ్లపాటు డీఈసీ మాత్రలను వాడితే సమస్య శాశ్వతంగా తీరిపోతుంది. బోదకాలు సోకిన శరీర భాగాలను నిత్యం నీటితో శుభ్రపర్చాలి. తప్పనిసరిగా ఆయింట్మెంట్ రాసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. – డాక్టర్ ఎస్.ప్రభావతి, ఫైలేరియా నిర్మూలన రాష్ట్ర అధికారి -
దోమలు.. కనిపిస్తే కాల్చివేత..!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు హాజరయ్యే అతిథులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక విందు ఇవ్వనున్న గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. విందు నాటికి గోల్కొండ కోటలో ఒక్క దోమ కూడా లేకుండా జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం దోమల నిర్మూలన చర్యల్ని ముమ్మరం చేసింది. దోమల నిర్మూలనలో భాగంగా ఇప్పటి వరకూ ఫాగింగ్, స్ప్రేయింగ్‌లకు శక్తిమంతమైన అల్ఫా సైపర్ మెథ్రిన్, సిఫనోథ్రిన్‌తోపాటు పొగ రాకుండా పైరిథ్రమ్‌ను వాడుతున్న సిబ్బంది.. తాజాగా పరిమళాలు వెదజల్లే సిట్రనెల్లా ఆయిల్, డెల్టా మిథిలీన్ లిక్విడ్లను స్ప్రే చేస్తున్నారు. వీటివల్ల దోమల నిర్మూలనే కాకుండా పరిసరాల్లో సువాసనలు వెదజల్లుతాయి. మస్కిటో రెపెల్లెంట్స్ గానూ పనిచేస్తుండంతో వీటిని వినియోగిస్తున్నారు. ఈ పనులకుగానూ 4 డ్యూరోటెక్ మెషీన్లు, 8 పవర్ స్ప్రేయర్లు, 8 మొబైల్ మెషీన్లను వాడుతున్నారు. పరీక్షలతో దోమల లెక్క.. దోమల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పాటు ఏరోజుకారోజు ప్రత్యేకంగా మస్కిటో డెన్సిటీ అధ్యయనం చేస్తున్నారు. ఇందుకు గానూ గోడలపై సక్షన్ ట్యూబ్‌లను ఉంచి గాలి గుంజుతారు. దీంతో పరిసరాల్లోని దోమలు ట్యూబ్‌లోకి వస్తాయి. వాటిని టెస్ట్‌ట్యూబ్‌లోకి పంపి లెక్కిస్తారు. బుధవారం విందు సమయానికి ఒక్క దోమా లేకుండా చేసేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తూ అందుకు అనుగుణంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. సాయంత్రం.. చీకటి పడ్డ తర్వాత ఇలా రోజుకు రెండు పర్యాయాలు ఈ పరీక్షలు చేస్తున్నారు. గోల్కొండ కోటలో పరీక్షల్లో ఐదు రోజుల క్రితం గంటకు 200 దోమలు ఉండగా.. శనివారం నాటికి 40కి తగ్గాయి. సోమవారం వరకు వీటిని జీరో చేసే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. సాధారణంగా చీకటి పడిన తర్వాత గోల్కొండ కోటలోకి దోమలు ఎక్కువగా వస్తాయని, అయితే తాము చేపట్టిన చర్యలతో శని, ఆదివారాల్లో దోమలు చాలా వరకు తగ్గిపోయాయని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. గోల్కొండ కోట పరిసరాల్లో దోమల లార్వా వ్యాప్తికి కారణమవుతున్న గుర్రపుడెక్కను తొలగించారు. శాతం చెరువు, హుడా తలాబ్, టిప్పుఖాన్ బ్రిడ్జి తదితర ప్రాంతాల్లోనూ గుర్రపుడెక్క తొలగించినట్లు సీనియర్ ఎంటమాలజిస్ట్ లచ్చిరెడ్డి తెలిపారు. విందురోజు ప్రత్యేక అగర్బత్తీలు.. ఇప్పటికే పరిమళాలు వెదజల్లే లిక్విడ్స్‌తో స్ప్రేయింగ్ పనులు చేస్తుండగా విందురోజు ప్రత్యేక పరిమళాలతోపాటు దోమలను దరి చేరకుండా చేసే లెమన్‌గ్రాస్‌తో తయారు చేసిన ప్రత్యేక అగర్బత్తీలను గోల్కొండ కోటలో వినియోగించనున్నారు. లెమన్ గ్రాస్.. దోమల రెపెల్లెంటే కాక సుగంధం వెదజల్లడంతో సదరు అగర్బత్తీలను నాందేడ్ నుంచి తెప్పిస్తున్నారు. -
రాష్ట్రంపై డెంగీ కాటు!
-
రాష్ట్రంపై డెంగీ కాటు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై డెంగీ, మలేరియా, విష జ్వరాలు మళ్లీ పంజా విసురుతున్నాయి. విభిన్న వాతావరణ పరిస్థితులతో రోజు రోజుకూ విజృంభిస్తున్నాయి. రాష్ట్రంలోని 173 గ్రామాలు డెంగీ ప్రభావానికి గురయ్యాయని, ఈ ఏడాది ఇప్పటివరకు 1,799 మందికి సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ధారించింది. అనధికారికంగా ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలు, పారిశుధ్య లోపం, దోమల బెడదతో డెంగీ వ్యాప్తి చెందుతోంది. మరోవైపు డెంగీ బాధితులకు చికిత్స పేరుతో ప్రైవేటు ఆస్పత్రులు దోపిడీకి తెరలేపాయి. లక్షల రూపాయలు వసూలు చేస్తూ పీల్చి పిప్పిచేస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక డెంగీ సోకినవారు వేల సంఖ్యలో ఉన్నా దానితో మృతి చెందిన ఘటనలేమీ నమోదు కాలేదని వైద్యారోగ్య శాఖ చెబుతుండగా.. ఇతర వ్యాధులు కూడా ఉండి డెంగీతో మృతి చెందినవారిని వైద్య శాఖ డెంగీ బాధితులుగా గుర్తించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో డెంగీ మరణాలు లేవని నివేదికలో పేర్కొంటోందని అంటున్నారు. ఖమ్మం, హైదరాబాద్‌లలో అధికంగా.. ఖమ్మం, హైదరాబాద్, మహ బూబ్‌నగర్ జిల్లాల్లో డెంగీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. ఖమ్మం జిల్లా లో అత్యధికంగా 572, హైదరాబాద్‌లో 426, మహబూబ్‌నగర్‌లో 134 మంది డెంగీతో బాధపడుతున్నారు. మలేరియా జ్వరాలు కూడా విజృంభిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,940 మంది మలేరియా బారినపడ్డారు. కొత్త గూడెం, భూపాలపల్లి, హైదరాబాద్ జిల్లా ల్లో మలేరియా బాధితులు ఎక్కువగా ఉన్నారు. ప్లేట్లెట్ల పేరుతో దోపిడీ డెంగీ బాధితులకు చికిత్స విషయంలో ప్రభుత్వ ఆస్పత్రులు చేతులెత్తేస్తుండడంతో.. బాధితులను ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు నిలు వునా దోచుకుంటున్నాయి. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గిందంటూ ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నాయి. ఒక్కో ప్లేట్లెట్ ప్యాకెట్ ధర ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటోంది. కార్పొరేట్ ఆస్పత్రులైతే ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. అవసరం లేకున్నా కూడా ఒక్కో డెంగీ బాధితులకు ఐదు నుంచి 20 వరకు ప్లేట్లెట్ ప్యాకెట్లు ఎక్కిస్తున్నారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంచుకుని లక్షల రూపాయలు బిల్లు వసూలు చేస్తున్నారు. ఇక ప్రభుత్వాస్పత్రులు డెంగీ పరీక్షలు, చికిత్స చేసే వసతులు లేవంటూ రోగులను పంపేస్తున్నాయి. మరోవైపు డెంగీ ఆరోగ్యశ్రీలో లేకపోవడంతో దాని బారిన పడే పేదల జీవితాలు ఆగమైపోతున్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కోలుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. పరిసరాల పరిశుభ్రతే అసలు మందు.. వర్షాలతో నీరు నిలవడం, పారిశుధ్య లోపాలే డెంగీ, మలేరియాల వ్యాప్తికి ప్రధాన కారణం. డెంగీ కారక దోమలు మంచినీటిలోనే వృద్ధి చెందుతాయి. నిల్వ ఉండే నీటిలో, డ్రమ్ములలో నిల్వ చేసే నీటిలో ఈ దోమలు పెరుగుతాయి. ఇక డెంగీ కారక దోమలు పగటిపూటే కుడతాయి. దీంతో పగటిపూట ఇళ్లలో ఉండే మహిళలు, పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతున్నారు. ఇక దోమల నివారణ మందులు, దోమ తెరలు వినియోగిస్తూ.. డెంగీ రాకుండా నివా రించే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాం ‘‘డెంగీ, మలేరియాల నివారణ విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం. డెంగీ ప్రభావం ఉన్న 117 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 123 వైద్య శిబిరాలు నిర్వహించాం. గ్రామాల్లో ఇళ్ల వారీగా నీటినిల్వలను పరిశీలించి దోమల నివారణకు చర్యలు చేపట్టాం. అవసరమైన వారికి వెంటనే చికిత్స అందిస్తున్నాం..’’ – డాక్టర్ ఎస్.ప్రభావతి, వైద్యశాఖ అదనపు డైరెక్టర్ -
జైలుకెళ్తారు జాగ్రత్త!
మురుగునీరు నిల్వ ఉంటే కుదరదంటూ ప్రాణాంతకమైన డెంగీ దోమల వ్యాప్తికి కారకులైన 20 వేల మందికి మంగళవారం ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష తప్పదని హెచ్చరించింది. ఇక ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ పిలుపునిచ్చారు. డెంగీ నివారణ చర్యల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కోరారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : తమిళనాడు వ్యాప్తంగా డెంగీ జ్వరాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. డెంగీ జ్వరాల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత రెండు నెలల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా పదివేల మందికి పైగా డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చేరగా వందల సంఖ్యలో ప్రాణాలు విడిచారు. ఇప్పటికీ కొన్నివేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోయంబత్తూరులో డెంగీ జ్వరాలకు ముగ్గురు మహిళలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి చనిపోయారు. సేలం జిల్లాలో గత వారం రోజుల్లో 18 మంది మృతి చెందడంతో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు పలు స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి డెంగీ నివారణ పనులను చేపడుతున్నారు. వ్యాధి నిరోధక కషాయం విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ప్రజలు, విద్యార్థులతో చైతన్యర్యాలి నిర్వహిస్తున్నారు. అదుపులోకి రాని డెంగీ ఎన్ని చర్యలు తీసుకున్నా డెంగీ అదుపులోకి రాలేదు. ప్రజల్లో భయాందోళనలు తొలగిపోలేదు. సాధారణ జ్వరం వచ్చినా డెంగీ జ్వరం అనుకుని జడుసుకుంటున్నారు. రోజుల కొలదీ నిల్వ ఉన్న మంచినీటిలో మాత్రమే డెంగీ దోమ వ్యాప్తిచెందుతుందున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి వాటిని నిర్మూలించాల్సిందిగా సూచించారు. ప్రజల్లో ధైర్యం కలిగించి, దోమలవ్యాప్తిని నివారించేందుకు ఆరోగ్యశాఖ అధికారులు ఈనెల 8వ తేదీన చెన్నైలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. చెన్నై పుదుప్పేట, రాయపేట తదితర ప్రాంతాల్లోని దుకాణాల వద్ద నీరునిలిచిపోయి ఉండడాన్ని గుర్తించారు. అలాగే ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాల్లో నీరు పేరుకుపోయి ఉండడాన్ని గమనించారు. కొన్ని ఇళ్ల ప్రాంగణంలో వాడకం నీరు ప్రవాహానికి నోచుకోకుండా నిలిచిపోయి ఉండగా వారికి జాగ్రత్తలు సూచించారు. ఇలా రాష్ట్రం నలుమూలలా గుర్తించిన 20 వేల మందికి మంగళవారం నోటీసులు జారీచేశారు. 48 గంటల్లోగా నీటి నిల్వలను తొలగించకుంటే ఆరు నెలల జైలుశిక్ష లేదా రూ.1 లక్ష జరిమానా తప్పదని హెచ్చరించారు. కాగా డెంగీ వ్యాప్తికి దోహదపడుతున్న 64 మంది నుంచి పూందమల్లి మునిసిపాలిటీ రూ.43వేల జరిమానా వసూలు చేసింది. పుదుచ్చేరిలో చెత్తవేస్తే రూ.100 జరిమానా డెంగీ నిరోధకానికి జాగ్రత్తల్లో భాగంగా మంగళవారం పుదుచ్చేరిలో పాదయాత్ర నిర్వహించిన గవర్నర్ కిరణ్‌బేడీ రోడ్డులో చెత్తవేసిన వారికి అక్కడికక్కడే రూ.100 జరిమానా విధించారు. పుదుచ్చేరి మంత్రి కందస్వామి డెంగీ జ్వరం అనుమానంతో సోమవారం రక్తపరీక్షలు చేయించుకోగా ఫలితాలు రావాల్సి ఉంది. ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం ప్రతి మంగళవారం డెంగీ నివారణ దినం పాటించాలని ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రోజుకు 2 వేల కిలోల నిలవేంబు కషాయాన్ని టామ్బాక్స్ సంస్థలో తయారుచేయించి ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఈ కషాయాన్ని అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. జ్వరం సోకగానే నిర్లక్ష్యం చేయకుండా డెంగీ వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి ఆరోగ్య పథకంలో కొత్తగా డెంగీ చికిత్సను కూడా చేర్చినట్లు చెప్పారు. ప్రతి మంగళవారాన్ని డెంగీ నివారణ దినంగా పాటించాలని జిల్లా కలెక్టర్లకు, ఆరోగ్యశాఖాధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. డెంగీ నివారణ చర్యల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆరోగ్యశాఖ కార్యదర్శి రాధాకృష్ణన్ కోరారు. ప్రభుత్వానికి కోర్టు నోటీసులు డెంగీ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మదురై హైకోర్టులో రమేష్ అనే వ్యక్తి మంగళవారం దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీచేసింది. -
పేరుకే భాగ్యనగర్! అన్నీ అసౌకర్యాలే
► కంపుకొడుతున్న డ్రెయినేజీలు ► గతుకులమయమైన రోడ్డు ► ఫాగింగ్‌పై పట్టింపు కరువు కరీంనగర్‌కల్చరల్: పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్నట్టుగా ఉందీ ఆ ప్రాంత పరిస్థితి. స్మార్ట్‌సిటీలో భాగమైన 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఆ ప్రాంతంలో రోజురోజుకు విషజ్వరాలు ప్రబలుతున్న పట్టించుకునే వారు కరువయ్యారు. డ్రెయినేజీలు లేక రోడ్డుపైనే మురుగునీరు పారుతున్న ఆ ప్రాంతం వైపు చూసేందుకు అధికారులు తీరడం లేదు. పారిశుధ్య నిర్వహణకే లక్షలు వెచ్చిస్తున్నామని గొప్పగా చెప్పుకునే కార్పొరేషన్ అధికారులకు భాగ్యనగర్‌ను చూస్తే వారి పనితీరు తెలిసిపోతుంది. అధ్వానం 42వ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌లో డ్రెయినేజీలు కనిపించవు. మురుగునీరు రోడ్డుపైనే ప్రవహించాల్సిందే. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ కాలనీవాసుల పరిస్థితి దయనీయంగా ఉంటుంది. దోమలు పెరిగి ఇప్పటికే పలువురు విషజ్వరాల బారిన పడ్డారు. పత్తా లేని ఫాగింగ్ దోమల నివారణకు చేసే ఫాగింగ్ గురించి అధికారులు పట్టించుకోవడం లేదు. కాలనీలో చాలా ఖాళీ ప్లాట్లు ఉండడంతో విపరీతంగా చెట్లు పెరిగి దోమలు విజృంబిస్తున్నాయి. దోమల నివారణకు ఉపయోగపడే ఫాగింగ్ ఆరు నెలలుగా చేసిన దాఖలాలు లేవు. కనీసం దుర్వాసన వెదజల్లుతున్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లడం లేదు. ఇప్పటికైనా పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ తీసుకోవాలని భాగ్యనగర్ వాసులు కోరుతున్నారు. భరించలేకపోతున్నం తలుపు తెరిచిపెడితే మోరీల కంపు భరించలేకపోతున్నం. సాయంత్రం అయితే దోమలు. మోరీల నిండా పందులు. అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకునే వారు కరువయ్యారు. ఇక్కడి కంటే ఊల్లె ఉండడమే మేలు. డ్రెయినేజీలు లేవు, రోడ్లు సరిగా లేవు. దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. – కాసనగొట్టు శ్రీధర్ దోమలతో వేగలేం దోమలతో వేగలేకపోతున్నాం. వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు భయమేస్తుంటుంది. చిన్నచిన్న గుంతల్లో వర్షపునీరు నిలిచి దోమలు పెరుగుతున్నాయి. పిల్లలకు జ్వరాలు వస్తున్నాయి. రాత్రి నిద్రపోలేకపోతున్నాం. వెంటనే దోమల నివారణ చర్యలు చేపట్టాలి. పరిసరాలు కంపు వాసన వస్తున్నాయి. – రామకృష్ణ కంపుకొడుతున్నాయి పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడికక్కడ మురికినీరు నిలిచి పరిసరాలు కంపుకొడుతున్నాయి. చాలా చోట్ల డ్రెయినేజీలు లేకపోవడంతో రోడ్డుపైనే మురుగునీరు ప్రవహిస్తుంది. నివాసాల మధ్యే మురుగునీరు చేరి దుర్వాసన వస్తుంది. ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జి.సబిత -
వ్యాధులపై సమరం
► జిల్లాకు చేరిన మలేరియా ర్యాపిడ్ కార్డులు ► ఉమ్మడి జిల్లాకు 75వేలు ► క్లోరిన్ గుళికలు 7లక్షలు ► దోమలు, లార్వాల నివారణకు స్ప్రే, లిక్విడ్స్ ► కాంట్రాక్టర్ల ద్వారా జిల్లాల్లో స్ప్రే పనులు సాక్షి, ఆదిలాబాద్: సీజనల్ వ్యాధుల ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఏటా సీజనల్ వ్యాధుల ప్రభావం కారణంగా అధికసంఖ్యలో మరణాలు సంభవించడం ఆందోళన కలిగించేది. గత రెండేళ్లుగా మరణాల ప్రభావం పెద్దగా లేకపోయినప్పటికీ వ్యాధుల ప్రభావం మాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత, నీటి కలుషితం నివారణకు చర్యలు తీసుకుంటోంది. వ్యాధులు ప్రబలినప్పుడు తక్షణం వివిధ పరీక్షల ద్వారా గుర్తించేందుకు అనువుగా టెస్ట్కార్డులను ఏటా సరఫరా చేస్తోంది. ఈయేడు కూడా ఉమ్మడి జిల్లాకు మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు మంజూరు చేసింది. 75వేల ర్యాపిడ్ కార్డ్ టెస్టు కిట్లు.. తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు, మౌళిక సదుపాయాల అభివద్ధి సంస్థ(టీఎస్ఎంఎస్ఐడీసీ) నుంచి ఉమ్మడి జిల్లాకు 75వేల మలేరియా ర్యాపిడ్ కార్డ్ టెస్టులు మంజూరయ్యాయి. వీటిని నాలుగు జిల్లాలకు త్వరలో పంపించనున్నారు. మలేరియా వ్యాధిని తక్షణం గుర్తించేందుకు ఈ ర్యాపిడ్ కార్డు టెస్టుల ద్వారా నిర్ధారణ చేయవచ్చు. దీంతోపాటు ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు రెండును మించి వచ్చిన చోటా పైరిత్రమ్ స్ప్రేను నాలుగు జిల్లాలకు కలిపి 200 లీటర్లు మంజూరు చేయడం జరిగింది. ప్రధానంగా దోమల ఉధృతి ఉన్న చోటా, ఇళ్ల లోపల పైరిత్రమ్ను స్ప్రే చేయడం జరుగుతుంది. నిల్వ ఉన్న నీళ్ల దగ్గర దోమల లార్వాలు వృద్ధి చెందే అవకాశం ఉండగా, అక్కడ టెమిఫోస్ లిక్విడ్‌ను చల్లడం ద్వారా లార్వాలను నిరోధించే అవకాశం ఉంటుంది. జిల్లాకు 550 లీటర్లను ప్రభుత్వం మంజూరు చేసింది. నాలుగు జిల్లాలకు దీనిని సరఫరా చేయనున్నారు. ఇండోర్ రెసిడ్యూయల్ స్ప్రేగా పేర్కొనే దీన్ని జిల్లాల్లో డీఎంహెచ్ఓ ఆధ్వర్యంలో టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తున్నారు. వీటితోపాటు మైక్రోస్లైడ్స్, బ్లడ్ ల్యాన్సర్లు, స్లైడ్ బాక్సులను సైతం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు ఇవి చేరుకున్నాయి. వీటిని నాలుగు జిల్లాలకు సరఫరా చేయనున్నారు. ఏడు లక్షల క్లోరిన్ గుళికలు.. ప్రధానంగా మంచినీటి ట్యాంకులు, బావుల్లో ఆర్డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో క్లోరినేషన్ చేయడం ద్వారా నీటిలో ఉన్న బ్యాక్టీరియాను నివారించవచ్చు. ట్యాంకుల్లో ప్రతి 15 రోజులకోసారి క్లోరినేషన్ చేయాల్సి ఉంటుంది. బావుల్లో వారానికి ఒకసారి క్లోరినేషన్ చేయాలి. ఇటీవల ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలం తడిహత్నూర్లో బావిలో నీరు కలుషితం కావడంతో వందమందికి పైగా అస్వస్థతకు గురైన విషయం విదితమే. నిల్వ ఉన్న నీటిలో క్లోరినేషన్ చేస్తారు. వాగులు, వంకల్లో ప్రస్తుతం కొత్త నీరు చేరుతోంది. పలు గ్రామాల్లో ఆ నీటిని కుండల్లో నింపుకొని గ్రామస్తులు తాగుతున్నారు. తద్వారా నీరు కలుషితంగా ఉండి డయేరియా వంటి వ్యాధులు ప్రబలే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు 7లక్షల క్లోరిన్ గుళికలను సరఫరా చేసింది. ఇప్పటికే ఇవి సెంట్రల్ డ్రగ్ స్టోర్‌కు చేరుకున్నాయి. నాలుగు జిల్లాలకు వీటిని పంపిణీ చేయనున్నారు. ప్రధానంగా వాగులు, వంకల నుంచి బిందెల్లో పట్టుకున్న నీటిలో రాత్రిపూట ఒక క్లోరిన్ గుళిక వేసి మరుసటి రోజు కాచివడబోసి తాగిన పక్షంలో వ్యాధులు సోకే ప్రమాదం ఉండదని వైద్యాధికారులు చెబుతున్నారు. పెరిత్రమ్ స్ప్రే.. ఉమ్మడి జిల్లాకు 200 లీటర్లు మంజూరు నాలుగు జిల్లాలకు 50 లీటర్ల చొప్పున పంపిణీ టెమిఫోస్ లిక్విడ్.. టెమిఫోస్ లిక్విడ్ 550 లీటర్లు నాలుగు జిల్లాలకు సమానంగా పంపిణీ మలేరియా టెస్టులు చేసేందుకు మైక్రోస్లైడ్స్.. ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు రోగి నుంచి రక్తం సేకరించేందుకు బ్లడ్ ల్యాన్సర్స్.. ఉమ్మడి జిల్లాకు 2లక్షల 90వేలు రక్త సేకరణ తర్వాత నిల్వ కోసం స్లైడ్ బాక్సులు.. ఉమ్మడి జిల్లాకు స్లైడ్ బాక్సులు 400 జిల్లాకు 100 చొప్పున పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో స్ప్రే ఇదివరకు మలేరియా పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లో ఇండోర్ రెసిడ్యూయ్ స్ప్రే చేయిస్తాం. ఆదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టర్లకు ఈ పనులు అప్పగించాం. ఆదిలాబాద్ జిల్లాలోని 437 గ్రామాల్లో ఈ స్ప్రే చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో స్ప్రే జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్ప్రే పనులను నిరంతరం పర్యవేక్షిస్తాం. ఎక్కడైనా లోపాలు ఉన్నపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం. – రాజీవ్‌రాజ్, డీఎంహెచ్‌వో -
డెంగీ సైరన్..
►విజృంభిస్తున్న మలేరియా ►పదిరోజుల్లో 17 మలేరియా, 6 డెంగీ కేసులు నమోదు ►అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ సిటీబ్యూరో: ఇటీవల నగరంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఖాళీ కొబ్బరి బొండాలు, టైర్లలోకి నీరు చేరడంతో దోమలు వ్యాపించి బస్తీవాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. యాంటిలార్వా, ఫాగింగ్ నిర్వహించి ఎప్పటికపుడు దోమలను నియంత్రించి, సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ఎంటమాలజీ విభాగం అధికారులు పట్టించుకోలేదు. గ్రేటర్లో కేవలం పది రోజుల్లో 17 మలేరియా, 15 డెంగీ కేసులు నమోదు కావడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదైన డెంగీ, మలేరియా కేసుల వివరాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు చేరడం లేదు. ప్రభుత్వం ఐజీఎం ఎలీసా టెస్టులో పాజిటివ్ వచ్చిన కేసులను మాత్రమే డెంగీగా పరిగణిస్తుంది. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్ఎస్–1 టెస్టు చేస్తున్నాయి. వీటిలో పాజిటివ్ వచ్చిన వాటిని డెంగీ జ్వరంగా నిర్థారిస్తున్నారు. నిజానికి రోగి నుంచి రెండో శాంపిల్స్ సేకరించి నిర్ధారణ కోసం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)కు పంపాలి. కానీ ప్రభుత్వ ఆస్పత్రులు మినహా నగరంలో ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా ఐపీఎంకు రెండో శాంపిల్‌ను పంపడం లేదు. సీజనల్ వ్యాధుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని ఎపిడమిక్ సెల్‌కు తెలియజేయాల్సి ఉన్నా చాలా ఆస్పత్రులు సస్పెక్టెడ్ డెంగీగా పేర్కొంటూ చికిత్స చేసి పంపుతుండడం గమనార్హం. టైగర్ దోమతోనే డెంగీ.. ఈడిస్ ఈజిప్ట్(టైగర్)దోమ కుట్టడం వల్ల డెంగీ వస్తుంది. ఒంటిపై తెల్లని చారలతో కనిపించే ఈ నల్లని దోమ పగటిపూట కుడుతుంది. కుట్టిన 7–8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు బయటపడుతాయి. కళ్లమంట, అధిక జ్వరం, చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి. రక్తంలో ప్లేట్లెట్స్ కౌంట్ కౌంట్ 20 వేలలోపునకు పడిపోయి రక్తస్రావం అవుతుంటే ప్లేట్లెట్స్ ఎక్కించాలి. – డాక్టర్ రాజన్న, చిన్నపిల్లల వైద్యుడు నీరు నిల్వలేకుండా చూడాలి డెంగీ బారిన పడుకుండా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. ఇంటి పరిసరాల్లో మురుగు, పాత టైర్లు, ఖాళీ కొబ్బరి బొండాలు నిల్వ ఉండకుండా చూడాలి. నీటి ట్యాంకులు, క్యాన్లు వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. గదుల్లో వెలుతురు ఎక్కువగా ఉండేలా చూడాలి. పిల్లలకు పగటిపూట దోమ తెరలు వాడాలి. ఓవర్‌హెడ్ ట్యాంక్‌లపై మూతలు విధిగా ఉంచాలి. – డాక్టర్ రమేష్ దంపూరి, నిలోఫర్ -
దోమల దండయాత్ర!
⇒ గ్రేటర్ చుట్టూ చెరువుల్లో పెరిగిన కాలుష్యం ⇒ విపరీతంగా బ్యాక్టీరియా, కోలిఫాం ఉనికి ⇒ వేగవంతంగా దోమ లార్వాల వృద్ధి.. ⇒ పొంచిఉన్న డెంగీ, మలేరియా ముప్పు ⇒ పీసీబీ తాజా పరిశీలనలో వెల్లడి సిటీబ్యూరో: డెంగీ..మలేరియా..స్వైన్‌ఫ్లూ వంటి వ్యాధులతో అల్లాడుతున్న సిటీపై ఇప్పుడు దోమలు దండయాత్ర చేస్తున్నాయి. చెరువుల కాలుష్యం శాపంగా మారుతోంది. ప్రకృతి రమణీయతకు మారుపేరుగా నిలవాల్సిన పలు జలాశయాలు కాలుష్య కాసారమవుతుండడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. గ్రేటర్ వాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి చేరుతున్న వ్యర్థజలాలతో నగరం చుట్టూ ఉన్న చెరువులు దుర్గంధభరితంగా మారుతున్నట్లు కాలుష్య నియంత్రణ మండలి తాజా పరిశీలనలో వెల్లడైంది. గతేడాదితో పోలిస్తే ఆయా చెరువుల్లో కోలిఫాం, హానికారక బ్యాక్టీరియా ఉనికి అనూహ్యంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు పలు జలాశయాల్లో గుర్రపుడెక్క పెరగడంతోపాటు ప్రస్తుత వాతావరణ పరిస్థితులు దోమ లార్వాలు భారీగా వృద్ధిచెందేందుకు అనుకూలంగా ఉండి.. మహానగరంలో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ దుస్థితి కారణంగా సిటీజన్లకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు పొంచిఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిలువెల్లా కాలుష్యమే.. నగరానికి మణిహారంలా ఉన్న పలు చెరువులు రోజురోజుకూ కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. వీటి ప్రక్షాళనకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలంకావడం శాపంగా పరిణమిస్తోంది. పలు చెరువుల్లో గుర్రపుడెక్క ఉధృతి అనూహ్యంగా పెరిగింది. మరోవైపు సమీప కాలనీలు, బస్తీలు, పారిశ్రామిక వాడలు, వాణిజ్య సముదాయాల నుంచి వెలువడుతున్న వ్యర్థజలాలు మురుగు శుద్ధి కేంద్రాల్లో శుద్ధి చేయకుండానే ఈ చెరువుల్లోకి చేరుతుండడంతో అందులోని హానికారక మూలకాలు నీటిని దుర్గంధభరితంగా మార్చేస్తున్నాయి. ప్రధానంగా డ్రైనేజీ నీరు, వ్యర్థజలాల్లో ఉండే ఫేకల్ కోలిఫాం, టోటల్ కోలిఫాం మోతాదు అధికంగా పెరిగినట్లు పీసీబీ పరిశీలనలో తేలింది. దీంతో ఆయా చెరువుల్లో హానికారక షిగెల్లా, స్టెఫైలోకోకస్, ఇ.కోలి వంటి బ్యాక్టీరియా ఉనికి పెరిగినట్లు స్పష్టమైంది. దీనికి తోడు ప్రస్తుతం కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో నమోదవుతుండడంతో పలు చెరువుల్లో దోమల లార్వాలు ఉధృతంగా వృద్ధిచెందుతున్నాయి. ఈ దుస్థితికి కారణాలివే.. కూకట్పల్లి ప్రగతి నగర్ చెరువులో 2015తో పోలిస్తే 2016 సంవత్సరంలో ప్రతి వంద మి.లీ నీటిలో 406 మైక్రోగ్రాముల మేర కోలిఫాం ఉనికి పెరిగింది. సమీప ప్రాంతాల మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరకుండా మినీ మురుగు శుద్ధికేంద్రాలను నిర్మించడంలో జీహెచ్ఎంసీ విఫలం కావడంతో పరిస్థితి విషమిస్తోంది. గత 20 ఏళ్లుగా పలు చెరువులు కబ్జాకు గురవడం..చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీగా గృహ, వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు ఏర్పడడంతో మురుగు పెరిగింది. చాలా వరకు చెరువులు వాటి ఎఫ్టీఎల్ పరిధిలోని సగం భూములను కోల్పోయి చిక్కి శల్యమై కనిపిస్తున్నాయి.చెరువుల్లో కనీసం గుర్రపు డెక్కను, దోమల లార్వాలను కూడా పూర్తిస్థాయిలో తొలగించడంలేదు. కూకట్పల్లి అంబీర్ చెరువులోకి సమీప ప్రాంతాల నుంచి భారీగా మురుగు నీరు నేరుగా వచ్చి చేరుతున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. ఈ చెరువు చుట్టూ భారీగా అక్రమ నిర్మాణాలు వెలిసినా బల్దియా యంత్రాంగం ప్రేక్షకపాత్రకే పరిమితమైంది. చెరువులు, మూసీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం నగరంలోని అంబర్ చెర్వు, ప్రగతినగర్, కాప్రా, పెద్ద చెర్వు, సాయిచెర్వు, దుర్గంచెర్వు, నల్లచెర్వు, లక్ష్మీనారాయణ చెర్వులకు సమీపంలో ఉన్న కూకట్పల్లి, కెపిహెచ్బీ, మూసాపేట్, శేరిలింగపల్లి, మణికొండ, జిల్లెలగూడా, బాలాపూర్, బాలానగర్ ప్రాంతాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని మెహిదీపట్నం, మసాబ్‌ట్యాంక్, చాదర్‌ఘాట్, కోఠి, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, అంబర్పేట్, ముషీరాబాద్, ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్, రాజేంద్రనగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రస్తుతం నగరంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణస్థాయిలో అంటే కనిష్టంగా 18, గరిష్టంగా 33 డిగ్రీల మేర నమోదవుతుండడంతో దోమ లార్వాలు గణనీయంగా వృద్ధిచెంది ఆయా ప్రాంతాలను దోమలు ముంచెత్తుతున్నాయి. లార్వాల వృద్ధిని నిరోధించేందుకు యాంటీ లార్వా స్ప్రే చేయడంలోనూ జీహెచ్ఎంసీ యంత్రాంగం విఫలమవుతోంది. మరోవైపు రోజువారీగా గ్రేటర్‌వ్యాప్తంగా వెలువడుతోన్న 1400 మిలియన్ లీటర్ల వ్యర్థజలాల్లో సగం మాత్రమే ఎస్టీపీల్లో శుద్ధిచేసి మూసీలోకి వదులుతున్నారు. మిగతా 700 మిలియన్ లీటర్ల మురుగునీరు ఎలాంటి శుద్ధిలేకుండానే మూసీలో కలుస్తుండడంతో పరిస్థితి విషమిస్తోంది. -
ఆ రక్తమంటే దోమలు పడిచస్తాయట!
న్యూఢిల్లీ: దోమల కారణంగా మానవులకు వచ్చే జబ్బులు చాలానే ఉన్నాయి. అందులో మలేరియా కూడా ఒకటి. మలేరియా గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని స్టోక్ హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు బయటపెట్టారు. మలేరియా సోకిన వ్యక్తి రక్తమంటే దోమలు పిచ్చెక్కిపోతాయట. మలేరియా సోకిన వ్యక్తి శరీరంలోని క్రిమి హెచ్ఎమ్బీపీపీ అనే మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. దాని వల్ల మనుషుల్లోని ఎర్ర రక్తకణాలు కార్బన్ డై ఆక్స్‌డ్ ను అధిక మొత్తంలో విడుదల చేస్తాయని చెప్పారు. ఆ సమయంలో మనిషి శరీరం నుంచి వచ్చే వాసన దోమలను ఆకర్షిస్తుందని తెలిపారు. వ్యక్తి నుంచి దోమలు సేకరించిన రక్తంలో ఉన్న మలేరియా క్రిములు వేరే వ్యక్తిని కుట్టినప్పుడు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తాజా పరిశోధనలతో ప్రమాదకర రసాయనాలను వినియోగించకుండా మలేరియాను నయం చేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. -
మారేదెన్నడు..సమస్య తీరేదెప్పుడు?
► చెత్త వేస్తుండడంతో నిండుతున్న జౌళి నాల ►ఎన్నిసార్లు పనులు చేపట్టినా అదే తీరు ►ఇబ్బంది పడుతున్న చుట్టు పక్కల ప్రజలు ► పట్టించుకోని అధికారులు నిర్మల్ టౌన్ : జిల్లాకేంద్రం నుంచి వెళ్లే జౌళినాల పూడికతో నిండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పలుమార్లు జౌళినాల పూడికను తీసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. అందులో చెత్తను వేస్తుండడంతో మళ్లీ పూడకతో నిండిపోతున్నాయి. సరైన మురుగుకాలువ వ్యవస్థ లేకపోవడంతో చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీరు సైతం ఇందులోకే చేరుతోంది. అందులోనే చెత్తను వేయడంతో మరింత అధ్వాన్నంగా తయారైంది. దీనిలోని పూడికను తీయడానికి మున్సిపల్ ఆధ్వర్యంలో పలుమార్లు పనులు చేపట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. ఎన్నిసార్లు పనులు చేపట్టినా... జౌళినాల పూడికతీత పనుల కోసం ఇప్పటి వరకు పలుమార్లు ప నులు చేపట్టారు. పని అయిపోయిందనిపించారే తప్ప పూడికతీ తను పూర్తిస్థాయిలో తీయడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. లక్షల రూపాయలు వె చ్చించి పూడికతీత పనులను చేపట్టినా ప్రయోజనం ఉండడం లే దు. ఇంతకుముందు పనులు చేపట్టినప్పుడు జౌళినాలలోనే ఓ ప క్కకు తొలగించిన పూడికను అలాగే ఉంచారు. దీంతో అది మళ్లీ అందులోనే పడడంతో సమస్య మొదటికి వస్తోంది. దీనికి తోడు జౌళినాలల్లో పెద్ద పెద్ద చెట్లు పెరిగిపోయాయి. దీంతో మురికినీ రు వెళ్లేందుకు దారిలేక అలాగే నిలిచిఉంటోంది. పారిశుధ్యం కరువు... జౌళినాల పట్టణంలోని విశ్వనాథ్‌పేట్, నాయిడివాడ, బేస్తవార్‌పేట్, సోమవార్‌పేట్, కాల్వగడ్డ, కురాన్నపేట్‌ల మీదుగా పోతోంది. ఇంతకుముందు జౌళినాలలో స్వచ్ఛమైన నీరు ప్రవహించేది. కానీ స్వర్ణ నుంచి నీరు రావడంలో అడ్డంకులు ఏర్పడడంతో నీటిపారకం నిలిచిపోయింది. అప్పటి నుంచి చుట్టుపక్కల ఇళ్ల నుంచి మురుగునీటిని అందులోనే వదులుతున్నారు. దీంతో విపరీతంగా దుర్గంధం వ్యాపిస్తోంది. ఇబ్బందుల్లో ప్రజలు... జౌళినాల నుంచి దుర్గంధం వస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం కాలనీలో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. కొన్ని చోట్ల జౌళినాలలను ఆక్రమించుకుని ఇళ్లను నిర్మించుకోవడంతో మురుగునీరు పోవడానికి సరైన స్థలం లేకుండా పోయింది. మురుగునీరు ఇళ్లల్లోకి వచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులతోనే పాలకవర్గం నెట్టుకొస్తున్నారు. దీనివల్ల నిధులు ఖర్చవుతున్నా, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదు. శాశ్వత ప్రాతిపదికన పనులు నిర్వహిస్తేనే తగిన ఫలితం ఉంటుంది.ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
‘దండయాత్ర’లో దోమలదే విజయం
అమరావతి: రాష్ట్రంలో విపరీతంగా పెరిగిపోయిన దోమలను నియంత్రించడానికి దండయాత్ర పేరుతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వథా ప్రయాసగానే మిగిలిపోయింది. దోమలు కాదు కదా.. కనీసం గుడ్లను కూడా ప్రభుత్వం నాశనం చేయలేకపోయింది. దీంతో ఎన్నడూ లేనంతగా రాష్ట్రం జ్వరాల గుప్పిట్లో విలవిల్లాడింది. ప్రధానంగా మున్సిపాలిటీలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 2016 సంవత్సరంలో ఎప్పుడూ లేనంతగా డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా జ్వరాలు జనాన్ని గుక్కతిప్పుకోకుండా చేశాయి. ఇది ఎంతగా అంటే ఒక దశలో ప్రభుత్వాస్పత్రుల్లో జ్వర బాధితులకు వారం రోజులు గడిచినా పడకలు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. కనీసం సెలైన్ బాటిళ్లు కూడా దొరకని పరిస్థితి. విశాఖపట్నం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో అయితే డెంగీ జ్వరాలు ఊహించని రీతిలో నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వంపై పేద రోగులు దుమ్మెత్తి పోశారు. ఈ వ్యతిరేకతను తాళలేక ఉన్నపళంగా ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని చేపట్టి మూడు రోజుల కిందటే మమ అని ముగించారు. రూ. 20 కోట్ల వ్యయం చేసి చేపట్టిన ఈ దండయాత్ర వథా ప్రయాసగా మిగిలినట్టు వైద్య ఆరోగ్యశాఖలో అధికారులే చెప్పుకుంటున్నారు. ముందస్తు చర్యలు లేకనే జ్వరాలు.. రాష్ట్రంలో జ్వరాలు ఏ సీజన్లో వస్తాయనే ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఉంటుంది. జూన్, జూలై మాసాల్లో జ్వరాలు విజభిస్తుంటాయి. దీనికోసం దోమల గుడ్డు (లార్వా) దశలోనే నిర్వీర్యం చేయాలి. మలాథియాన్, పైరిథ్రిమ్ పిచికారీ చేయడంతో పాటు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ముమ్మర నియంత్రణ చర్యలు చేపట్టాలి. అలాంటివేమీ చేపట్టకుండా సెప్టెంబర్ దాకా వేచిచూసి, అందరూ మంచాన పడ్డాక ప్రభుత్వం కళ్లు తెరిచింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. గుడ్లన్నీ పగిలి దోమలుగా మారి సర్కారు మీదే దండయాత్ర చేశాయి. అన్నిటికీ మించి ఈ ఏడాది డెంగీ జ్వరాలు గత పదేళ్లలో ఎప్పుడూ లేనంతగా నమోదయ్యాయంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. వృథా ప్రయాసగా మిగిలిన ‘దోమలపై దండయాత్ర’ దోమలను కాదు.. వాటి గుడ్లను కూడా నిర్వీర్యం చేయలేకపోయారు 126 వాహనాలు, 4,300 ర్యాలీలు, 38 లక్షలకు పైగా కరపత్రాలు రూ. 20 కోట్ల నిధులు వథా.. ముగిసిన కార్యక్రమం దండయాత్ర బలగం ఇదీ.. దండయాత్రకు వాడిన వాహనాలు 126 ఎన్ని గ్రామాల్లో దండయాత్ర 1.43 లక్షలు ఎన్ని గ్రామాల్లో పారిశుధ్యం చేశారు 1.43 లక్షలు బ్లీచింగ్ పౌడర్ చల్లిన గ్రామాలు 35,953 స్వచ్ఛభారత్ మీటింగ్‌లు 3,610 కార్యక్రమాలు నిర్వహించిన స్కూళ్లు 5,796 పంచిన కరపత్రాల సంఖ్య 38.42 లక్షలు -
డ్రై డేతో దోమలకు చెక్
వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని సీతంపేట : వారానికి ఒకరోజు డ్రై డే పాటిస్తే డెంగ్యూ, మలేరియా జ్వరాలను వ్యాప్తి చేసే దోమల పెరుగుదలను నియంత్రించవచ్చని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ గీతా ప్రసాదిని అన్నారు. దోమ లార్వా పెరుగుదల నియంత్రణపై 13వ వార్డులో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీతంపేట దుర్గాగణపతి ఆలయం వద్ద ఆమె ర్యాలీని ప్రారంభించారు. గీతా ప్రసాదిని మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ జ్వరాలను వ్యాప్తి చేసే దోమలు నిల్వ ఉన్న మంచినీటిలోనే పెరుగుతాయన్నారు. కుండీలు, గోళాలు, మంచినీటి ట్యాంకులు, వారానికి ఒకసారి శుభ్రం చేసి ఆరబెట్టి నీరు పట్టుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌వో సరోజిని మాట్లాడుతూ తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వాంతులు, శరీరంపై దద్దుర్లు ఉంటే డెంగ్యూ జ్వరంగా అనుమానించి వైద్యుడిని సంప్రదించాలన్నారు. అన్ని ప్రభుత్వ , మున్సిపల్ డెస్పెన్సరీలలో డెంగ్యూ, మలేరియా జ్వరాలకు చికిత్స అందుబాటులో ఉందన్నారు. జీవీఎంసీ బయాలజిస్ట్ వై.మణి, జీవీఎంసీ సీనియర్ మెడికల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్, మలేరియా ఇన్ స్పెక్టర్లు ఎం.వసంత్‌కుమార్, రామచంద్రరావు, రాంబాబు, ప్రకాశ్, జీవీఎంసీ, జిల్లా మలేరియా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటిప్స్
అల్లం, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్‌ని చేసిన తరువాత ఒక టీ స్పూన్ వేడి నూనె, ఉప్పు కలిపి నిల్వ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం నిల్వ ఉండడమే కాకుండా వండిన పదార్థాలు రుచికరంగా ఉంటాయి. వండుతున్న అన్నంలో కనోలా ఆయిల్ ఒక టీ స్పూన్ వేసి వండితే అన్నం విడివిడిగా అవుతుంది. కొద్దిగా నిల్వ ఉన్న లడ్డూలను మైక్రో ఓవెన్లో అర నిమిషం పాటుంచితే తాజాగా అవుతాయి. చపాతీలు వత్తుకునేటప్పుడు బియ్యప్పిండిని పొడిపిండిగా వాడితే చపాతీలు మెత్తగా వస్తాయి. ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఒకేచోట నిల్వ చేయకూడదు. గది మూలల్లో కాస్తంత బోరిక్ పౌడర్ చల్లితే మూలల్లో దాగి ఉన్న బొద్దింకలు బయటికి వెళ్లిపోతాయి. నెమలిపింఛాన్ని గోడకి తగిలిస్తే బల్లులు బయటకు వెళ్లిపోతాయి. ఒక గ్లాస్ నీటిలో కర్పూరం వేయాలి. ఈ గ్లాస్‌ని మీరు పడుకునే బెడ్ దగ్గర పెడితే దోమలు దరి చేరవు. -
దోమలపై దండ(గ)యాత్ర
► లక్ష్యం చేరని దోమలపై దండయాత్ర ► ప్రకటనలకే పరిమితమైన పాలకులు ► ర్యాలీలతో మమా అనిపించిన అధికారులు ► పారిశుద్ధ్యం మెరుగుపడక రోగాలబారిన పడుతున్న జనం సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం దోమలపై ప్రకటించిన దండయాత్ర దండగయాత్రగా మారిందని, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అది లక్ష్యం చేరలేదనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా కనీసం అన్ని గ్రామాల్లో మురుగు కాల్వలను కూడా శుభ్రం చేయలేక పోయారంటేనే అధికారులు ఏ స్థాయిలో వైఫల్యం చెందారో అర్థం చేసుకోవచ్చు. కేవలం అవగాహన ర్యాలీలకే పరిమితం కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. దీనికితోడు 14 ఆర్థికసంఘం నిధులు కూడా పంచాయతీ ఖాతాలకు చేరకపోవడంతో పరిసరాల పరిశుభ్రత ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో జిల్లాలోని 1350కి పైగా గ్రామాలు, 6 మున్సిపాలిటీలు దోమలకు నిలయంగా మారాయి. కాలువలు, డ్రెయిన్లు, గుంతలు, ఖాళీస్థలాలు చెత్తాచెదారంతో నిండి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమలపై దండయాత్రకు కార్యక్షేత్రానికి వెళ్లాల్సిన అధికారులు కేవలం ర్యాలీలకే పరిమితమయ్యారు. ప్రణాళిక ఏదీ.. సెప్టెంబర్ 24న ప్రభుత్వం ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. తిరుపతిలో జిల్లా ఇంచార్జి మంత్రి నారాయణ ఆరోజు కాలువ కూడా శుభ్రం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంపై ప్రత్యేక ప్రణాళికలేవీ లేక దండగయాత్రలా మారింది. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయాలనే సూచనలు ప్రభుత్వం నుంచి లేకపోవడంతో అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మొదటి రెండు రోజులు దోమల నివారణపై ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసింది. పుస్తకాలు, కరపత్రాలు పంచింది. తర్వాత చివరికి రాతలు, కోతలు తప్పితే కార్యక్షేత్రంలో దిగి దోమలను తరిమేసే పనులేవీ చేయకపోవడంతో కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకోలేదు. నిధులేవీ.. గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. వీటిని శుభ్రంగా ఉంచితేనే దోమలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి వీలవుతుంది. దీనికి సర్పంచ్‌లు, వైద్యశాఖ, పంచాయతీ సెక్రటరీలు కలిసి కట్టుగా పని చేయాల్సి ఉంటుంది. అయితే వీరందరూ ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నెలల తరబడి ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో సర్పంచ్‌లు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని మురుగు కాలువలు, నీరునిల్వ ఉన్న గుంతల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లించడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలందినా.. ఆ నిధులు పంచాయతీ ఖాతాల్లోకి జమకాకపోవడంతో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఒక్క సమీక్షాలేదు.. జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి దోమలను తరమి కొడతామని చెప్పిన జిల్లా ఉన్నతాధికారి సిద్ధార్థ్‌జైన్.. కార్యక్రమం ప్రారంభమై వారం రోజులు గడచినా దీనిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటే కొంతమేరకైనా కార్యక్రమ ఉద్దేశం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్!
అక్షర తూణీరం ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’ అని మరోసారి సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. రెండ్రోజుల క్రితం ముఖ్యమంత్రి ముఖతా ‘‘ఆనంద ఆంధ్రప్రదేశ్’’ ఆవిష్కృతమైంది. అంతకు ముందు దోమరహిత రాష్ట్రంగా చేయాలని నిర్భయంగా తీర్మానించారు. దానికిముందు కరువు రహిత రాష్ట్రంగా చేయడానికి కంకణ బద్ధులైనారు. చక్కని ఆలోచనలు చేస్తున్నారు. వింటుంటే పిచ్చి సంతోషంగా ఉంది. మన నేత ఏమి చెయ్యలేరో చెప్పడం కష్టం. ఆయన తలచుకుంటే డ్రోన్లతో దోమలకు పొగ పెట్టగలరు. ఆనంద ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా పుష్కరాల రేవుల్లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలకు గజ్జెలు కట్టి, తెరలు తీయనున్నారు. ఒకవైపు నాట్యాలు, ఇంకోవైపు గాన గోష్ఠులు, ఆవైపు కవి సమ్మేళనాలు, ఈవైపు జానపద కళారీతులు - కృష్ణా తరంగాలు నవరసా లొలికిస్తూ సాగిపోతుంటాయి. మల్టీఫ్లెక్స్‌లు వచ్చి వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే అవి రెక్కలు తొడుక్కుని అమరా వతి పరిసరాల్లో వాలడానికి సిద్ధంగా ఉన్నాయి. అందరూ ఆనందంగా ఉండాలన్నదే నిన్నటి మానిఫెస్టో లక్ష్యం. ఉద్యోగులు, శ్రామికులు, మరీ ముఖ్యంగా రైతులు ఆడుతూ పాడుతూ పనులు చేసుకోవాలి. ముఖ్యంగా ట్రాఫిక్ కానిస్టేబుళ్లు మన తెలుగువారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వారి సొంత సంప్రదాయమైన కూచిపూడి బాణీలో వీధి కూడళ్ల దగ్గర సిగ్నల్స్ ఇస్తే కళాత్మకంగా ఉంటుంది. అవసరమైతే వారందరికీ సామూహిక శిక్షణ ఇప్పిస్తాం. ‘‘ఆనందమే బ్రహ్మ. ఆనందమే విష్ణువు. ఆనందమే యన్టీఆర్.’’ ఈ మూడోది నేవిన్లేదని ఒక రిక్షా కార్మికుడు వాదనకి దిగాడు. ‘‘ఇప్పుడు విన్నా వుగా’’ అంటూ సర్ది చెప్పాడు సాటి మిత్రుడు. ‘‘నవ్వులో ఆనందం ఉంది. అదే విధంగా ఆనందంలో నవ్వు ఉంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండాల’’ అనగానే ‘‘ఆయన నవ్వడం నేనెప్పుడూ చూడనేలేదురా’’ అన్నాడు నిష్టురంగా. ‘‘గొప్పోడు నవ్వడు, నవ్విస్తాడు. గొప్పోడు ఏడవడు, ఏడిపిస్తాడు. అయినా, వడ్డించేవాడు తింటాడేంటిరా’’అని మరోసారి సర్ది చెప్పాడు. ‘‘ఇది కాదుగాని, చూడగా చూడగా ఆధ్యాత్మికాంధ్రప్రదేశ్‌గా మారి పోతోందని నాకు సందేహంగా ఉందండీ’’ అంటూ ఒక పెద్దాయన ఇంద్రకీలాద్రి మొగలో నిలబడి టాపిక్ మార్చాడు. ‘‘అదెలాగ’’ అన్నాను. గోదావరి పుష్కరాలు మహోధృతంగా సాగినాయి. నెల్లాళ్లు ఆధ్యాత్మిక శోభ. దర్భలు, పిండాలు, స్నానాలతో గడిచింది. ఆనక కృష్ణా పుష్కరం. పైగా గోదావరి అంత్య పుష్కరం వచ్చి పడింది. ఆ రెండు పుణ్యనదులు బాబుగారి పుణ్యమా అని సంగమించి మహాతీర్థమై కూచుంది. ఇదంతా ఒక నెలపాటు శ్రాద్ధ విధులతో, మంత్రాలతో తల్లడిల్లింది. రకరకాల హారతులతో మహానది వెలిగిపోయింది. ఇంతలో వినాయక ఉత్సవాలు ఓ రెండువారాలు భక్తిలో జనాన్ని ముంచెత్తాయి. ఆ పందిళ్లలోనే ఇప్పుడు అమ్మవారిని నిలుపుతున్నారు. శరన్నవరాత్రులు! ఇక కొండ మీదా సందడే. కొండకిందా సందడే. ఆయన సామాన్యుడు కాదు. అవసరమైతే బోలెడు కొత్త పండుగలు పుట్టించి ఆధ్యాత్మికాంధ్రప్రదేశం చేయడం ఖాయం’’ అంటూ అక్కడనించే దుర్గమ్మకి దణ్ణం పెట్టాడు. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) - శ్రీరమణ -
‘దోమలపై దండయాత్ర’కు ఐఏఎస్‌లు
విజయవాడ: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఐఏఎస్‌లను నోడల్ అధికారులుగా నియమించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు 13 మందిని డిప్యూట్ చేసింది. వీరంతా విజయవాడలోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌తోపాటు ఆయా జిల్లాల్లో అధికారులను సమన్వయం చేసుకుంటూ దోమల నివారణకు కృషి చేయనున్నారు. -
దోమల స్వైర విహారం
పట్టపగలే విజృంభణ పారిశుద్ధ్య లోపం, మురుగు నీరే కారణం నివారణ చర్యలు శూన్యం రోగాల బారిన పడుతున్న ప్రజలు సదాశివపేట: నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పట్టణంలోని పలు కాలనీల్లో అపరిశుభ్రత వాతావరణం ఏర్పడింది. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. పట్టపగలే దోమలు ప్రజలపై దాడి చేస్తున్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా అవి జలగల్లా పట్టి పీడిస్తున్నాయి. పారిశుద్ధ్య లోపం డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంతో పలు కాలనీల్లో ప్రజలకు కంటిమీద కునుకు కరువైంది. పిల్లలు, వృద్ధులు రోగాల బారినపడి ఆస్పత్రుల పాలవుతున్నారు. పట్టణంలోని సిద్దాపూర్ కాలనీ, శంభులింగేశ్వరకాలనీ, నాగేశ్వర్నగర్, ఫయాజ్‌నగర్, గురునగర్, రవీంద్రనగర్, దత్తాత్రేయనగర్, శ్రీరాంనగర్, ప్రియదర్శిని కాలనీ, రాఘవేంద్రనగర్, హనుమాన్‌నగర్, కృష్ణనగర్, తదితర ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ మురుగునీరు నిలవ ఉండడంతో దోమలకు ఆవాసాలుగా మారాయి. దోమకాటుతో ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. చాలామంది మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధుల బారినపడి ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు కానీ వైద్య సిబ్బంది కానీ అయా కాలనీలపై కన్నెత్తి చూడడం లేదు. దోమల నివారణకు ఇళ్లలో కాయిల్స్, లిక్వీడ్ సీసాల వినియోగానికి ప్రతి కుటుంబం నేలకు వంద వరకు ఖర్చు చేస్తున్నారు. పట్టణంలో అధికారికంగా 10 వేల వరకు గృహాలు ఉండగా రికార్డుల్లో నమోదుకానీ గృహాలు మరో పదివేల వరకు ఉండవచ్చని అంచన. పత్తాలేని ఫాగింగ్ పట్టణంలో పారిశుద్ధ్యంపై సంబంధిత అధికారులు ఏ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోవడంతో పలు కాలనీల్లో పలు వ్యాధులు ప్రబలుతున్నాయి. డ్రైనేజీలు దోమలకు నిలయాలుగా మారినందువల్ల పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడతున్నారు. శానిటేషన్ సిబ్బంది దోమల నివారణకు ఫాగింగ్ చేయకపోవడం, చెత్తకుండీల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లకపోవడంతో అపరిశుభ్రత రాజ్యమేలుతుంది. పలు కాలనీల్లో పిల్లలు,వృద్ధులు, యువత అనే తెడాలేకుండా విషజ్వారాల బారినపడుతున్నారు. ఇప్పటికైన మున్సిపల్ అధికారులు స్పందించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకుంటాం పట్టణ పరిధిలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ పరిధిలో ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. సిబ్బందిని అప్రమత్తంగ ఉంచుతూ అందుబాటులో ఉంచాం. కాలనీలో నీరు నీలువ ఉండకుండ ప్రత్యేక చర్యలు చేపడుతున్నం. పలు కాలనీల్లో పారిశుద్ధ్య సమస్యలు లేకుండా పనులు చేపడుతున్నాం, ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఇంటి పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి. - ఇస్వాక్ ఆబ్‌ఖాన్, మున్సిపల్ కమిషనర్ -
దోమల నివారణ అంటే...ఆ వ్యాధుల నివారణే!
ఇటీవల మన తెలుగు రాష్ట్రాలలో దోమల వల్ల వ్యాప్తి చెందే డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నాయి. ఆయా వ్యాధులు వచ్చాక చికిత్స తీసుకోవడం కంటే వాటి నివారణ ఎంతో మేలు. అయితే మన రాష్ట్రాల వాతావరణం కూడా ఇందుకు దోహదపడేలా ఉంటుంది. ఒక ప్రదేశంలో తీవ్రమైన వేడిమి, చాలా ఎక్కువగా తేమ, అదేపనిగా నీళ్లు నిల్వ ఉండే పరిసితులు ఉంటే అక్కడ దోమలు విపరీతంగా పెరుగుతుంటాయి. మనం ట్రాపికల్ ప్రాంతాల్లో ఉండటం వల్ల ఇక్కడి వాతావరాణ్ని బట్టి ఎక్కువ వేడి, తేమ, నీళ్లు ఉంటాయి. ఇదే వాతావరణం వరి పెరగడానికి అనువైనది. దురదృష్టవశాత్తు ఇదే వాతావరణం దోమ పెరగడానికి కూడా అనువైనది. ఒక దోమ జీవించే కాలం (ఆయుఃప్రమాణం) దాదాపు 30 రోజులు. ఈ కాలంలో అది రోజు విడిచి రోజు 150 నుంచి 200 వరకు గుడ్లు పెడుతుంది. అది గుడ్లు పెట్టడానికి చిన్న కొబ్బరి చిప్ప పరిమాణంలో 50 ఎం.ఎల్. నీళ్లు చాలు. దాంతో ఇలా చిన్న పాటి గుంటలూ, కొబ్బరి చిప్పలూ, చెడిపోయిన టైర్లు, వాడి ఆపేసిన కూలర్లు వంటి చోట్ల దోమలు గుడ్లు పెట్టి తమ సంతతిని అభివృద్ధి చేసుకుంటాయి. వాటిని నిర్మూలించడానికి మనం ఎన్ని దార్లు వాడుతుంటామో, వాటి పట్ల తమ నిరోధకతను పెంపొందించుకోడానికీ అవి అన్ని దార్లూ వెతుకుతుంటాయి. ఇలా తమ మనుగడను సాగిస్తుంటాయి. ఇలా అవి బలపడటానికి పరోక్షంగా మనమూ దోహదపడుతున్నామన్నమాట. అయితే ఒక్క మాట... పారే నీరు ఉన్న చోట అవి గుడ్లు పెట్టలేవు. అందుకే వాటిని నివారించాలంటే వారంలో ఏదో ఒక రోజు నీళ్లు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు, మురుగుకాల్వల వంటి చోట్ల నీరు పారేలా శుభ్రంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం మంచి మార్గం. నివారణ మార్గాలివి... ⇔ దోమల నివారణే వాటి ద్వారా వచ్చే డెంగ్యూ, చికన్‌గున్యా, మలేరియా వంటి వ్యాధుల నివారణకు మంచి మార్గం. దోమ కాటు నుంచి మనల్ని మనం ఎంతగా రక్షించుకుంటే ఆ వ్యాధుల నుంచి మనల్ని మనం అంత సమర్థంగా కాపాడుకోవచ్చు. ⇔ మనం ఉండే ఇంటిలో, గదిలో దోమలు రాకుండా చూసుకోడానికి అవసరమైన రిపెల్లెంట్లు, దోమతెరలు వాడాలి. ⇔దోమలు కుట్టకుండా పొడువు చేతుల చొక్కాలు ధరించడం, ఒంటినిండా బట్టలు ఉండినా, ఒంటినంతా అవి కప్పి ఉంచేలా చూసుకోవడం అవసరం. ⇔ దోమలు కుట్టకుండా ఉండేందుకు శరీరంపైన పూత మందులు వాడటం కూడా ఒక మార్గం. ⇔ దోమలు మురికిగా ఉండే దుస్తులకు వెంటనే ఆకర్షితమవుతాయి. అందుకే ఎప్పటికప్పుడు శుభ్రమైన దుస్తులు వేసుకోవాలి. ఇక కొంతవరకు లేత రంగుల దుస్తులను ధరించడం మేలు. ⇔ అలాగే ఘాటైన వాసనలున్న పెర్ఫ్యూమ్స్కీ దూరంగా ఉండాలి. ⇔ దోమలను తరిమివేసే మస్కిటో కాయిల్స్ ఉపయోగించవచ్చు. అయితే ఆరోగ్యానికి వాటి వాసన సరిపడని వాళ్లు, పిల్లలు, వృద్ధులు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రి పూట దోమ తెరల్ని వాడాలి. వేపాకులతో పొగవేయడం వంటి సంప్రదాయ మార్గాలను కూడా చేపట్టవచ్చు. ⇔ ఇక సామాజిక నివారణలో భాగంగా మన ఇళ్ల సరిసరాల్లో మురుగు నీరు లేకుండా, నిల్వ నీరు లేకుండా చూసుకోవడం మంచిది. దీనితో పాటు కాల్వల్లో నీరు ఒకేచోట చేరి ఉండకుండా నిత్యం పారేలా వాటిని శుభ్రం చేసుకోవడం అవసరం. -
చస్తున్నా పట్టదా? స్టాండింగ్ కమిటీ ఆగ్రహం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో విషజ్వరాల భారినపడి పలువురు మృత్యువాత పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మేయర్ అధ్యక్షతన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ మార్కెట్ల నిర్వహణ..విధివిధానాలకు సంబంధించిన అంశాన్ని సమావేశం తిరస్కరించారు. విధివిధానాలు రూపొందించి తదుపరి కమిటీ సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. గ్రేటర్లో ఆటస్థలాలు, స్విమ్మింగ్ పూల్స్ నిర్వహణలోని మార్పుల ప్రతిపాదనల్ని సైతం కమిటీ తిరస్కరించింది. సమావేశంలో ఆమోదించిన అంశాలు.. ► ఎస్సార్డీపీలో భాగంగా దుర్గం చెరువుపై 80 అడుగుల వేలాడే వంతెనకు అవసరమైన ఆస్తుల సేకరణ. ► జీహెచ్ఎంసీలో ఈఆర్పీ, ఇతర పద్దుల నిర్వహణ మూడునెలల పాటు ‘బ్లూమ్స్ సొల్యూషన్స్’కు అప్పగించేందుకు ఆమోదం. నిర్వహణ చార్జీల కింద రూ. 18,41,281 చెల్లించేందుకు ఏకగ్రీవంగా ఆమోదం. అకౌంట్ల నిర్వహణను కొత్త ఏజెన్సీకి అప్పగించేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ సంస్థకే నిర్వహణను అప్పగించాలని తీర్మాణం. జీహెచ్ఎంసీలో గతంలో ఈ పద్దులను నిర్వహించిన అనుభవం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఈసేవలను ఉపసంహరించుకున్నట్లు పేర్కొన్నారు. ► జంక్షన్ల అభివృద్ధి పనుల కోసం భూసేకరణ, భూ బదలాయింపులకు ఆమోదం. మెరుగైన రవాణాకు ఆటంకాలుగా ఉన్న బస్‌బేల తొలగింపు, 55 ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి ఆమోదం. ► నిర్ణీత వ్యవధుల్లోని పద్దుల నిర్వహణ, వ్యయ పట్టికలను ఆమోదించాల్సిందిగా ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం. -
నగరంలో దోమల రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మళ్లీ డెంగీ, మలేరియా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేవలం 18 రోజుల్లో 20కి పైగా డెంగీ కేసులు నమోదు కాగా, కేవలం ఈ నెల 10నlఒక్క రోజే ఫీవర్ ఆస్పత్రిలో 14 కేసులు నమోదు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఇప్పటి వరకు 120–150 (డెంగీ, మలేరియా) కేసులు నమోదు కాగా, వీరిలో పది మందికిపైగా మృత్యువాత పడ్డారు. మరో వంద మందికి పైగా మలేరియా జ్వరంతో బాధపడ్డారు. ప్రస్తుతం ఒక్క ఫీవర్ ఆస్పత్రిలోనే 20 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. బస్తీ ప్రజల ప్రాణాలను హరిస్తున్న దోమలను నియంత్రించడంలో గ్రేటర్ పాలకమండలి ఘోరంగా విఫలం అవుతోంది. ఆ 45 ప్రాంతాల్లో అధికం.. గ్రేటర్ పరిధిలో అధికారికంగా గుర్తించిన మురికివాడలు 1,470 ఉన్నాయి. వీటిలో 8 బస్తీలు ముంపు ప్రాంతాలు. మొత్తం మురికివాడల్లోని 45 ప్రాంతాల్లో దోమల బెడద అత్యధికం. గ్రేటర్ ఎంటమాలజీ విభాగంలో సుమారు 2,375 మంది పనిచేస్తున్నారు. ఈ విభాగం ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. దోమల సాంద్రత గంటకు జియాగూడలో అత్యధికంగా 9.9, బంజారాహిల్స్ ఎర్రగుంట చెరువుతో పాటు, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో 9.8, జియాగూడలో 9.7, అల్వాల్, మల్కజ్గిరిలో 9.5, గోల్నాక, అంబర్‌పేటలో 9.4, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ, బార్కాస్‌లో 7.6 దోమలు ఉన్నట్లు గుర్తించారు. దోమల నియంత్రణ కోసం గ్రేటర్ ఏటా రూ.2.7 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. వర్షాకాలానికి ముందే యాంటీ లార్వా, మలాథియాన్ స్ప్రే, ఫాగింగ్ వంటివి చేయాల్సి ఉన్నా చర్యలు శూన్యం. దోమల వల్ల వచ్చే వ్యాధులపై ఎప్పటికప్పుడు హైరిస్కు బస్తీల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలి. ఇంటింటికీ తిరిగి అవగాహన కోసం కరపత్రాలు పంచాలి. కానీ ఎంటమాలజీ విభాగం పట్టించుకోలేదు. ‘ఫీవర్’కు రోగుల తాకిడి.. నల్లకుంట: నగర ప్రజలు రోగాలతో మంచం పడుతున్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో పలురకాల సీజనల్ వ్యాధుల దాడి చేస్తున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఫీవర్‌కు 1725 మంది రోగులు వైద్యం కోసం వచ్చారు. వీరిలో అధిక శాతం విష జ్వరాల బాధపడుతున్నవారే కావడం గమనార్హం. -
సర్దన.. వ్యాధులతో హైరానా
అస్తవ్యస్తంగా డ్రై నేజీ వ్యవస్థ పేరుకుపోతున్న పారిశుద్ధ్యం పొంచి ఉన్న సీజనల్ వ్యాధులు ఇద్దరికి మలేరియా పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు మెదక్‌రూరల్:వర్షాకాలం ప్రారంభమైంది.. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది.. గ్రామల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించి ప్రజలు రోగాల బారిన పడకుండా చూడాలని కలెక్టర్ మొదలుకొని తహశీల్దార్ వరకు వారం వారం వీడియోకాన్ఫరెన్స్‌లలో పదే పదే చెబుతూనే ఉన్నారు. అయినప్పటికీ అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. దీంతో సీజనల్ వ్యాధులు పొంచి ఉండగా, ఇప్పటికే మెదక్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మెదక్ మండలంలోని సర్ధన గ్రామంలో మురికి కాల్వలు సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో పారిశుద్ధ్యం పేరుకుపోయింది. అలాగే మురికి కాల్వలపై ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు మురికి కాల్వల్లో ఎక్కడికక్కడ మురికి నీరు నిల్వ ఉండటంతో గ్రామంలో దోమలు, ఈగలు విపరీతంగా వద్ధి చెందాయి. దీంతో రాత్రి పగలు అనే తేడాలేకుండా ప్రజలు దోమలు, ఈగలతో అనేక అవస్థలు పడాల్సి వస్తుంది. దోమలు విపరీతంగా పెరగడంతో ప్రజలు మలేరియా వంటి వ్యాధులకు గురికావస్తుంది. ఇప్పటికే గ్రామంలోని శ్రీకాంత్, దాసు అనే ఇద్దరు వ్యక్తులు మలేరియా వ్యాధికి గురికాగా, మరికొంతమంది వాంతులు, విరేచనాలకు గురై ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ప్రజాప్రతినిధులుగాని, అధికారులుగాని పట్టించుకోక పోవడంతో ప్రజలంతా దోమలతో మలేరియా వ్యాధులకు గురవుతుండగా, ఈగలతో వాంతులు, విరేచనాలకు గురవుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి, దోమల నివారణ మందులు వేయించాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి గ్రామప్రజలను సీజనల్ వ్యాధులనుంచి రక్షించాలని పలువురు కోరుతున్నారు. ఇద్దరు మలేరియాకు గురయ్యారు: గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించక పోవడంతో మురికి కాల్వల్లో చెత్తా చెదారం పేరుకుపోయింది. దీంతో విపరీతంగా దోమలు, ఈగలు పెరిగిపోయాయి. ఫలితంగా గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మలేరియాకు గురికాగా, చాలా మంది సీజనల్ వ్యాధుల బారిన పడి ఆస్పత్రుల చుట్టు తిరుగుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి. –రాంచందర్, సర్ధన గ్రామస్తుడు ఎవరూ పట్టించుకోవడం లేదు: గ్రామంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నా అధికారులుగానీ, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడం లేదు. గ్రామంలో సమస్యలపై ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించాం. అయినప్పటికీ అధికారులు ఎవరు మా గ్రామంవైపు కన్నెత్తి చూడటం లేదు. డ్రై నేజీలతోపాటు రోడ్లు కూడా అధ్వాన్నంగానే ఉన్నాయి. ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికి గ్రామానికి చెందిన రోడ్లు ఎక్కడికక్కడ గుంతలమాయంగా మారి ప్రజలు కాలి నడకన కూడా నడవలేని స్థితికి చేరింది. –కిరణ్‌కుమార్, సర్ధన గ్రామస్తుడు. మలేరియా వచ్చింది గ్రామంలో విపరీతంగా దోమలు ఉన్నాయి. మురికి కాల్వలు శుభ్రం చేయడం లేదు. గ్రామంలో దోమలు, ఈగలు పెరిగిపోయి వ్యాధులు ప్రబలుతున్నాయి. నేను ఇటీవల మలేరియాకు గురికాగా ప్రై వేట్ ఆస్పత్రికి వెళ్తే వేల రూపాయలు ఖర్చు అయ్యాయి. ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలి. –శ్రీకాంత్, మలేరియా బాధితుడు -
దోమలను తరిమే టీవీ వచ్చిందోచ్!
న్యూఢిల్లీ: మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా? దోమలను తరిమేయడానికి రకరకాల సాధనాలు వాడి విసిగిపోయారా? ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ దిగ్గజ సంస్థ ఎల్జీ నిపుణులు. దోమల వల్ల డెంగ్యూ వంటి ప్రాణాంతకర వ్యాధులు ప్రబలుతున్నాయంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఎల్జీటీవీ సంస్థ వినూత్నంగా ఆలోచించి.. ఇంట్లో దోమలు తరిమేయడానికో ఓ సాధనాన్ని కనిపెట్టింది. అదే..! ''ఎల్జీ మస్కిటో ఎవే టీవీ''. సరికొత్త టెక్నాలజీ అల్ట్రా సోనిక్ డివైజ్‌తో రూపొందిన ఈ మస్కిటో ఎవే టీవీని ఇటీవలే ఎల్జీ మార్కెట్లోకి విడుదల చేశారు. అయితే ఈ ఎల్జీ మస్కిటో టీవీ.. మీ ఇంట్లో ఉంటే ఇక దోమల బెడద నుంచి విముక్తి పొందవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మీకు వినోదంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుంది అనమాట!. మస్కిటో ఎవే టీవీ.. ఆడియో, వీడియో సిస్టమ్ నాణ్యత చాలా బాగుంటుందని ఎల్జీ నిపుణులు చెబుతున్నారు. ఈ టీవీని ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్ట్యా రూపొందించినట్టు తెలిపారు. ఎల్జీ టీవీ తయారీలో విషపూరిత నిరోధకాలు వాడలేదనీ గ్లోబల్ సంస్థలైన బయోటెక్నాలజీ అండ్ టాక్సికాలజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్(ఐఐబీఏటీ) పరీక్షించి తేల్చి చెప్పింది. 2015 గణాంకాల ప్రకారం.. గత 20 సంవత్సరాలలో 10, 683 డెంగ్యూ కేసులు నమోదైనట్టు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్వీబీడీసీపీ) సర్వే, భారత ప్రభుత్వం నివేదికలో వెల్లడైంది. డెంగ్యూ వంటి ప్రాణాంతకర వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి ''ఎల్జీ మస్కిటో ఎవే టీవీ''ని రూపొందించడంలో ఎల్జీ సంస్థ విజయం సాధించింది. కాగా, అన్ని ఎల్జీ స్టోర్లలో మస్కిటో ఎవే టీవీ లభ్యమవుతోందని పేర్కొంది. అయితే ఈ మస్కిటో టీవీ ధరలు ఇలా ఉన్నాయి.. 80 సెం.మీలు అయితే ధర రూ. 26,900 ఉండగా, 108 సెం.మీల ధర రూ. 47, 500 లుగా ఉన్నట్టు ఎల్జీటీవీ సంస్థ వెల్లడించింది. -
డేంజరస్ డెంగీ !
దోమలతోనే వ్యాధి వ్యాప్తి నేడు జాతీయ డెంగీ దినోత్సవం దోమతెరలపై అవగాహన అవసరం ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించాలి డెంగీ వ్యాధి ప్రమాదకరమైంది. ఈ వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతుంది. పరిసరాల్లో నీళ్లు నిల్వ ఉండ టం, పారిశుద్ధ్య సమస్యలు లోపించడం వల్ల వాటిలో దోమ లు స్థావరాలను ఏర్పరచుకుంటాయి. ఇవి కుట్టడం వల్ల వ్యాధి వస్తుంది. సోమవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం... - అర్వపల్లి వ్యాధి వ్యాపించే విధానం.. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బో వైరస్ వల్ల సంక్రమిస్తుంది ఒకరి నుంచి మరొకరికి ఏడీస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి చెందుతుంది ఈ దోమలు పగలేకుడుతాయి. ఈ రకమైన దోమలు ఇళ్ల పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిలో వృద్ధి చెందుతాయి. ఈ దోమలు గుడ్లు పెట్టి పెరుగుటకు కింద తెలిపిన వస్తువులు, పరిసరాలు అనుకూలమైనవి. ఎయిర్‌కూలర్స్, రిఫ్రిజిరేటర్లు, పూలకుండీలు, బయట పడేసిన టైర్లు, నీరు నిల్వ ఉన్న తొట్లు, కుండీలు, ఖాళీ డ్రమ్ములు, భవనాలపై నిలిచిన వాన నీటిలో పనికిరాని, పగిలిన వస్తువుల్లో ఉంటాయి. దోమల నివాసాలను తొలగించుట.. నీటినిల్వను, పనికి రాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు, పనికి రాని వాటిని ఇళ్లు, వెలుపల నీటి నిల్వలను పారబోయూలి. నీటి ట్యాంకులకు మూతలు ఉంచాలి. నీటి నిల్వ గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేస్తూ వారంలో ఒక రోజు డ్రైడే(పొడిదినం) విధానం పాటించాలి. వ్యక్తిగత జాగ్రత్తలు.. దోమతెరలు, నివారణ మందులు వాడి దోమకాటు నుంచి విముక్తి పొందవచ్చు. శరీరమంతా రక్షణ కలిగే విధంగా దుస్తులు ధరించాలి. ముఖ్యంగా పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయాలి. చికిత్స.. ఈ వ్యాధికి సొంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబ్లీఫాం, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు. డెంగ్యూ వస్తే రక్తంలో ప్లేట్లెట్లు తగ్గుతాయని భయపడుతూ ఎంతో మంది రక్తనిధులకు పరుగులు తీస్తారు. ఈ ప్లేట్లెట్ల గురించి అ వగాహన పెంచుకోవాలి. రక్తంలో తెల్లరక్తకణాలు, ఎర్రరక్త కణాలతో పాటు ప్లేట్లెట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తస్రావం జరగకుండా రక్తం గడ్డ కట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సాధారణంగా మన రక్తంలో ఈ ప్లేట్లెట్ కణాలు 1.5 లక్షల నుంచి 4.5 లక్షల వరకు ఉంటాయి. వీటి సంఖ్య బాగా పడిపోతే రక్తస్రావం కావడానికి దారితీస్తుంది. జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించాలి. పనికిరాని, వాడుకలో లేని వస్తువులను తొలగించి వేయాలి. ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, డ్రమ్ములు, నీటి తొట్లపై మూతలు పెట్టాలి. ప్రతి శుక్రవారం పొడి దినంగా పాటించాలి. సమాజ పరంగా గ్రామాల్లో వీధులు, మురుగు కాల్వల్లో చెత్తా చెదారం తొలగించాలి. వర్షాలకు ముందు తర్వాత మురికి కాలువల్లో పూడికతీత చేపట్టి, నీరు పారేటట్లు చూడాలి. గ్రామపెద్దలు, ఉపాధ్యాయులు, సామాజిక కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో డెంగ్యూపై అవగాహన కల్పించాలి. వ్యాధి ప్రబలంగానే ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి వారి సూచనలు, సలహాలు పాటించాలి. - ఓం ప్రకాష్, జిల్లా మలేరియా అధికారి -
దోమలు లేకుండా చేసిన గ్రామం
ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు ప్రస్తుతం దోమల వల్ల సోకే డెంగ్యూ, చికెన్ గున్యా, ఇప్పుడు దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తున్న జికా వైరస్ వ్యాధుల గురించి అసలు భయం లేదు. కారణం ఆ గ్రామాల్లో దోమలు లేకపోవడమే. దోమల బ్రీడింగ్‌కు అసలు అవకాశం లేకుండా వారు మురుగునీరు పారుదల వ్యవస్థను చక్చదిద్దుకోవడమే. ముఖ్యంగా నాందేడ్ జిల్లా, హిమాయత్‌నగర్ తాలూకా, తెంబూర్ణి గ్రామ ప్రజలు దోమలను నిర్మూలించడంలో సంపూర్ణ విజయం సాధించారు. ఇంటి నుంచి ముందు పారే మురుగునీరు కాల్వ కింద, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతను నిర్మించారు. ఇంటి నుంచి పారే వృధా నీరును ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు పీల్చుకుంటున్నాయి. ఎక్కడా దోమల బ్రీడింగ్‌కు అవకాశమే ఉండడం లేదు. ఈ గ్రామంలో తాము అనేక సార్లు సర్వే జరిపామని, తమకు గ్రామంలో ఒక్క దోమల బ్రీడింగ్ చోటు కూడా కనిపించలేదని, పైగా గ్రామస్థులకు వచ్చే రోగాలు కూడా 75 శాతం తగ్గిపోయాయని నాందేడ్ జిల్లా ఆరోగ్య శాఖాధికారి బాలాజీ షిండే తెలిపారు. ఇంకుడు గుంతల విధానం వల్ల భూగర్భ జలాల శాతం కూడా పెరిగిందని, ఫలితంగా ఈ గ్రామానికి నీటి కరవు కూడా లేకుండా పోయిందని ఆయన వివరించారు. దశాబ్దం క్రితమే గ్రామ సర్పంచ్ ప్రహ్లాద్ పాటిల్ ఈ ఇంకుడు గుంతల విధానానికి దశాబ్దం క్రితమే చేపట్టారు. ఇప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉంది. ఈ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకున్న జిల్లా అధికారులు స్వయం ఉపాధి హామీ పథకం కింద జిల్లాలోని పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల మురుగునీరు పారుదల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. నాందేడ్‌లో ఇంకుడు గుంతల నిర్మాణానికి వరుసగా నాలుగు రంధ్రాలు చేసిన సిమ్మెంట్ పైపును, ఇసుకను ఉపయోగిస్తున్నారు. ఇటుక ముక్కలు, కంకర రాళ్లు, ఇసుకను ఉపయోగించి ఇంకుడు గుంతలను నిర్మించవచ్చు. ఈ రెండో విధానాన్ని హర్యానాలోని ముందాక, సర్కారిపురి గ్రామాలు అమలు చేస్తూ ఆ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడి పథకానికి ‘ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసర్చ్ అండ్ రూరల్ డెవలప్మెంట్’ శాస్త్రవిజ్ఞాన సహకారాన్ని అందిస్తోంది. జికా లాంటి వైరస్‌కు ప్రస్తుతానికి వ్యాక్సిన్లు లేనందున దోమల బ్రీడింగ్‌ను నిర్మూలించడమే ప్రజలకు అందుబాటులో ఉన్న ఉత్తమ మార్గం. -
మోగుతున్న ‘జికా’ గంటలు
* వేగంగా వ్యాప్తి చెందుతున్న జికా వైరస్ * ఆందోళనలో బ్రెజిల్, అమెరికా ప్రజలు * లోతుగా అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు * గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని సూచన * 23 దేశాల్లో వ్యాప్తి చెందినట్లు డబ్ల్యూహెచ్ఓ స్పష్టీకరణ రియో డీ జెనిరో: ప్రమాదకరమైన జికా వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈడిస్ ఈజిప్టీ జాతికి చెందిన దోమల కారణంగా ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. చిన్న తలతో పుట్టడం, మెదడు ఎదగకపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఇప్పటి వరకు దీని నివారణకు వ్యాక్సిన్‌గానీ చికిత్సగానీ అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలని హెల్త్ అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. తొందర్లోనే దాదాపు నలభై లక్షల మందికి ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ మార్గరేట్ చాన్ తెలిపారు. ఫిబ్రవరి 1న అత్యవసర సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమెరికాతో పాటు 23 దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు వెల్లడించారు. అయితే అంతర్జాతీయ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలా వద్దా అనే దానిపై ఫిబ్రవరి 1న నిర్ణయిస్తామని పేర్కొన్నారు. తొలిసారిగా 1947లో ఉగాండాలోని ఓ కోతిలో ఈ వైరస్‌ను కనుగొన్నారని వివరించారు. బ్రెజిల్లో భిన్న గణాంకాలు.. బ్రెజిల్లో తొలుత ఊహించిన దాని కన్నా చిన్న తలతో పుట్టిన కేసులు తక్కువ ఉన్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పరిశోధనల్లో ఏదైనా లోపం ఉండటం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ వ్యాధికి, జికా వైరస్ వ్యాప్తికి మధ్య ఉన్న సంబంధాలపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చిన్న తలతో పుట్టిన దాదాపు 4,180 మంది జికా వైరస్ అనుమానితులను ఆరోగ్య అధికారులు పరీక్షించారు. ఈ లోపానికి జికా వైరస్ కారణమై ఉండొచ్చని చెబుతున్నారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమవుతున్న ఈడిస్ ఈజిప్టీ అనే జాతి దోమల నిర్మూలనకు దాదాపు 2.2 లక్షల మంది సైనికులను రంగంలోకి దింపినట్లు అధికారులు ప్రకటించారు. దాదాపు 700 కేసులను అధ్యయనం చేయగా 270 మంది జికా వైరస్ బారిన పడ్డారని నిర్ధారించినట్లు బుధవారం బ్రెజిల్ ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అయితే దీన్ని కొందరు నిపుణులు కొట్టిపారేస్తున్నారు. ఈ జికా వైరస్ వల్లే పిల్లలు చిన్న తలతో పుడుతున్నారనే విషయం ఇంకా శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదని, దీన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని జార్జ్‌టౌన్ యూనివర్సిటీ కో డెరైక్టర్ పాల్ రోప్ పేర్కొన్నారు. జికాను పూర్తిగా నిర్మూలించే వరకు గర్భిణులు వైరస్ వ్యాప్తి ఉన్న ప్రాంతాల్లో పర్యటించకూడదని బ్రెజిల్ అధికారులు సూచించారు. కాగా, జికా వైరస్‌ను పారదోలేందుకు కలసికట్టుగా పోరాడుదామని పొరుగు దేశాలను బ్రెజిల్ అభ్యర్థించింది. అటు ఫ్రాన్స్ కూడా గర్భిణులు ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. వైరస్‌పై యుద్ధం ప్రకటించిన యూఎస్.. జికా వైరస్ నిర్మూలనకు వ్యాక్సిన్ రూపొందించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పిలుపునిచ్చిన నేపథ్యంలో యూఎస్.. ప్రయోగాలు ముమ్మరం చేసింది. వ్యాక్సిన్, చికిత్స విధానాలను కనుగొనేందుకు యూఎస్ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా వర్జీనియాలో ఒకరు, అర్కన్సాస్‌లో మరొకరు జికా వైరస్ బారిన పడినట్లు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది. ఇప్పటివరకు అమెరికాలో ఈ వ్యాధి బారినపడినవారి సంఖ్య 21కి చేరింది. -
డెంగ్యూ నియంత్రణకు జన్యుమార్పిడి దోమలు!
డెంగ్యూ వ్యాధి నివారణకు ఇప్పుడు భారతదేశంలో వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. దోమలవల్ల వ్యాపించే డెంగ్యూను.. అదే దోమలతో నివారించేందుకు మహరాష్ట్రకు చెందిన ఓ సంస్థ ప్రయోగాలు జరుపుతోంది. విజృంభిస్తున్న ప్రాణాంతక డెంగ్యూ వ్యాధిని నియంత్రించే దిశగా దృష్టి సారించిన సంస్థ... జన్యుమార్పిడి పద్ధతిలో దోమలను అరికట్టే ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. భారతదేశంలో జన్యుమార్పిడి పత్తి విత్తనాలను అభివృద్ధి చేసే కంపెనీ 'మైకో' సోదర సంస్థ.. గంగాబిషన్ భికులాల్ ఆధ్వర్యంలో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. మహరాష్ట్రలో నెలకొన్న దోమల జన్యుమార్పిడి ప్రయోగశాల... అందులోని సాంకేతిక నిపుణులు భారతీయులే అయినప్పటికీ ఈ టెక్నాలజీని మాత్రం లండన్ ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధనలను ప్రోత్సహించే ఆక్సిటెక్ కంపెనీ ఆధ్వర్యంలో సాగుతున్నాయి. ఈ పద్ధతిలో డెంగ్యూ దోమలు పెరిగి పెద్దవి అవకుండా శైశవ దశలోనే వాటిని అంతమొందిస్తారు. జన్యుమార్పిడి చేసిన మగదోమల వల్ల కలిగే సంతానం క్రమంగా అంతమొందుతుంది. అయితే ఈ పద్ధతిలో జరిగే సంపర్కం వల్ల ఏ ఇతర జీవులకు నష్టం కలగదని ఆక్సిటెక్ సంస్థ చెప్తోంది. లండన్ కు చెందిన పురుగులను నియంత్రించే పరిశోధనా సంస్థ ఆక్సిటెక్ ఈ జన్యుమార్పిడి దోమలను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం భారతదేశంలో ఈ ప్రయోగానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా డెంగ్యూ దోమలను జన్యుమార్పిడి దోమలను ప్రయోగించి నియంత్రించాలన్నది శాస్త్రవేత్తల ప్రయత్నం. ఈ సంస్థ విడుదల చేసిన జన్యు నియంత్రిత మగ దోమలు టెట్రాసైక్లిన్ యాంటీబయోటిక్ లేనప్పుడు లార్వా దశలోనే చనిపోవటం జరుగుతుంది. ఫలితంగా దోమల సంతతి తగ్గిపోతుంది. డెంగ్యూ జ్వరాలకు ప్రధానంగా కారణమయ్యే ఈడిస్ ఈజిప్టి దోమల నివారణకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. అయితే జన్యుమార్పిడి మగ దోమలతో ఆడదోమల సంభోగం జరగకుండా తప్పించుకునే దశలో ఏమౌతుంది అన్న విషయంలో మాత్రం... ఇంకా సందిగ్ధత కనిపిస్తోంది. అయితే ఈ జన్యు మార్పిడి దోమలవల్ల ఎటువంటి నష్టం కలగదని, డెంగ్యూ వ్యాప్తి చెందకుండా నిర్మూలనకు మాత్రం ఎంతగానో సహకరిస్తుందని ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న సీనియర్ సైంటిస్ట్.. డాక్టర్ దాస్ గుప్తా చెప్తున్నారు. -
ఆ దోమ కుట్టినా మలేరియా రాదట..
కాలిఫోర్నియా: ప్రాణాంతక మలేరియా వ్యాధి సంక్రమాన్ని నిరోధించేందుకు శాస్త్రవేత్తలు ఎన్నిరకాల మందులను కనిపెట్టినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. దోమల నుంచి సంక్రమించే ప్లాస్మోడియం పరాన్న జీవి వల్ల మానవులకు మలేరియా వ్యాధి వస్తోందన్న విషయం తెలిసిందే. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవిని దోమలోనే చంపేస్తే అన్న ఆలోచన అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలకు వచ్చింది. అంతే...ఓ రకమైన దోమ డీఎన్ఏను జన్యు మార్పిడి పద్ధతి ద్వారా మార్చేసి ప్లాస్మోడియం పరాన్న జీవిని నియంత్రించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. అంటే దోమలోకి ప్లాస్మోడియం పరాన్న జీవి ప్రవేశించగానే దోమలో వచ్చిన జన్యు మార్పుల కారణంగా ఆ పరాన్న జీవి ఆదిలోనే చచ్చిపోతుంది. ఫలితంగా ఆ దోమ మానవులను కుట్టినప్పటికీ మలేరియా సోకే ప్రసక్తే లేదన్న మాట. జన్యు మార్పిడికి గురైన దోమకు పుట్టే పిల్ల దోమలకు కూడా ఈ పరాన్న జీవిని బతక్కుండా నిరోధించే శక్తి వస్తుంది. కనీసం మూడు తరాల వరకు దోమ జాతిలో జన్యుపరంగా ఈ శక్తి సంక్రమిస్తుందని పరిశోధక నిపుణుల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఆంథోని జేమ్స్ వివరించారు. దోమ డీఎన్ఏ జన్యు మార్పిడి ప్రక్రియకు 'క్రిస్పర్' అని నామకరణం కూడా చేశారు. ఈ జన్యు మార్పిడి ప్రక్రియ కోసం భారత్‌లో కనిపించే 'అనోఫెలెస్ స్టెఫెన్సీ' జాతికి చెందిన దోమను ఎంపిక చేసుకున్నారు. ఇలా ప్రతి జాతికి చెందిన దోమలను ఎంపిక చేసి ల్యాబ్‌లో జన్యు మార్పిడి ద్వారా ప్లాస్మోడియం పరాన్న జీవిని ఎదుర్కొనే శక్తిని కలిగిస్తూ పోతే కొంతకాలానికి వాటి సంతానానికి కూడా ఈ శక్తిని ప్రసాదించవచ్చు. అలా చేసినట్టయితే కొంతకాలానికి ఏ రకమైన దోమలు మానవులను కుట్టినా మలేరియా వ్యాధి సంక్రమించదు. ఇదొక్కటే మలేరియాను సమూలంగా నిర్మూలించలేదని, ఇదొక మార్గం మాత్రమేనని డాక్టర్ ఆంథోని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, శక్తివంతమైన మందులను కనుగొనడం, మలేరియా సోకినప్పుడు వాటిని వాడడం తప్పనిసరని ఆయన చెప్పారు. ఎందుకంటే, దోమ జాతులన్నింటిలో డీఎన్ఏలో జన్యు మార్పిడి తీసుకరావడం అంత సులభం కాదు. ప్రపంచ వ్యాప్తంగా 320 కోట్ల మంది, అంటే దాదాపు ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నారు. వారిలో ఏడాదికి 5,80,000 మంది మృత్యువాత పడుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అసలు ప్లాస్మోడియం పరాన్న జీవికి వాహకంగా పనిచేస్తున్న దోమ జాతినే నిర్మూలిస్తూ పోవడం శ్రేయస్కరంగదా! అన్న ఆలోచన శాస్త్రవేత్తలకు రాకపోలేదు. అలాంటి చర్యలు తీసుకున్నట్లయితే పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటుందని, ఇప్పటికే దోమల ద్వారా నశించిపోతున్న ఇతర రకాల పరాన్న జీవులు మరోరకంగా విజృంభించే అవకాశం ఉందని కొంత మంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ వస్తున్నారు. -
అవినీతి ‘కంపు’!
పారిశుద్ధ్యం పేరుతో రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం మచ్చుకైనా కన్పించని ఫినాయిల్, డెటాల్ కేవలం బ్లీచింగ్ పౌడర్‌తోనే సరి దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు, టాయిలెట్లు రోగుల అవస్థలు ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. వార్డులకు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయక తీవ్ర దుర్వానస వెదజల్లుతున్నాయి. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగులకు కొత్త రోగాలను అంటగడుతున్నాయి. ఆస్పత్రిలో పారిశుధ్యం కోసం ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తున్నా...పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి కారణమేంటని ఆరా తీస్తే... కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమేనని తెలుస్తోంది. కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ పనులను తొలుత ఆల్ సర్వీసు సంస్థ ఔట్ సోర్సింగ్ దక్కించుకుంది. అప్పట్లో సదరు సంస్థకు నెలకు రూ.17 లక్షలు చెల్లించారు. పారిశుద్ధ వ్యవస్థ మెరుగు పడకపోవడంతో ఆల్ సర్వీసు కాంట్రాక్ట్‌ను 20013లో రద్దు చేసి,‘గౌరి మహిళా మండలి’ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఆ పనులను అప్పగించారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం నెలసరి ఖర్చులను రూ.17 లక్షల నుంచి రూ.29 లక్షలకు పెంచింది. ఇలా ఏడాదికి రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తుంది. ఔట్ సోర్సి ంగ్ ఏజెన్సీ కింద 270 మంది వర్కర్లు పని చేయిస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్ లెక్క చూపుతున్నారు. నిజానికి 150 మందికి మించి లేరు. వీరిలో చాలా మందికి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం లేదు. వీరిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో చాలా మంది కార్మికులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రోజుల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇక కాంట్రాక్టర్లు వీరికి పనిచేసిన దినాలకే వేతనం చెల్లిస్తూ పూర్తిస్థాయి బిల్లులు పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఏ వార్డులో ఎవరెవరు పని చేస్తున్నారో ఆస్పత్రి హెల్త్ ఇన్స్పెక్టర్కు తెలియజేయాలి. షిప్ట్ ముగిసిన తర్వాత వార్డు ఇన్చార్జి నర్సు పారిశుధ్య పనుల పట్ల సంతృప్తి చెందినట్లు రిజిస్టర్లో సంతకం చేయించాలి. ఆ తర్వాత హెల్త్ఇన్స్పెక్టర్తో సంతకం చేయించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. సివిల్ సర్జన్ ఆర్ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓలు సదరు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై అన్నీ తామై వ్యవ హరిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్తుర్కిపడి సదరు ఆర్‌ఎంఓలు ఏమీ పట్టించుకోకుండానే బిల్లుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తున్నారని ఆరోపణలున్నాయి. ముక్కు మూసుకోవాల్సిందే... ఓపీతో పాటు ఇన్‌పేషంట్ వార్డుల్లో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. కీలకమైన ఎఐసీయూ ప్రవేశ ద్వారానికి రెండు వైపులా ఉన్న మూత్ర శాలల నుంచి దుర్వాసన వస్తోంది. ఇక పాత భవనం రెండు, మూడు అంతస్థుల్లోని ఆపరేషన్ థియేటర్ల వద్ద ఉన్న మ రుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులు సహా వారి సంరక్షకులు సైతం ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. కారిడార్లు, మెట్లను శుభ్రం చేయక పోవడంతో వాటిపై నడిచినవారు జారిపడుతున్నారు. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీకుతుబ్‌షా భవన ంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తుండటంతో డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెంది నర్సింగ్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో నీటిని తాగిన రోగులు మరింత అనారోగ్యాల పాలవుతున్నారు. సిరెంజ్లు, బ్లేడ్స్, సీజర్స్ తదితర క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇక్కడి పారిశుద్ధ్య లోపం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యనిపుణులే అభిప్రాయపడుతున్నారు. నిబంధనల ప్రకారం శుభ్రం చేయాలి ఇలా... ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి.అవుట్ పేషంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడుసార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడుసార్లు శుభ్రం చేయాలి. {పతి పదిహేను రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే కానీ కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాజరు నమోదుకు గాంధీ ఆస్పత్రిలో ఉన్నట్లుగా ఇక్కడ బయోమెట్రిక్ పద్ధతి లేదు. -
ఎటాక్...
సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో పాలనాపరంగానే కాదు... వ్యాధుల పరంగానూ డివిజన్లు వేరవుతున్నాయి. ఈ ప్రాంతాలను వేరు చేసిందెవరో తెలుసా?... దోమలు. అవును... డెంగీ వ్యాప్తికి... మలేరియాకు కారణమవుతున్న దోమల విస్తృతిని బట్టి ఈ ప్రాంతాలు ‘విడిపోయాయి’. ఇదేదో మేం చెబుతున్న విషయం కాదు... అక్షరాలా అధికారులే తేల్చిన వాస్తవం. ఎండా కాలం... వానా కాలం అనే తేడా లేకుండా దోమలు మనపై దాడి చేస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా వీటి తీవ్రత ఉన్న ప్రాంతాలపై దృష్టి సారించిన అధికారులు... డెంగీ ... మలేరియా కేసులు ఏ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదవుతున్నాయో అంచనా వేశారు. డెంగీకి ఎక్కువ అవకాశమున్న ప్రాంతాలు.. మలక్‌పేట సర్కిల్లోని అక్బర్‌బాగ్, ఆజంపురా, తలాబ్‌చంచలం, చార్మినార్ సర్కిల్లోని ఫలక్‌నుమా, ఘాన్ని బజార్, ధూల్‌పేట, దూద్‌బౌలి, రాజేంద్రనగర్ సర్కిల్లోని రాజేంద్రనగర్, కార్వాన్ (సర్కిల్-7) పరిధిలోని దత్తాత్రేయ నగర్, మెహదీపట్నం, చింతల్‌బస్తీ, అబిడ్స్(సర్కిల్-8) పరిధిలోని జాంబాగ్, హిమాయత్ నగర్(సర్కిల్-9)లోని బర్కత్‌పురా, ఆడిక్‌మెట్, బంజారాహిల్స్(సర్కిల్-10)లోని సోమాజిగూడ, సనత్‌నగర్, శేరిలింగంపల్లి (సర్కిల్-11)లోని గచ్చిబౌలి, శేరిలింగంపల్లి (సర్కిల్-12)లోని హఫీజ్‌పేట, పటాన్చెరు, ఆర్సీపురం సర్కిల్లోని రామచంద్రాపురం, కూకట్పల్లి సర్కిల్లోని కూకట్పల్లి, అల్వాల్ సర్కిల్లోని అల్వాల్, మల్కాజిగిరి సర్కిల్లోని సఫిల్‌గూడ, సికింద్రాబాద్ సర్కిల్లోని బన్సీలాల్‌పేట, బేగంపేట. మలేరియాకు అవకాశమున్న ప్రాంతాలు.. కాప్రా పరిధిలోని నాచారం, ఎల్బీనగర్ పరిధిలోని చంపాపేట, మలక్‌పేట సర్కిల్లోని సంతోష్ నగర్, జంగమ్మెట్, సలీంనగర్, అలియాబాద్, చార్మినార్ సర్కిల్లోని శాలిబండ, ధూల్‌పేట, పురానాపూల్, కిషన్‌బాగ్, రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్‌దేవ్‌పల్లి, కార్వాన్ పరిధిలోని మంగళ్‌హాట్, మెహదీపట్నం, గుడిమల్కాపూర్, అబిడ్స్(సర్కిల్-8)లోని గన్‌ఫౌండ్రి, హిమాయత్‌నగర్ సర్కిల్లోని కాచిగూడ, గోల్నాక, విద్యానగర్, రామ్‌నగర్, భోలక్‌పూర్, దోమలగూడ, బంజారాహిల్స్ సర్కిల్లోని బంజారాహిల్స్, షేక్‌పేట, కూకట్పల్లి సర్కిల్లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ సర్కిల్లోని షాపూర్‌నగర్, అల్వాల్ సర్కిల్లోని అల్వా ల్, మల్కాజిగిరి సర్కిల్లోని డిఫెన్స్ కాలనీ, సికింద్రాబాద్ సర్కిల్లోని బన్సీలాల్‌పేట, రామ్‌గోపాల్‌పేట. ....గత సంవత్సరం డెంగీ, మలేరియా కేసులు ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు ప్రస్తుతం వీటిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. దోమల నివారణకు నిత్యం మందు పిచికారీ చేయడం... ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు వినియోగిస్తున్నారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని చెబుతున్నారు. సమీపంలో నీరు ఉన్నా... తొలగించాల్సిందిగా సూచిస్తున్నారు. దోమలు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నందున అన్ని ప్రాంతాల వారూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాఠశాలల వద్ద స్పెషల్ డ్రైవ్.. విద్యార్థులు దోమల బారిన పడకుండా ఉండేందుకు 718 ప్రభుత్వ పాఠశాలలతో పాటు 2,306 ప్రైవేట్ పాఠశాలల్లో వీటి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ వి.వెంకటేశ్ తెలిపారు. పాఠశాలలు, పరిసరాల్లో పైరిథ్రమ్ స్ప్రే వంటివి వినియోగిస్తున్నామన్నారు. నాలాలు, డ్రెయిన్లలో పూడిక వల్ల దోమలు పెరిగే అవకాశముందన్నారు. మూసీ నది ప్రాంతంలో నివారణ చర్యలకు ప్రత్యేక బృందాలను నియమించినట్టు చెప్పారు. -
చైనాలో దోమల ఫ్యాక్టరీ!
బీజింగ్: డెంగీ వ్యాధిపై పోరు కోసం చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దోమల ఫ్యాక్టరీని ప్రారంభించింది! దక్షిణ చైనా రాష్ట్రం గ్వాంరలో గల షాజీ ఐల్యాండ్‌లో ఏర్పాటు చేసిన సైన్స్ సిటీ ఫ్యాక్టరీ నుంచి ప్రతివారం స్టెరిలైజ్ చేసిన పది లక్షల దోమల్ని బయటికి వదులుతోంది. దీనివల్ల వ్యాధికారక దోమల జనాభా తగ్గించేందుకు చైనా ప్రయత్నిస్తోంది. స్టెరిలైజ్ చేసిన దోమలు సంతానాన్ని ఉత్పత్తి చేయలేవు. అలాగే, ప్రౌఢ దోమలుగా కూడా ఎదగలేవని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రయోగపూర్వకంగా ఈ ఫ్యాక్టరీని ప్రారంభించామని, దీనివల్ల స్థానికంగా 90 శాతం దోమల జనాభా తగ్గిందని అధికారులు తెలిపారు. గతేడాది చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ మొత్తంలో ఏకంగా 47 వేల మంది డెంగీ వైరల్ ఫీవర్ బారినపడ్డారు. సరైన టీకాలు, చికిత్సలు అందుబాటులో లేకపోవడంతో ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 22 వేల మంది చనిపోతున్నట్లు అంచనా. ఇది సక్సెస్ అయితే గనక.. మలేరియా వంటి ఇతర వ్యాధుల నివారణకోసమూ ప్రత్యేకంగా దోమల ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. -
విజృంభిస్తున్న డెంగీ
- బాధితులతో కిటకిటలాడుతున్న విమ్స్ - బళ్లారి, రాయచూరు, కొప్పళ వాసులే అధికం బళ్లారి (తోరణగల్లు) : అప్పుడప్పుడు కురుస్తున్న వానలకు తోడు మురుగు కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, అపరిశుభ్రతల నుంచి దోమలు కుప్పతెప్పలుగా ఉత్పత్తవుతున్నాయి. ఎక్కువ కాలం నిల్వ ఉన్న మూతలులేని నీటితొట్టెలు, డ్రమ్ములు, టైర్లు, టెంకల్లో నుంచి డెంగ్యూ బారిన పడేసే దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఈ దోమకాటుకు గురైనవారు జ్వరంతో మంచాన పడుతున్నారు. ఈ జ్వరమే డెంగీగా మారి ఆసుపత్రి పాలు చేస్తున్నాయి. విమ్స్‌లో చిల్డ్రన్స్ వార్డులో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలకు చెందిన వివిధ ప్రాంతవాసులు, చిన్నారులు చికిత్స పొందుతున్నారు. గత వారం తీవ్ర డెంగీతో మృత్యువాత పడిన మహిళలు, చిన్నారులు ఉన్నారు. ఆసుపత్రిలో వార్డులు డెంగీ బాధితులతో నిండుతున్నాయి. విమ్స్ పాలక మండలి డెంగీ బాధితుల కోసం కొత్తగా రెండు వార్డులను ఏర్పాటు చేశారు. పెరుగుతున్న డెంగీ బాధితులతో వార్డుల్లో పడకల కొరత ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ, సిటీ కార్పొరేషన్ చర్యలు చేపట్టి నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టి డెంగీని నివారించాలని ప్రజలు కోరుతున్నారు. -
డెంగీ పంజా!
పారిశుద్ధ్య కార్మికుల సమ్మె ప్రభావం వీధుల్లో భారీగా పేరుకుపోయిన చెత్త విజృంభిస్తున్న దోమలు ముసురుతున్న వ్యాధులు సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికులు ఆరు రోజులుగా సమ్మెలో ఉండడంతో నగరంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. దీనికి తోడు వీధుల్లోని రహదారులపై మురుగు నీరు నిల్వ ఉంటోంది. దీంతో దోమలు వ్యాప్తి చెంది... బస్తీల్లో డెంగీ, మలేరియా వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇటీవల కాటేదాన్ పరిధిలోని శ్రీరామ్‌నగర్ బస్తీకి చెందిన ఐదుగురు వ్యక్తులు డెంగీ బారిన పడినట్టు వైద్యులు తేల్చారు. తాజాగా కంచనపల్లికి చెందిన ఉప్పలయ్య(45), శివంపేటకు చెందిన రఘువీర్(28)కు డెంగీ సోకినట్టు తేలింది. ఇలా వారం రోజుల్లోనే ఎనిమిది మంది డెంగీ భారిన పడటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మూలన చర్యలేవీ? వర్షాల వల్ల నివాసాల మధ్య మురుగు నీరు నిల్వ ఉండటంతో మలేరియా, డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి. ఫాగింగ్ చేయక పోవడంతో కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దీనికి తోడు రాత్రి వేళల్లో విద్యుత్ కోత విధిస్తుండడంతో ఇళ్లలో ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మూసీ పరీవాహక ప్రాంతాలైన కూకట్పల్లి, లోయర్ ట్యాంక్ బండ్, అంబర్పేట్, సుల్తాన్‌బజార్, ముసారంబాగ్, మలక్‌పేట్, కొత్తపేట్, నాగోలు, ఉప్పల్, రామంతాపూర్, గోల్నాక, ఉస్మానియా క్యాంపస్ ప్రాంతాలతో పాటు సిటీ శివారుల్లోనూ దోమల బెడద ఎక్కువగా ఉంది. మరోవైపు కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా కేసులూ పెరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల్లోని ఆస్పత్రులకు రోగుల తాకిడి అధికమవుతోంది. -
ప్రియమైన శరీర వాసన ఉన్నవారిపైనే దోమల దాడి!
కొత్త పరిశోధన మిమ్మల్ని దోమలు విపరీతంగా కుడుతున్నాయంటే కారణం... మీ శరీరం నుంచి వెలువడే వాసనే అంటున్నారు బ్రిటిష్ అధ్యయనవేత్తలు. దీన్ని నిరూపించడం కోసం 36 మంది కవల పిల్లలను ఎంచుకున్నారు. వీరంతా ఒకేలాంటి కవలలన్నమాట. అంటే ఐడెంటికల్ ట్విన్స్. ఇక ఐడెంటికల్ ట్విన్స్ కాని కవల పిల్లలను మరో 38 మందినీ ఎంచుకొని వారిని మరో గదిలో ఉంచారు. ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి వెళ్లేలా ఇంగ్లిష్ అక్షరం ‘వై’ ఆకృతిలో ఉండే ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసి... ఈ రెండు గదుల్లోకీ ఒకేసారి దోమల్ని పంపారు. ఐడెంటికల్ ట్విన్స్ ఉన్న గదిలోనికే ఎక్కువ దోమలు వెళ్లాయి. ఐడెంటికల్ ట్విన్స్ అంటే వారిలో శరీర వాసనను వెలువరించే ఒకేలాంటి జన్యువులు ఉంటాయి కాబట్టి... వారి మీదకే ఎక్కువ సంఖ్యలో దోమలు వెళ్లాయన్నమాట. అదే ఒకేలాంటి కవలలు కానివారి విషయంలో వేర్వేరు జీన్స్ వల్ల వేర్వేరు శరీర వాసనలు వెలువడ్డాయి కాబట్టి... వాటిలో దోమలకు ప్రియంగా లేని శరీర వాసనలు వెలువడేవారిదగ్గరకు అస్సలు దోమలే వెళ్లలేదట. వీటన్నింటినీ సమీక్షించి చూస్తే తమకు ప్రియమైన శరీర వాసనను వెలువరించే వారిపైకే దోమలు దాడి చేస్తాయని వెల్లడైందని ఈ పరిశోధనవేత్తలు పేర్కొంటూ ఇదే విషయాన్ని ‘ప్లాస్ ఒన్’ అనే జర్నల్‌లో సైతం పొందుపరిచారు. మరో కొత్త విషయం ఏమిటంటే... ఈ శరీరవాసనకు కారణమయ్యే జన్యువుకూ... ఎత్తుతో పాటు, ఐక్యూకూ కారణమయ్యే జన్యువుతో దగ్గరి పోలికలున్నాయట. -
చలిలో నిద్ర.. దోమల బెడద
వణికిస్తున్న చలి.. చన్నీళ్ల స్నానం.. దోమల బెడద. రోజూ సగం నిద్ర. కప్పుకుందామంటే దుప్పట్లు లేవు.. పుస్తకాలు, దుస్తులు భద్ర పర్చుకుందామంటే బాక్సుల్లేవు. సన్నబియ్యం అన్నమైనా.. సప్పటి కూరలే.. ఇవి ఎస్సీ బాలుర వసతిగృహం విద్యార్థుల ఇబ్బందులు. హాస్టళ్లలో సమస్యలు తెలుసుకునేందుకు చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ ‘సాక్షి’ తరఫున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. గంగాధరలోని ఎస్సీ వసతి గృహ విద్యార్థులతో మాట్లాడారు. అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బొడిగె శోభ: బాబూ.. నీపేరేంటి? విద్యార్థి: నాపేరు సాయికిరణ్ బొడిగె శోభ: ఏ ఊరు? సాయికిరణ్ : తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ బొడిగె శోభ: బాగా చుదువుతున్నావా? సాయికిరణ్ : చదువుతున్నా మేడం. క్లాసులో సెకండ్ వస్తున్నా బొడిగె శోభ: సన్న బియ్యంతో భోజనం పెడుతున్నారా? దొడ్డు బియ్యంతోనా? రాజకుమార్ : సన్న బియ్యంతోనే మేడం బొడిగె శోభ: మెనూ ప్రకారం భోజనం, కూరలు పెడుతున్నారా? ఎ.రాజకుమర్ : ఉదయం టిఫిన్ ఇస్తున్నారు. మధ్యాహ్నం, సాయంత్రం అన్నం పెడుతున్నారు. 5 రోజులు గుడ్లు ఇస్తున్నారు. పండ్లతోపాటు ప్రతి బుధవారం స్వీటు ఇస్తారు బొడిగె శోభ: మీకేమైనా సమస్యలు ఉన్నాయా? వెంకటేశం : రాత్రి పూట దోమల బెడద ఎక్కువ ఉంది. చలికాలం.. ఉదయం చన్నీళ్లతో స్నానం చేయడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. కింద పడుకుంటే నేల చల్లగా ఉంటుంది, బెడ్లు ఇస్తమన్నారు కానీ.. రాలేదు బొడిగె శోభ: ప్రభుత్వం దోమ తెరలు అందజేయలేదా? వార్డెన్ : మూడు సంవత్సరాల క్రితం అందించిన దోమ తెరలు చినిగి పోయినయ్ బొడిగె శోభ: ఇంకేమైనా సమస్యలున్నాయా? సంతోష్ : చలికాలం బాగా చలి పెడుతుంది. బెడ్ షీట్లు కావాలి బొడిగె శోభ: వసతి గృహంలోని విద్యార్థులందరికీ నేనే శాలువాలు ఇస్తా. (45 మంది విద్యార్థులకు శాలువాలు పంపిణీ చేశారు) బొడిగె శోభ: వార్డెన్ రోజూ వస్తున్నాడా? విద్యార్థులు: వస్తున్నారు మేడం రాంబాబు : తినడానికి ప్లేట్లు లేవు మేడం. బొడిగె శోభ: ప్లేట్లు ఇస్తే బాగా చదువుకుంటారా.. క్లాస్ ఫస్ట్ వస్తారా? రాంబాబు: తప్పకుండా మేడం బొడిగె శోభ: కొండన్నపల్లి మాజీ సర్పంచ్ రేండ్ల రాజిరెడ్డి మీకు ప్లేట్లు అందజేస్తారు. వంశీకృష్ణ: జ్వరం, దగ్గు వంటి సమస్యలు వస్తే హాస్పిటల్‌కు వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. హాస్పిటల్ బాగా దూరంగా ఉంది బొడిగె శోభ: వైద్యాధికారితో మాట్లాడి వారానికి రెండుసార్లు వసతి గృహానికి వచ్చి వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తా బొడిగె శోభ: వార్డెన్ గారూ.. విద్యార్థుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారా ? వార్డెన్: సమస్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్లా మేడం. హాస్టల్లో నీటి సమస్య పరిష్కారానికి సబ్ మెర్సిబుల్ పంపు కావాలి. దోమ తెరల కోసం కలెక్టర్‌తో మాట్లాడుతా.. బొడిగె శోభ, చొప్పదండి ఎమ్మెల్యే గత ప్రభుత్వాలు వసతిగృహ విద్యార్థుల సమస్యలు పట్టించుకోలేదు. పేద విద్యార్థులు కడుపు నిండా భోజనం చేయాలని ప్రస్తుత ప్రభుత్వం హాయాంలో సన్నబియ్యం అందిస్తున్నాం. వసతిగృహ సందర్శనలో విద్యార్థులు దృష్టికి తీసుకువ చ్చిన సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. దోమల బెడద నివారణకు పంపిణీ చేసే దోమ తెరల విషయం కలెక్టర్‌తో మాట్లాడుతా. ఐఏఎస్, ఐపీఎస్‌లు అందరూ ప్రభుత్వ పాఠశాలలు, వ సతిగృహాల్లో చదువుకున ్న వారే. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురాావాలి. -
మందుపాతర కంటే.. మశకమంటేనే భయం
కూంబింగ్ ఆపరేషన్లలో సాయుధ బలగాలను వణికిస్తున్న దోమలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సాయుధ బలగాలు మందుపాతరలు, మవోలు కంటే మశకా(దోమ)లంటేనే ఎక్కువ భయపడుతున్నారు. అనాఫిలిస్ దోమలతో వ్యాపించే మలేరియా తమలో పోరాట పటిమను తగ్గిస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల దాడిలో మృతి చెందిన, క్షతగాత్రులుగా మారిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మలేరియాతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ కారణంగానే వారు మావోయిస్టుల దాడిని పూర్తిస్థాయిలో తిప్పికొట్టలేకపోయారని ఉన్నతాధికారులు నిర్ధారించారు. గడిచిన నెల రోజుల్లో కూం బింగ్ విధు ల్లో ఉన్న 500 మందికి మలేరియా సోకిందని, వీరిలో ఒకరు మరణించినట్లు తెలి సింది. ఈ బృందాలు క్యాంపుల్లో విశ్రాంతి తీసుకునే సమయంలోనే దోమల దాడికి గురవుతున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ)కు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నివేదించా రు. భద్రతా కారణాల వల్ల జ్వరపీడిత జవాన్లు వైద్యం కోసం దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని, వెళ్లినా వారికి మెరుగైన వైద్యం అం దట్లేదని ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మందుపాతరలు, మావోల తూటాలకు ఎవ్వరూ నేలకొరగకూడదని(జీరో క్యాజు వాలిటీ) లక్ష్యంగా నిర్దేశించుకున్న సాయుధ బల గాలు తాజాగా మలేరియా దోమల్నీ ఈ జాబితా లో చేర్చారు. అనాఫిలిస్ దోమల్ని గుర్తించడానికి, నిరోధించడానికి ఎలాంటి పరిజ్ఞానం బల గాల వద్ద లేకపోవడంతో కిట్ బ్యాగుల్లో దోమ తెరలు, మస్కిటో కాయిల్స్, క్రీములుల్ని తీసుకువెళ్లడం తప్పనిసరి చేశారు. అయితే వీటిని విని యోగిస్తే తమ ఉనికి మావోలు గుర్తించే ప్రమా దమున్న కారణంగా అనేక మంది జవాన్లు వాటి ని వాడటానికి వెనుకాడుతున్నారని ఉన్నతాధికారులు ఎంహెచ్ఏకే నివేదించారు. ఈ నేపథ్యం లోనే కూంబింగ్ సిబ్బందికి మలేరియా నిరోధక మందులు ముందుగానే ఇప్పించడం, సమీపంలోని వైద్యశాలల్లో సంబంధిత మందులు, వైద్యు ల్ని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను కోరింది. -
చదివేదెలా?
జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో సంక్షేమం కరువైంది. అక్కడి విద్యార్థ్ధినీ, విద్యార్థులకు రక్షణ కూడా ప్రశ్నార్థకంగా మారింది. దోమల మధ్య, అశుభ్ర వాతావరణంలో చదువు కొండెక్కుతోంది. మద్దిపాడు మండలంలోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఎలా ఉన్నాయి... విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి శనివారం సంతనూతలపాడు శాసనసభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ‘సాక్షి’ విలేకరిగా మారారు. ఉదయం ఎనిమిది గంటల సమయంలో మద్దిపాడు హాస్టల్‌కు చేరుకున్న ఆయన తొలుత బాలుర హాస్టల్‌కు వెళ్లారు. ఆయన వెళ్లే సరికి పిల్లలు కొందరు స్నానాలు చేస్తుండగా, మరికొందరు స్కూల్‌కు తయారవుతున్నారు. ఇంకొందరు ఆడుకుంటున్నారు. హాస్టల్ వార్డెన్ మాత్రం ఎక్కడా కనపడలేదు. ఆదిమూలపు సురేష్ : బాత్ రూములు ఎన్ని ఉన్నాయి. విద్యార్థులు : మొత్తం వందమందికి మూడు మరుగుదొడ్లే ఉన్నాయి. మరో ఏడు పనిచేయడం లేదు. కొత్తగా ఏడు బాత్రూములు కట్టినా అవి ఇంకా ప్రారంభించలేదు. ఆదిమూలపు సురేష్ : వందమందికి మూడు టాయిలెట్లేనా? విద్యార్ధులు : అవును సార్ అక్కడి నుంచి పిల్లలు స్నానం చేసే చోటకి వచ్చారు. అక్కడ పిల్లలు సంప్‌లోకి దిగి నీటిని బక్కెట్లతో తోడుకుంటున్నారు. ఆదిమూలపు సురేష్ : ఈ నీరు ఎక్కడి నుంచి వస్తున్నాయి. విద్యార్ధి : గుండ్లకమ్మ నుంచి వస్తున్నాయి. ఉదయం పూట కరెంట్ ఉండటం లేదు. దీంతో మోటార్ పనిచేయకపోవడం వల్ల మిగిలిన పంపులు పనిచేయడం లేదు. అందుకే ఈ నీళ్లు పట్టుకుని స్నానాలు చేస్తున్నాం. ఆదిమూలపు సురేష్ : కరెంట్ లేదా? ఎప్పుడు వస్తుంది విద్యార్ధి : తెలియదు సర్ ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ? ఎన్నో తరగతి చదువుతున్నావు. మధు : నా పేరు మధు, పదో తరగతి చదువుతున్నాను. ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఆదిమూలపు సురేష్ : ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయో చెబుతావా? మధు : స్నానం చేయడానికి బక్కెట్లుండవు, కరెంట్ ఉండదు, ఆ డ్రైనేజీ వల్ల దోమలు. వీటి వల్ల జ్వరాలు వస్తున్నాయి. ఆదిమూలపు సురేష్ : మీకు డాక్టర్ ఉన్నారా? వస్తున్నారా? మందులు ఇస్తున్నారా? మధు : ఉన్నారు. నెలకోసారి వచ్చి అందరినీ పరీక్షించి మందులు ఇస్తారు. ఆదిమూలపు సురేష్ : మరుగుదొడ్లు సరిపోతున్నాయా? మధు : సరిపోవడం లేదు. మూడు ఉన్నాయి. వంద మందికి మూడు టాయిలెట్లు ఉన్నాయి. ఆదిమూలపు సురేష్ : మరి బాత్రూములున్నాయా? మధు : లేవు, బయటే స్నానం చేస్తాం. వర్షాకాలం కూడా ఇక్కడే స్నానం చేయాల్సి వస్తోంది. ఆదిమూలపు సురేష్ : మీకు యూనిఫామ్స్ వచ్చాయా, ప్రతిరోజూ అటెండెన్స్ తీసుకుంటారా? విద్యార్ధులు : యూనిఫామ్స్ వచ్చాయి. అటెండెన్స్ వేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ : ఈ రోజు ఏం పెట్టారు విద్యార్ధులు : రాగి జావ ఆదిమూలపు సురేష్ : నీపేరేంటి? ఏం సమస్యలు ఉన్నాయి? గోవిందు : నాపేరు గోవిందు. గదులకు కిటికీలు లేవు. విద్యార్ధులు : దోమలు పెద్ద సమస్య. కిటికీలకు తలుపులు లేవు. డ్రైనేజి వల్ల దోమలు వస్తున్నాయి. టాప్‌లు లేవు. బాత్రూములు చాలా ఇబ్బందిగా ఉన్నాయి. నీరు సరిగా రావడం లేదు. ఆదిమూలపు సురేష్ : సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగారు ఒక నెంబర్ ఇచ్చి సమస్యలు మీకు చెప్పమన్నారు. ఆ నెంబర్ తెలుసా? విద్యార్ధులు : తెలియదు. ఆదిమూలపు సరేష్ : తలుపులు కిటికీలు పెట్టిస్తాము. (బట్టలు ఆరేసుకోవడానికి స్థలం లేదు. చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంది. ఒకచోట కాంపౌండ్ వాల్ లేదు. దీంతో పాములు, ఇతర జంతువులు లోపలికి వస్తున్నాయి. విద్యార్థులు చెప్పిన సమస్యలు చూడడానికి హాస్ఠల్లోని గదుల్లోకి వెళ్లి తలుపులు లేని కిటికీలను పరిశీలించారు. కరెంట్ వైర్లు కూడా ఊడిపోయి ప్రమాదకరంగా మారాయి. వీటిని కూడా ఎమ్మెల్యేకు చూపించారు. కిటికీలకు మెష్ లేదు. పక్కనే డ్రైనేజీ వల్ల దోమలు విపరీతంగా వస్తున్నాయని చూపించారు. వర్షం పడితే శ్లాబు కురుస్తోంది.) ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటి? ఏసు : నా పేరు ఏసు, ఒకటో నెంబర్ రూమ్ పక్కనే డ్రైనేజీ ఉంది, దీనివల్ల దోమలు వస్తున్నాయి. అంటూ ఎమ్మెల్యేని డ్రైనేజీల వద్దకు తీసుకువెళ్లారు. ఆ డైనేజీ నీటిపారుదల సక్రమంగా లేకపోవడం వల్ల అందులో పెద్ద సంఖ్యలో దోమలు పెరుగుతున్నాయి. పక్కనే చెత్త కూడా పెద్ద సంఖ్యలో పడేశారు. ఆదిమూలపు సురేష్ : డ్రైనేజీ పక్కనే పెద్ద ఎత్తున చెత్త వేశారు. పక్కనే హాస్టల్ కిటికీలున్నాయి. వీటికి కనీసం మెష్ కూడా లేదు. కిటికీ తలుపులు లేవు. దీనివల్ల ఈ గదుల్లో ఉన్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కిటీకీలకు మెష్ బిగించి, డ్రైనేజీ బాగు చేయించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఈ డ్రైనేజీ వల్ల ప్రమాదం పొంచి ఉంది. (అక్కడి నుంచి ప్రైవేటు భవనంలో నిర్వహిస్తున్న బాలికల హాస్టల్‌కు వెళ్లారు. దానికి వెళ్లే రోడ్డు కూడా సరిగా లేదు. పైగా దారికి ఇరువైపులా మలమూత్ర విసర్జనతో ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఈ భవనంలో నాలుగు గదులుండగా అందులో ఒకటి వార్డెన్ రూముగా, మరొకటి స్టోర్‌రూమ్‌గా ఉపయోగిస్తున్నారు. ఒకచిన్న గదితోపాటు హాల్ మాత్రమే విద్యార్థినుల కోసం ఉంది. ఇందులో 70 మంది ఉంటున్నారు. అక్కడ బాలికల టాయిలెట్‌కు కనీసం తలుపులు లేకపోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి వెంటనే డోర్ పెట్టించాలని ఆదేశించారు. గోడకు అతికించిన మెనూను పరిశీలించారు. ఎలా అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారు. తాగేనీరు కూడా మురికిగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. అక్కడ కూడా వార్డెన్ అందుబాటులో లేరు. ) ప్రజెంటర్ : దాళా రమేష్‌బాబు ఫోటోలు : కె. శ్రీనివాసులు పరిష్కారానికి పోరాడుతా... సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థినీ విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది. పధానంగా పారిశుధ్యం, తాగునీటిపై శ్రద్ధ చూపించాలి. యుద్ధప్రాతిపదికన వసతి గృహ భవనాలు ఏర్పాటు చేయాలి. బాలికలకు రక్షణ లేని దుస్థితిలో భవనాలున్నాయి. సాంఘిక సంక్షేమ శాఖ వారు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టారు. ఇక్కడ అటెండెన్స్ రిజిస్టర్‌కు, ఉన్న సంఖ్యకు సంబంధం లేదు. పిల్లలను రాత్రి ఇంటికి పంపిస్తున్నారు. ఆ సమయంలో ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత. కాంపౌండ్ వాల్స్ పూర్తిగా కట్టాలి. అరకొరగా మరుగుదొడ్లున్నాయి. పదోతరగతి విద్యార్థులకు చదువుకోవడానికి విద్యుత్ కోతల సమయంలో ఇన్వర్టర్ ఏర్పాటు చేయాల్సి ఉంది. ఎన్నికల సమయంలో హాస్టల్స్‌కు సోలార్ ఫెన్సింగ్, బయోమెట్రిక్ హాజరు, కంప్యూటరైజేషన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. విద్యార్ధులకు మంచి సదుపాయాలు కల్పించేవరకూ పోరాడతా. పర్యవేక్షించాల్సిన వార్డెన్లు హాస్టళ్లల్లో లేకపోవడం విచారకరం. ఆదిమూలపు సురేష్ : నీ పేరేంటమ్మ, ఇక్కడ ఏం చేస్తున్నావు. ఎంత మంది ఉంటారు? వంటమనిషి : నా పేరు రాణి, ఇక్కడ 70 మంది ఉంటున్నారు. ఇక్కడ పడుకోడానికి స్థలం లేకపోవడంతో 30 మంది వరకూ ఇంటికి వెళ్లి పడుకుని ఉదయాన్నే వస్తున్నాం. ఆదిమూలపు సురేష్ : పిల్లలను ఇంటికి ఎలా పంపిస్తారు? వంటమనిషి : వారి తల్లితండ్రులు వచ్చి తీసుకువెళ్తారు. లేనిపక్షంలో ఇక్కడే ఉంటారు. (రెండు హాస్టల్స్‌లో వార్డెన్లు అందుబాటులో లేరు. ఎమ్మెల్యేగారు తనిఖీలకు వచ్చారని తెలియగానే ఆగమేఘాలపై ఒంగోలు నుంచి వచ్చారు. ఆయన ఎంపీపీ కార్యాలయంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చి సంజాయిషీ ఇచ్చుకున్నారు.) -
ఏళ్లకేళ్లుగా అవస్థలే..
‘డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచి నీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్. ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం’ రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో నివసించే ప్రజల ఆవేదన ఇది... కొంకటి లక్ష్మీనారాయణ : అమ్మా నమస్కారములు. ఎలా ఉన్నారమ్మా? లక్ష్మీకాంతం : ఎలా ఉంటాం సారూ. మురుగు కంపుతోటి సచ్చిపోతున్నం. డ్రెరుునేజీ కుండీలు కట్టినట్టేకానీ.. ఏం పాయిదా లేదు. కుండీలు నిండిపోయి మురికినీళ్లన్నీ ఇండ్లల్లకత్తన్నయ్. రోగాలపాలైతన్నం. లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..? సరస్వతీ : డ్రెయినేజీల నీళ్లు నిండిపోతే వాసన భరించలేక పోతున్నం. ఇంటికి తలా కొంత డబ్బు పోగేసి కుండీలళ్ల జామైన మట్టిని తీపిచ్చుకుంటున్నం. ఎవలకు చెప్పినా పట్టించుకుంటలేరు. మా గోసైతే తీరుతలేదు. లక్ష్మీనారాయణ : కార్పొరేషన్ నల్లాలున్నాయా? సుశీల : కార్పొరేషన్ పైపులైన్లు ఉన్నా... సంవత్సరం నుంచి నీళ్లు వస్తలేవు. పక్కింటికి పోయి నీళ్లు తెచ్చుకుంటున్నం. లక్ష్మీనారాయణ : మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చేస్తా. లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారండి..? మే పేరేంటి? రవీందర్ : నా పేరు రవీందర్. ఆటో డ్రైవర్‌ను. లక్ష్మీనారాయణ : మీ సమస్యలు ఏమైనా ఉన్నాయా? రవీందర్ : మా ఇంటి ముందు కరెంటు తీగలు కిందకి వేలాడుతున్నయ్. ట్రాక్టర్ రావాలంటే ఇబ్బందిగా ఉంది. ప్రమాదముందని అధికారులకు చెప్పినా పట్టించుకుంటలేరు. లక్ష్మీనారాయణ : ఏమమ్మా.. బాగున్నారా..? లక్ష్మి : ఏం బాగుంటాం సార్. ఇంటి ముందట మురుగునీళ్ల కోసం కుండీలను కట్టిళ్లు. దానిమీద మూతలే పెట్టలేదు. దోమలు ఎక్కువైపోయి నిద్ర కూడా పడుతలేదు. ఇంట్లో అందరం ఇబ్బంది పడుతన్నం. లక్ష్మీనారాయణ : ఎలా ఉన్నారు..? మీకేమైనా సమస్యలున్నాయా..? పూర్మ శ్రీనివాస్ : నేను న్యాయవాదిగా పనిచేస్తున్నా. ఈ ప్రాంతం మున్సిపాలిటీకాకముందు నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుతం అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్(యూఏసీ) కింద ఆస్తి విలువలో 10 శాతం ఎక్కువ పన్ను విధిస్తున్నారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించారు. మేం ఎందుకు ఈ అదనపు పన్ను చెల్లించాలి. లక్ష్మీనారాయణ : అధికారుల దృష్టికి తీసుకెళ్తా. లక్ష్మీనారాయణ : ఏం తాత.. బాగున్నావా..? బాలయ్య : ఏం బాగుంటామయ్యా. ఇరువై ఏండ్ల కిందట సింగరేణిలో పనిచేసి రిటేరైన. వయసు మీదపడి వచ్చిన రోగాలకు సింగరేణి ఆస్పత్రికిపోతే మందులిత్తలేరు. గవర్నమెంట్ ఆస్పత్రికి పోదామంటే ఆటో చార్జీలకే యాభై రూపాయలైతన్నయ్. అందుకే ఇంటికాన్నే ఉంటన్న. సింగరేణిల పింఛన్ వత్తలేదు. కేసీఆర్ వచ్చినంక ఇత్తమన్నరు. ఇంకా ఇత్తలేరు. జల్ది ఇప్పియ్యండ్రి. లక్ష్మీనారాయణ : పింఛన్ కోసం కార్పొరేషన్లో దరఖాస్తు పెట్టుకున్నవా..? పెట్టుకోకుంటే ఎవరితోనైనా దరఖాస్తు రాపిచ్చి ఇయ్యి. నేను పింఛన్ ఇప్పిస్తా. ఆనందం : సార్... నీళ్ల పైపులు లీకైతన్నయ్. ఆ నీళ్లనే తాగుతన్నం. లక్ష్మీనారాయణ : తాగునీటి పైపులైన్ల లీకేజీలను కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్తా. లక్ష్మీనారాయణ : ఏం అన్నా... బాగున్నావా. మీ ఏరియాలో ఏమైనా సమస్యలున్నాయా..? మామిడి లింగయ్య : ఇంటిముందటున్న సింగరేణికి చెందిన నీళ్ల ట్యాంకు కాడ చెత్తపోత్తండ్లు. కుళ్లిపోయినై తీసుకొచ్చి అక్కడేత్తండ్లు. వాసనతో సచ్చిపోతున్నం. ఇంకేం బాగుంటం. లక్ష్మీనారాయణ : రోజూ వచ్చి చెత్తతీత్తలేరా..? మామిడి లింగయ్య : వారం రోజులకొక్కసారి కూడా చెత్త తీత్తలేరు. ఎన్నిసార్లు చెప్పినా ఎవలు పట్టించుకుంటలేరు. లక్ష్మీనారాయణ:ఈ ఇండ్లల్ల ఎట్ల ఉంటున్నరమ్మా మధునమ్మ : మా బతుకు ఏం చెప్పుడు సారూ. ఎంతకని చెప్పుడు! పదేండ్ల నుంచి మాది ఇదే గోస. ఇంతకుముందు మురుగునీరు, వాన నీ ళ్లు సాపుగా ఎల్లిపోయేటివి. కాల్వకు మధ్య సెప్టిక్‌ట్యాంక్ కట్టి మమ్మల్ని అరిగోస పెట్టిళ్లు. రోజూ నరకమే చూస్తున్నం. చుట్టుపక్కల ఇండ్ల ల్ల నుంచి వచ్చిన డ్రెయినేజీ నీళ్లన్నీ ఇండ్ల పక్కకే వత్తున్నయ్. నీళ్లు ఎక్కువైతే ఇంట్లోకి వస్తయి. వాన కాలంల మురికినీళ్లతో ఇండ్లన్నీ నిండిపోతయ్. దోమలబాధ భరించలేపోతున్నం. రోగాలకే పైసలన్నీ ఖర్చయితన్నయ్. అసలు నిద్ర కూడా పడుతలేదు. ఇల్లు ఖాళీ చేసి వేరే కాడ కిరాయికి ఉంటే బాగుండు అనిపిస్తంది. లక్ష్మీనారాయణ : మీరు చెప్పండమ్మా..? శిరీష : సార్... మేం పేదోళ్లం. ఏం చేయలేక ఈ మురికి కూపంలోనే బతుకుతున్నం. వానకాలంల ఇళ్లలోకి వచ్చిన నీళ్లను బయటకు పంపించాలంటే మా తరం అయితలేదు. ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ఎందరో లీడర్లు వచ్చి చూసిం డ్రు. పరిష్కరిస్తామని చెప్పి పోయిండ్రు. వాళ్లు వచ్చుడు... పోవుడు వరకే కానీ, మా సమస్య మాత్రం తీరలేదు. మా బాధను ‘సాక్షి’ పేపర్ గతంలో చాలా సార్లు గవర్నమెంట్ దృష్టికి తీసుకువచ్చింది. (‘సాక్షి’ ప్రచురించిన కథనాలను కొంకటి లక్ష్మీనారాయణకు చూపించారు.) కనకలక్ష్మి : మేమీ ప్రాంతంలో ఉంటున్నామనే విషయాన్ని కూడా అధికారులు గుర్తిస్తలేరు. అందరిలెక్కనే పన్నులు కడుతున్నం. మమ్మలెందుకు ఈ రకంగా ఇబ్బందిపెడుతున్నారు. శ్రీనివాస్ : డ్రెయినేజీ కోసం కట్టిన కాల్వల నుంచే మంచినీళ్ల పైపులైన్లు వేసిండ్లు. పైపులు లీకైనప్పుడల్లా ఆ నీళ్లు మంచినీళ్లలో కలుస్తున్నయ్. మురికి కాల్వలు కూడా తక్కువ వెడల్పుతో కట్టడంతో పైనుంచి వచ్చే వర్షపు నీళ్లు ముందుకు వెళ్లక ఇళ్లలోకి వస్తున్నయ్. కాల్వ వెడల్పు చేయాలె. లక్ష్మీనారాయణ : అమ్మా బాగున్నారా..? భాగ్య : నమస్కారం సార్. రమేశ్‌నగర్ చౌరస్తా ఇవతల రోడ్డు అధ్వానంగా తయారైంది. వాహనాలు నడిరోడ్డు నుంచి వెళ్లకుండా పక్కనుంచి వస్తుండడంతో పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చేందుకే భయపడుతున్నరు. లక్ష్మీనారాయణ : రోడ్డు మీద నీళ్లు చాలానే పారుతున్నయ్ కదా? సరోజన : కార్పొరేషన్ మంచినీటి పైప్‌లైన్ లీకై ఇలా రోడ్డు మీద మొత్తం నీళ్లే సార్. నీళ్లు నిలిచి రోడ్డు కూడా పాడైపోయింది. పంపు వచ్చినప్పుడల్లా ఇదే గోస. ఎవలు పట్టించుకుంటలేరు. మేయర్ హామీలు... ఎల్బీనగర్లో అండర్‌గ్రౌండ్ పైపులైన్ సరిగ్గా వేయకపోవడంతో మురుగునీరు పొంగి ప్రవహిస్తోంది. దీన్ని సరిచేసేందుకు కార్పొరేషన్ అధికారులతో అంచనాలు తయారు చేయిస్తున్నా. త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. కిందికి వేలాడే విద్యుత్ తీగల విషయమై వెంటనే ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడుతా. లూజ్లైన్లు లేకుండా చూస్తాం. సింగరేణిలో పనిచేసి 20 ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సంస్థ నుంచి పెన్షన్ రావడం లేదు. వారికి పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాశా. రూ.2 లక్షల్లోపు ఆదాయం ఉన్న వృద్ధులకు పెన్షన్ తప్పకుండా ఇస్తాం. మేం అధికారంలోకి రాకముందు 295 చోట్ల తాగునీటి పైప్లైన్ల లీకేజీలుండేవి. అధికారంలోకి వచ్చాక 230 లీకేజీలు అరికట్టాం. లీకేజీలు శాశ్వతంగా అరికట్టేందుకు రూ.2.20 కోట్లతో టెండర్లు పిలిచాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. 24వ డివిజన్లో ఇళ్ల మధ్య ఉన్న మురికి గుంటను తొలగించి అక్కడ కాల్వ నిర్మిస్తాం. రీజినల్ ఆస్పత్రి రోడ్డు నుంచి ఎల్బీనగర్కు వెళ్లే రహదారి సింగరేణికి సంబంధించింది. ఈ రోడ్డును నిర్మించాలని సింగరేణికి లేఖ రాస్తాం. -
ప్రగతీలేదు..‘ప్రణాళిక'లేదు
రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం అట్టహాసంగా ప్రవేశపెట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ ఆచరణలో ‘ప్రగతి' చూపలేక పోయింది. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి ప్రారంభమై ఈనెల 15తో ముగిసిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వం పెద్ద పీట వేసిన పారిశుద్ధ్య కార్యక్రమం సైతం అమలుకు నోచలేదు. ఫలితంగా పల్లెలు అపరిశుభ్రవాతావరణంలో అలమటిస్తున్నాయి. నిధులివ్వని ఈ తరహా కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విఫలమవుతాయని సాక్షాత్తూ గ్రామ సర్పంచ్‌లే స్పష్టం చేస్తున్నారు. సత్తెనపల్లి: దోమలు పెరగకుండా, రోగాలు ప్రబల కుండా పారిశుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వం పల్లెలవైపు చూడడం లేదని గ్రామీణులు గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ‘వంద రోజుల ప్రణాళిక’ పేరిట గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుకు పెద్ద పీట వేసినా ఆచరణలో ప్రగతి చూపలేదంటున్నారు. మరో వైపు నిధులు ఇవ్వకుండా పంచాయతీల్లో పనులు ఎలా చేపట్టాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి ఇప్పటి వరకు ఉన్న కొద్దిపాటి నిధులు ఖర్చు అయ్యాయని, కొత్త పథకాల అమలు భారమేనని అంటున్నారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో ఏగ్రామం చూసినా అపరిశుభ్రంగానే దర్శనమిస్తోంది. దోమలు పెరిగి వ్యాధుల భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 57 మండలాలు 1,011 పంచాయతీలు. వీటిలో 112 మేజరు, 899 మైనర్ పంచాయతీలు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగక ముందు రెండేళ్లపాటు ప్రత్యేక అధికారుల ఏలుబడిలో సమస్యలు పేరుకుపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయకపోవడంతో గ్రామాలు ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయి. గత ఏడాది పంచాయతీ ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాయి. అనంతరం విడుదలైన సాధారణ నిధులతో సర్పంచ్‌లు గ్రామాల్లో తాగునీరు, వీధి దీపాల ఏర్పాటు, చెత్త కుప్పల తొలగింపు, సైడు కాలువలు శుభ్రం చేయించడం, బోర్ల మరమ్మతులు, కాలువల్లో పూడిక తీత పనులను అరకొరగానే చేయించగలిగారు. అమలు కాని ‘వంద రోజుల ప్రణాళిక’ ... కొత్త ప్రభుత్వం చేపట్టిన ‘వంద రోజుల ప్రణాళిక’ కార్యక్రమం నిధులు లేక నీరసించింది. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు, వీధి దీపాలు, ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ, ఇతర మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ‘వంద రోజుల ప్రణాళిక’ను నిర్ధేశించింది. ఇందులో పారిశుద్ధ్యానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభమైన వంద రోజుల ప్రణాళిక ఈనెల 15తో ముగిసింది. కొన్ని గ్రామాల్లో కాలువల్లో పూడిక తొలగించి చేతులు దులుపుకున్నారు. చాలా పల్లెల్లో వంద రోజుల ప్రణాళిక ఊసే లేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళికతో గ్రామాల్లో ఏమాత్రం ప్రగతి కనిపించలేదని పేర్కొంటున్నారు. కొత్త పథకాలే భారం... వంద రోజుల ప్రణాళికలో గ్రామసభల ఏర్పాటు, స్వచ్ఛ భారత్, జన్మభూమి-మా ఊరు, పారిశుద్ధ్యం, నీటి ట్యా ంకుల పరిశుభ్రత వంటి పనులు చేయడానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలని సర్పంచ్‌లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల సర్పంచ్‌లు తమ సొంత నిధులతో చిన్న చిన్న పనులు చేయగా, మరికొందరు తామేమీ చేయలేమని వదిలేశారు. -
అబ్బా..ఇది ఏమి దోమ
* దోమల నివారణకు ‘పశ్చిమ’ వాసుల నెల ఖర్చు రూ.10 కోట్లు * వైద్య ఖర్చులు దీనికి 10 రెట్లు అధికం * అయినా జనం రక్తాన్ని పీల్చేస్తున్న మశకాలు తాడేపల్లిగూడెం : ఎండా.. వాన.. చలి.. రాత్రి.. పగలు అనే తేడా లేకుండా దోమలు జనాన్ని కుట్టి కుట్టి ఆసుపత్రుల పాలు చేస్తున్నాయి. వీటి తీవ్రత ఎంతగా ఉందంటే.. పగటిపూట కూడా మస్కిటో రిపెల్లెంట్స్, మేట్స్, కాయిల్స్ ఉపయోగించాల్సిన స్థాయిలో మశకాలు విజృం భిస్తున్నాయి. ఈ సమస్య దోమలగూడెంగా ప్రసిద్ధికెక్కిన తాడేపల్లిగూడెం పట్టణానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏలూరు నగరం, భీమవరం, నరసాపురం, పాల కొల్లు, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పట్టణాలతోపాటు ప్రతి గ్రామంలోనూ ప్రజలను వేధిస్తున్నాయి. వీటివల్ల వైరల్, టైఫాయిడ్ జ్వరాలు సోకుతున్నాయి. సకాలంలో వైద్యం చేయించుకోకపోతే కిడ్నీలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితి సంభవిస్తోంది. ప్రతి కుటుంబంలోనూ ఒక్కరైనా జ్వరం బారిన పడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అవగతం చేసుకోవచ్చు. రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోయి జ్వర పీడితులు ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్న సందర్భాలు అనేకం ఉంటున్నాయి. వేరే వ్యక్తుల నుంచి ప్లేట్లెట్స్ దానంగా తీసుకుని.. వైద్య ఖర్చుల కోసం వేలాది రూపాయలు వెచ్చించి ప్రాణాలు నిలబెట్టుకుంటున్న వారెందరో ఉన్నారు. నెల బడ్జెట్ రూ.10 కోట్లు జిల్లా జనాభా 39 లక్షల 34 వేల 782. కుటుంబాల పరంగా చూస్తే జిల్లాలో మొత్తం 10 లక్షల 91 వేల 525 కుటుంబాలున్నాయి. జిల్లాలోని ప్రతి కుటుం బం దోమల నివారణకు మస్కిటో రిపెల్లెంట్, మేట్స్, కాయిల్స్‌లో ఏదో ఒకటి విధిగా వాడుతోంది. అధిక శాతం కుటుం బాల్లో గదికి ఒకటి చొప్పున వీటిని వాడుతున్నారు. కొందరైతే పగలు, రాత్రి కూడా వీటిని వెలిగిస్తున్నారు. ప్రతి కుటుంబం రోజుకు ఒక రిపెల్లెంట్ లేదా ఒక కాయిల్ చొప్పున మాత్రమే వాడుతున్నట్టు భావిస్తే నెలకు రూ.90 చొప్పున వెచ్చించాల్సి వస్తోంది. రిపెల్లెంట్ (లిక్విడ్) వాడకానికి అయితే రూ.70 నుంచి రూ.120 వరకూ ఖర్చవుతోంది. ఎవరు ఏది వాడుతున్నా నెలకు సగటు ఖర్చు రూ.90 చొప్పున లెక్కిస్తే.. మొత్తం కుటుంబాలు దోమల నివారణకు నెలకు రూ.9,85,97,250 ఖర్చు చేస్తున్నాయి. వాస్తవ పరిస్థితుల ఆధారంగా చూస్తే ఈ ఖర్చు ఇంతకంటే ఎక్కువే. కుదేలవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు దోమల ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నారుు. దోమల వల్ల అనారోగ్యానికి గురవుతున్న పేద, మధ్య తరగతి కుటుంబాలు మంచాన పడటంతో పనులకు వెళ్లలేకపోతున్నారు. దీనివల్ల పూట గడవటం కష్టంగా మారుతోంది. మరోవైపు వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవుతున్నారు. దీని ప్రభావం పైకి సాదాసీదా విషయంగానే కనిపిస్తున్నప్పటికీ.. ఎన్నో కుటుం బాల జీవన పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఎన్నో కుటుం బాలను కుదేలు చేస్తున్నాయి. దిగజారిన పారిశుధ్యం పారిశుధ్య నిర్వహణకు నిధులు లేవంటూ మునిసిపాలిటీలు చేతులెత్తేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఖాళీ జాగాలు, వాటినిండా పిచ్చి మొక్కలు, మురికి గుంటలు దర్శనమిస్తున్నాయి. అవన్నీ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయి. మురుగు కాలువల్లో దోమల లార్వాను నివారించే బెటైక్స్ వంటి మందులను మునిసిపాలిటీలు పిచికారీ చేయడం లేదు. దోమల నివారణకు ఫాగింగ్ చేయడం లేదు. ఫలితంగా దోమలు కుప్పలు తెప్పలుగా పెరుగుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో.. మరీ ముఖ్యంగా మునిసిపల్ కార్యాలయూల్లో సైతం పగటి పూట దోమల నివారణకు రిపెల్లెంట్స్, మేట్స్ వంటివి వాడుతున్నారు. మునిసిపాలిటీలు ఏం చేయూలి పారిశుధ్య పరిరక్షణకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నట్టు మునిసిపాలిటీలు గణాంకాల్లో పేర్కొంటున్నప్పటికీ.. దోమల సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. దోమలను గుడ్డు దశ నుంచి లార్వా.. ఆ తరువాత దశల్లో నివారించేందుకు ప్రతి నిత్యం చర్యలు చేపట్టాల్సి ఉంది. డ్రెయిన్లలో గుడ్లు, లార్వాలు దోమలుగా వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలి. వీటిని వేయడం వల్ల నీటిపై ఆయిల్ తెట్టు కడుతుంది. తద్వారా లార్వా ఊపిరి అందక చనిపోతుంది. గుడ్లు లార్వాలుగా అభివృద్ధి చెందవు. గంబూషియా చేపలను తరచూ మురుగు కాలువలలో వదలాలి. ఇవి దోమల లార్వాలను తినేస్తుంటాయి. ఈ పనులు చాలాచోట్ల ప్రహసనంలా మారడంతో దోమల నివారణ ఎండమావిలా మారిందనే విమర్శలు ఉన్నాయి. -
విజృంభిస్తున్న డెంగీ
నెల్లూరు (విద్యుత్) : జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. ఇటీవల జిల్లాలో కురిసిన వర్షాలకు అపరిశుభ్రత తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో డెంగీ కేసులు నమోదు అవుతున్నాయి. వెంకటగిరి నియోజకవర్గంలోనే 20 డెంగీ కేసులు నమోదైనట్టు సమాచారం. జిల్లా వైద్యారోగ్యశాఖ నిద్రావస్థలో ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షాలు మొదలుకాగానే వైద్యశాఖ క్షేత్ర స్థాయిలో క్యాంపులను నిర్వహించి రోగులకు పరీక్షలతో పాటు అవగాహన కల్పించాల్సి ఉంది. ఈ ప్రక్రియ తూతూ మంత్రంగా సాగుతోందన్న విమర్శలున్నాయి. ప్రాణాపాయం తక్కువే ఉదయం పూట తిరిగే దోమలు కుట్టడం వల్ల డెంగీ వ్యాధి వైరస్ శరీరంలోకి చేరుతుంది. ఈ జ్వర బాధితులు దాదాపుగా కోలుకుంటారు. ఒక్క శాతం కంటే తక్కువ మందికే ప్రాణాపాయం ఉన్నట్టు వైద్యులు తెలిపారు. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ మాత్రలను వాడాలి. ఇష్టం వచ్చినట్లు యాంటీ బయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. యాంటీజెన్, యాంటీ బాడీ, ఎలీసా టెస్ట్‌ల ద్వారా డెంగీ వ్యాధిని నిర్ధారించవచ్చు. ఈ వ్యాధికి వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ఈ వ్యాధి సోకిన వారికి రక్తంలోని ప్లేట్లెట్స్ అందించాల్సిన అవసరం లేదు. సాధారణంగా మన రక్తంలో 2 లక్షల ప్లేట్లెట్స్ కౌంట్ ఉండాలి. ఈ సంఖ్య 20 వేలకు పడిపోతేనే పరిస్థితి విషమిస్తుంది. అంతర్గత రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్లేట్లెట్స్ కౌంట్ 40 వేలు ఉన్నప్పుడే వాటిని తిరిగి ఎక్కించాలి. దీనివల్ల ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. లక్షణాలు : చలి, జ్వరం, కళ్లు ఎర్రబడటం, వాంతులు, విరేచనాలు, చర్మం కందిపోవడం డెంగీ వ్యాధి ప్రధాన లక్షణాలు.ప్రైవేట్ వైద్యశాలలకు పండగ జ్వరపీడితులు ప్రభుత్వ వైద్య శాలలపై నమ్మకంలేక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అవసరం లేకున్నా అక్కడ ప్లేట్లెట్ కౌంట్ టెస్ట్, డెంగీ నిర్ధారణ టెస్ట్, ప్లేట్లెట్ కణాలను ఎక్కిస్తూ వేలాది రూపాయలు గుంజుతున్నారు. సాధారణ జ్వరం అయినప్పటికీ డెంగీ బూచి అని భయపెడుతూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. ఒకవేళ డెంగీ పాజిటివ్‌గా తేలిందా ఇక వైద్యుల పంట పండినట్టే. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వర్షాకాలంలో ఎక్కువగా విష జ్వరాలు సోకుతుంటాయి. ఎక్కువగా నీరు నిల్వ ఉన్న చోటు, చెత్తా చెదారాలు పేరుకుపోయిన చోట, మురుగుగుంతలు ఎక్కువగా ఉన్నచోట దోమలు వ్యాప్తి చెందుతాయి. దోమల వల్ల విష జ్వరాలు, డెంగీ వంటి వ్యాధులు వస్తుంటాయి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల దోమలు చేరవు. నిత్యం తమ నివాసంతో పాటు పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. తాగేసిన కొబ్బరి బోండాలు, రబ్బరు టైర్లు, గాజు సీసా లు, వాడని ట్యాంకులు ఇంటి సమీపం లేకుండా చూసుకోవాలి. దోమ తెరలు, దోమల నివారణ మందులను వాడాలి. జ్వరం వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్సను పొందాలి. వెంబులూరులో ప్రబలిన డెంగీ డక్కిలి: మండలంలోని వెంబులూరు గ్రామంలో పలువురికి డెంగీ సోకింది. వీరంతా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ గ్రామానికి చెందిన పూల విజయ నెల్లూరులో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కందికట్టు సుబ్బమ్మ, మరో ఇద్దరు చిన్నారులు కూడా నెల్లూరులో వైద్యం తీసుకుంటున్నారు. శాంపిల్స్ సేకరిస్తున్నాం: కోటేశ్వరి, ఇన్చార్జి డీఎంహెచ్ఓ జిల్లా వ్యాప్తంగా డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రత్యేక క్యాంపుల ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. రోజుకు 15 శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. పీహెచ్ కేంద్రాల్లోని వైద్యులను అప్రమత్తం చేశాం. విష జ్వరాలకు సంబంధించిన మందులను అన్ని చోట్ల అందుబాటులో ఉంచుతున్నాం. -
జిల్లాలో 136 డెంగ్యూ కేసులు
డీఎంఓ ప్రసాదరావు తుమ్మపాల: జిల్లాలో 136 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని జిల్లా మలేరియా అధికారి కె.వి.ఎస్. ప్రసాదరావు అన్నారు. మండలంలోని బవులవాడ పంచాయతీ దర్జీనగర్, తుమ్మపాల పీహెచ్‌సీని ఆయన గురువారం పరిశీలించారు. దర్జీనగర్‌లో రెండేళ్ల బాలుడు టి. మోహిత్‌కు డెంగ్యూ నిర్దారణ కావడంతో ఆయన పర్యటించారు. గ్రామంలో నీటి నిల్వలున్న చోట దోమలు వ్యాప్తి చెందుతాయని, నిల్వలు ఉండకుండా జాగ్రత్త పడాలని గ్రామస్తులకు సూచించారు. దోమల మందును ఇంటింటా పిచికారి చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17 వరకు 136 డెంగ్యూ కేసులు, 57 చికున్ గున్యా, 6,160 మలేరియా కేసులు నమోదయ్యాయని చెప్పారు. దీంతో అన్ని గ్రామాల్లో అవగాహన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. డెంగ్యూ నివారణలో ఆరోగ్య శాఖ, పంచాయతీ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించి ఇళ్లల్లోని గోళాలలో నీటిని ఎప్పటికప్పుడు పొడిగా ఉంచాలన్నారు. చిన్నపిల్లలు దోమకాటుకు గురికాకుండా పూర్తిస్థాయిలో దుస్తులను వేయించాలన్నారు. ఏఎంఓ పి. రామారావు, జిల్లా కోఆర్డినేటర్ ఎ.శ్రీనివాసరావు తుమ్మపాల పీహెచ్సీ వైద్యాధికారి ఐ. ఉదయ్‌కుమార్ పాల్గొన్నారు. ఉగ్గినపాలెంలో ముగ్గురికి డెంగ్యూ కశింకోట: మండలంలోని ఉగ్గినపాలెంలోనూ ముగ్గురికి డెంగ్యూ వ్యాధి సోకినట్లు నిర్థారణ అయింది. గాలి మంగ, కలగ కనకరత్నం, బుదిరెడ్డి రమణలకు వ్యాధి సోకినట్లు తాళ్లపాలెం పీహెచ్సీ వైద్యాధికారి లూసీ కార్డిలియా తెలిపారు. పది మంది రక్త నమూనాలు విశాఖ కేజీహెచ్‌కు పంపగా ఈ నివేదిక వచ్చిందన్నారు. వైద్య శిబిరంలో ముగ్గురికి, జి.భీమవరం శిబిరంలో పది మందికి జ్వరాలు ఉన్నట్లు తేలిందన్నారు. జ్వర తీవ్రత ఎక్కువగా ఉన్న పది మందికి పీహెచ్సీలో వైద్యమందించినట్టు తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపమే వ్యాధులకు కారణమన్నారు. అనకాపల్లి వంద పడకల ఆసుపత్రి వైద్యుడు రత్నకుమార్ జి.భీమవరంలో వైద్య సేవలందించారు. -
పంచాయతీలకు పైసల్లేవ్!
మైనర్ పంచాయతీలను వేధిస్తున్న నిధుల సమస్య పారిశుద్ధ్య పనులకూ డబ్బుల్లేవు విజృంభిస్తున్న దోమలు అల్లాడుతున్న జనం పట్టించుకోని ప్రభుత్వం మచిలీపట్నం/నూజివీడు : నిధుల కొరత వల్ల జిల్లాలోని మైనర్ పంచాయతీల్లో అనేక సమస్యలు తిష్టవేశాయి. ఏ పని చేయాలన్నా పైసా డబ్బుల్లేవని సర్పంచిలు వాపోతున్నారు. కనీసం పన్నులు వసూలు చేసినా, కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. కానీ, కార్యదర్శులపై పని ఒత్తిడి వల్ల వారు పన్నుల వసూలుపై దృష్టి పెట్టలేకపోతున్నారు. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహక నగదు అందించినా, ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. ఈ నిధుల విడుదలకు కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో గ్రామాల్లో మౌలిక సదుపాయల కల్పన కలగానే మిగులుతోంది. సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పలు గ్రామాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారడంతో దోమలు పెరిగి ప్రజలు జ్వరాల బారినపడుతున్నారు. మూడేళ్లుగా నిధులు నిల్..! జిల్లాలో ప్రస్తుతం 970 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో 820 మైనర్ పంచాయతీలే. స్థానికంగా వసూలు చేసే పన్నులతోపాటు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్(ఎస్ఎఫ్సీ), వృత్తి పన్ను, సీనరేజీ, భూముల క్రయ, విక్రయాల ద్వారా వచ్చే ఆదాయం,కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే తలసరి ఆదాయం పంచాయతీల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఈ ఏడాదికి సంబంధించి ఎస్ఎఫ్సీ, వృత్తి పన్నులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. సుమారు 13వేల మంది జనాభా ఉన్న పంచాయతీకి ఏడాదికి తలసరి ఆదాయం కింద రూ.80వేలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సి ఉండగా, మూడేళ్లుగా ఆ నిధులు కూడా రావడంలేదు. ఈ ఏడాది కాలంలో కేవలం 13వ ఆర్థిక సంఘం నిధులు మాత్రమే వచ్చాయని, వాటిని ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సి ఉండటంతో అత్యవసర పనులు చేపట్టలేకపోతున్నామని పలువురు సర్పంచిలు తెలిపారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు మంగళం మైనర్ పంచాయతీల్లో వీధి దీపాల నిర్వహణకు సంబంధించిన విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేజర్ పంచాయతీలకు కూడా విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. వైఎస్ మరణానంతరం ఈ విధానానికి పాలకులు మంగళం పాడారు. ఒక్కో మేజర్ పంచాయతీ ఏడాదికి రూ.10 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రావడంతో వచ్చిన ఆదాయంలో సగభాగం దానికే సరిపోతోంది. దీంతో నిధుల లేమి కారణంగా మేజర్ పంచాయతీల్లోనూ కనీస వసతులు కల్పించలేని దుస్థితి నెలకొంది. ప్రభుత్వ కార్యక్రమాలతో అదనపు భారం పంచాయతీలకు అరకొరగా వస్తున్న ఆదాయం వీధి లైట్ల కొనుగోలు, గుమస్తాల జీతభత్యాలకు సరిపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో ఇటీవల ప్రభుత్వం ఏదో ఒక పేరుతో వారోత్సవాలు, పొలం పిలుస్తోంది.. బడిపిలుస్తోంది.. తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో వాటికి సంబంధించి గ్రామ సభలు నిర్వహించేదుకు సైతం పంచాయతీల వద్ద నిధులు లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్యల మేట పంచాయతీలకు ఆదాయం లేకపోవడంతోపాటు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు సకాలంలో మంజూరు కావడంలేదు. దీంతో డ్రెయినేజీలకు కనీస మరమ్మతులు చేయించేందుకు, దోమల నివారణకు మందుల పిచికారీ చేసేందుకు కూడా దిక్కులు చూడాల్సిన దుస్థితి నెలకొంది. కొద్దిపాటి వర్షాలకే కొన్ని ప్రాంతాల్లో మురుగు సమస్య తలెత్తింది. ముసునూరు మండలంలోని చక్కపల్లి, కొర్లగుంట పంచాయతీలలో సైడు కాలువల్లో మురుగునీరు ముందుకు కదలడం లేదు. తీవ్ర దుర్వాసన వస్తోందని, పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. నూజివీడు మండలం గొల్లపల్లి, మీర్జాపురం, అన్నవరం, తుక్కులూరు, పడమర దిగవల్లి, వెంకటాయపాలెంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఆగిరిపల్లి మండలంలో చొప్పరమెట్ల, నర్శింగపాలెం, చిన్నాగిరిపల్లి, కొత్త ఈదర, నెక్కలం గొల్లగూడెం, సూరవరం ప్రాంతాల్లో డ్రెయినేజీలకు కనీస మరమ్మతుల చేసిన దాఖలాలు లేవు. విస్సన్నపేట మండలంలోని పుట్రేల, తెల్లదేవరపల్లి, రెడ్డిగూడెం మండలంలోని కూనపరాజుపర్వ, ముచ్చనపల్లి, పాతనాగులూరు, రంగాపురం పంచాయతీల్లోనూ రోడ్లు, సైడు కాలువలు అధ్వానంగా ఉన్నాయి. మైలవరం మండలం చంద్రాల, తోలుకోడు, కీర్తిరాయునిగూడెం, ఎ.కొండూరు మండలం తూర్పు మాధవరం, రేపూడి, మచిలీపట్నం మండలంలో ఎస్ఎన్ గొల్లపాలెం, చిన్నాపురం, వాడపాలెం తదితర గ్రామాలలోని సైడు కాలువల్లో పూడిక తొలగించకపోవడంతో ఎక్కడి మురుగునీరు అక్కడే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడదతో ప్రజలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇబ్బందుల పాలవుతున్నారు. ఇప్పటికే నందిగామ, గూడూరు, బంటుమిల్లి మండలాల్లో జ్వరాలు ప్రబలాయి. ఈ పరిస్థితి జిల్లా అంతటా వ్యాపించక ముందే పంచాయతీలకు నిధులు మంజూరు చేసి పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు, ఇతర సదుపాయాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏకగ్రీవ పంచాయతీలకు అందని ప్రోత్సాహకాలు జిల్లాలో ఏడాది క్రితం జరిగిన ఎన్నికల సమయంలో 119 పంచాయతీ పాలకవర్గాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఏకగ్రీవమైన ఒక్కో పంచాయతీకి ప్రోత్సాహకంగా రూ.5లక్షలు మంజూరు చేయనున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. రాష్ర్టం విడిపోయింది. ఈ తరుణంలో గతంలో ప్రకటించిన విధంగా ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నగదు అందిస్తుందా.. లేదా.. అనే విషయంపై స్పష్టత కొరవడింది. పన్నుల వసూలుపై దృష్టి పెట్టని కార్యదర్శులు జిల్లాలో 970 పంచాయతీల నుంచి ఈ ఏడాది రూ.41.09 కోట్లను వన్నుల రూపంలో వసూలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు రూ.18.26 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మూడు, నాలుగు పంచాయతీల బాధ్యతలు చూడాల్సి ఉండటంతో పన్నుల వసూలుపై దృష్టి సారించలేకపోతున్నామని కార్యదర్శులు చెబుతున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వంద రోజుల కార్యక్రమానికి సంబంధించి రోజూ వివిధ ఫార్మాట్లలో నివేదికలు పంపడానికే సమయం సరిపోవడం లేదని, ఇతర పనులపై ఎలా దృష్టి పెట్టగలని పలువురు పేర్కొంటున్నారు. -
విజృంభిస్తున్నాయ్..
కొద్దిపాటి జాగ్రత్తలతో.. విజృంభిస్తున్న వ్యాధుల విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే కొంత మేర వాటిని నివారించవచ్చు. ప్రధానంగా దోమలు, ఈగలు, పారిశుధ్యం, తాగునీటి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. దోమలు వృద్ధి చెందకుండా ఇంటి చుట్టు పక్కల అపరిశుభ్ర వాతావరణం లేకుండా చూసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతే కాకుండా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి ముందు పగిలిన సీసాలు, కుండీలు, వాడి పారేసిన టైర్లు, పగిలిన కుండలు, ఖాళీ డబ్బాలు, కూలర్లలో నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇలాంటి ప్రాంతాల్లోనే దోమలు అధికంగా ఉంటాయి. ఎడిస్ దోమలు కృత్రిమంగా నిల్వ ఉన్న నీటిలోనే పెరుగుతాయి. దోమ తెరలు వాడడం, వేప ఆకులతో పొగ పెట్టడం వంటివి చేయాలి. దోమలు ఇళ్లలోకి రాకుండా కిటికీలకు, తలుపులకు సన్నని జాలీలను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో దోమలు వృద్ధి చెందకుండా జెట్ మస్కిటో కాయిల్ వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. పందులు పట్టణంలో ఉండకుండా పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంటే ఆ నీటిలో కిరోసిన్, వాడిన ఇంజిన్ ఆయిల్ చుక్కలను వేయాలి. ఇంటి మూలలు, పాఠశాలల్లో బెంచీల మూలలు, గదుల మూలలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ ప్రదేశాల్లో దోమలు, ఈగలు అధికంగా వృద్ధి చెందే ప్రమాదం ఉంది. పంచాయతీలు, మున్సిపాలిటీల వారు ఎప్పటికప్పుడు మురికి కాలువల శుభ్రత, దోమల మందు స్ప్రే చేయించడం, నీరు నిల్వ ఉండకుండా తగిన జాగ్రత్తలు తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. నీటి విషయంలో.. మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు నీటి సంరక్షణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. బోర్లు, బావులు, చేతిపంపులు, తదితర వాటి చుట్టూ ఎలాంటి మురికి నీరు నిలువ ఉండకుండా చూడాలి. చేతి పంపులకు ప్లాట్‌ఫాంలను నిర్మించాలి. మురికికాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి. రక్షిత మంచినీటి పథకాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. క్లోరినేషన్‌ను పకడ్బందీగా చేపట్టాలి. నీరు సరఫరా అయ్యే పైప్లైన్లను పర్యవేక్షిస్తూ ఉండాలి. లీకేజీలకు మరమ్మతులు చేయించాలి. చేతిపంపులు, బావులు, నల్లాల ద్వారా వచ్చే నీటిని అలాగే పట్టుకోకుండా జాలీలు ఏర్పాటు చేసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు కాచిన తర్వాత చల్లారిన నీటినే తాగాలి. చిన్నారుల విషయంలో.. వర్షాకాలంలో చిన్నారులు అస్వస్తతకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ జలుబు, దగ్గు, జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువ. చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చిన్నారులు తినే ఆహార పదార్థాలపై దోమలు, ఈగలు వాలకుండా చూడాలి. పండ్లు, చాకెట్లు, అన్నం వంటి వాటిని వారి చేతికి ఇవ్వకుండా తల్లిదండ్రులే తినిపించాలి. ఈగలు, దోమలు వాలే తినుబండారాలను కొనవద్దని చిన్నారులకు సర్దిచెప్పాలి. చిన్నారులకు తినిపించే సమయంలో సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. వర్షంలో చిన్నారులు తడవకుండా చూసుకోవాలి. ఏ మాత్రం అస్వస్తతకు గురైనా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
మూడేళ్లలో దోమల నిర్మూలనకు పెట్టిన ఖర్చు!
సాక్షి, కర్నూలు: దోమ.. ఈ పేరు వింటనే జనం హడలి పోతున్నారు. ప్రబలుతున్న విష జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొందరు అధికారులకు మాత్రం దోమలు మంచి నేస్తాలుగా మారాయి. వాటి నిర్మూలనకు కృషి చేయాల్సిన వారు.. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను జేబులో వేసుకొని కాలక్షేపం చేస్తున్నారు. లెక్కలు మాత్రం ‘పక్కా’గా చూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ముసురు పట్టింది. వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కుంటలు, చెరువులు, పిల్ల కాల్వల నిండా నీరు చేరింది. కొన్ని చోట్ల నీరు నిల్వ ఉండి దోమలు విజృంభిస్తున్నాయి. అధికారులు వీటి నిర్మూలనకు తగని చర్యలు తీసుకోవడం లేదు. కర్నూలు నగరాన్నే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక్కడ 5 లక్షల పైచిలుకు జనాభా, 20కిపైగా మురికివాడలు ఉన్నాయి. భారీ వర్షాలతో మురుగు నీరు పోయే మార్గం లేక ఎక్కడికక్కడే నిల్వ ఉంటోంది. చాలా ప్రాంతాల్లో తాగునీటి పంపులు లోతులో ఉండటంతో నీరు అక్కడే నిలిచిపోతోంది. అభివృద్ధి చెందిన కొన్ని కాలనీల్లోనూ రహదారుల పక్కన మరుగునీటి గుంతలు ఉంటున్నాయి. గత మూడేళ్లుగా లార్వా దశలోనే దోమలను నిరోధించడానికి ఏటా రూ. 30 లక్షల చొప్పున రూ. కోటి ఖర్చు పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని రూ. 40 లక్షలకు పెంచారు. ప్రతిరోజూ గుర్తించిన మురికివాడల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి. అంతేకాకుండా 200 స్ప్రేయర్లు, ఇతర యంత్రాల సహాయంతో మురుగు గుంతల్లో లార్వాను నిర్మూలించాలి. మలాథియాన్తోపాటు ఇతర పదార్థాలను కలిపి గుడ్ల దశలోనే దోమలను నివారిస్తే డెంగీ, మలేరియా వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. తప్పుడు నివేదికలు.. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్(కేఎంసీ)లోని ఆరోగ్య విభాగం అవినీతికి కేరాఫ్‌గా మారిందనే విమర్శలున్నాయి. ఈ విభాగంలో కిందిస్థాయి అధికారుల అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ముందస్తుగా దోమల నివారణకు మలాథియాన్ ఇతర మందులను కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నారు. వాస్తవంగా వీటి కొనుగోలులోనే గోల్మాల్ జరుగుతోంది. దోమల నివారణ కోసం ఇచ్చిన పరికరాలను బయట అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నగరంలో ఎక్కడా పూర్తిస్థాయిలో ఫాగింగ్ జరగడం లేదు. నిధులు మాత్రం ఖర్చవుతున్నాయి. అయితే విష జ్వరాలపై ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారు. ఇక్కడ మరీ దారుణం.. కొన్ని ప్రాంతాల్లో ‘సాక్షి’ పరిశీలించినప్పుడు అక్రమాలు వెలుగు చూశాయి. శ్రీరామ నగర్, లక్ష్మినగర్, సాయిబాబా నగర్, సంజీవ్‌నగర్ ఇలా నగరంలోని దాదాపు 20 మురికివాడల్లో దోమల లార్వాల నిరోధం కోసం దాదాపు 45 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరందరూ నెలకు లక్షల రూపాయలు విలువైన మందులను వినియోగిస్తున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఫాగింగ్, మందుల పిచికారీ చేయడం లేదు. కల్లూరు పరిధిలోని 11 వార్డుల్లో పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న చాణిక్యపురి కాలనీలోనూ ఇదే తీరు. కఠినంగా వ్యవహరిస్తాం : వ్యాధులు ప్రబలకుండా మందుల పిచికారీ, ఫాగింగ్ చేయించడంలో ఈ ఏడాది కఠిన వైఖరిని అవలంబించనున్నట్లు మున్సిపల్ ఆరోగ్య అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి ‘సాక్షి’కి తెలిపారు. ఫాగింగ్ చేస్తున్నారా? లేదా? అన్న వివరాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, అక్రమాలు జరిగినట్లు తేలినా, తన దృష్టికి తెచ్చినా చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
‘చెత్త’శుద్ధి ఏదీ?
మొయినాబాద్ రూరల్: పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.. ఎక్కడ చూసినా చెత్తకుప్పలు, మురుగు కాలువలు పేరుకుపోయి కనిపిస్తున్నాయి. అధికారులకు ‘చెత్త’శుద్ధి లోపించింది. ఏదో తూతూమంత్రంగా పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించి వదిలేశారు. మండల పరిధిలోని అమ్డాపూర్, హిమాయత్‌నగర్, బాకారం, ముర్తజా గూడ, కాశింబౌళి, నదీంమ్‌పేట్, ఎన్కేపల్లి, మొయినాబాద్ గ్రామాల్లో పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. దశాబ్దాల క్రితం నిర్మించిన మురికి కాలువలు శిథిలావస్థకు చేరుకొన్నాయి. చెత్తాచెదారం పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. దోమలు, ఈగలు వ్యాపించి రోగాల బారిన పడే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మురుగుకాలువలు శుభ్రం చేయాలనే లక్ష ్యంతో ఏటా చేపట్టే పారిశుద్ధ్య వారోత్సవాలను అధికారులు 20రోజుల క్రితం నిర్వహించారు. అయినప్పటికీ ఒనగూరిన ప్రయోజనం శూన్యం. రోడ్లపై ఎక్కడి చెత్తకుప్పలు అక్కడే దర్శనమిస్తున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య పనుల నిమిత్తం జాతీయ ఆరోగ్య సంస్థ ద్వారా ఏటా పంచాయతీలకు రూ.10వేలు మంజూరు చేసేవారని, ఈసారి అవి కూడా రాలేదని ప్రజాప్రతినిధులు చేతులెత్తేస్తున్నారు. రోగాలు దరిచేరకముందే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి గ్రామాల్లో పేరుకపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
అమ్మో.. దోమ
జిల్లాలో వర్షాలు జోరందుకున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించింది. దోమలు ప్రబలాయి. ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఏటా జూలై నుంచి సీజనల్ వ్యాధులు ప్రజలను ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వ్యాధుల సమస్య సెప్టెంబర్ వరకూ కొనసాగుతుంది. ఇప్పటికే ప్రబలిన వ్యాధులను అరికట్టేందుకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా ఈ వ్యాధులపై అవగాహన పెంచుకుని, పరిసరాల పరిశుభ్రత పాటిస్తే వాటిని అదుపుచేసే అవకాశం ఉంటుంది. - నల్లగొండటౌన్ దోమల నివారణకు చర్యలు జిల్లాలో దోమల నివారణ కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. మురుగుకాల్వలను శుభ్రం చేయించడం, గుంతలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం వంట చర్యలు చేపట్టాం. ముఖ్యంగా ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంటి పరిసరాలలోని మురుగుకాల్వలను శుభ్రం చేసుకుని దోమలవ్యాప్తి లేకుండా చేసుకోవాలి. నీటి ట్యాంకులకు మూతలను ఏర్పాటు చేసుకుని, ఇంటిలోకి దోమలు రాకుండా కిటికీలకు, తలుపులకు మెష్లను ఏర్పాటు చేసుకోవాలి. దోమలు కుట్టకుండా దోమతెరలు, నివారణ కాయిల్స్‌ను ఉపయోగించుకోవాలి. మలేరియా వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి రక్త పరీక్షలు నిర్వహించి చికిత్సల కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలలో అవగాహన కల్పించడానికి గ్రామాలలో సదస్సులను నిర్వహిస్తున్నాం. ఓంప్రకాష్, జిల్లా మలేరియా అధికారి ప్రణాళికాబద్ధంగా చర్యలు వర్షాకాలంలో వ్యాధులు సోకకుండా జిల్లా ఉన్నతాధికారులు ముందు జాగ్రత్తల చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి శుక్రవారం గ్రామాల్లో డ్రై డేను నిర్వహిస్తున్నాం. ఆశా, అంగన్వాడీ వర్కర్ల ద్వారా ప్రతి ఇంటిలోనూ సర్వేచేసి జ్వర పీడితులకు మందులు పంపిణీచేస్తున్నారు. దోమల లార్వాను నిర్మూలించేందుకు మురుగు కాలువలు, గుంతల్లో ఎబెట్, మలాథిన్ మందులు పిచికారీ చేస్తున్నారు. డెంగీ వ్యాధి గ్రస్తులు ఉన్న ప్రాంతంలో పైరిథాన్ మందు చల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఫాగింగ్ కూడా చేస్తున్నారు. ఏటా పీడితులు అధికమే మలేరియా కేసులు జిల్లాలో 2008 నుంచి 2013 వరకు మొత్తం 714 నమోదయ్యాయి. అదే విధంగా 2014లో ఇప్పటి వరకు 3 కేసులు నమోదయ్యాయి. డెంగీ 2007 నుంచి 2013 వరకు 211 కేసులు, 2014లో ఇప్పటి వరకు 6 కేసులు గుర్తించారు. మెదడువాపునకు సంబంధించి 2007 నుంచి 2013 వరకు 4కేసులు నమోదు అయ్యాయి. అదే విధంగా చికున్‌గున్యా కేసులు 2007 నుంచి 2013 వరకు 41 కేసులు నమోదు కాగా 2014లో 11 కేసులను నమోదయ్యాయి. బోధకాలు వ్యాధుగ్రస్తులు జిల్లాలో 5,829 మంది ఉండగా అత్యధికంగా సూర్యాపేట డివిజన్లో ఉన్నారు. ముందు జాగ్రత్తలు ముఖ్యం వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల నియంత్రణకు ముందు జాగ్రత్త చర్యలు ఉపయోగడపతాయని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి. వాటి నివారణ ఏమిటి? అన్న విషయాలు ప్రజలకు అవగాహన చేయటం ఎంతో అవసరమని అంటున్నారు. జిల్లా ప్రజల్లో అవగాహన కల్పిస్తే, మలేరియా, డెంగీ వ్యాధి బారిన పడకుండా ఉంటారని చెబుతున్నారు. ఈ సూచనలను పాటిస్తే, రోగాల బారిన పడకుండా ఉంటారని అంటున్నారు. మలేరియా వ్యాప్తి ఇలా... ‘ఎనాఫిలిస్’ రకం దోమ ద్వారా ఈ వ్యాధికి కారణమైన ప్లాస్మోడియా క్రిమి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ఈ దోమలు మంచినీటి నిల్వల్లో గడ్లు పెడతాయి. అవి లార్వా, ప్యూపాగా పెరిగి పెద్ద దోమలుగా మారతాయి. దోమకాటు నుంచి రక్షణ, వ్యాధి నివారణలో ముఖ్యం. దోమ కుట్టిన 8 నుంచి 12 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయట పడతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు, గర్భిణులకు ఈ వ్యాధి ప్రమాదకరమైంది. లక్షణాలు ఇవీ చలి, వణుకుతో కూడిన జ్వరం వస్తుంది. సరైన వ్యాధి నిర్ధారణ, చికిత్స అందకపోతే నెలల తరబడి బాధిస్తుంది. ప్లాస్మోడియా జాతికి చెందిన రెండు క్రిముల వలన మన ప్రాంతాల్లో మలేరియా వ్యాపిస్తోంది. ‘వైవాక్స్’ మలేరియా తక్కువ బాధిస్తే, ‘పాల్సీఫారం’ మలేరియా ప్రమాదకరస్థాయిలో ఇబ్బందిపెడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వైవాక్స్ మలేరియా ఎక్కువగా ప్రబలుతెంది. ఎనాఫిలిస్ దోమ ఎక్కడైనా పెరుగుతుంది. దీంతో వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. -
దోమలను తరిమి కొట్టేందుకూ ఓ యాప్!!
ఈరోజుల్లో ఏ పనిచేయాలన్నా దానికి సంబంధించి స్మార్ట్ఫోన్లలో ఓ యాప్ కనిపిస్తోంది. తాజాగా, దోమల బారి నుంచి బయటపడటానికి కూడా ఒక యాప్‌ను తయారు చేశారు. ఇప్పటివరకు దోమలను తరిమి కొట్టాలంటే కాయిల్స్ గానీ, లిక్విడ్ గానీ లేదంటే మస్కిటో బ్యాట్లు గానీ ఉపయోగించేవారు. ఇప్పుడు అవేమీ అవసరం లేదని, స్మార్ట్‌ఫోన్‌లో తమ యాప్ ఒక్కటి ఇన్స్టాల్ చేసుకుని, దాన్ని ఆన్ చేస్తే చాలని ఆ యాప్ రూపకర్తలు తెలిపారు. అదెలాగంటారా.. అయితే చదవండి. 'మస్కిటో రిపెల్లెంట్' అనే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. దాన్ని ఆన్ చేయగానే ఒక రకమైన ఫ్రీక్వెన్సీతో అది శబ్దాలను విడుదల చేస్తుంది. ఆ శబ్దం భరించలేక దోమలు ఎక్కడివక్కడే పారిపోతాయి. ఈ యాప్ కేవలం ఇలా దోమలను తరిమి కొట్టడమే కాదు.. అందులో ఉన్న 'ఎం ట్రాకర్' అనే ఫీచర్‌తో మీ ఇంట్లో ఎన్ని దోమలు ఉన్నాయి, అవి ఎక్కడెక్కడ ఎక్కువగా ఉన్నాయనే విషయాన్ని కూడా తెలియజెబుతుంది. ఈ యాప్ విడుదల చేసే శబ్దాలు కుక్క ఈలల కంటే కొంచెం ఎక్కువగా మాత్రమే ఉంటాయని, అందువల్ల మనుషులకు ఇబ్బందికరంగా అనిపించదని చెబుతున్నారు. పైగా, మన ప్రాంతానికి అనువుగా ఉండేలా ఫ్రీక్వెన్సీని కూడా మార్చుకోవచ్చు. దీనికి బ్యాటరీ కూడా పెద్దగా ఏమీ ఖర్చుకాదట. -
ఈ ‘రోగానికి’ మందులేదా?
అధ్వానంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రి బంధువులే రోగులను తీసుకెళ్లాల్సిన దుస్థితి విజయవాడ : ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు..’ పాట గుర్తుకొస్తోంది ప్రభుత్వాస్పత్రిని చూస్తుంటే. చినుకు పడితే చాలు ఆస్పత్రి ప్రాంగణం చిత్తడిగా మారుతోంది. వర్షపు నీరు పారేందుకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేనందున ఆవరణంతటాకాన్ని తలపిస్తోంది. దీంతో రోగులు ఆ నీటిలోనే నడుచుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. నిత్యం వందలాది మంది చికిత్స కోసం వచ్చే ప్రభుత్వాస్పత్రిలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఉన్నవారు సైతం బురదనీటిలో నడిచివెళ్లక తప్పడం లేదని ఆవేదన చెందుతున్నారు. రోగిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బంధువులే తీసుకెళ్లాల్సివస్తోంది. ఆస్పత్రి చుట్టూ నీరు నిలవడంతో దోమలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి. ముఖ్యంగా ఆస్పత్రి వెనుకవైపు, డయాగ్నోస్టిక్ బ్లాక్ పక్కన, ఎదురుగా నిత్యం నీరు నిలిచే ఉంటుందని, రాత్రి వేళల్లో విధులు నిర్వర్తించడం కష్టంగా ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.