అవినీతి ‘కంపు’! | Corruption 'stench'! | Sakshi
Sakshi News home page

అవినీతి ‘కంపు’!

Published Mon, Nov 23 2015 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 12:51 PM

అవినీతి ‘కంపు’!

అవినీతి ‘కంపు’!

పారిశుద్ధ్యం పేరుతో  రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం
మచ్చుకైనా కన్పించని ఫినాయిల్, డెటాల్
కేవలం బ్లీచింగ్ పౌడర్‌తోనే సరి
దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు, టాయిలెట్లు
రోగుల అవస్థలు
 

ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో రోగుల ముక్కుపుటాలు అదురుతున్నాయి. వార్డులకు.. మరుగుదొడ్లకు పెద్ద తేడా కన్పించడం లేదు. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేయక తీవ్ర దుర్వానస వెదజల్లుతున్నాయి. ఈగలు, దోమలు వ్యాప్తి చెంది రోగులకు కొత్త రోగాలను అంటగడుతున్నాయి. ఆస్పత్రిలో పారిశుధ్యం కోసం ప్రభుత్వం ఏటా రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తున్నా...పరిస్థితి దారుణంగా ఉంది. దీనికి కారణమేంటని ఆరా తీస్తే... కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపమేనని తెలుస్తోంది.
 
కాంట్రాక్టర్ల అవినీతి, అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఉదాసీనత, పర్యవేక్షణ లోపం వెరసి ఉస్మానియా రోగుల పాలిట శాపంగా మారుతుంది. ఆస్పత్రి పారిశుద్ధ్య నిర్వహణ పనులను తొలుత ఆల్ సర్వీసు సంస్థ ఔట్ సోర్సింగ్ దక్కించుకుంది. అప్పట్లో సదరు సంస్థకు నెలకు రూ.17 లక్షలు చెల్లించారు. పారిశుద్ధ వ్యవస్థ మెరుగు పడకపోవడంతో ఆల్ సర్వీసు కాంట్రాక్ట్‌ను 20013లో రద్దు చేసి,‘గౌరి మహిళా మండలి’ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి ఆ పనులను అప్పగించారు. కార్మికులకు కనీస వేతనాలు అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం నెలసరి ఖర్చులను రూ.17 లక్షల నుంచి రూ.29 లక్షలకు పెంచింది. ఇలా ఏడాదికి రూ.3.48 కోట్లు ఖర్చు చేస్తుంది. ఔట్ సోర్సి ంగ్ ఏజెన్సీ కింద 270 మంది వర్కర్లు పని చేయిస్తున్నట్లు సదరు కాంట్రాక్టర్ లెక్క చూపుతున్నారు. నిజానికి 150 మందికి  మించి లేరు. వీరిలో చాలా మందికి పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం లేదు. వీరిపై ప్రభుత్వ అజమాయిషీ లేకపోవడంతో చాలా మంది కార్మికులు ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రోజుల తరబడి విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇక కాంట్రాక్టర్లు వీరికి పనిచేసిన దినాలకే వేతనం చెల్లిస్తూ పూర్తిస్థాయి బిల్లులు పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఏ వార్డులో ఎవరెవరు పని చేస్తున్నారో ఆస్పత్రి హెల్త్ ఇన్‌స్పెక్టర్‌కు తెలియజేయాలి. షిప్ట్ ముగిసిన తర్వాత వార్డు ఇన్‌చార్జి నర్సు పారిశుధ్య పనుల పట్ల సంతృప్తి చెందినట్లు రిజిస్టర్‌లో సంతకం చేయించాలి. ఆ తర్వాత హెల్త్‌ఇన్‌స్పెక్టర్‌తో సంతకం చేయించాలి. కానీ ఇవేవీ జరగడం లేదు. సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ, డిప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓలు సదరు కాంట్రాక్టర్‌తో కుమ్మక్కై అన్నీ తామై వ్యవ హరిస్తున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే కమీషన్లకు కక్తుర్కిపడి సదరు ఆర్‌ఎంఓలు ఏమీ పట్టించుకోకుండానే బిల్లుల మంజూరుకు సంబంధించిన ఫైలుపై సంతకం చేస్తున్నారని ఆరోపణలున్నాయి.

ముక్కు మూసుకోవాల్సిందే...
ఓపీతో పాటు ఇన్‌పేషంట్ వార్డుల్లో తీవ్ర దుర్వాసన వెలువడుతోంది. కీలకమైన ఎఐసీయూ ప్రవేశ ద్వారానికి రెండు వైపులా ఉన్న మూత్ర శాలల నుంచి దుర్వాసన వస్తోంది. ఇక పాత భవనం రెండు, మూడు అంతస్థుల్లోని ఆపరేషన్ థియేటర్ల వద్ద ఉన్న మ రుగుదొడ్లు కంపు కొడుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులు సహా వారి సంరక్షకులు సైతం ముక్కు మూసుకోవాల్సి వస్తోంది. కారిడార్లు, మెట్లను శుభ్రం చేయక పోవడంతో వాటిపై నడిచినవారు జారిపడుతున్నారు. అవుట్ పేషంట్ వార్డుతో పాటు కులీకుతుబ్‌షా భవన ంలో డ్రైనేజ్ లీకవుతోంది. వార్డుల్లో చుట్టూ మురుగునీరు ప్రవహిస్తుండటంతో డెంగీ, మలేరియా దోమలు వ్యాప్తి చెంది నర్సింగ్ విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నారు. వాటర్ ట్యాంక్‌లను రోజుల తరబడి శుభ్రం చేయకపోవడంతో నీటిని తాగిన రోగులు మరింత అనారోగ్యాల పాలవుతున్నారు. సిరెంజ్‌లు, బ్లేడ్స్, సీజర్స్ తదితర క్లినికల్ వ్యర్థాలను వార్డుల్లోనే వదిలేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వచ్చిన రోగులు ఇక్కడి పారిశుద్ధ్య లోపం వల్ల ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నట్లు స్వయంగా వైద్యనిపుణులే అభిప్రాయపడుతున్నారు.

నిబంధనల ప్రకారం శుభ్రం చేయాలి ఇలా...
ఆస్పత్రి పరిసరాలను రోజుకు ఒకసారి శుభ్రం చేయాలి.అవుట్ పేషంట్ విభాగాన్ని రోజుకు రెండుసార్లు, జనరల్ వార్డులను మూడుసార్లు, ఆపరేషన్ థియేటర్లను ఐదుసార్లు, ఎన్‌ఐసీయూ, ఇతర అత్యవసర విభాగాలను రోజుకు ఏడుసార్లు శుభ్రం చేయాలి. {పతి పదిహేను రోజులకు ఒకసారి గోడలు, కిటీకీలు, మంచాలు, తలుపులు శుభ్రం చేయాలి. నెలకోసారైనా వాటర్ ట్యాంకులను క్లీన్ చేయాలి. మరుగుదొడ్లు, మూత్ర శాలల్లో రోజుకోసారి బ్లీచింగ్ చల్లాలనే నిబంధన ఉన్నా కాంట్రాక్టర్ పట్టించుకోవడం లేదు. వార్డులను తడిగుడ్డతో ఊడ్చుతున్నారే కానీ కనీసం ఫినాయిల్ కూడా వాడటం లేదు. వార్డుల్లో డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేయాలనే నిబంధన ఉన్నా..పట్టించుకోవడం లేదు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది హాజరు నమోదుకు గాంధీ ఆస్పత్రిలో ఉన్నట్లుగా ఇక్కడ బయోమెట్రిక్ పద్ధతి లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement