- కూంబింగ్ ఆపరేషన్లలో సాయుధ బలగాలను వణికిస్తున్న దోమలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రా-ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో, ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్న సాయుధ బలగాలు మందుపాతరలు, మవోలు కంటే మశకా(దోమ)లంటేనే ఎక్కువ భయపడుతున్నారు. అనాఫిలిస్ దోమలతో వ్యాపించే మలేరియా తమలో పోరాట పటిమను తగ్గిస్తోందని వారు ఆందోళన చెందుతున్నారు.
ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో మావోల దాడిలో మృతి చెందిన, క్షతగాత్రులుగా మారిన 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మలేరియాతో బాధపడుతున్నట్లు తేలింది. ఈ కారణంగానే వారు మావోయిస్టుల దాడిని పూర్తిస్థాయిలో తిప్పికొట్టలేకపోయారని ఉన్నతాధికారులు నిర్ధారించారు. గడిచిన నెల రోజుల్లో కూం బింగ్ విధు ల్లో ఉన్న 500 మందికి మలేరియా సోకిందని, వీరిలో ఒకరు మరణించినట్లు తెలి సింది.
ఈ బృందాలు క్యాంపుల్లో విశ్రాంతి తీసుకునే సమయంలోనే దోమల దాడికి గురవుతున్నారని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కు సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు నివేదించా రు. భద్రతా కారణాల వల్ల జ్వరపీడిత జవాన్లు వైద్యం కోసం దగ్గర్లోని ఆస్పత్రులకు వెళ్లలేకపోతున్నారని, వెళ్లినా వారికి మెరుగైన వైద్యం అం దట్లేదని ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఒకప్పుడు మందుపాతరలు, మావోల తూటాలకు ఎవ్వరూ నేలకొరగకూడదని(జీరో క్యాజు వాలిటీ) లక్ష్యంగా నిర్దేశించుకున్న సాయుధ బల గాలు తాజాగా మలేరియా దోమల్నీ ఈ జాబితా లో చేర్చారు.
అనాఫిలిస్ దోమల్ని గుర్తించడానికి, నిరోధించడానికి ఎలాంటి పరిజ్ఞానం బల గాల వద్ద లేకపోవడంతో కిట్ బ్యాగుల్లో దోమ తెరలు, మస్కిటో కాయిల్స్, క్రీములుల్ని తీసుకువెళ్లడం తప్పనిసరి చేశారు. అయితే వీటిని విని యోగిస్తే తమ ఉనికి మావోలు గుర్తించే ప్రమా దమున్న కారణంగా అనేక మంది జవాన్లు వాటి ని వాడటానికి వెనుకాడుతున్నారని ఉన్నతాధికారులు ఎంహెచ్‌ఏకే నివేదించారు.
ఈ నేపథ్యం లోనే కూంబింగ్ సిబ్బందికి మలేరియా నిరోధక మందులు ముందుగానే ఇప్పించడం, సమీపంలోని వైద్యశాలల్లో సంబంధిత మందులు, వైద్యు ల్ని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను కోరింది.