
దోమలను తరిమే టీవీ వచ్చిందోచ్!
న్యూఢిల్లీ: మీ ఇంట్లో దోమల బెడద ఎక్కువగా ఉందా? దోమలను తరిమేయడానికి రకరకాల సాధనాలు వాడి విసిగిపోయారా? ఇక మీరు చింతించాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ దిగ్గజ సంస్థ ఎల్‌జీ నిపుణులు. దోమల వల్ల డెంగ్యూ వంటి ప్రాణాంతకర వ్యాధులు ప్రబలుతున్నాయంటూ సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఎల్‌జీటీవీ సంస్థ వినూత్నంగా ఆలోచించి.. ఇంట్లో దోమలు తరిమేయడానికో ఓ సాధనాన్ని కనిపెట్టింది. అదే..! ''ఎల్‌జీ మస్కిటో ఎవే టీవీ''. సరికొత్త టెక్నాలజీ అల్ట్రా సోనిక్ డివైజ్‌తో రూపొందిన ఈ మస్కిటో ఎవే టీవీని ఇటీవలే ఎల్‌జీ మార్కెట్లోకి విడుదల చేశారు.
అయితే ఈ ఎల్‌జీ మస్కిటో టీవీ.. మీ ఇంట్లో ఉంటే ఇక దోమల బెడద నుంచి విముక్తి పొందవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే మీకు వినోదంతో పాటు ఆరోగ్యం కూడా అందిస్తుంది అనమాట!. మస్కిటో ఎవే టీవీ.. ఆడియో, వీడియో సిస్టమ్ నాణ్యత చాలా బాగుంటుందని ఎల్‌జీ నిపుణులు చెబుతున్నారు. ఈ టీవీని ప్రత్యేకంగా భారతీయ వినియోగదారులను దృష్ట్యా రూపొందించినట్టు తెలిపారు. ఎల్‌జీ టీవీ తయారీలో విషపూరిత నిరోధకాలు వాడలేదనీ గ్లోబల్ సంస్థలైన బయోటెక్నాలజీ అండ్ టాక్సికాలజీ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్(ఐఐబీఏటీ) పరీక్షించి తేల్చి చెప్పింది.
2015 గణాంకాల ప్రకారం.. గత 20 సంవత్సరాలలో 10, 683 డెంగ్యూ కేసులు నమోదైనట్టు నేషనల్ వెక్టార్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ (ఎన్‌వీబీడీసీపీ) సర్వే, భారత ప్రభుత్వం నివేదికలో వెల్లడైంది. డెంగ్యూ వంటి ప్రాణాంతకర వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి ''ఎల్‌జీ మస్కిటో ఎవే టీవీ''ని రూపొందించడంలో ఎల్‌జీ సంస్థ విజయం సాధించింది. కాగా, అన్ని ఎల్‌జీ స్టోర్‌లలో మస్కిటో ఎవే టీవీ లభ్యమవుతోందని పేర్కొంది. అయితే ఈ మస్కిటో టీవీ ధరలు ఇలా ఉన్నాయి.. 80 సెం.మీలు అయితే ధర రూ. 26,900 ఉండగా, 108 సెం.మీల ధర రూ. 47, 500 లుగా ఉన్నట్టు ఎల్‌జీటీవీ సంస్థ వెల్లడించింది.