
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్‌ఎంసీజీ రంగంలో ఉన్న గోద్రెజ్ తాజాగా గుడ్‌నైట్ బ్రాండ్‌లో ‘నేచురల్స్ నీమ్ అగర్‌బత్తి’ పేరిట దోమల నివారణ స్టిక్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వేప, పసుపు మిశ్రమంతో ఈ ఉత్పాదనను తయారు చేశారు. రెండేళ్ల పరిశోధన అనంతరం నేచురల్స్ నీమ్ అగర్‌బత్తిని మార్కెట్లోకి తెచ్చినట్లు గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు.
‘ఈ స్టిక్స్ 100 శాతం సహజ సిద్ధమైనవి. ఒక్కో బత్తి మూడు గంటల వరకు కాలుతుంది. 10 స్టిక్స్‌తో కూడిన ప్యాక్ ధర రూ.15. దేశంలో దోమల నివారణ ఉత్పత్తుల విపణి రూ.6,000 కోట్లుంది. ఇందులో గుడ్‌నైట్ వాటా రూ.2,500 కోట్లు’ అని వివరించారు.