Agarbatti
-
వాడిన విరులూ పరిమళిస్తాయి
అమ్ముడుపోని పూలు ఏమవుతాయి? కొనేవాళ్ల కోసం ఎదురు చూసే సహనం పూలమ్మాయికి ఉంటుంది, కానీ పూలకు ఉండదు. రెక్కలు విచ్చుకోవడం, ఆ రెక్కలు వాలిపోవడంలో అవి వాటి సమయాన్ని క్రమం తప్పనివ్వవు. మార్పుకు నాంది పూలసాగు రైతుల జీవితాలను సువాసనభరితం చేస్తోందా? మొక్కనాటి, నీరు పెట్టి, ఎరువు వేసి పెంచిన మొక్కలు మొగ్గతొడిగితే ఆనందం. ఆ మొగ్గలు విచ్చేలోపు కోసి మార్కెట్‌కు చేర్చాలి. తెల్లారేటప్పటికి నగరంలోని మార్కెట్‌కు చేరాలంటే పూలను కోసే పని అర్ధరాత్రి నుంచి మొదలవ్వాలి. ఆ సమయంలో ΄పొలంలో పనికి వచ్చే వాళ్లు ఉండరు. వచ్చినా రెండింతల కూలి ఇవ్వాలి. సాగు ఖర్చులు, రవాణా ఖర్చులు, తన శ్రమ కలిపి ధర నిర్ణయించుకోవాలి. చాలా సందర్భాల్లో అలా జరగడం లేదు. మార్కెట్లో పూలు ఎక్కువై΄ోయి డిమాండ్ తగ్గిన రోజుల్లో పూలు కోయడానికిచ్చే కూలి కూడా గిట్టదని ఆ పూలను చెట్లకే వదిలేస్తుంటారు. ఇంజనీరింగ్ టెక్నాలజీతో పరిమళాలను మట్టిపాలు కాకుండా కాపాడుతున్నారు కేజీఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ సంయుక్త. తక్కువ ఖర్చులో ఆటోమేటిక్ ఇన్సెన్స్ మేకింగ్ మెషీన్‌కు రూపకల్పన చేశారామె. ఇంజనీర్ సమాజంలో మార్పు తీసుకువచ్చే చేంజ్‌మేకర్ కావాలనే ఆశయాన్ని ఆచరణలో పెట్టారామె. పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్లో పరిశోధన చేస్తున్న సంయుక్త పర్యావరణహితమైన ఆవిష్కరణ కోసం గ్రామాల బాట పట్టారు. ఈ మెషీన్ రూపకల్పనకు దారి తీసిన కారణాలను సాక్షితో పంచుకున్నారామె.మహిళలతో ముందడుగు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ సోషల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను ‘‘2020లో స్థాపించాం. సమాజంలో అవసరమైన ఇంజనీరింగ్ ఆవిష్కరణల గురించి అధ్యయనం చేయడానికి 72 గ్రామాల్లో పర్యటించాం. మహిళలు, మగవాళ్లు, రైతులు, ఇతర వృత్తుల్లోని వారు, పిల్లలు, వృద్ధులు... ఇలా అన్ని కేటగిరీల వ్యక్తులతో మాట్లాడాం. అక్కడి సమస్యలు తెలిశాయి, అవసరాలు అర్థమయ్యాయి. వాటిని పరిష్కరించడానికి ఏం చేయాలనే స్పష్టత కూడా వచ్చింది. అన్నింటినీ మేం పరిష్కరించలేం, ప్రభుత్వాలు మాత్రమే చేయగలిగిన వాటిని వదిలేసి, మా స్థాయిలో పరిష్కరించగలిగే పన్నెండు ప్రాజెక్టుల జాబితా తయారు చేసుకున్నాం. వాటిలో మొదటిది అగరువత్తి తయారీ యంత్రం. అప్పటికి మార్కెట్లో ఉన్న అగరువత్తి మేకింగ్ మెషీన్ల ధర నాలుగైదు లక్షల్లో ఉంది. మేము అరవై వేలలో తయారు చేశాం. రైతుల దగ్గర వృథా అయ్యే పూలు, ఆలయాల దగ్గర అమ్ముడు కానివి, దేవునికి పెట్టి తీసిన పూలను సేకరించి అగరువత్తి, సాంబ్రాణి కడ్డీలు తయారు చేస్తున్నాం. స్థానిక మహిళలకు శిక్షణనిచ్చాం. వారే స్వయంగా నిర్వహించుకుంటున్నారు. ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వస్తే శిక్షణనిచ్చి, వాళ్లకు తగినట్లు మెషీన్ తయారు చేసిస్తాం’’ అన్నారు ్ర΄పొఫెసర్ సంయుక్త.తయారీ ఇలాగ...సేకరించిన పూల నుంచి రెక్కలను వేరు చేసి ఉప్పు నీటిలో కడిగి ఓ గంటసేపు ఎండలో పెడతారు. ఆ పూలను ΄పొడి చేస్తారు. పది కేజీల పూల నుంచి కేజీ ΄పొడి వస్తుంది. ఆటోమేటిక్ మెషీన్ కాబట్టి మెటీరియల్ పెట్టి సెట్ చేసి ఆ మహిళలు మరొక పని చేసుకోవచ్చు. గంటకు అగరువత్తులు 900, సాంబ్రాణి కడ్డీలైతే మూడు వందల వరకు చేయవచ్చు. రా మెటీరియల్ లభ్యత, మార్కెట్ అవసరాలను బట్టి ఇప్పుడు ఈ మహిళలు రోజుకో గంట పని చేస్తున్నారు. వర్షాకాలంలో పూలను ఎండబెట్టడం కష్టం, కాబట్టి ఆ రోజుల్లో గోమయం కడ్డీలను చేస్తారు. గ్రామాల్లో మహిళలు గోమయాన్ని వేసవిలో సేకరించి ఎండబెట్టి నిల్వ చేసి ఉంచుతారు. ఆసక్తి ఉన్న మహిళలు ఇంట్లోనే రోజుకో గంటసేపు పని చేసుకుని తాము ఉంటున్న అపార్ట్మెంట్, ఇరుగు΄పొరుగు ఇళ్లు, దగ్గరున్న ఆలయాలకు సప్లయ్ చేయవచ్చు. ఇందులో భారీ లాభాలను ఇప్పుడే ఆశించలేం. కానీ పర్యావరణహితమైన పని చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాపకంతో ఎకో వారియర్‌గా గుర్తింపు ΄పొందవచ్చు. – సంయుక్త, ఇన్సెన్స్ స్టిక్స్ మెషీన్ ఆవిష్కర్త -
World Cup 2023: లక్కీ పోజులు సరదా సెంటిమెంట్లు
అమితాబ్ ఇరకాటంలో పడ్డారు. ‘నేను చూడకపోతే ఇండియా గెలుస్తుంది’ అని ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనను మొహమాట పెడుతోంది. ‘ఆస్ట్రేలియాతో ఇండియా ఫైనల్స్ చూడకండి సార్’ అని అందరూ ఆయనతో మొరపెట్టుకుంటున్నారు. న్యూజీలాండ్‌తో జరిగిన సెమీఫైనల్స్‌లో మనం గెలవాలని ఒక అభిమాని 240 అగరుబత్తులు వెలిగించాడు. క్రికెట్ అంటే ఒక పిచ్చి. వెర్రి. అభిమానులకే కాదు ఆటగాళ్లకు బోలెడన్ని సెంటిమెంట్లు. రేపు ఫైనల్స్. ప్రతి ఫ్యామిలీ ఇందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్లు, సరదా విశ్వాసాల స్పెల్ చూద్దామా.. ‘జులాయి’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ కోసం పబ్‌కు వెళ్లిన అల్లు అర్జున్‌కు అక్కడ ఒంగి నీలుక్కుపోయి నిలబడి ఉన్న సప్తగిరి కనపడతాడు. ‘వీడేంటి ఇలా?’ అని అడుగుతాడు అల్లు అర్జున్ తన ఫ్రెండ్ యాంకర్ ప్రదీప్‌ని. ‘వీడా... ఇందాక వీడు ఇలా నిలుచున్నప్పుడు ధోని ఫోర్ కొట్టాడు. సెంటిమెంట్‌గా బాగుంటుందని అలా ఉంచేశాం’ అంటాడు ప్రదీప్. మనవాళ్ల సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి. 1970ల నుంచి క్రికెట్‌ను విపరీతంగా ఫాలో అవుతూ స్టేడియంలకు వెళ్లి మరీ మ్యాచ్‌లు చూసిన ఒక తెలుగు అభిమాని తన సెంటిమెంట్లు ఇలా చెప్పుకొచ్చారు– ‘మా నాన్న క్రికెట్ చూసేటప్పుడు మా అమ్మను పక్కన కూచోబెట్టుకొని ఇవాళ నీకు వంట లేదు అనేవారు. ఆయనకు అదొక సెంటిమెంట్ అమ్మ పక్కనుంటే గెలుస్తుందని. నేను ఆ తర్వాత మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు మధ్యలో మా అమ్మ వచ్చి పలకరిస్తే మనం ఓడిపోతామని సెంటిమెంట్ పడింది. అందుకని మ్యాచ్ ఉన్న రోజు మా అమ్మకు ఉదయాన్నే చెప్పేసేవాణ్ణి ఇవాళ పలకరించవద్దని. పెద్దవాళ్లు కదా. ఊరికే ఉండరు. ఒక్కోసారి మర్చిపోయి వచ్చి పలకరిస్తుంది. ఇంకేముంది... మ్యాచ్ హరీ’... ఎనభైల్లో ఊరూ వాడా క్రికెట్ ఫీవర్ మొదలయ్యింది. హైస్కూళ్లకు వ్యాపించింది. 1990లు దాటాక బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇళ్ల కప్పుల మీదకు యాంటెన్నాలు లైవ్ టెలికాస్ట్‌లు మొదలయ్యాయి. ఒక నెల్లూరు వాసి ఇలా చెప్పాడు– ‘మా ఫ్రెండ్స్‌లో నలుగురైదుగురి ఇళ్లల్లో టీవీలు ఉన్నాయి. కాని ఎందుకనో విజయ్‌గారి ఇంట్లో చూస్తేనే ఇండియా గెలుస్తుందనే నమ్మకం ఏర్పడింది. దాంతో ఇండియా మేచ్ ఉన్న ప్రతిసారీ వాడింట్లో చేరి కిష్కిందకాండ చేసేవాళ్లం. ఇదేం గోలరా... ఇంకెక్కడా టీవీలు లేవా అని వాళ్లమ్మ మొత్తుకునేది. అదో సరదా’... అయితే ప్రతి గ్రూప్‌లో మచ్చనాలుకోడు ఒకడు ఉంటాడు. వాడు ‘ఫలానా వాళ్లు పోతారు’ అంటే గ్యారంటీగా పోతారు. వాడు తక్కిన రోజుల్లో ఎంత ప్రేమాస్పదమైన ఫ్రెండ్ అయినా క్రికెట్ వచ్చే రోజుల్లో అందరికీ కంటగింపు అవుతాడు. ‘మా ఫ్రెండ్ శేషుగాడు ఇలాగే ఉండేవాడు. మేమందరం ఉదయాన్నే లైవ్ చూడ్డానికి ఎగ్జయిట్ అవుతుంటే ఇండియా ఢమాల్ అనేవాడు. ఇండియా అలాగే పోయేది. అందుకని మ్యాచ్‌లు జరిగే కాలంలో వాడు కనిపిస్తే రాళ్లెత్తి కొట్టి మరీ తరిమేసేవాళ్లం’ అంటాడొక అభిమాని నవ్వుతూ. అభిమానులు మందుబాబులైతే వాళ్ల సెంటిమెంట్లకు కూడా లెక్కే లేదు. ‘మనకు అలవాటైన బార్లో మిగిలిన రోజుల్లో ఎక్కడైనా సరే కూచుంటాం. కాని ఇండియా మ్యాచ్ ఉన్న రోజు మాత్రం నాకొక పర్టిక్యులర్ సీట్లో కూచుని చూస్తే గెలుస్తామని సెంటిమెంట్. అక్కడే కూచునేవాణ్ణి. బార్వాళ్లు కూడా నా సీట్ నాకే అట్టి పెట్టేవాళ్లు. అంతేనా? గ్లాస్లో మందైపోతే వికెట్ పడిపోతుందని ఒక సెంటిమెంట్. అందుకే మందైపోయేలోపు ఒక పెగ్ రెడీగా పెట్టుకునేవాణ్ణి’ అని తెలియచేశాడు ఆ క్రికెట్ నిషా అభిమాని. అదేముంది... ఆటగాళ్లకు కూడా సెంటిమెంట్స్ ఉంటాయి. టెస్ట్ మేచ్‌ల రోజుల్లో బాగా బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆ ప్లేయర్లు ఆ డ్రస్సుల్ని వాష్ చేయకుండా మేచ్ అయ్యేంతవరకూ అవే డ్రస్సుల్ని వేసుకునేవారు. ‘నిన్న రాత్రి ఫలానా సినిమా చూసి నిద్రపోయి ఉదయం బ్రహ్మాండంగా ఆడాను. అందుకే మళ్లీ అదే సినిమా చూసి ఆడతాను అనుకునే వరకు క్రికెటర్ల సెంటిమెంట్లు ఉంటాయి’ అని ఒక క్రికెటర్ తెలిపాడు. ‘పూజ చేసి సాంబ్రాణి కడ్డీలు గుచ్చి రెండు రోజులుగా ఉంచిన అరటి పండును బౌలర్ శ్రీశాంత్ వికెట్లు పడతాయన్న నమ్మకంతో తినడం చూశానని’ ఆ క్రికెటర్ చెప్పాడు. సునీల్ గవాస్కర్‌కు గురువారం గండం ఉండేది. 1980లో రెండు వరస గురువారాల్లో ఇద్దరు అనామక బౌలర్లకు వికెట్స్ ఇచ్చి సున్నాకు ఔట్ అయ్యాడతడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌కు చేతిలో ఉన్న బ్యాట్‌ను గిర్రున తిప్పితే బాగా కొడతాననే నమ్మకం ఉండేది. అతని మ్యాచులు చూస్తే బ్యాట్ హ్యాండిల్‌ని తిప్పడం కనిపిస్తుంది. మొహిందర్ అమర్నాథ్ ఎర్ర కర్చీఫ్‌ను జేబులో పెట్టుకుని ఉండేవాడు. సచిన్‌కు ముందు ఎడమ కాలు ప్యాడ్ కట్టుకుంటే కలిసొస్తుందని నమ్మకం. జహీర్ ఖాన్ పసుపు రంగు చేతిగుడ్డను జేబులో పెట్టుకునేవాడు. బౌలర్ అశ్విన్ అయితే ఒకే బ్యాగ్‌ను అన్ని మ్యాచ్‌లకు తెచ్చేవాడు. అది అతని లక్కీ బ్యాగ్. ఇక అజారుద్దీన్ తావీజ్ లేకుండా మ్యాచ్ ఆడడు. 1987 వరల్డ్ కప్‌లో జింబాబ్వే మీద కపిల్ దేవ్ బ్యాటింగ్‌కు దిగే సమయానికి ఇండియన్ ఆటగాళ్లు ఆశలు వదలుకుని డ్రస్సింగ్ రూమ్ బయటకు వచ్చి నిలబడ్డారు. కపిల్ దేవ్ బాదడం మొదలు పెట్టాడు. అంతే టీమ్ మేనేజర్ మాన్ సింగ్ ఎక్కడి వాళ్లను అక్కడే నిలబడమన్నాడు. క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ను పాస్‌కు వెళ్లడానికి కూడా ఒప్పుకోలేదు. ఇప్పుడు కూడా చాలా సెంటిమెంట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అమితాబ్‌కు తాను మేచ్ చూడకపోతే ఇండియా గెలుస్తుంది అనే సెంటిమెంట్ ఉంది. మరోవైపు ఫైనల్స్‌కు ఆహ్వానం ఉంది. వెళ్లాలా వద్దా అని ఊగిసలాడుతున్నాడు. మరోవైపు అభిమానులు కూడా రకరకాల సెంటిమెంట్లు చెప్పుకుంటున్నారు. 2011 నుంచి వరల్డ్ కప్ పోటీల్లో హోస్ట్ కంట్రీలే గెలిచాయి కాబట్టి ఈసారి హోస్ట్ కంట్రీ ఇండియా గెలుస్తుందని ఒక సెంటిమెంట్. మరోవైపు 2019 వరల్డ్ కప్ సమయంలో చంద్రయాన్–2 ఫెయిల్ అయ్యింది. ఇండియా కప్ కోల్పోయింది. 2023లో చంద్రయాన్ –3 సక్సెస్ అయ్యింది. అంటే మనం వరల్డ్ కప్ గెలుస్తామని ఒక సెంటిమెంట్. కాని ఆట ఎప్పుడూ టీమ్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది... సెంటిమెంట్స్ మీద కాదు. కాకుంటే కొంచెం అదృష్టం కలిసి రావాలంతే. ఆ అదృష్టం కోసం అభిమానుల ఆకాంక్షే సెంటిమెంట్ల రూపంలో బయటకు వస్తుంది. ఈసారి భారత్ గెలవాలని... అందుకు అందరి సెంటిమెంట్లు పని చేయాలని కోరుకుందాం. -
అయోధ్య రాముడికి ఎవరూ ఊహించని కానుక....జై శ్రీరామ్
-
ఆయోధ్య రాముడికి మర్చిపోలేని కానుక..ఏకంగా 108 అడుగుల..
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. 2024 కల్లా పూర్తి అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇదిలా ఉండగా ఆ అయోధ్య రాముడి కోసం గుజరాత్‌ని వడోదరాలో తర్సాలీ గ్రామం తమ వంతుగా మర్చిపోలేని ఓ గొప్ప కానుక ఇవ్వాలనుకుంది. అందులో భాగంగా భారీ అగరబత్తి తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఆ గ్రామ ప్రజలు. అంతేగాదు ఈ భారీ అగర్బత్తి కారణంగా ప్రతిరోజు రాముడికి ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందట. తొలుత ఈ భారీ అగరబత్తిని తయారు చేయాలని సంకల్పించింది విహాభాయ్ అనే రైతు. అయనకు రాముడంటే అమితమై భక్తి. ఈ నేపథ్యంలోనే ఆయన 108 అడుగులు పోడవు ధూపం తయారు చేయాలని సంకల్పించారు. అందుకోసం 191 కిలోల ఆవునెయ్యి, 376 కిలోల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పౌడర్, 425 కిలోల హవాన్ మెటీరియల్, 1475 కిలోల ఆవు పేడ పొడి తదితరాలను వినియోగించినట్లు విహాభాయ్ తెలిపారు. ఇలా మొత్తంగా సుమారు 3,400 కిలోల బరువు ఉన్న అగరుబత్తిని సిద్ధం కానుంది. ఆయనకు ఈ అగరుబత్తిన తయారు చేయడంలో గ్రామస్తులు కూడా తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన ముడి సరుకును, ఉపయోగించే పదార్థాలను సమకూర్చి ఆయనకు తగినంత సాయం అందించారు. ఈ విధంగా అక్కడున్న వారంతా రాముడిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. అంతేగాదు ఈ భారీ అగరుబత్తి తయారయ్యిన తదనంతరం డిసెంబర్ 2023 కల్లా భారీ ఊరేగింపుగా రామజన్మ భూమి అయోధ్యకు తరలిస్తామని ఆనందంగా చెబుతున్నారు విహాభాయ్. ఈ భారీ పంచద్రవ్య ధూపదీపం(అగర్బత్తి) తయారీ పనులు కూడా తుదిదశకు చేరుకున్నట్లు వెల్లడించారు విహాభాయ్. (చదవండి: ఆడపిల్ల ఉన్న తండ్రి అంటే ఏమిటో? దశరథుని మాటల్లో..) -
ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి
న్యూఢిల్లీ: ఢిల్లీలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని యువకుడు అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన యావత్ దేశాన్ని కలవరానికి గురిచేస్తోంది. యువతితో పరిచయం, సహజీవనం, హత్య, మృతదేహాన్ని ముక్కలుగా కోయడం, ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని భద్రపరిచిన తీరు విస్మయానికి గురి చేస్తోంది. దీనికి తోడు హత్య చేసిన ఆరు నెలల తర్వాత ఈ ఉదంతం వెలుగులోకి రావడం మరింత గమనార్హం. ఈ కేసులో ఇప్పటికే హంతకుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. కేసు వివరాలను ఢిల్లీ సౌత్ పోలీసు ఇన్ఛార్జ్ అంకిత్ చౌహాన్ తెలిపారు. 300 లీటర్ల ఫ్రిడ్జి కొని 24 ఏళ్ల యువతితో సహజీవనం చేసిన ప్రియుడు చివరికి ఆమె పాలిట మృత్యుపాశంగా మారాడు. ఉన్మాదిగా మారి ఆమెను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతోనే ప్రియురాలిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయిదు నెలల క్రితమే ప్రియురాలని హత్య చేసినట్లు తేలింది. యువతిని అంతమొందించి.. ఆమె మృతదేహాన్ని 35 భాగాలుగా కోశాడు. అయితే ఆమె శరీర భాగాలను భద్రపరిచేందుకు ఓ భారీ(300 లీటర్ల) ఫ్రిడ్జిని కొనుగోలు చేశాడు. చదవండి: కాలేజ్ బిల్డింగ్ పైనుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య దుర్వాసన రాకుండా అగర్బత్తీలు హత్య చేసిన 18 రోజుల్లో వాటిని ఒక్కొక్కటిగా నగరంలోని మొహహ్రౌలీ అటవీ ప్రాంతంలో చెల్లాచెదురుగా విసిరేశాడు. తెల్లవారుజామున 2 గంటల సమయంలో బయటకు వచ్చి ముక్కలుగానరికిన శరీర భాగాలను పారేశాడు. అపార్ట్మెంట్ ఇరుగుపొరుగు వారికి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఇంట్లో అగర్బత్తిలు వెలిగించినట్లు అంగీకరించాడు. అంతేగాక అమెరికన్ క్రైం షో ‘డెక్స్టర్’ నుంచి ప్రేరణ పొంది ఇంతటి కిరాతకానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీనికితోడు చెఫ్‌గా శిక్షణ పొందిన నిందితుడు మాంసం కత్తిని ఉపయోగించడంలో ప్రవీణుడని తేలింది. హత్యకు ముందు ఏం జరిగిందంటే ముంబైలో పనిచేస్తుండగా అఫ్తాబ్ అనే 28 ఏళ్ల యువకుడు శ్రద్ధా(26) యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావడంతో యువతి వాళ్ల ఇంట్లో వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇద్దరు కలిసి ఢిల్లీకి మకాం మార్చారు. ఓ మల్టినేషనల్ కంపెనీకి చెందిన కాల్ సెంటర్లో పనిచేస్తూ ఛతర్‌పూర్‌లోని అపార్ఠ్మెంట్లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని సహజీవనం చేశారు. మే నెలలో ఇద్దరి మధ్య పెళ్లి విషయమై గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలు కాస్తా పెద్దగా అయ్యాయి. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా నిత్యం ఒత్తిడి తేవడంతో మే 18న ప్రియురాలిని అఫ్తాబ్ గొంతు కొసి చంపాడు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో కూతురు సహజీవనం విషయంలో విభేదాలు రావడంతో తల్లిదండడ్రులు ఆమెతో మాట్లాడటం మానేశారు. అయితే కొంతకాలంగా శ్రద్ధా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుందని ఆమె స్నేహితురాలు చెప్పడంతో అనుమానం వచ్చిన తండ్రి కూతురు కోసం ముంబై నుంచి ఢిల్లీకి బయల్దేరాడు. ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు హంతకుడిని ఐదు రోజుల కస్టడీకి తరలించారు. అటవీ ప్రాంతంలో కొన్ని శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నామని, అయితే అవి మానవ అవశేషాలు కాదా అనేది తెలియాల్సి ఉందని తెలిపారు. నిందితుడు ఉపయోగించిన కత్తి ఇంకా లభ్యం కాలేదని పేర్కొన్నారు. -
వాడిన పూలే.. సువాసనలు వెదజల్లునే..
యాదగిరిగుట్ట: తిరుమలలో మాదిరిగానే యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ స్వామి, అమ్మవారికి వినియోగించిన పూలతో అగరుబత్తులను తయారు చేయనున్నారు. ఈ మేరకు యాదగిరిగుట్టలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటుకు లక్నోలోని సెంటర్ ఫర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీమ్యాప్), సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్స్ కౌన్సిల్(సీఎస్ఐఆర్) సంస్థల సహకారం తీసుకోనున్నారు. ఇటీవల యాదాద్రి ఆలయ అధికారులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ, యాదగిరిగుట్ట మున్సిపల్ అధికారులు చర్చించారు. యాదగిరిగుట్ట, ధర్మపురి, వేములవాడలో ఈ తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని నిర్ణయించి యాదగిరిగుట్టను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అగరుబత్తుల తయారీకి ఇప్పటికే స్వయం సహాయక సంఘాల సభ్యులకు, సిబ్బందికి శిక్షణనిచ్చారు. యాదగిరిగుట్టలో ప్రస్తుతం శాంపిల్‌గా చేతులతో అగరుబత్తులను తయారు చేస్తున్నారు. తయారీ విధానమిదే.. రోజూ ఆలయంలో వాడిన పూలను మున్సిపల్ సిబ్బంది మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తారు. ఈ పూలను వేరుచేసి నీడలో ఆరబెడతారు. అనంతరం ఒక్కోరకం పువ్వులను వేర్వేరుగా యంత్రంలో వేసి పౌడర్ తయారు చేస్తారు. పువ్వు పౌడర్, జిగట్ పౌడర్‌ను కలుపుతారు. దాన్ని సన్నని స్టిక్స్‌కు పెట్టి రోల్ చేస్తారు. ఆరబెట్టాక సువాసన వెదజల్లేలా తులసీపత్రాల నూనెను అగరుబత్తులకు అద్దుతారు. కిలోపువ్వుల పౌడర్‌తో 2,500 అగరుబత్తులు తయారవుతాయి. ప్రస్తుతం ఆలయం నుంచి రోజూ 6 నుంచి 8 కిలోల వరకు పూలు వస్తున్నాయి. పట్టణంలో 2,700 మంది మహిళాస్వయం సహాయక సంఘాల సభ్యులున్నారు. వీరితో అగరుబత్తులు తయారు చేయించి, వారినే సొంతంగా మార్కెటింగ్ చేసుకునేలా వీలు కల్పించనున్నారు. మహిళల ఉపాధికి శిక్షణ వాడిన పూలతో అగరుబత్తుల తయారీకి మహిళాసంఘాల సభ్యులకు మొదటి విడత శిక్షణ పూర్తయింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఈ బాధ్యత తీసుకుంది. – శ్రవణ్ కుమార్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ యాదాద్రి బ్రాండ్ పేరిట అమ్మకాలు పూలతో తయారు చేసిన అగరుబత్తులను భక్తులు స్థానిక దుకాణాల్లో కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం. యాదాద్రి బ్రాండ్ పేరుతో అమ్మకాలు చేపడతాం. – ఎరుకల సుధాహేమేందర్ గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ -
కొత్త అవతారమెత్తిన ధోని.. షాక్‌లో నెటిజన్స్!
ముంబై: ‘జెడ్ బ్లాక్’ అగర్బత్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ క్రికెటర్ మహీంద్ర సింగ్ ధోనీ.. సంస్థ నూతన ప్రచార కార్యక్రమంలో ‘గురూజీ’ అవతారంలో కనిపించనున్నాడు. ధోనీ ప్రచారంతో బ్రాండ్ ప్రజలకు మరింత చేరువ అవుతుందని జెడ్బ్లాక్ అగర్బత్తి బ్రాండ్ యజమాని మైసూర్ డీప్ పెర్ఫ్యూమ్ హౌస్ డైరెక్టర్ అంకిత్ అగర్వాల్ పేర్కొన్నారు. ‘దేశంలో టాప్–3 బ్రాండ్లలో జెడ్ బ్లాక్ ఒకటి. కంపెనీ వినూత్న ఆవిష్కరణలు సంస్థకు అంబాసిడర్ పనిచేసేందుకు ప్రోత్సాహాన్నిచ్చాయి’ అని ధోనీ చెప్పారు. ప్రస్తుత జెబ్ బ్లాక్ అగర్బత్తి మార్కెట్ రూ. 7,000 కోట్లుగా ఉండగా,దాదాపు ఈ కంపెనీ 20% వాటాను కలిగి ఉంది. వాటి బ్రాండ్ల విషయానికొస్తే జెడ్ బ్లాక్ 3 ఇన్ 1, మంథన్ ధూప్, మంథన్ సాంబ్రాణి కప్స్, ఆరోగ్యం కాంఫర్, జెబ్ బ్లాక్ పైనాపిల్, శ్రీఫాల్, గౌవ్డ్ సాంబ్రాణి కప్స్, అరోమిక్స్, నేచర్ ఫ్లవర్ గోల్డ్, సియాన్ పేర్లతో మార్కెట్లో లభిస్తున్నాయి. కాగా ఐపీఎల్ 2022 తర్వాతా తెరపై మహేంద్ర సింగ్ ధోని కనపడడం ఇదే తొలిసారి. అయితే గురూజీ అవతారంలో ఉన్న ధోనిని చూసి మొదట నెటిజన్లు షాకయ్యారు. ఆ తర్వాత అగర్బత్తి యాడ్ కోసం అలా మారడని తెలుసుకుని ఈ గెటప్‌లో కూడా బాగున్నాడంటూ కామెంట్లు పెట్టారు. చదవండి: ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్! -
అగర్ బత్తీ కంపెనీ పేరుతో రూ.85 లక్షలు స్వాహా
సాక్షి, హైదరాబాద్: అగర్బత్తీల తయారీ కంపెనీ ఏర్పాటు చేద్దామంటూ నమ్మించి మంగళ్‌హాట్‌కు చెందిన ఒక మహిళను ఓ గ్యాంగ్ రూ. 85 లక్షలు మోసం చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళ్‌హాట్‌కు చెందిన బిరదర్ ఉమా కు, తన మేనల్లుడు రాజ్‌కుమార్ ద్వారా శ్రీకాంత్, భీమా, శశిధర్ అనే వ్యక్తులు పరిచయం అయ్యారు. అగర్బత్తీల కంపెనీ ఏర్పాటు చేద్దామని దానికి సంబంధించిన లైసెన్స్‌లు, యాంత్రాలు తెప్పిస్తామని నమ్మించారు. మున్నా సింగ్ అనే వ్యక్తిని పరిచయం చేసి అరంఘార్, దూల్పేట్లోని ప్యాక్టరీ పెట్టేందుకు స్థలాన్ని అగ్రిమెంట్ చేసుకోవాలని ఒప్పించారు. ఆ తరువాత సంగమేశ్వర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో లైసెన్స్ తెప్పించారు, దానికి బాధితురాలు అంగీకరించలేదు. తన పేరుతోనే లైసెన్స్ కావాలని స్వయంకృషి ఇండస్ట్రీస్ పేరుతో లైసెన్స్ దరఖాస్తు చేసింది. వీటన్నింటికి లక్షల రూపాయలలో డబ్బులు తీసుకొని రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారు. అలాగే తన మేనల్లుడైన రాజ్‌కుమార్ వద్ద కూడా యంత్రాల కోసం డబ్బు తీసుకున్నారు. ఇలా మొత్తం రూ. 85 లక్షల వరకు తమ వద్ద డబ్బు తీసుకొని మోసం చేశారంటూ బాధితురాలు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
అగరబత్తీల విషయంలో జోక్యం చేసుకోలేం
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిధిలోని పలు దేవస్థానాల్లో వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి ప్రజాప్రయోజనాలు లేవని స్పష్టం చేసింది. వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడంపై అభ్యంతరం ఉంటే.. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లొచ్చంది. వినతిపత్రం ఇవ్వాలా.. లేదా.. అనేది పిటిషనర్ ఇష్టమంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దేవతామూర్తులకు వినియోగించిన పూలతో అగరబత్తీలు తయారుచేయడం ఆగమ శాస్త్ర నిబంధనలకు విరుద్ధమని, టీటీడీ.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందంటూ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పూజారి మేడూరి సాయికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. దేవతామూర్తులకు వినియోగించిన పూలను మరో రకంగా వినియోగించడానికి వీల్లేదన్నారు. ఇలా చేయడం భక్తుల మతవిశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీయడమేనని చెప్పారు. ఇంట్లో వాడుకోవాలన్న ఉద్దేశంతోనే.. పిటిషనర్ వాదనలను టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సర్వా సత్యనారాయణ ప్రసాద్ తోసిపుచ్చారు. శ్రీవారికి వినియోగించిన పూలను పూల బావిలోనే వేస్తున్నారన్నారు. ఆ పూలను అగరబత్తీల తయారీలో వాడటం లేదని చెప్పారు. టీటీడీ ఆధ్వర్యంలోని పలు దేవస్థానాల్లో వినియోగించిన పూలను అగరబత్తీల తయారీకి వాడుతున్నామన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలను ఆధారం చేసుకుని ఈ వ్యాజ్యం వేశారే తప్ప, ఆగమ శాస్త్ర పండితులతో చర్చించలేదన్నారు. సింహాచలంలో స్వామికి పూసిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగా అందచేస్తారని తెలిపారు. అలాగే పూలతో చేసిన అగరబత్తీలను ఇంట్లో పూజలకు వాడుకోవాలన్న ఉద్దేశంతో టీటీడీ అగరబత్తీల తయారీకి నిర్ణయం తీసుకుందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. అసలు ఈ వ్యాజ్యానికున్న విచారణార్హత ఏమిటని ప్రశ్నించింది. పిటిషనర్ హక్కులకు భంగం కలిగి ఉంటే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలే తప్ప, పిల్ ఎలా వేస్తారని నిలదీసింది. అగరబత్తీల తయారీ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ ఉత్తర్వులిచ్చింది. -
శ్రీనివాసుని చెంత నుంచి.. టీటీడీ పరిమళ అగరబత్తీలు
తిరుపతి రూరల్/కల్చరల్/చంద్రగిరి (చిత్తూరు జిల్లా)/తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తయారు చేసిన పరిమళ అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 50 దేవాలయాల్లో స్వామి, అమ్మవార్ల పూజల్లో ఉపయోగించిన పూలతో ఈ అగరబత్తీలను తయారు చేస్తున్నామన్నారు. సోమవారం తిరుపతి ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఈవో జవహర్‌రెడ్డి, ఏఈవో పాల్గొన్నారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి లాభాపేక్ష లేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. ‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను తిరిగి అందుబాటులోకి తెచ్చాం. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నాం’ అని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకష్టి, స్పష్టి, తుష్టి, దష్టి పేర్లతో అగరబత్తీలను మార్కెట్లోకి విడుదల చేశామన్నారు. తిరుమలలో అగరబత్తీల అమ్మకాలు టీటీడీ తయారు చేసిన అగరబత్తీలు సోమవారం నుంచి తిరుమలలో భక్తులకు విక్రయిస్తున్నారు. లడ్డూ కౌంటర్ల వద్ద 3 కౌంటర్లు, శ్రీవారి ఆలయం ఎదురుగా పుస్తకాల విక్రయాల వద్ద ఓ కౌంటర్‌ను టీటీడీ ప్రారంభించింది. మొదటి రోజు అగరబత్తీలను భక్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. శ్రీనివాసమంగాపురంలో మినీ కల్యాణ కట్ట శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం సోమవారం మినీ కల్యాణ కట్టను ఆలయ అధికారులు ఓ భక్తురాలితో ప్రారంభింపజేశారు. ఆలయానికి వచ్చే భక్తులు, శ్రీవారిమెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు ఇక్కడ తలనీలాలు సమర్పించేందుకు అనువుగా ఉంటుందని ఆలయ డిప్యూటీ ఈవో శాంతి తెలిపారు. వచ్చే ఏడాదికి బంగారు తాపడం పనులు పూర్తి టీటీడీ అనుబంధంగా తిరుపతిలో ఉన్న శ్రీగోవిందరాజస్వామి వారి ఆలయంలో విమాన గోపురానికి రాగి రేకులపై బంగారు తాపడం పనులు వచ్చే ఏడాది మే నాటికి పూర్తి చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయంలో ఈనెల 9 నుంచి చేపట్టిన గోవిందుని బాలాలయ సంప్రోక్షణ సోమవారం ముగిసింది. కార్యక్రమానికి హాజరైన టీటీడీ చైర్మన్ మాట్లాడారు. తర్వాత అధికారులతో కలిసి ఆలయంలోని విమాన గోపురం, ఐనా మహల్ వంటి వాటిని పరిశీలించారు. త్వరలోనే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్య పెంపు: టీటీడీ చైర్మన్ పేదలకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉద్దేశంతో నాలుగు రోజుల కిందట నుంచి రోజుకు రెండు వేల సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రారంభించినట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ భక్తులకు ఈ సదుపాయం కల్పించామన్నారు. టోకెన్లు పొందేందుకు కౌంటర్ల వద్దకు వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. త్వరలోనే సర్వ దర్శనం టోకెన్ల సంఖ్య పెంచే అంశంపై అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు. -
తిరుపతిలో అగరబత్తీల కేంద్రాన్ని ప్రారంభించిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుపతి: టీటీడీ ఆధ్వర్యంలో అగరబత్తీల కేంద్రం సోమవారం ప్రారంభమైంది. ఈ కేంద్రాన్ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, ఏఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఆలయాల్లో వాడిన పూలతో అగరబత్తీలు తయారీని ప్రారంభించామని తెలిపారు. ఎలాంటి లాభాపేక్షలేకుండా దర్శన్ సంస్థ వీటిని తయారు చేస్తోందన్నారు. తిరుపతి, తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ‘‘ఏడు రకాల అగరబత్తీలను భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. ఎలాంటి కెమికల్స్ లేకుండా పరిమళభరితంగా తయారు చేస్తున్నారు. వాడిన పూలతో బొమ్మల తయారీని కూడా ప్రారంభించాం. సప్తగిరి మాసపత్రికను కూడా తిరిగి అందుబాటులోకి తెచ్చాం. రంగుల పేజీలతో శ్రీవారి సమాచారాన్ని అందిస్తున్నామని’’ టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి ఏడుకొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో అగరబత్తీలను టీటీడీ తయారీ చేపట్టింది. అభయహస్త, తందనాన, దివ్యపాద, ఆకృష్టి, స్పష్టి, తుష్టి, దృష్టి పేర్లతో అగరబత్తులను టీటీడీ విడుదల చేసింది. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో అగరబత్తీల విక్రయానికి టీటీడీ నిర్ణయించింది. -
7 బ్రాండ్లతో శ్రీవారి అగరబత్తీలు
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఉపయోగించిన పుష్పాలతో పరిమళభరిత అగరబత్తీలు తయారు చేసి భక్తులకు విక్రయానికి అందుబాటులోకి తీసుకువచ్చే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. శ్రీవారి ఏడు కొండలకు సూచికగా ఏడు బ్రాండ్లతో సెప్టెంబర్ 13వ తేదీ నుంచి అగరబత్తీల విక్రయాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ ఆలయాల్లో పూజలు, అలంకరణలకు రోజూ పుష్పాలు వినియోగిస్తున్నారు. పర్వదినాలు, ఉత్సవాల సమయంలో వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇలా ఉపయోగించిన పుష్పాలన్నీ మరుసటిరోజు ఉదయం తొలగిస్తారు. స్వామి సేవకు ఉపయోగించిన పుష్పాలు వృథా కాకుండా తిరిగి ఉపయోగించే విషయంపై టీటీడీ ఆలోచన చేసింది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ టీటీడీ ఆలయాల్లో రోజువారీగా వినియోగించిన పుష్పాలను అందిస్తే లాభం లేకుండా అగరబత్తీలు తయారు చేసి అందిస్తామని ముందుకు వచ్చింది. ఈ మేరకు ఆ సంస్థతో టీటీడీ అవగాహన కుదుర్చుకుని ఎస్వీ గోశాలలో అగరబత్తీల తయారీకి అవసరమైన స్థలం కేటాయించింది. దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థ తన సొంత ఖర్చులతో యంత్రాలు, సిబ్బందిని నియమించుకుని కొన్ని రోజులుగా ప్రయోగాత్మకంగా అగరబత్తీల ఉత్పత్తిని ప్రారంభించింది. తయారీ ఇలా.. టీటీడీ స్థానిక ఆలయాల్లో వినియోగించిన పుష్పాలను ఉద్యానవన విభాగం సిబ్బంది ఎస్వీ గోశాలలోని అగరబత్తీల తయారీ కేంద్రానికి తరలిస్తారు. ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది వీటిని రకాల వారీగా పుష్పాలను వేరు చేసి వాటిని డ్రైయింగ్ యంత్రంలో పూర్తిగా ఎండేలా చేసి పిండిగా మారుస్తారు. ఆ పిండికి నీరు కలిపి కొన్ని పదార్థాలతో మిక్సింగ్ చేస్తారు. ఈ మిశ్రమాన్ని మరో యంత్రంలో వేసి అగరబత్తీలు తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక యంత్రంలో 15 నుంచి 16 గంటల పాటు ఆరబెట్టిన తరువాత మరో యంత్రంలో ఉంచి సువాసన వెదజల్లే ద్రావకంలో ముంచుతారు. చివరగా వీటిని మరోసారి ఆరబెట్టి యంత్రాల ద్వారా ప్యాకింగ్ చేస్తారు. మొత్తం 10 యంత్రాల ద్వారా రోజుకు 3.50 లక్షల అగరబత్తీలు తయారుచేసేలా ఏర్పాట్లు చేశారు. -
సెప్టెంబర్ నుంచి టీటీడీ అగరబత్తులు
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల శ్రీవారికి వినియోగించిన పూలు.. తిరిగి పరిమళాలు వెదజల్లేలా టీటీడీ కార్యాచరణ రూపొందించింది. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ ఆలయాల్లో వాడిన పుష్పాలతో సుగంధాలు వెదజల్లే అగరబత్తులు తయారు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు బెంగళూరుకు చెందిన దర్శన్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోగా, ఆ సంస్థ ఏడు రకాల బ్రాండ్లతో అగరబత్తులు తయారు చేసి ఇస్తోంది. నో లాస్ నో గెయిన్ ప్రాతిపదికన ఆ సంస్థ అగరబత్తులను టీటీడీకి అందిస్తోంది. వీటిని తిరుమల, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురంతో పాటు టీటీడీ ఆలయాల్లో విక్రయానికి అందుబాటులో ఉంచుతారు. సెప్టెంబర్ తొలి వారంలో తిరుమలలో తొలి విడతగా వీటి విక్రయాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని గో సంరక్షణకు వినియోగించాలని నిర్ణయించారు. -
దోమల నివారణకు గోద్రెజ్ అగర్బత్తి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్న గోద్రెజ్ తాజాగా గుడ్‌నైట్ బ్రాండ్‌లో ‘నేచురల్స్ నీమ్ అగర్బత్తి’ పేరిట దోమల నివారణ స్టిక్స్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వేప, పసుపు మిశ్రమంతో ఈ ఉత్పాదనను తయారు చేశారు. రెండేళ్ల పరిశోధన అనంతరం నేచురల్స్ నీమ్ అగర్బత్తిని మార్కెట్లోకి తెచ్చినట్లు గోద్రెజ్ కన్సూ్యమర్ ప్రొడక్ట్స్ ఇండియా, సార్క్ సీఈవో సునీల్ కటారియా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘ఈ స్టిక్స్ 100 శాతం సహజ సిద్ధమైనవి. ఒక్కో బత్తి మూడు గంటల వరకు కాలుతుంది. 10 స్టిక్స్‌తో కూడిన ప్యాక్ ధర రూ.15. దేశంలో దోమల నివారణ ఉత్పత్తుల విపణి రూ.6,000 కోట్లుంది. ఇందులో గుడ్‌నైట్ వాటా రూ.2,500 కోట్లు’ అని వివరించారు. -
మారెమ్మతల్లికి ఐదు అడుగుల అగర్బత్తి
ఖమ్మంరూరల్: మం డలంలోని రెడ్డిపల్లిలో గల మారెమ్మతల్లి ఆ లయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అంబికాదర్బార్ అగర్బత్తి వారు అమ్మవారికి ఐదు అడుగుల పొడవుగల అగర్బత్తిని బహుమతిగా ఇచ్చారు. కంపెనీ సేల్స్మ¯ŒS ఉపేందర్, ఆలయ ప్రధాన అర్చకుడు రామశర్మకు అగర్బత్తిని అందించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు నరేంద్రశర్మ, సతీష్‌శర్మ, నిర్వాహకులు పురాణం చక్రధర్శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. -
అగర్‌బత్తీల్లో లోకల్ ఆధిపత్యం
- రూ.3,500 కోట్లకు పరిశ్రమ - ఏటా 6 శాతం మార్కెట్ వృద్ధి - ఆన్లైన్ సహా విస్తరణ బాటలో కంపెనీలు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొన్నాళ్ల కిందటి వరకూ... అగర్బత్తీ అంటే ఒకటే రంగు. సువాసన కూడా ఒకటే. అసలు అగర్బత్తీ అంటే ఇలాగే ఉంటుంది... ఇలా లేనిది అగర్బత్తీ కాదనే భావనతో ఉండేవారంతా. మరిప్పుడో...! మార్పు దీనికీ వ్యాపించింది. రకరకాల రంగులు. అత్తరు పరిమళాలను మించి రకరకాల సువాసనలు. ఇక బ్రాండ్ల విషయానికొస్తే చెప్పనక్కరే లేదు. లెక్కలేనన్ని ప్రాంతీయ బ్రాండ్లు. స్థానికంగా తయారీ ప్లాంట్లు ఉండడం, దశాబ్దాల తరబడి వ్యాపారాలను కొనసాగిస్తుండడంతో ఈ కంపెనీలు మార్కెట్లో గట్టి పట్టు సాధించాయి. అంతేకాదు ఒకటి రెండు ఉత్పత్తులకు పరిమితం కాకుండా కస్టమర్ల అభిరుచులను లోతుగా అధ్యయనం చేస్తూ... వాటికి అనుగుణంగా రకరకాల పరిమణాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తున్నాయి. ఇవన్నీ కలిసి కంపెనీల బ్రాండ్ ఇమేజ్ను బాగా పెంచుతున్నాయి. ప్రజల్లో ఆధ్యాత్మికత అంతకంతకూ పెరుగుతుండడంతో ఇదే ఊపుతో ప్రాంతీయ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నాయి. రూ.3,500 కోట్ల భారత అగర్బత్తీల విపణిలో దిగ్గజ కంపెనీలకు ప్రాంతీయ బ్రాండ్లు సవాల్ విసురుతున్నాయి. మార్కెట్లో వేటికవే సాటి... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఏటా రూ.300 కోట్ల విలువైన అగర్బత్తీల వ్యాపారం జరుగుతుండగా.. దాన్లో వ్యవస్థీకృత రంగం వాటా రూ.200 కోట్లు. ఇందులో 60% వాటాతో అంబికా దర్బార్బత్తి అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ 1946 నుంచి ఈ వ్యాపారంలో ఉంది. కర్ణాటకలో ‘వాసు’ బ్రాండ్ ముందంజలో ఉంది. 1949లో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ కంపెనీ.. 50కిపైగా దేశాలకు ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఇక 1954లో ప్రారంభమైన దేవ్ దర్శన్ బ్రాండ్ హరియాణా మార్కెట్లో స్థిరమైన వాటాను దక్కించుకోవటమే కాక... ఆన్‌లైన్‌లోనూ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 100కుపైగా ఉత్పత్తులను తయారు చేస్తూ 15 రాష్ట్రాల్లో విక్రయిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో గట్టి పట్టు సాధించిన ‘తిరంగ’ బ్రాండ్... ఉత్తర, తూర్పు భారత్‌లో పలు రాష్ట్రాలకు విస్తరించింది. నాలుగు తరాలుగా అగర్బత్తీల తయారీలో ఉన్న ‘హరి దర్శన్’... ఢిల్లీలో పాపులర్ బ్రాండ్. ప్రీమియం విభాగంలో...: కొన్ని కంపెనీలు మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రీమియం విభాగంలో పోటీ పడుతున్నాయి. ఖరీదైన అగర్బత్తీలు, ధూప్ బత్తీ, ధూప్ కోన్స్, ధూప్ స్టిక్స్‌ను విభిన్న పరిమళాల్లో తయారు చేస్తున్నాయి. ఒక్కో బత్తి ధర రూ.5 వరకు విక్రయిస్తున్న కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో సైకిల్ బ్రాండ్ ఒకటి. దేశీయ వ్యవస్థీకృత అగర్ బత్తీల మార్కెట్లో సైకిల్ బ్రాండ్‌కు 20% వాటా ఉంది. ప్రపంచంలో అత్యధికంగా ఏటా 900 కోట్ల అగర్బత్తీలను కంపెనీ తయారు చేస్తోంది. ఐటీసీకి చెందిన మంగళ్‌దీప్ బ్రాండ్ మార్కెట్లో పట్టుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జెడ్ బ్లాక్ పేరుతో ఇండోర్ కేంద్రంగా అగర్బత్తీలను తయారు చేస్తున్న మైసూర్ డీప్ పెర్ఫ్యూమరీ హౌస్... భారత్‌లో టాప్-5 కంపెనీల్లో ఒకటి. 500 రకాల ఉత్పత్తులను తయారు చేస్తూ... 10 దేశాలకు విస్తరించింది. పరిమళాల ప్రత్యేకత... అగర్‌బత్తీల్లో పరిమళాల తయారీ అంతా గోప్యంగానే సాగుతోంది. కొన్ని కంపెనీల్లో అయితే యజమానులకు మాత్రమే ఈ రహస్యం పరిమితం. ఈ విషయంలో ఒకో కంపెనీది ఒకో ప్రత్యేకత. కొన్నయితే పరిమళాల తయారీకి ఏళ్ల తరబడి సమయం వెచ్చించాయి కూడా. కొన్ని సంస్థలు ఫ్రాన్స్, టర్కీ, ఇండోనేిసియా నుంచి లావెండర్, రోజ్, క్లోవ్ ఆయిల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. సైకిల్ బ్రాండ్ 350 పరిమళాల్ని అభివృద్ధి చేయగా... అంబికా 100కు పైగా పరిమళాలను రూపొందించింది. సైకిల్ బ్రాండ్‌ను మైసూరుకు చెందిన ఎన్ఆర్ గ్రూప్ ప్రమోట్ చేస్తుండగా గ్రూప్ కంపెనీ అయిన నెస్సో ప్రస్తుతం 15 రకాల పూలు, 10 రకాల మొక్కల ఎక్స్ట్రాక్ట్స్ను విదేశాలకు ఎగుమతి చేస్తోంది. గ్రీన్ టీ, కాఫీ ఎక్స్ట్రాకసారంను సైతం విక్రయిస్తోంది. ఫార్ములేషన్స్ తయారీలోకి ప్రవేశించాలన్న ఆలోచన ఉందని ఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ ఆర్.గురు ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోకు తెలిపారు. న్యూట్రాస్యూటికల్స్, కాస్మెటిక్స్ తయారీలో ఇవి ఉపయోగపడతాయన్నారు. ఆధ్యాత్మికత పెరుగుతోంది... భారత్‌తోపాటు ఇతర దేశాల్లోనూ ఆధ్యాత్మికత పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. యువతలో ఇది అధికంగా కనపడుతున్నట్లు సైకిల్ బ్రాండ్ చెబుతోంది. ‘‘దేశంలో 76 శాతం మందికి అగర్బత్తీలు అందుబాటులో ఉన్నాయి. నెలకు సగటున ఒక్కో కుటుంబం రూ.20-50 ఖర్చు చేస్తోంది’’ అని సైకిల్ ప్యూర్ అగర్బత్తీస్ ఎండీ అర్జున్ రంగా చెప్పారు. 6 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తున్న రూ.3,500 కోట్ల దేశీయ అగర్బత్తీ మార్కెట్లో 50 శాతం వ్యవస్థీకృత రంగం కైవసం చేసుకుంది. మొత్తంగా 2,000 పైగా కంపెనీలు పోటీపడుతుండగా దేశం నుంచి రూ.500 కోట్ల విలువైన అగర్బత్తీలు ఎగుమతి అవుతున్నాయి. బ్రెజిల్, పెరు, కొలంబియా ప్రధాన మార్కెట్లు. పరిశ్రమ ఇప్పుడిప్పుడు ఆన్‌లైన్‌కు మళ్లుతోంది. తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెద్దగా పెరగకపోవడం పరిశ్రమకు ఊరట కలిగించే అంశం. అయితే వెదురు దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయన్నది కంపెనీల ఆందోళన. అగ్రశ్రేణి ఎఫ్ఎంసీజీ కంపెనీలు కొన్ని తయారీ వ్యయం కంటే తక్కువ ధరకే ఉత్పత్తులను విక్రయిస్తుండడంతో మార్కెట్లో నిలదొక్కుకోలేక పోతున్నామని చిన్న కంపెనీలు చెబుతున్నాయి.