ఆ రక్తమంటే దోమలు పడిచస్తాయట!
ఆ రక్తమంటే దోమలు పడిచస్తాయట!
Published Fri, Feb 10 2017 9:19 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM
న్యూఢిల్లీ: దోమల కారణంగా మానవులకు వచ్చే జబ్బులు చాలానే ఉన్నాయి. అందులో మలేరియా కూడా ఒకటి. మలేరియా గురించిన ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని స్టోక్ హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు బయటపెట్టారు. మలేరియా సోకిన వ్యక్తి రక్తమంటే దోమలు పిచ్చెక్కిపోతాయట. మలేరియా సోకిన వ్యక్తి శరీరంలోని క్రిమి హెచ్‌ఎమ్‌బీపీపీ అనే మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. దాని వల్ల మనుషుల్లోని ఎర్ర రక్తకణాలు కార్బన్ డై ఆక్స్‌డ్ ను అధిక మొత్తంలో విడుదల చేస్తాయని చెప్పారు.
ఆ సమయంలో మనిషి శరీరం నుంచి వచ్చే వాసన దోమలను ఆకర్షిస్తుందని తెలిపారు. వ్యక్తి నుంచి దోమలు సేకరించిన రక్తంలో ఉన్న మలేరియా క్రిములు వేరే వ్యక్తిని కుట్టినప్పుడు అతని శరీరంలోకి ప్రవేశిస్తాయని చెప్పారు. తాజా పరిశోధనలతో ప్రమాదకర రసాయనాలను వినియోగించకుండా మలేరియాను నయం చేసేందుకు అవకాశం ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు.
Advertisement
Advertisement