
ఎన్ని రకాల కాయిల్స్, లిక్విడ్స్ వాడినా దోమల బెడద తప్పడం లేదా? మీ సమస్యకు విస్‌కాన్సిన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరిష్కారాన్ని కనుక్కున్నారు. మట్టిలో ఉండే ఓ బ్యాక్టీరియా అత్యంత సమర్థంగా దోమలు దూరంగా పారిపోయేలా చేయగల రసాయనాన్ని సృష్టిస్తోందని వీరు గుర్తించారు. ఈ రసాయనం డీడీటీ కంటే చాలా శక్తిమంతమైందని అంచనా. డీడీటీతో దోమల నివారణ జరుగుతున్న కొన్ని ఇతర సమస్యల కారణంగా ఈ రసాయనంపై చాలా దేశాల్లో నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సహజసిద్ధమైన ప్రత్యామ్నాయం కోసం చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. జీనోరాబ్డస్ బుడపెస్టెనిసిస్ అనే బ్యాక్టీరియా కీటకాలను ఎలా చంపగలుగుతోందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. ఈ క్రమంలో బ్యాక్టీరియా విడుదల చేసే రసాయనం దోమలు దూరంగా పారిపోయేలా చేస్తున్నట్లు గుర్తించారు. బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తున్న రసాయనం డీడీటీ కంటే నాలుగు రెట్లు ఎక్కువ ప్రభావశీలి అని కూడా ఈ పరిశోధనల ద్వారా తెలిసింది. అంతేకాకుండా... ఈ రసాయనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు దోమలు రక్తం పీల్చకుండా మాత్రమే నిరోధిస్తోందని.. ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే దోమలు పారిపోయేలా చేస్తోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment