ముంబై: చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్ నిండా నింపుకుని కోర్డుకు వచ్చాడు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా. వాటిని జడ్జికి చూపిస్తూ దోమతెర కావాలని కోరాడు. సదరు గ్యాంగ్‌స్టర్ ఎజాజ్ లక్డావాలా పరారీలో ఉన్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం మాజీ సహచరుడు. అతనిపై మహారాష్ట్రలో పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. లక్డావాలాని 2020లో పోలీసులు అరెస్టు చేసి నావీ ముంబైలోని తలోజా జైల్లో పెట్టారు.
ఈమేరకు లక్డావాలా సెషన్ కోర్టులో దోమతెర కావాలంటూ అప్పీల్ పెట్టుకున్నాడు. అందుకోసం అని కోర్టుకి చనిపోయిన దోమలను ఒక ప్లాస్టిక్ బాటిల్‌లో వేసుకుని తీసుకువచ్చి...కోర్టులో చూపిస్తూ తాను తన సాటి ఖైదీలు వీటితో ఇబ్బందిపడుతున్నామని చెప్పాడు. పోలీసులు భద్రతా దృష్ట్యా దోమతెరలు అందించడం లేదని వాపోయాడు. ఐతే కోర్టు ఆ ఆపీల్‌ని తిరస్కరించింది.
దోమతెరకు బదులు ఓడోమోస్ వంటి దోమల నివారిణులను ఉపయోగించుకోవాల్సిందిగా సూచించింది. అంతేగాక జైలు అధికారులు దోమల బెడద అరికట్టే చర్యలను తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇలాంటి పలు ఫిర్యాదులు గతంలో కోర్టు ముంగిటకి వచ్చాయి. ఐతే వాటిలో కొందరికి దోమతెర వెసులుబాటు కల్పించారు కానీ కొందరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌కి మాత్రం ఆ వెసులుబాటు ఇవ్వడం లేదు.
(చదవండి: దోపిడికి గురయ్యాను కాపాడాలంటూ ఎమర్జెన్సీ కాల్! తీరా చూస్తే...)
Comments
Please login to add a commentAdd a comment