
కాన్సాస్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధించిన సందర్భంగా అమెరికాలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాన్సాస్‌లో విజయోత్సవ సభ నిర్వహించారు. గొప్ప విజయాన్ని అందించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, వైఎస్సార్‌సీపీ నాయకులకు, విజయ సారథి వైఎస్ జగన్‌కి శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ జగన్ నిర్వహించిన పాదయాత్ర వలన ప్రజల సమస్యలు పూర్తిగా తెలుసుకోవడమే కాకుండా, ఆయన చూపించిన పరిష్కార మార్గాలు, ప్రజలలో విశ్వాసం కలిగించిందని వైఎస్సార్ కంటే ఒక అడుగు ముందుకేసి పరిపాలిస్తారని ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎంతో సంతోషానిచ్చిందని వైఎస్సార్‌సీపీ కాన్సాస్ సిటీ కోర్ కమిటీ సభ్యులు జొన్నల సునీల్ రెడ్డి, సాగర్ సింగారెడ్డి, పి. సుబ్రమణ్యేశ్వరరావు, వంశి సువ్వారి, అశోక్ మేక, శివ తియ్యగూర, అవుతు విజయ్ భాస్కర్ రెడ్డి, చంద్ర యక్కలి, శ్రీనివాస్ ఓరుగంటి, శ్రీనుకుమార్ గాదిరాజు, శ్రీనివాసుల రెడ్డి చేవూరు, నరేంద్ర దుద్దెల, సుదర్శన్ చెమికాల, వెంకట్ మంత్రి, చిర్రారెడ్డి దివాకర్ రెడ్డి, సుమన్ సారెకుక్క, కిరణ్ కుమార్ రెడ్డి బడే తెలిపారు. 151 ఎమ్మెల్యే, 22 ఎంపీ సీట్లను గెలుచుకోవడం ప్రజావిజయమని పేర్కొన్నారు. ప్రజా నాయకుడు వైఎస్ జగన్‌కు పట్టంకట్టినందుకు ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసలు రెడ్డి (ఎంపీ, ఒంగోలు), మేకపాటి గౌతమ్ రెడ్డి (మినిస్టర్ ఆఫ్ ఐటీ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ఆత్మకూరు), బియ్యపు మధుసూదన్ రెడ్డి (ఎమ్మెల్యే , శ్రీకాళహస్తి ), మద్దిశెట్టి వేణుగోపాల్ (ఎమ్మెల్యే , దర్శి), కంగట్టి శ్రీదేవి (ఎమ్మెల్యే, పత్తికొండ), శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి (ఎమ్మెల్యే, నంద్యాల), గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి (ఎమ్మెల్యే, నర్సరావుపేట), బొత్స అప్పల నరసయ్య (ఎమ్మెల్యే, గజపతినగరం), ఆళ్ళ రామి రెడ్డి (వైఎస్సార్ ఫౌండేషన్)లు వైఎస్సార్సీపీ అభిమానులని ఉద్దేశించి మాట్లాడిన వీడియోలని ప్రదర్శించారు. కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుండి ముగిసే వరకు జై జగన్... జోహార్ వైఎస్సార్ నినాదాలతో హోరెత్తించారు. అతిథులందరికీ రుచికరమైన ఆహారాన్ని అందించిన గోదావరి రెస్టారెంట్ బృందానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment