వైరల్‌: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి! | Mother Eats Toddler Finger In A Viral Funny Video | Sakshi
Sakshi News home page

వైరల్‌: కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి!

Published Mon, Dec 14 2020 4:25 PM | Last Updated on Mon, Dec 14 2020 7:43 PM

Mother Eats Toddler Finger In A Viral Funny Video - Sakshi

వీడియో దృశ్యం

కాన్సాస్‌ : ‘కూతురి వేళ్లు కొరుక్కుతిన్న తల్లి’ అని చదవగానే ఆ తల్లి ఎంత క్రూరురాలో ఊహించుకుని, మనసులో ఆమెను తిట్టుకుని ఉంటారు కూడా. అయితే ఆ తల్లి నిజంగా తన కూతురి వేళ్లను కొరుక్కుతిన లేదు. కూతురి రియాక్షన్‌ చూద్దామని తిన్నట్లు నటించిందంతే. వివరాల్లోకి వెళితే.. కొద్ది రోజుల క్రితం అమెరికాలోని కాన్సాస్‌కు చెందిన ఓ మహిళ తన కూతురు జోషఫైన్‌ చార్లీ వేళ్లను  నోట్లో పెట్టుకుని కొరికి తిన్నట్లు నటించింది. అయితే తన చేతి వేళ్లను చూసుకున్న చార్లీ నిజంగా తల్లి వాటిని తిన్నట్లు ముఖం పెట్టింది. వెక్కివెక్కి ఏడ్చింది. ( మీ కథ చెబితే డబ్బులిస్తాడు )

సదరు మహిళ ఇందుకు సంబంధించిన వీడియో తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘తన వేళ్లు తిన్నందుకు చార్లీ ఇప్పటికీ నాపై కోపంగా ఉంది’’ అంటూ శీర్షికను జోడించింది. డిసెంబర్‌ 13న షేర్‌ అయిన ఈ వీడియో వేల సంఖ్యలో వ్యూస్, పదుల సంఖ్యలో కామెంట్లు‌ సంపాదించుకుంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు..‘‘ఈ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందే!.. నువ్వేం తల్లివి చంటిపిల్లను అలా ఏడిపించొచ్చా?.. పిదప కాలం పిల్లలు.. పిదప కాలం బుద్ధులు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement