ఆమ్‌స్టర్ డ్యామ్: నెదర్లాండ్‌లో ఒక సబ్‌వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
Published Wed, Nov 4 2020 3:35 PM | Last Updated on Wed, Nov 4 2020 5:19 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment