tail
-
మనుషులకు తోకలు ఎలా మాయమైపోయాయి?
కోతి నుంచి రూపాంతరం చెంది మనిషిగా ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని లక్షల ఏళ్ల మార్పు తర్వాత.. నేటి ఆధునిక మనిషిగా మార్పు చెందాడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్యాప్‌లో చాలా మార్పులు జరిగాయి. అందులో ఒక ముఖ్యమైనది.. మనిషికి ఉన్న తోక మాయమైపోవడం! అవును.. తొలినాళ్లలో మనుషులకు తోకలు కూడా ఉండేవని.. పరిణామ క్రమంలో కొద్ది కొద్దిగా తోక మాయమైపోయింది. మరి ఆ తోక ఎప్పుడు మాయమైపోయిందో సరిగ్గా ఎవరికి తెలీదు.. ఈ విషయమే ఇప్పుడు తెలుసుకుందాం!. దాదాపుగా ప్రతీ జంతువుకూ, పక్షికీ తోక ఉంటుంది. వాటి శరీర నిర్మాణాన్ని బట్టి.. అవి పలు రకాలుగా ఉంటాయి. మనలో చాలా మందికి.. ఆ తోక గురించి తెలుసు తప్ప, అది ఎంతగా ఉపయోగ పడుతుందో తెలియదు. ఒక పక్షి ఆకాశంలో అలుపు లేకుండా ఎంతదూరమైనా ప్రయాణించడానికి కేవలం రెక్కలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా తోక కూడా ఉండాల్సిందే. లేదంటే.. వేగమే కాదు సరిగా ఎగరలేవు కూడా. నీటిలోని చేప సంగతి చూస్తే.. వాయువేగంతో ప్రయాణించే మీనాలకు తోకే ప్రధాన ఆధారం. ఉన్నట్టుండి ఏ టర్న్ తీసుకోవాలన్నా కూడా తోకే కీలకం.ఇక నాలుగు కాళ్ల జంతువులన్నీ.. పరిగెత్తాలన్నా.. నడవాలన్నా.. వాటి గమనాన్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయడానికి తోక ఎంతో సాయం చేస్తోంది. ఇక కొన్ని తేళ్లు, పాము వంటి విషపూరిత జీవులకు ఆ తోకే రక్షణ ఆయుధంలా పనిచేస్తుంది. అలాంటి తోకలు తొలుత మానవులకు కూడా ఉండేది. కానీ కాలక్రమేణ అది అదృశ్యమైపోయింది. ఇది ఎలా జరిగింద? ఎందువల్ల అనేది శాస్త్రవేత్తల మదిని తొలిచే ప్రశ్న. అందుకోసం ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 25 మిలియన్ల ఏళ్లక్రితం మానవులకు తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీని గురించి అప్పట్లో చార్లెస్డార్విన్ ఇచ్చిన వివరణ పెద్ద విప్లవంగా మారింది. ఒక్కసారిగా అందరీ దృష్టి ఈ దిశగా అడుగులు వేసేలా చేసి, పరిశోధనలు చేసేందుకు నాంది పలికింది. కానీ తోక ఎలా కనుమరుగైందనేది చిక్కు ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి ఇప్పుడు జియా అనే శాస్త్రవేత్త చేసిన పరిశోధన వివరణాత్మక సమాధానం ఇచ్చింది. మానవ పిండం తొలి దశలో తోకలా ఉండి ఆ తర్వాత అది నెమ్మదిగా చీల్చుకుంటూ వెన్నుపూస, కండారాలుగా ఏర్పడతాయని అన్నారు. ఆ క్రమంలో వచ్చే జన్యు మార్పులను గమనించారు. అలాగే తోకలు అభివృద్ధి చేసే జంతువుల జన్యవులో, తోకలేని మనిషి జన్యవులోనూ టీబీఎక్స్‌టీ అనే కామన్ జన్యు క్రమాన్ని గుర్తించారు. దీనిలో వచ్చే మార్పులు కారణంగానే తోకలు అదృశ్యమైనట్లు కనుగొన్నారు. దీన్ని జన్యుమ్యుటేషన్గా పేర్కొన్నారు. ఈ టీబీఎక్స్టీని జన్యుమ్యుటేషన్ని ఎలుకల్లో ప్రవేశ పెట్టగా వాటికి పుట్టిన సంతానంలో చాలా వరకు ఎలుకలు తోకను అభివృద్ధి చేయలేకపోయాయి. కొన్నింటికి చిన్నగానే ఉండిపోయింది తోక. ఈ జన్యు ఉత్పరివర్తనాల మ్యుటేషన్‌ను దాని తరువాత తరానికి పంపుతూ ఉంటుంది ఆ క్రమంలోనే తోకలు పూర్తిగా అదృశ్యమవుతాయని సవివరంగా వెల్లడించారు శాస్త్రవేత్తలు. (చదవండి: దీపావళికి ఈసారి టపాసులు పేలతాయా? కాలుష్యం "కామ్" అంటోందా?) -
తోకతో రికార్డు కొట్టేసింది...
ఈ ఫొటోలో విలాసంగా పోజు పెట్టిన పిల్లిని చూశారు కదా! చాలా పిల్లుల్లాగానే ఇది కూడా మామూలు పిల్లి మాత్రమే అనుకుంటే పొరపాటే! ఇది అలాంటిలాంటి పిల్లి కాదు, సుదీర్ఘవాలం కలిగిన మార్జాలరాజం. పొడవుగా పెరిగిన తోకే దీనికి రికార్డు తెచ్చిపెట్టింది. అమెరికాలో మిషిగన్‌కు చెందిన డాక్టర్ విలియమ్ జాన్ పవర్స్ పెంచుకుంటున్న ఈ ఐదేళ్ల పిల్లి ప్రపంచంలోనే అత్యంత పొడవైన తోక కలిగిన పిల్లిగా ఇటీవల గిన్నిస్ రికార్డు సాధించింది. దీని పేరు అలై్టర్. దీని తోక పొడవు 16.07 అంగుళాలు. ప్రపంచంలో మరే పిల్లికీ ఇంత పొడవాటి తోక లేదని గిన్నిస్‌బుక్ అధికారులు ధ్రువీకరించారు. అలై్టర్ మాత్రమే కాదు, దీని తోబుట్టువులైన ఆర్కటరస్, ఫెన్రిర్లు ఇదివరకు అతి పొడవాటి పిల్లులుగా గిన్నిస్ రికార్డులు సాధించాయి. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు!) -
షాకింగ్.. తోకతో జన్మించిన చిన్నారి.. ఫొటో వైరల్..
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు. చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..? -
డిడిమోస్ ఢీ! గ్రహశకలానికి తోకలు! గుర్తించిన హబుల్ టెలిస్కోప్
గ్రహశకలాల కక్ష్యను మార్చి భూమికి వాటి ముప్పును తప్పించే లక్ష్యంతో నాసా నెల క్రితం డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) ఉపగ్రహంతో డిడిమోస్ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టించడం తెలిసిందే. ఫలితంగా డిడిమోస్ నుంచి బయటికి పొడుచుకొచ్చిన రెండు తోకలను హబుల్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దానిచుట్టూ కమ్ముకున్న ధూళి మేఘాలను కూడా గమనించింది. తోకలు పుట్టుకు రావడం అనూహ్యమని నాసా అంటోంది. వీటితో గ్రహశకలానికి ఏం సంబంధమో తేల్చే పనిలో ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్యలో డిడిమోస్ తిరిగే వేగంలో 32 నిమిషాల మేరకు మార్పు వచ్చినట్టు తేలింది! ఇలా మొత్తం 18 విశేషాలను హబుల్ ఇప్పటికి గుర్తించింది. -
జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక!
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు. ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు. -
అరుదైన వింత సంఘటన... తోకతో పుట్టిన బాలుడు
బ్రైజిల్: మానవుడు కోతి నుంచి పుట్టాడని కొందరూ, చింపాజీ నుంచి అని మరికొందరూ చెబుతారు. ఏదిఏమైనా మొదట్లో మానవునికి తోకలు ఉండేవని ఆ తర్వాత క్రమక్రమంగా తోకలు లేవని చెబుతుంటారు. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు గానీ బ్రెజిల్‌లోని ఒక బాలుడు మాత్రం తోకతో జన్మించాడు. (చదవండి: అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని) పైగా ఆ తోక 12 సెం.మీ పొడవుతో చివర ఒక బంతి ఆకారం ఉంటుంది. నిజానికి మానవుని జనన సమయంలో నాలుగు నుంచి ఎనిమిది వారాల గర్భధారణలో మొదట పిండం తోకల రూపంలోనే పెరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా నెలలు నిండే కొద్ది అవయావలు ఏర్పడి పూర్తి మానవ శరీర రూపంలోకి మారిపోతుంది. కానీ అనూహ్యంగా ఇది పిండంతోపాటుగా ఈ తోక కూడా పెరిగింది. అయితే ఫోర్టలేజాలోని ఆల్బర్ట్ సబిన్ చిల్డ్రన్స్ హాస్పిటల్లో శిశువు జన్మించిన సమయంలో 'తోక' 12 సెం.మీ వరకు పెరిగి 4 సెం.మీ వ్యాసం కలిగిన బంతిని కలిగి ఉన్నట్లు మెడికల్ జర్నల్ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు డాక్టర్లు శస్త్ర చికిత్స ద్వారా ఆ శిశువుకు తోకను తొలగించినట్లు తెలిపారు. ఇలాంటి అరుదైన కేసులు సుమారు 40 వరకు చూశామని చెప్పారు. ఈ అరుదైన మానవ తోకల గురించి సమగ్రంగా రేడియోలాజికల్ పద్ధతుల ద్వారా అధ్యయనం చేయల్సిన అవసరం ఉందని అన్నారు. (చదవండి: వింత ఇల్లు.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!) -
అసాధ్యురాలు.. ఏకంగా సింహం తోకపట్టుకుని
సింహాలను టీవిల్లోని డిస్కవరీ ఛానల్లోనో లేక ఏదైన జూ పార్క్‌లలో చూసి ఉంటాం. కానీ దాన్ని సరాసరిగా చూడటానికే భయపడతాం. అలాంటిది ఒక అమ్మాయి సింహం తోక పట్టుకుని మరీ నడిచేస్తుంది. అసలు ఆమె ఎవరు, ఎక్కడ జరిగింది చూద్దాం రండి. (చదవండి: మీది గొప్ప మనసు ..ఇష్టంగా వీడ్కోలు చెప్పేలా చేశారు!) అసలు విషయంలోకెళ్లితే.....వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా కూతురు వసుంధర పత్నీ సింహg తోక పట్టుకుని నవ్వుతూ నడుస్తుంది. అయితే ఆమె తండ్రి ఇండియన్ ఆర్పీజీ గ్రూప్ కాంగ్లోమెరిట్ ఛైర్మన్ అయిన హర్ష్ గోయెంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో తోపాటు" అది నా కూతురు. మీరు ఆమె తల్లిని ఊహించుకోగలరా " అనే క్యాప్షన్‌తో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఇది దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన పార్క్‌లోని వన్యప్రాణుల పర్యటనలోనిదని, అక్కడ నిపుణుల సమక్షంలో పెద్ద పులులతో ఎంజాయ్ చేస్తారు అంటూ రకరకాలు ట్వీట్ చేశారు. (చదవండి: వృద్దుడు చేసిన వెరైటీ చాట్) -
మన తోకలకు కత్తెర పడిందెలా?
మనిషికి, కోతికి పోలికలు ఎన్ని ఉన్నా.. ప్రధానమైన తేడా.. తోక! పూర్వీకులు ఒకరే అయినా.. మనిషి తోకలేకుండా ఎదిగితే.. కోతులు అలాగే ఉండిపోయాయి ఇది అందరికీ తెలిసిన విషయమే.. కానీ ఈ మార్పు జరిగిందెలా? యాభై కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు పొడవాటి తోక ఉండేది. చేపల మాదిరిగా ఈ తోకలను సముద్రాల్లో సులువుగా ఈదేందుకు వాడేవారు. కొన్నికోట్ల ఏళ్ల తర్వాత ఈ తోకలే.. చెట్టు కొమ్మలపై సమతులంగా నడిచేందుకు సాయపడ్డాయి. మరికొంత కాలం గడిచిన తరువాత అంటే.. సుమారు రెండున్నర కోట్ల ఏళ్ల క్రితం ఆ తోకలు మాయమైపోయాయి! ఈ విషయాన్ని అందరికంటే ముందుగా గుర్తించింది పరిణామ సిద్ధాంతకర్త చార్లెస్ డార్విన్. కానీ ఓ జన్యుమార్పు కారణంగా మన తోకలు మాయమైపోయాయని గుర్తించింది మాత్రం న్యూయార్క్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం. రెండు వారాల క్రితం ఈ పరిశోధన వివరాలు ఆన్లైన్లో ప్రచురితమయ్యాయి. ఆ వివరాలివీ.. మనిషి తన తోకను వదిలించుకోవడం పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన ఘట్టం. కోతులకు తోకలు ఉన్నా చింపాంజీలు, ఒరాంగ్ ఊటాన్ వంటి వానర జాతుల్లో మాత్రం తోకలు లేవు. కాకపోతే వాటిలో, మనలోనూ తోక తాలూకు అవశేషం కటి వలయం మధ్యన కొన్ని ఎముకల నిర్మాణం రూపంలో ఉంటుంది. ఇంగ్లిష్‌లో ఈ అవశేషాన్ని కోసిక్స్ అని పిలుస్తారు. ఇది తోక అవశేషం అనడంలో ఎలాంటి సందేహం లేదని డార్విన్ స్వయంగా స్పష్టం చేశారు కూడా. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ తోక తొలగిపోయిందెలా? అన్న అంశంపై పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి కూడా. పలుచోట్ల తవ్వకాల్లో బయటపడ్డ పురాతన శిలాజాల ఆధారంగా చూస్తే.. కనీసం 6.6 కోట్ల ఏళ్ల క్రితం అన్ని వానర జాతుల్లో పూర్తిస్థాయిలో తోక వంటి నిర్మాణం ఉంది. కానీ రెండు కోట్ల ఏళ్ల క్రితం నాటి శిలాజాల్లో మాత్రం తోకల స్థానంలో కోసిక్స్ కనిపించాయి. ఈ పరిణామం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు నూయార్క్ యూనివర్సిటీ శాస్త్రవేత్త బో షియా గత ఏడాది కొన్ని పరిశోధనలు చేపట్టారు. కొన్నిరకాల జంతువుల్లో తోకలు ఎలా ఏర్పడుతున్నాయో గుర్తించేందుకు ప్రయత్నించారు. పిండంగా ఉన్నప్పుడే కొన్ని మాస్టర్ జన్యువులు చైతన్యవంతం కావడం వల్ల వెన్నులోని భాగాలు మెడ, లంబార్ ప్రాంతంగా విడిపోతాయని.. పిండం ఒక చివరలో కనిపించే బొడిపెలాంటి నిర్మాణంలో ఎముకలు, కండరాలు, నాడులు అభివృద్ధి చెంది తోకలుగా మారతాయని బో గుర్తించారు. తోక ఏర్పడటంలో దాదాపు 30 జన్యువులు పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఈ ముప్పై జన్యువుల్లో ఏదో ఒక జన్యువులో వచ్చిన మార్పుల ప్రభావం వల్లనే మనిషి తోకను కోల్పోయి ఉంటాడని అంచనా కట్టిన బో.. దాన్ని గుర్తించే ప్రయత్నం చేశారు. తోకల్లేని వానరాలు ఆరింటి డీఎన్ఏను, తోకలున్న తొమ్మిది రకాల కోతుల డీఎన్ఏతో పోల్చి చూసినప్పుడు ‘టీబీఎక్స్‌టీ’ అనే జన్యువులోని మార్పులు కారణమైనట్టు గుర్తించారు. ఈ మార్పులు మనుషులు, చింపాంజీల్లాంటి వానరాల్లో కనిపించగా.. తోకలున్న కోతుల్లో మాత్రం లేకపోవడం గమనార్హం. – సాక్షి, హైదరాబాద్ ఎలుకలపై ప్రయోగాలతో.. ‘టీబీఎక్స్‌టీ’ జన్యువులో వచ్చిన మార్పుల కారణంగానే మనకు తోకలు లేకుండా పోయాయా? అన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు బో షియా.. జన్యుమార్పులు చేసిన పలు ఎలుకలపై ప్రయోగాలు చేశారు. మనుషుల టీబీఎక్స్‌టీ జన్యువులో ఉన్న మార్పులే కలిగి ఉన్న ఎలుకల పిండాలు అభివృద్ధి చెందినప్పుడు.. చాలా వాటిలో తోకలు వృద్ధి చెందలేదు. కొన్నింటిలో తోకలు పెరిగినా వాటి సైజు చాలా చిన్నగా ఉండిపోయింది. ఈ ప్రయోగాల ఆధారంగా బో చెప్పేది ఏమిటంటే.. సుమారు రెండు కోట్ల ఏళ్ల క్రితం ఈ జన్యుమార్పు వానరాల్లో యాదృచ్ఛికంగా జరిగి ఉంటుందని, తర్వాత వారసత్వంగా కొనసాగడం వల్ల తోకలు లేకుండా పోయాయి అని!! కొసమెరుపు ఏమిటంటే.. తోకలు ఎలా పోయాయో తెలిసింది కానీ.. దీనివల్ల వచ్చిన లాభమేమిటన్న ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. -
పిల్లి తోక కత్తిరించారు.. వారిని అరెస్ట్ చేయండి
ముంబై: మూగజీవాలను హింసిస్తే నేరమనేది అందరికీ తెలుసు. అయినా కూడా వాటిపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా కొందరు ఓ పిల్లి తోక కత్తిరించడంతో ఓ జంతు ప్రేమికుడు తల్లడిల్లిపోయాడు. వెంటనే వైద్యం అందించి నేరుగా పోలీస్‌స్టేషన్ చేరుకున్నాడు. పిల్లి తోక కత్తిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అతడు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలోని మలాడ్ పశ్చిమ ప్రాంతంలో అజయ్ షా నివసిస్తున్నాడు. అతడు జంతు ప్రేమికుడు. అతడి ఇంటికి రోజూ ఓ పిల్లి వస్తుండడంతో దానికి ఆహారం అందిస్తూ ప్రేమగా చూసుకుంటున్నాడు. అయితే ఆదివారం (మే 2) మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆ పిల్లి తీవ్ర గాయాలతో ఇంటికి వచ్చింది. దాన్ని చూసి అజయ్ ఆందోళన చెందాడు. పిల్లిని పరిశీలించగా తోక మొత్తం ఎవరో కత్తిరించి ఉంది. వెంటనే ఆ పిల్లిని ఎవర్షైన్నగర్లోని వెటర్నరీ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ దానికి చికిత్స అందించారు. అయితే పిల్లి తోకను పదునైన ఆయుధంతో కత్తిరించారని అక్కడి సిబ్బంది తెలిపారు. అయితే పిల్లి తోకను ఎవరో ఉద్దేశపూర్వకంగా కత్తిరించాడని భావించి మలాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పిల్లి తోక కత్తిరించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అందించాడు. ఈ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆయన నివసిస్తున్న ప్రాంతాలను సీసీ ఫుటేజీలో పరిశీలిస్తున్నారు. పిల్లి తోక కత్తిరిస్తున్న వారిపై జంతు క్రూరత్వ నిరోధక చట్టం (సెక్షన్ 428) కింద కేసు నమోదైంది. చదవండి: తొలిసారి గిరిజన ఎమ్మెల్యేకు సోకిన కరోనా చదవండి: డీఎంకే విజయంలో ‘ఇటుక’దే కీలక పాత్ర -
రైలును ప్రమాదం నుంచి కాపాడిన తిమింగలం!
ఆమ్స్టర్ డ్యామ్: నెదర్లాండ్‌లో ఒక సబ్వే రైలు ప్రమాదానికి గురి కాకుండా తృటిలో తప్పించుకుంది. సోమవారం తీసిన వైమానిక ఫోటోలో ఆ రైలును చూడవచ్చు. డి అక్కర్స్ మెట్రో స్టేషన్ వద్ద అదుపు తప్పిన రైలు నేరుగా రైలింగ్‌ను ఢీకొట్టి ముందుకెళ్లిపోయింది. అయితే పట్టాలను అనుకొని ఉన్న భారీ తిమింగలం తోక మీద ఆగింది. రోటర్ డామ్ మెట్రోకు దక్షిణంగా ఉన్న స్టేషన్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆర్కిటెక్ట్ స్ట్రూయిజ్స్ అనే వ్యక్తి 20 ఏళ్ల క్రితం తిమింగలాలు వంటి శిల్పాలను అక్కడ నిర్మించారు. ఈ సంఘటన గురించి స్ట్రూయిజ్ మాట్లాడుతూ, నేను ఆశ్చర్యపోయాను ఇలాంటి ఘటనను అసలు ఊహించలేదు. అయితే ఈ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నా అని అన్నారు. అదృష్టవశాత్తు రైలును పార్క్ చేయడానికంటే ముందే ప్రయాణికులందరూ దిగేశారు. ఆ సమయంలో లోకో పైలెట్ ఒక్కడే ఉన్నాడు. ఈ ప్రమాదంలో అతను ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. ఈ ప్రమాదం 30 అడుగుల ఎత్తులో జరిగింది. ఒక వేళ తిమింగలం తోక కనుక అక్కడ లేకపోతే పెను ప్రమాదమే జరిగేది. రైలును అక్కడ నుంచి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: పాపకి ఊహించని గిఫ్ట్.. డాడీ అంటూ.. -
శభాష్.. మహేష్
యాప్రాల్: కృషి, పట్టుదల ఉండి లక్ష్యాన్ని ఏర్పరచుకొని కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో అద్బుతాలు సుష్టించవచ్చని నిరూపించాడో యువకుడు.బుధవారం యాప్రాల్ ప్రగతి ఉన్నత పాఠశాల ఆవరణలో ఒకినవ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమి ఆద్వర్యంలో ఇంటర్నేషనల్ వండర్ బక్ ఆఫ్ రికార్డ్ పోటీలు నిర్వహించారు. వండర్ బక్ ఆప్ రికార్డ్స్, జీనియస్ బక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా కో ఆర్డినేటర్ బింగి నాగెందర్గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా పోలో రమేష్ బ్లాక్ బెల్ట్, పాఠశాలలో ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 9.35 నిమిషాలలో 1000 టైల్స్పే తన నుదిటితో పగులగొట్టి ఇంటర్నేషన్ వండర్ బక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ రికార్డ్స్ 16 నిమిషాలలో చేయాల్సి ఉండగా రమేష్ కేవలం 9 నిమిషాల 35 సెకన్లలోనే సాధించాడు. చీఫ్ జడ్జి బింగి నాగెందర్గౌడ్, పాఠశాల కరస్పాండెంట్ శ్రీనువాసురెడ్డి, ఒకనవ మా ర్షల్ ఆర్ట్స్ కరాటే మాస్టర్ కిషోర్‌కుమార్, నాగెందర్, సమక్షంలో వండర్ బక్ ఆప్ రికార్డ్స్ పతకం, సర్టిఫికట్ అందుకున్నాడు. -
కొత్తరకం డైనోసార్ అస్థిపంజరం గుర్తింపు!
టాంజానియా : డైనోసార్ల గురించి జరిగే చర్చ అంతా ఇంతా కాదు. వేల ఏళ్ల కిందట అంతరించి పోయిన ఈ జీవులపై ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు ఎప్పటికప్పుడు బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా ఆఫ్రికాలో మరో కొత్త జాతి డైనోసార్ అస్థిపంజరాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. తోక భాగాల్లో గుండె ఆకారంలో ఎముక ఉండడం ఈ డైనోసార్ల ప్రత్యేకత. టైటనోసారస్ జాతికి ఈ చెందిన ఈ డైనోసార్ శిలాజాన్ని టాంజానియాలోని మొటుకా నది సమీపంలో ఉన్న ఓ క్వారీలో గుర్తించినట్లు మిడ్ వెస్టర్న్ యూనివర్సిటీ పరిశోధకులు ప్రకటించారు. పొడవైన మెడ, 70 టన్నుల బరువుతో ఉండే ఈ డైనోసార్లు నాలుగు కాళ్లపై నడిచేవని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సుమారు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట క్రిటేషియస్ శకంలో అంతరించిపోయిన డైనోసార్లలో ఇవీ ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. సాధారణంగా తోక భాగంలో గుండె ఆకారంలోని ఎముకతో కూడిన రాక్షసి బల్లులు అరుదని, కానీ తాము కనుగొన్న డైనోసార్ అస్థిపంజరం తమ అంచనాలను మార్చిందని ఈ పరిశోధకులు అంటున్నారు. పరిశోధనలు కొనసాగుతున్నాయని, ఇవి మాంసాహారులా కాదా అనే విషయం తేలాల్సి ఉందని పేర్కొన్నారు. -
కోడిగుడ్డుకు తోక..
తూర్పుగోదావరి :కరప మండలం పేపకాయలపాలెంలో రాయుడు సుబ్రహ్మణ్యం ఇంట్లో ఓ కోడి ఆదివారం పెట్టిన గుడ్డుకు తోక ఏర్పడింది. విచిత్రంగా ఉండటంతో దీనిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. -
ఎనిమిదేళ్ల బాలుడిని దైవంగా భావించి..
అమృత్సర్: పంజాబ్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలుడిని ప్రజలు దైవంగా భావించి పూజిస్తున్నారు. హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తూ ఆరాదిస్తున్నారు. కొందరు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అతడిని దర్శించుకొని వెళ్తుంటారు. దీనంతటికీ కారణం అతడికి హనుమంతుడికి ఓ విషయంలో సారూప్యత ఉండటమే. అమృత్‌సర్‌లో నివసించే దుల్హా సింగ్ అనే బాలుడికి వీపు కింది భాగంలో చిన్న తోకలా వెంట్రుకలు ఏర్పడ్డాయి. అది హనుమంతుడి తోకలా ఉందని, దేవుడి అనుగ్రహంతో అలా ఏర్పడిందని భావిస్తున్న చుట్టుపక్కల వారు ఆ బాలుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఓసారి ఆ తోకను కత్తిరించాలని భావించిన దుల్హా తల్లి హఠాత్తుగా మరణించిందని ప్రస్తుతం అతడి ఆలనా పాలనా చూస్తున్న అంకుల్ సాహిబ్ సింగ్ వెల్లడించారు. తోక వలన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని దుల్హా సింగ్ చెబుతున్నాడు. పైగా అది ఉండటం వల్ల అందరూ తనను గౌరవిస్తున్నారని, దానిని దేవుడిచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానని అంటున్నాడు. అయితే.. జనమంతా వచ్చి తనకు పూజలు ఎందుకు చేస్తారో తెలియడం లేదని అమాయకంగా చెబుతున్నాడు. తోక మూలంగా కొంత మంది తనను ఎగతాళి కూడా చేస్తారని అయితే వాటిని తానేమీ పట్టించుకోనని అంటున్నాడు. దుల్హాను చూడటానికి వస్తే పరవాలేదు గానీ.. పూజించడం లాంటివి చేయొద్దని చెప్పినా జనం వినిపించుకోవడం లేదని అంకుల్ సాహిబ్ సింగ్ తెలిపారు. -
నరుడి తోక.. కత్తిరింపు!
నాగ్‌పూర్: ఎవరిమీద అయినా కోపమొస్తే.. వాడి తోక తెగ్గోస్తా అంటా మన కోపాన్ని వ్యక్తం చేస్తాం. అయితే మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడికి దురదృష్టవశాత్తూ నిజంగానే తోక మొలిచింది. నాగపూర్ డాక్టర్లు ఎంతో శ్రమించి శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. అసాధారణంగా 18 అంగుళాలు పెరిగిన తోక వల్ల తీవ్రమైన నొప్పితో వచ్చిన బాలుడిని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రక్షించారు. గత వారం తీవ్రమైన నొప్పితో 18 ఏళ్ల బాలుడు ఆసుపత్రికి వస్తే సర్జరీ చేసి తోకను తీసివేశామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్.ప్రమోద్ గిరి అన్నారు. ‘బాలుడు పుట్టినప్పటి నుంచి తోక ఉంది. క్రమంగా పెరుగుతూపోవడం వల్ల అతడికి కూర్చోవడం, పడుకోవడానికి ఇబ్బంది కలిగింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని ఆయన చెప్పారు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేష¯ŒS అని, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్జరీ ముగించామని ప్రమోద్ వివరించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద తోకను తొలగించడం ఇదే మొదటిసారని ప్రమోద్ విశదీకరించారు. -
బాలాంజనేయులు
పరిపరి శోధన ఆ మధ్య ఎప్పుడో వినాయక విగ్రహాలు పాలు తాగినట్టే, కొంతమందికి బాలాంజనేయులు పుట్టినట్టు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. జన్యుపరమైన కొన్ని లోపాల వల్ల కొందరు చిన్నారులు వెనకభాగంలో కణుతులు, సిస్టులతో పుడుతుంటారు. దానినే మనవాళ్లు తోక అని చెప్పుకుంటుంటారు. నిజానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ వారంలో చిన్నారులకు తోక ఏర్పడుతుందట. అయితే ఎనిమిదవ వారానికల్లా అది కాస్తా మాయమవుతుంది. అలా ఏర్పడ్డ తోకనే ఎంబ్రియో అంటారు. కొద్దిమంది చిన్నారులకు మాత్రం ఈ ఎంబ్రియో దానంతట అది కుదించుకుపోదు. అలాంటివాళ్లే తోకలాంటి అవయవంతో పుడతారు. నిజానికి అది తోక కాదు... చిన్నచిన్న కండరాలు, కణాల సముదాయం. ఈ విధంగా తోకతో పుట్టేవారి గురించి ఆ మధ్య ఎప్పుడో‘స్పెక్ట్రమ్ ఆఫ్ హ్యూమన్ టెయిల్స్’ పేరిట ఒక పరిశోధన పత్రం కూడా ప్రచురితమయింది. -
సముద్రంలో విమానం తోక
ఏయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరణ జకార్తా/సింగపూర్: జావా సముద్రంలో కూలిపోయిన ఎయిర్ ఆసియా విమానం తోక భాగాన్ని బుధవారం గుర్తించారు. దీంతో ప్రమాద కారణం తెలుసుకోవడానికి వీలు కల్పించే బ్లాక్‌బాక్స్ స్వాధీనంపై ఆశలు పెరిగాయి. బ్లాక్ బాక్స్ విమానం తోక భాగంలోనే ఉంటుంది. తోక భాగంలో ఒక సిగ్నల్‌ను గుర్తించామని, అయితే డైవర్లు దాన్ని మరోసారి గుర్తించలేకపోయారని అధికారులు చెప్పారు. సిగ్నల్ గుర్తించడంతో బ్లాక్స్ బాక్స్ కూడా దొరుకుందని భావిస్తున్నారు. ‘విమానం చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి 30 కి.మీ. దూరంలో విమాన తోక భాగం కనిపించింది. దానిపై ఎయిర్ ఆసియా అక్షరాలు ఉన్నాయి. సముద్ర గర్భంలో తీసిన ఫొటోల్లోని విమానం ప్రమాదానికి గురికాకముందు తీసిన విమానం మాదిరే ఉంది. అది ఎయిర్ ఆసియా విమానానిదేనని ధ్రువీకరిస్తున్నాను’ అని ఇండోనేసియా జాతీయ అన్వేషణ, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలలిస్తియో జకార్తాలో తెలిపారు. గత నెల 28న ఇండోనేసియా నుంచి 162 మంది తో సురబయ వెళ్తున్న ఎయిర్ ఆసియా విమానం అదే రోజు సముద్రంలో కూలడం తెలిసిందే. ఇప్పటివరకు 40 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీశారు. మిగతా మృతదేహాలు విమానంలోపలే చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. గాలింపు ప్రాంతాన్ని విస్తరించారు. 30 మీటర్ల లోతులో 10 అడుగుల పొడవున్న తోక భాగాన్ని వెలికి తేసేందుకు భూగర్భ వాహనాన్ని వినియోగించనున్నారు. -
తోక భగవాన్!
-
గోతిలో నివసించే పక్షి... కివీ!
జంతు ప్రపంచం - కివీ పక్షులకు తోక ఉండదు. రెక్కలు ఉన్నా చాలా చిన్నగా ఉంటాయి. అందుకే ఇవి ఎగురలేవు. - చూడడానికి చిన్నగా ఉన్నా కివీ చాలా బలమైన పక్షి. ముక్కు, కాళ్లు చాలా బలంగా ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది. ఈకలు ఉన్నిలాగా దళసరిగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉంటాయి. - వీటికి శ్వాసరంధ్రాలు ముక్కు చివర ఉంటాయి. కుక్కల కంటే వేగంగా ఇవి వాసనలను పసిగట్టగలవు! - ఇవి రాత్రిపూట ఆహారాన్ని వేటాడతాయి. పురుగుల్ని ఏరుకోవడం కోసం ముక్కుతో నేలను లోతుగా తవ్వుతాయి. అలా తవ్వేటప్పుడు పెద్దగా శబ్దం చేస్తాయి. - పురుగులతో పాటు పువ్వులు, ఆకులు, సాలీళ్లు, లార్వాలు, చిన్న చిన్న చేపలు, కప్పలను తింటాయి కివీ పక్షులు. - విశ్రాంతి తీసుకునేటప్పుడు ఇవి మనుషుల మాదిరిగా రెండు కాళ్లూ చాపుకుని కూర్చుంటాయి! - వీటి కాళ్లు, ముక్కు చాలా బలంగా ఉంటాయి. వాటి సాయంతో లోతైన గొయ్యి తవ్వి, అందులో నివసిస్తాయి! - వీటికి కోపం చాలా ఎక్కువ. అవి నివసించే స్థలాన్ని వేరే జంతువులేవైనా కబ్జా చేయాలని చూస్తే తీవ్రంగా మండి పడతాయి. ముక్కుతో పొడిచి పొడిచి తరిమేయాలని చూస్తాయి! - కివీ పెట్టే గుడ్డు దాని శరీరపు బరువు కంటే పదిహేను శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో కడుపులో గుడ్డు ఉన్నప్పుడు పొట్ట బాగా సాగిపోయి నేలకు తగులుతుంటుంది. - ఇవి గుడ్లను పొదిగి వదిలేస్తాయి తప్ప... పిల్లలకు తిండి పెట్టి పెంచవు. పుట్టేటప్పటికి పిల్లల కడుపులో గుడ్డుసొన లాంటి ద్రవం ఉంటుంది. దాని కారణంగా కొన్ని రోజుల వరకూ తల్లి తిండి పెట్టకపోయినా అవి బతికేస్తాయి. ఆ తరువాత అవే ఆహారాన్ని వేటాడడం అలవాటు చేసుకుంటాయి!