
Mexico Baby Girl Born With Extremely Rare Tail
మెక్సికోలో ఓ శిశువు తోకతో జన్మించింది. దాని పొడవు రెండు అంగుళాలు(5.7 సెంటీమీటర్లు) ఉంది. తమ దేశంలో ఇప్పటివరకు ఇలాంటి కేసు నమోదు కాలేదని వైద్యులు తెలిపారు. పాప తోక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
అయితే తల్లిదండ్రులు, పాప ఆరోగ్యంగా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి సమస్యలు లేవు. తోకను సూదితో తాకినప్పుడు చిన్నారి ఏడ్చిందని వైద్యులు చెప్పారు. రెండు నెలల తర్వాత దాన్ని చిన్న సర్జరీ చేసి తొలగించినట్లు తెలిపారు. అదే రోజు పాపను డిశ్చార్జ్ చేసినట్లు వెల్లడించారు. ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు పేర్కొన్నారు.
తల్లిగర్భంలో ఉన్నప్పుడే శిశవుల్లో తోక వంటి ఆకృతి ఏర్పడుతుందని, అయితే 9 నెలలు నిండేసరికి అది ఎముకగా మారి లొపలికి వెళ్లిపోతుందని వైద్య నిపుణులు చెప్పారు. అత్యంత అరుదైన సందర్భాల్లోనే ఇలా తోకలతో శిశువులు జన్మిస్తారని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా 2017 నాటికి ఇలా తోకతో జన్మించిన శిశువుల సంఖ్య 195గా ఉంది. అయితే మెక్సిలో మాత్రం ఇదే తొలి కేసు. ఎక్కువగా మగ శిశువులకు ఇలా జరుగుతుంది. మెదడు, పుర్రె వృద్ధి సమస్యల ప్రభావంతోనే చిన్నారులు ఇలా తోకతో జన్మిస్తారని ఓ అధ్యయనం పేర్కొంది. కానీ వైద్యులు మాత్రం దీనికి కచ్చితమైన కారణాలు వెల్లడించలేదు.
చదవండి: కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
Comments
Please login to add a commentAdd a comment