ఎనిమిదేళ్ల బాలుడిని దైవంగా భావించి.. | Boy with long, hairy tail is worshipped by villagers | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలుడిని దైవంగా భావించి..

Published Tue, Jun 6 2017 11:03 AM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM

ఎనిమిదేళ్ల బాలుడిని దైవంగా భావించి..

ఎనిమిదేళ్ల బాలుడిని దైవంగా భావించి..

ఓ ఎనిమిదేళ్ల బాలుడిని ప్రజలు దైవంగా భావించి పూజిస్తున్నారు.

అమృత్‌సర్‌: పంజాబ్‌లో ఓ ఎనిమిదేళ్ల బాలుడిని ప్రజలు దైవంగా భావించి పూజిస్తున్నారు. హనుమంతుడి ప్రతిరూపంగా భావిస్తూ ఆరాదిస్తున్నారు. కొందరు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి అతడిని దర్శించుకొని వెళ్తుంటారు. దీనంతటికీ కారణం అతడికి హనుమంతుడికి ఓ విషయంలో సారూప్యత ఉండటమే.

అమృత్‌సర్‌లో నివసించే దుల్హా సింగ్‌ అనే బాలుడికి వీపు కింది భాగంలో చిన్న తోకలా వెంట్రుకలు ఏర్పడ్డాయి. అది హనుమంతుడి తోకలా ఉందని, దేవుడి అనుగ్రహంతో అలా ఏర్పడిందని భావిస్తున్న చుట్టుపక్కల వారు ఆ బాలుడికి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఓసారి ఆ తోకను కత్తిరించాలని భావించిన దుల్హా తల్లి హఠాత్తుగా మరణించిందని ప్రస్తుతం అతడి ఆలనా పాలనా చూస్తున్న అంకుల్‌ సాహిబ్‌ సింగ్‌ వెల్లడించారు.

తోక వలన తనకు ఎలాంటి ఇబ్బంది లేదని దుల్హా సింగ్‌ చెబుతున్నాడు. పైగా అది ఉండటం వల్ల అందరూ తనను గౌరవిస్తున్నారని, దానిని దేవుడిచ్చిన గిఫ్ట్‌గా భావిస్తానని అంటున్నాడు. అయితే.. జనమంతా వచ్చి తనకు పూజలు ఎందుకు చేస్తారో తెలియడం లేదని అమాయకంగా చెబుతున్నాడు. తోక మూలంగా కొంత మంది తనను ఎగతాళి కూడా చేస్తారని అయితే వాటిని తానేమీ పట్టించుకోనని అంటున్నాడు. దుల్హాను చూడటానికి వస్తే పరవాలేదు గానీ.. పూజించడం లాంటివి చేయొద్దని చెప్పినా జనం వినిపించుకోవడం లేదని అంకుల్‌ సాహిబ్‌ సింగ్‌ తెలిపారు.





Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement