నరుడి తోక.. కత్తిరింపు!
నాగ్‌పూర్: ఎవరిమీద అయినా కోపమొస్తే.. వాడి తోక తెగ్గోస్తా అంటా మన కోపాన్ని వ్యక్తం చేస్తాం. అయితే మహారాష్ట్రకు చెందిన ఒక బాలుడికి దురదృష్టవశాత్తూ నిజంగానే తోక మొలిచింది. నాగపూర్ డాక్టర్లు ఎంతో శ్రమించి శస్త్రచికిత్స ద్వారా దానిని తొలగించారు. అసాధారణంగా 18 అంగుళాలు పెరిగిన తోక వల్ల తీవ్రమైన నొప్పితో వచ్చిన బాలుడిని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు రక్షించారు.
గత వారం తీవ్రమైన నొప్పితో 18 ఏళ్ల బాలుడు ఆసుపత్రికి వస్తే సర్జరీ చేసి తోకను తీసివేశామని న్యూరోసర్జరీ విభాగం అధిపతి డాక్టర్.ప్రమోద్ గిరి అన్నారు. ‘బాలుడు పుట్టినప్పటి నుంచి తోక ఉంది. క్రమంగా పెరుగుతూపోవడం వల్ల అతడికి కూర్చోవడం, పడుకోవడానికి ఇబ్బంది కలిగింది. దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు’ అని ఆయన చెప్పారు. ఇది చాలా క్లిష్టమైన ఆపరేష¯ŒS అని, వెన్నెముకకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సర్జరీ ముగించామని ప్రమోద్ వివరించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద తోకను తొలగించడం ఇదే మొదటిసారని ప్రమోద్ విశదీకరించారు.