
ఆధునిక మానవుల పూర్వజీవులు లక్షలాది సంవత్సరాల పరిణామ క్రమంలో తోకలు కోల్పోవడం జరిగింది. మనుషులకు తోకలు ఉంటే, వయసు మళ్లినా జంతువుల మాదిరిగానే నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా ఉంటారు కదా అని ఆలోచించారు జపానీస్ పరిశోధకులు.
ఆ ఆలోచనతోనే కీయో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మీటరు పొడవు ఉండే రోబోటిక్ తోకను రూపొందించారు. వెనుకవైపు వేలాడేలా దీన్ని తొడుక్కుంటే, ఇది అచ్చం జంతువుల తోకల మాదిరిగానే పనిచేస్తుంది. ఈ తోక గడియారంలోని పెండ్యూలంలా కదులుతూ, నడకలో బ్యాలెన్స్ కోల్పోకుండా చేస్తుందని కీయో వర్సిటీ పరిశోధకుడు జునిచి నబెషిమా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment