ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్ల తయారీలో రోబోట్ల కంటే మనుషులే మేలని నమ్ముతుంది. అందుకే ప్రస్తుతం కార్ల మ్యానిఫ్యాక్చరింగ్‌లో ఉన్న రోబోట్లను తొలగించింది. వాటి స్థానంలో మనుషుల్ని నియమించనుంది.
జర్మన్ ఆటోమేకర్ మెర్సిడెజ్ బెంజ్ ఎస్-క్లాస్ లిమోసిన్, ఎలక్ట్రిక్ అవతార్ మెర్సిడెస్ ఈక్యూఎస్, మేబాక్, ఏఎంజీ వెహికల్స్ తయారు చేసిన ఫ్యాక్టరీ 56లో, అలాగే ఓల్డ్ ఫ్యాక్టరీ 46లో గతంలో ఉన్న 25-30శాతం రోబోట్లలో 10 కంటే తక్కువకు తగ్గించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కారణంగా, లగ్జరీ కార్ల తయారీదారు ఇప్పుడు కంబస్టివ్-ఇంజిన్, అలాగే ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను అదే స్థాయిలో ఉత్పత‍్తి చేసుకోవచ్చు. ఎందుకంటే రోబోట్‌లు కార్ల తయారీని ఒక్కో పని మాత్రమే చేస్తాయి. అదే మనుషులైతే ఒకే సారి పలు మోడళ్లను తయారు చేసే సామర్ధ్యం ఉందని నమ్ముతుంది. ఈ సందర్భంగా మెర్సిడెస్ బెంజ్ ప్లాంట్ సైట్ మేనేజర్ మైఖేల్ బాయర్ మాట్లాడుతూ..రోబోట్లను మనుషులు భర్తీ చేయడం వల్ల ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. కానీ సామర్ధ్యం పెంచుతుందని బౌయర్ వివరించాడు. వినియోగదారుల డిమాండ్ పెరిగే కొద్ది కార్ల తయారీలో ఉపయోగించే టెక్నాలజీల్లో మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణమని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment