
గ్రహశకలాల కక్ష్యను మార్చి భూమికి వాటి ముప్పును తప్పించే లక్ష్యంతో నాసా నెల క్రితం డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) ఉపగ్రహంతో డిడిమోస్ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టించడం తెలిసిందే. ఫలితంగా డిడిమోస్ నుంచి బయటికి పొడుచుకొచ్చిన రెండు తోకలను హబుల్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది.
దానిచుట్టూ కమ్ముకున్న ధూళి మేఘాలను కూడా గమనించింది. తోకలు పుట్టుకు రావడం అనూహ్యమని నాసా అంటోంది. వీటితో గ్రహశకలానికి ఏం సంబంధమో తేల్చే పనిలో ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్యలో డిడిమోస్ తిరిగే వేగంలో 32 నిమిషాల మేరకు మార్పు వచ్చినట్టు తేలింది! ఇలా మొత్తం 18 విశేషాలను హబుల్ ఇప్పటికి గుర్తించింది.