Hubble Space Telescope
-
నిషిద్ధ కాంతి చిక్కింది
ఇప్పటిదాకా వినడమే తప్ప కంటికి కనబడని విశ్వపు సుదూరాల్లోని నిషిద్ధ కాంతి ఎట్టకేలకు చిక్కింది. దాన్ని హబుల్ టెలిస్కోప్ తాజాగా తన కెమెరాలో బంధించింది. భూమికి ఏకంగా 27.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో హైడ్రా నక్షత్ర రాశిలో ఉన్న ఎంసీజీ–01–24–014 స్పైరల్ గెలాక్సీ నుంచి వెలువడుతున్న ఈ కాంతి తరంగాలను ఒడిసిపట్టింది. వాటికి సంబంధించి అబ్బురపరిచే ఫొటోలను భూమికి పంపింది. టెలిస్కోప్ తాలూకు అడ్వాన్స్డ్ కెమెరా ఫర్ సర్వేస్ (ఏసీఎస్) ఈ ఘనత సాధించింది. అత్యంత స్పష్టతతో ఉన్న ఫొటోలు చూసి నాసా సైంటిస్టులతో పాటు అంతా సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఈ కిరణాల వెలుగులో కనువిందు చేస్తున్న ఎంసీజీ గెలాక్సీ అందాలకు ఫిదా అవుతున్నారు. కాస్మిక్ ఫొటోగ్రఫీ చరిత్రలోనే దీన్ని అత్యంత అరుదైన ఫీట్‌గా అభివరి్ణస్తున్నారు. హబుల్ ఫొటోల్లో కన్పిస్తున్న ఎంసీజీ గెలాక్సీ పూర్తిస్థాయిలో వికసించిన నిర్మాణం, అత్యంత శక్తిమంతమైన కేంద్రకంతో కనువిందు చేస్తోంది. ఇది అత్యంత చురుకైన కేంద్రకాలున్న టైప్–2 సీఫెర్ట్ గెలాక్సీల జాబితాలోకి వస్తుందని నాసా పేర్కొంది. సీఫెర్ట్ గెలాక్సీలు అంతరిక్షంలో మనకు అత్యంత దూరంలో ఉండే అతి ప్రకాశవంతమైన నక్షత్ర మాలికలైన క్వాసార్ల సమీపంలో ఉంటాయి. అయితే క్వాసార్లు తామున్న గెలాక్సీలను బయటికి ఏమాత్రమూ కని్పంచనీయనంతటి ప్రకాశంతో వెలిగిపోతుంటాయి. సీఫెర్ట్ గెలాక్సీలు మాత్రం వీక్షణకు అనువుగానే ఉంటాయి. కానీ అత్యంత సుదూరంలో ఉన్న కారణంగా వీటి వెలుతురు ఇప్పటిదాకా మనిషి కంటికి చిక్కలేదు. ఆ కారణంగానే సైంటిస్టుల పరిభాషలో దాన్ని ‘నిషిద్ధ కాంతి’గా ముద్దుగా పిలుచుకుంటూ వస్తున్నారు. పైగా ఈ కాంతి పుంజాలు భూమ్మీద మనకు ఇప్పటిదాకా తెలిసిన పరిమాణ భౌతిక శాస్త్ర నియమాలకు పూర్తిగా అతీతమన్నది సైంటిస్టుల నమ్మకం. అనంత విశ్వంలో అంతటి సుదూర అంతరిక్ష క్షేత్రంలో మన భౌతిక శాస్త్ర నియమాలన్నీ తల్లకిందులవుతాయని వారు చెబుతుంటారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆ పేలుడు కథ ఏమిటి?
‘‘సైన్స్... పది కొత్త సమస్యలను సృష్టించిగానీ.. ఒకదానికి పరిష్కారం కనుక్కోదు’’ ప్రఖ్యాత ఇంగ్లీష్ కవి జార్జ్ బెర్నాడ్ షా మాటలివి. సైన్స్ ముందుకు పురోగమిస్తున్న కొద్దీ కొత్త కొత్త సవాళ్లు, సంక్లిష్టమైన సమస్యలు ఎదురవుతూంటాయని చెప్పడం ఆయన ఉద్దేశం. జ్ఞానాన్ని పెంచుకోవడం నిత్యం జరుగుతూనే ఉంటుందని, ఒక సమస్యకు దొరికే పరిష్కారం మరిన్ని కొత్త ప్రశ్నలు, సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని కూడా బెర్నార్డ్ షా అనుకుని ఉంటాడు. ఇంతకీ విషయం ఏమిటంటే.. విశాల విశ్వంలో ఓ మూలన ఓ పే...ద్ధ పేలుడు సంభవించిందట. సుదూర గ్రహాలు, పాలపుంతలు, నక్షత్రాలపై కన్నేసేందుకు అమెరికాకు చెందిన నాసా ప్రయోగించిన టెలిస్కోపు ‘హబుల్’ ఈ పేలుడును గుర్తించింది. ఇందులో పెద్దగా విశేషం ఏమీ లేకపోవచ్చు కానీ.. ఈ పేలుడు జరిగిన ప్రాంతంలో ఏ రకమైన ఖగోళ వస్తువూ లేకపోవడమే శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. సింపుల్‌గా చెప్పాలంటే.. ఏమీ లేని చోట బాంబు పేలుడు జరిగిందన్నమాట. పేలుడు ఎలా జరిగిందన్నది ఇప్పుడు ప్రశ్న? అంచనాలు తారుమారు... కొన్నేళ్ల క్రితం ఖగోళ శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జరిగే ఓ కొత్త రకం పేలుడు గురించి ప్రకటించారు. లూమినస్ ఫాస్ట్ బ్లూ ఆప్టికల్ ట్రాన్సియట్... క్లుప్తంగా ఎల్ఎఫ్బోట్ అని పిలుస్తారు దీన్ని. పొడవాటి, సంక్లిష్టమైన పేరును కాసేపు మరచిపోండి. ఈ పేలుడులో భాగంగా కొన్ని రోజుల పాటు ప్రకాశవంతమైన నీలి రంగు కనిపిస్తుందని మాత్రమే గుర్తుపెట్టుకుందాం. 2016లో ఇలాంటి పేలుడు ఒకదాన్ని తొలిసారి గుర్తించగా.. ఆ తరువాత దాదాపుగా చూడలేదు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి సమచారంతోనే ఈ పేలుళ్లు ఎలా పుట్టిఉంటాయో అంచనా కట్టేందుకు ప్రయత్నం చేశారు. రకరకాల అంచనాల్లో కోర్-కొలాప్స్ సూపర్ నోవాకు మద్దతు పెరిగింది. ఎక్కువయ్యారు. ఇంధనమంతా ఖర్చయిపోయిన నక్షత్రం పేలిపోతే సూపర్నోవా అంటారని మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే పెరిగిపోయే గురుత్వ శక్తి కారణంగా ఈ నక్షత్రం తాలకూ కోర్ కూడా తనలో తాను కుప్పకూలిపోతే దాన్ని కోర్-కొలాప్స్ సూపర్నోవా అని పిలుస్తారు. కానీ... ఈ ఏడాది ఏప్రిల్ పదిన ఈ అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. జ్వికీ ట్రాన్సియంట్ ఫెసిలిటీ (జెడ్‌టీఎఫ్) ఎల్ఎఫ్బోట్ పేలుడును గుర్తించింది. ‘ఏటీ2023ఎఫ్హెచ్ఎన్’ అని నామకరణం చేశారు. ‘ఫించ్’ అని ముద్దుగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. ప్రకాశవంతమైన నీలి రంగులో కాంతి కనిపించింది. కొన్ని రోజుల తరువాత క్రమేపీ మాయమైంది. ఉష్ణోగ్రతలు కూడా గరిష్టంగా 20000 డిగ్రీ సెల్సియస్ వరకూ ఉన్నట్లు తెలిసింది. అన్నీ సాధారణమే అనుకున్నారు శాస్త్రవేత్తలు. కానీ... హబుల్ టెలిస్కోపును ఈ పేలుడు సంభవించిన వైపు తిప్పినప్పుడు అసలు విషయం తెలిసింది. ఇది సాధారణ ఎల్ఎఫ్బోట్ కాదని అర్థమైంది. అప్పటివరూ గుర్తించి అన్ని ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లోపల సంభవించాయి. అది కూడా ఓ నక్షత్రం తయారవుతున్న సమయంలో జరిగాయి ఈ పేలుళ్లు. ఫించ్ మాత్రం పాలపుంతలో లేదు సరికదా.. ఒంటరిగా అలా తేలియాడుతూ ఉందంతే. పైగా దీనికి దగ్గరలో కూడా ఏ పాలపుంత లేదు. సుమారు 15000 కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే పాలపుంతలున్నాయి. సూపర్నోవాల్లో నక్షత్రం చాలా వేగంగా అంతరించిపోతుంది. ఏమీ లేని ప్రాంతంలో దీర్ఘకాలం అలా తేలియాడుతూ ఉండేందుకు అవకాశం లేదు. ఏమై ఉండవచ్చబ్బా...? ఏప్రిల్ పదిన గుర్తించి ఎల్ఎఫ్బోట్ కచ్చితంగా మమ్మల్ని ఆశ్చర్యపరిచిందంటారు ఆష్లే క్రైమ్స్. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త ఈయనే. ఫించ్ ఘటన తరువాత ఎల్ఎఫ్బోట్లు పాలపుంతల్లో మాత్రమే కాకుండా... సూదూరంగానూ సంభవించగలవని స్పష్టమైంది. బహుశా ఓ భారీ కృష్ణ బిలం నక్షత్రం ఒకదాన్ని ముక్కలుగా చీల్చేయడం వల్ల ఈ ఎల్ఎఫ్బోట్ పుట్టి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు తాజాగా అంచనా వేస్తున్నారు. లేదా రెండు న్యూట్రాన్ స్టార్లు ఢీకొనడం కూడా కారణమై ఉండవచ్చునని అంటున్నారు. ఈ రెండు న్యూట్రాన్ స్టార్లలో ఒకటి భారీగా అయస్కాంతీకృతమైనందైతే (మాగ్నెటార్ అంటారు) సాధారణ సూపర్నోవా కంటే వంద రెట్లు ఎక్కువ కాంతి వెలువడుతుందని క్రైమ్స్ చెప్పారు. ఈ విషయంపై కచ్చితమైన అంచనా వేయాలంటే మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుందని చెప్పారు. అమెరికా, యూరప్, కెనడాలు కలిసికట్టుగా ప్రయోగించిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా పరిశీలించినప్పుడు మరికొన్ని క్లూలు దొరికాయి. దగ్గరలోని పాలపుంత ఔటర్ హాలో (ప్రకాశవంతమైన కాంతి ఉండే ప్రాంతం)లోని నక్షత్రాల గుంపు నుంచి వచ్చి ఉండవచ్చునని తెలుస్తోంది. ఇదే నిజమైతే కృష్ణబిలం ఓ నక్షత్రాన్ని చీల్చేయడం వల్ల ఎల్ఎఫ్బోట్ ఏర్పడిందన్న సిద్ధాంతానికి బలం చేకూరుతుంది. పరిశోధన వివరాలు రాయల్ అస్ట్రనామికల్ సొసైటీ జర్నల్ ‘మంత్లీ నోటీసెస్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. హైలైట్స్.... ఏమిటి?.... శూన్యంలో వినూత్నమైన పేలుడు! ఎప్పుడు?... ఈ ఏడాది ఏప్రిల్ పదవ తేదీ తొలిసారి గుర్తించారు! ఎలా?.... నాసా ప్రయోగించిన హబుల్ టెలిస్కోపు ద్వారా... ఎందుకు జరిగిందీ పేలుడు?.... స్పష్టంగా తెలియదు! తెలుసుకునే ప్రయత్నంలోనే శాస్త్రవేత్తలున్నారు.! -
డిడిమోస్ ఢీ! గ్రహశకలానికి తోకలు! గుర్తించిన హబుల్ టెలిస్కోప్
గ్రహశకలాల కక్ష్యను మార్చి భూమికి వాటి ముప్పును తప్పించే లక్ష్యంతో నాసా నెల క్రితం డబుల్ ఆస్టిరాయిడ్ రీడైరెక్షన్ (డార్ట్) ఉపగ్రహంతో డిడిమోస్ గ్రహశకలాన్ని విజయవంతంగా ఢీకొట్టించడం తెలిసిందే. ఫలితంగా డిడిమోస్ నుంచి బయటికి పొడుచుకొచ్చిన రెండు తోకలను హబుల్ టెలిస్కోప్ తాజాగా గుర్తించింది. దానిచుట్టూ కమ్ముకున్న ధూళి మేఘాలను కూడా గమనించింది. తోకలు పుట్టుకు రావడం అనూహ్యమని నాసా అంటోంది. వీటితో గ్రహశకలానికి ఏం సంబంధమో తేల్చే పనిలో ఉన్నట్టు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకటించింది. డార్ట్ ఢీకొట్టడం వల్ల డైమోర్ఫస్ కక్ష్యలో డిడిమోస్ తిరిగే వేగంలో 32 నిమిషాల మేరకు మార్పు వచ్చినట్టు తేలింది! ఇలా మొత్తం 18 విశేషాలను హబుల్ ఇప్పటికి గుర్తించింది. -
ఒకేసారి.. మోస్ట్ పవర్ఫుల్ ఫొటోలు ఇవి
జేమ్స్ వెబ్, హబ్బుల్ టెలిస్కోప్‌లు గురువారం మోస్ట్పవర్ఫుల్ చిత్రాలను విడుదల చేశాయి. డార్ట్ వ్యోమనౌక ఉద్దేశపూర్వకంగా గ్రహశకలంలోకి దూసుకెళ్లిన ఫొటోలు అవి. రెండు అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్‌లు ఒకే ఖగోళ వస్తువును గమనించడం ఇదే మొదటిసారి. భవిష్యత్‌లో ప్రాణాంతక గ్రహశకలాల నుంచి భూమిని రక్షించేందుకు.. చారిత్రాత్మక పరీక్ష నిర్వహించాయి. ఆ సమయంలో ఈ టెలిస్కోప్‌లు స్పేస్ రాక్ డైమోర్ఫోస్ వైపు తమ చూపును మళ్లించాయి. .@NASAWebb & @NASAHubble caught the DART impact on camera – the 1st time that Webb & Hubble were used to simultaneously observe the same celestial target. Looking forward to what we’ll learn about #DARTmission from our telescopes on Earth soon. https://t.co/Y0HOAbSkI0 https:/ pic.twitter.com/lgDwOBd7Om — Bill Nelson (@SenBillNelson) September 29, 2022 NASA డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (DART) ఇంపాక్టర్ సోమవారం రాత్రి భూమి నుండి 11 మిలియన్ కిలోమీటర్ల (6.8 మిలియన్ మైళ్ళు) దూరంలో ఉన్న పిరమిడ్-పరిమాణ లక్ష్యాన్ని చేరుకోవడంతో ఖగోళ శాస్త్రవేత్తలు సంతోషించారు. ఈ టెలిస్కోప్‌ల ద్వారా తీసిన చిత్రాలు.. అంతరిక్ష నౌక ఢీకొట్టిన విస్తరిస్తున్న దుమ్మును చూపించాయి. -
Nasa: అద్భుతం.. మహాద్భుతం
వాషింగ్టన్: నాసాకు చెందిన హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్.. గత ముప్పై ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది. గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు.. వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్. Round and round we go… Let yourself be whisked away by the Whirlpool Galaxy’s curving arms, pink star-forming regions, and brilliant blue strands of star clusters. Explore #GalaxiesGalore with @NASAHubble on @Tumblr: https://t.co/F2kzCVAYBt pic.twitter.com/zVUKShxrEB — NASA (@NASA) May 22, 2022 అంతరిక్షంలో గెలాక్సీ ఎం51(దీనికి వర్ల్‌పూల్ గెలాక్సీ) అనే పేరు కూడా ఉంది. సర్వేల కోసం ఏర్పాటు చేసిన హబ్బుల్ అడ్వాన్స్డ్ కెమెరా ఈ ఫొటోల్ని క్లిక్‌మనిపించింది. గంభీరమైన స్పైరల్ గెలాక్సీ M51 వెడల్పాటి చేతులు.. నిజానికి నక్షత్రాల పొడవైన లేన్లు, ధూళితో నిండిన వాయువు. గ్రాండ్-డిజైన్ స్పైరల్ గెలాక్సీలు" అని పిలవబడే ముఖ్య లక్షణం అని పేర్కొంది. M51.. భూమి నుండి 31 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కేన్స్ వెనాటిసి నక్షత్రరాశిలో ఉంది. -
ఎట్టకేలకు తిరిగి ప్రారంభమైన హబుల్ టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. గత నెలలో కంప్యూటర్లో తలెత్తిన చిన్న లోపం కారణంగా హబుల్ టెలిస్కోప్ పరిశోధనలకు ఆటంకం ఏర్పడింది. ఎట్టకేలకు నాసా ఇంజనీర్లు టెలిస్కోప్‌లో తలెత్తిన లోపాన్ని పరిష్కరించారు. గత నెలలో ఏర్పడిన కంప్యూటర్ లోపం కారణంగా అబ్జర్వేటరీతో అన్ని ఖగోళ పరిశోధనలు ఆగిపోయాయి. కాగా టెలిస్కోప్‌లో 1980 శకం కంప్యూటర్ల వలన లోపం తల్తెతడంతో టెలిస్కోప్ పరిశోధనలు ఆగిపోయాయని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. నాసా ఇంజనీర్లు గురువారం హబుల్ టెలిస్కోప్‌లో బ్యాకప్ పరికరాలకు విజయవంతంగా మార్చారు. దీంతో హబుల్ టెలిస్కోప్ పరిశోధనలు తిరిగి ప్రారంభంకానున్నట్లు శుక్రవారం నాసా ఒక ప్రకటనలో తెలిపింది. టెలిస్కోప్‌లో తలెత్తిన లోపానికి పరిష్కారం చూపిన ఇంజనీర్లకు నాసా సైన్స్ మిషన్ చీఫ్ థామస్ జుర్బుచెన్ అభినందనలు తెలిపారు. 1990 లో ప్రారంభించిన హబుల్ విశ్వం గురించి ఇప్పటికీ వరకు 1.5 మిలియన్లకు పరిశోధనలను చేసింది. ఈ సంవత్సరం చివరి నాటికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను ప్రారంభించాలని నాసా యోచిస్తోంది. -
హబుల్ టెలిస్కోప్ స్థానంలో మరో కొత్త టెలిస్కోప్..!
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. కాగా తాజాగా టెలిస్కోప్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని నాసా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న స్పేస్ షటిల్ డిస్కవరీ నిర్మించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్..! సుదీర్ఘ సర్వీస్‌ను అందించిన హబుల్ టెలిస్కోప్ స్ధానంలో మరో టెలిస్కోప్‌ను లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. తరచూ హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను హబుల్ స్థానంలో రానుంది. అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 న జరిపే అవకాశాలు ఉన్నాయి. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా) చదవండి: ఇతర గ్రహలకు జీవుల రవాణా మరింత ఈజీ కానుందా..! -
విశ్వం సమగ్ర వర్ణచిత్రం
రోదసిలో గెలాక్సీల నుంచి వచ్చే అతినీలలోహిత కాంతిని పరిశీలిస్తూ హబుల్ అంతరిక్ష టెలిస్కోపు సేకరించిన సమాచారం ఆధారంగా నాసా ఖగోళ శాస్త్రవేత్తలు రూపొందించిన విశ్వం సరికొత్త వర్ణచిత్రమిది. ఇంతవరకూ అత్యంత స్పష్టంగా రంగులతో, సమగ్రంగా రూపొందించిన విశ్వం చిత్రాల్లో ఇదే ఉత్తమమైనదట. ఈ చిత్రంలో సుమారు 10 వేల గెలాక్సీలు ఉన్నాయట. సమీప గెలాక్సీలతోపాటు సుదూర గెలాక్సీల్లో సైతం నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి? మన పాలపుంత వంటి గెలాక్సీల్లో ప్రస్తుతం తారలు ఎలా పుడుతున్నాయి? అన్నది అవగాహన చేసుకునేందుకు హబుల్ సమాచారం తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సుమారు 1370 కోట్ల ఏళ్ల క్రితం బిగ్‌బ్యాంగ్ జరిగి విశ్వం ఆవిర్భవించగా.. 500-1000 కోట్ల ఏళ్ల మధ్యకాలంలోనే అత్యధిక నక్షత్రాలు పుట్టాయని అంచనా. ఇప్పటిదాకా ఈ కాలంలో పుట్టిన నక్షత్రాలకు సంబంధించిన సమాచారం పెద్దగా లేదని, తాజాగా హబుల్ ఆ సమాచారాన్ని కూడా సేకరించిందని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.