వాషింగ‍్టన్: నాసాకు చెందిన హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్.. గత ముప్పై ఏళ్ల కాలంలో కొన్ని మిలియన్ల ఫొటోలు తీసింది. కానీ, తాజాగా తీసిన ఓ ఫొటో మాత్రం మహాద్భుతమనే ప్రశంసను దక్కించుకుంటోంది.
గుండ్రని వలయాలు, గులాబీ రంగులో నక్షత్రాలు, నీలి రంగు నక్షత్ర సమూహాలు.. వెరసి ఎం51 పాలపుంత ఫొటోల్ని పక్కాగా తీసి పంపింది హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్.
Round and round we go…
— NASA (@NASA) May 22, 2022
Let yourself be whisked away by the Whirlpool Galaxy’s curving arms, pink star-forming regions, and brilliant blue strands of star clusters. Explore #GalaxiesGalore with @NASAHubble on @Tumblr: https://t.co/F2kzCVAYBt pic.twitter.com/zVUKShxrEB
అంతరిక్షంలో గెలాక్సీ ఎం51(దీనికి వర్ల్‌పూల్ గెలాక్సీ) అనే పేరు కూడా ఉంది. సర్వేల కోసం ఏర్పాటు చేసిన హబ్బుల్ అడ్వాన్స్‌డ్ కెమెరా ఈ ఫొటోల్ని క్లిక్‌మనిపించింది.
గంభీరమైన స్పైరల్ గెలాక్సీ M51 వెడల్పాటి చేతులు.. నిజానికి నక్షత్రాల పొడవైన లేన్లు, ధూళితో నిండిన వాయువు. గ్రాండ్-డిజైన్ స్పైరల్ గెలాక్సీలు" అని పిలవబడే ముఖ్య లక్షణం అని పేర్కొంది.
M51.. భూమి నుండి 31 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో కేన్స్ వెనాటిసి నక్షత్రరాశిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment