హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా)
విశ్వంతరాలను శోధించడానికి హబుల్ టెలిస్కోప్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ టెలిస్కోప్‌తో సుదూరాన ఉన్న ఇతర గ్రహల, గెలక్సీల పరిశోదనల కోసం శాస్త్రవేత్తలకు ముప్పై సంవత్సరాలుగా హబుల్ తన సేవలను అందిస్తోనే ఉంది. కాగా తాజాగా టెలిస్కోప్‌లో నెలకొన్న సాంకేతిక లోపంతో పలు పరిశోధనలకు ఆటంకం ఏర్పడనున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ప్రస్తుతం హబుల్ టెలిస్కోప్ పునరుద్దరించడానికి చర్యలు తీసుకుంటున్నామని నాసా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
హబుల్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా)
హబుల్ టెలిస్కోప్‌ను మొట్టమొదటి సారిగా 1990 ఏప్రిల్ 25న స్పేస్ షటిల్ డిస్కవరీ నిర్మించారు. సుమారు 13.4 బిలియన్ల కాంతి సంవత్పరాల దూరంలోఉన్న గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలపై పరిశోధనలను చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది.
హబుల్ స్థానంలో మరో టెలిస్కోప్..!
సుదీర్ఘ సర్వీస్‌ను అందించిన హబుల్ టెలిస్కోప్ స్ధానంలో మరో టెలిస్కోప్‌ను లాంచ్ చేయాలని నాసా భావిస్తోంది. తరచూ హబుల్ టెలిస్కోప్‌లో సాంకేతిక లోపాలు తలెత్తడంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను హబుల్ స్థానంలో రానుంది. అందుకు సంబంధించిన ప్రయోగాన్ని ఈ ఏడాది అక్టోబర్ 31 న జరిపే అవకాశాలు ఉన్నాయి.
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ (ఫోటో కర్టసీ: నాసా)
Comments
Please login to add a commentAdd a comment