బాలాంజనేయులు
పరిపరి శోధన
ఆ మధ్య ఎప్పుడో వినాయక విగ్రహాలు పాలు తాగినట్టే, కొంతమందికి బాలాంజనేయులు పుట్టినట్టు అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తుంటాయి. జన్యుపరమైన కొన్ని లోపాల వల్ల కొందరు చిన్నారులు వెనకభాగంలో కణుతులు, సిస్టులతో పుడుతుంటారు. దానినే మనవాళ్లు తోక అని చెప్పుకుంటుంటారు. నిజానికి తల్లి గర్భంలో ఉన్నప్పుడు 5వ వారంలో చిన్నారులకు తోక ఏర్పడుతుందట. అయితే ఎనిమిదవ వారానికల్లా అది కాస్తా మాయమవుతుంది. అలా ఏర్పడ్డ తోకనే ఎంబ్రియో అంటారు.
కొద్దిమంది చిన్నారులకు మాత్రం ఈ ఎంబ్రియో దానంతట అది కుదించుకుపోదు. అలాంటివాళ్లే తోకలాంటి అవయవంతో పుడతారు. నిజానికి అది తోక కాదు... చిన్నచిన్న కండరాలు, కణాల సముదాయం. ఈ విధంగా తోకతో పుట్టేవారి గురించి ఆ మధ్య ఎప్పుడో‘స్పెక్ట్రమ్ ఆఫ్ హ్యూమన్ టెయిల్స్’ పేరిట ఒక పరిశోధన పత్రం కూడా ప్రచురితమయింది.