
బ్రహ్మానందంలో బయటపడిన రెండోకోణం
బ్రహ్మానందం అనగానే గతంలో తెలుగు లెక్చరర్ అని, ప్రస్తుతం హాస్యనటుడని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయనలో మనందరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. కేవలం హాస్య కళ మాత్రమే కాక.. శిల్పాలు చేయడం కూడా మన బ్రహ్మానందానికి వచ్చు! ఈ విషయం ఇన్నాళ్ల పాటు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు.
తాజాగా ఆయన బంకమట్టితో ఓ విగ్రహాన్ని రూపొందించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను ఆయన జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారుచేసే క్రమంలో ఉన్న ఫొటోలను కూడా బ్రహ్మానందం తన ఫేస్బుక్ పేజీలో అభిమానులందరికీ షేర్ చేశారు. దాంతో ఆయనలో్ ఉన్న రెండో కోణం కూడా అభిమానులకు తెలిసింది.