Brahmi
-
పెసర, మినుములేనా? బ్రహ్మీ, వస సాగు.. భలే బాగు! ఏడాదికి నికరాదాయం ఎంతంటే..
మాగాణి రేగడి భూముల్లో వరి, పెసర, మినుము మాత్రమేనా? ఇంకే ఇతర పంటలూ సాగు చేసుకోలేమా? ఉన్నాయి. ఔషధ పంటలున్నాయి. ఎకరానికి ఏటా రూ. లక్షకు తగ్గకుండా నికరాదాయం ఇచ్చే బ్రహ్మీ, వస వంటి దీర్ఘకాలిక ఔషధ పంటలు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో కొందరు రైతులు ఈ పంటలను నీటి వసతి ఉన్న మాగాణి నల్లరేగడి భూముల్లో సాగు చేస్తూ చక్కని ఆదాయం పొందుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు వీరిని ప్రోత్సహిస్తోంది. ఆయుర్వేద ఔషధ పరిశ్రమదారులతో కొనుగోలు ఒప్పందాలు చేయించి సాగు చేయిస్తుండటం విశేషం. బహ్మీ, వస పంటల సాగులో అక్కడి ముగ్గురు రైతుల అనుభవాలను పరిశీలిద్దాం.. బ్రహ్మీ.. 4 నెలలకో కోత బ్రహ్మీ (Bacopa monneiri) నేల మీద పాకే తీగజాతి దీర్ఘకాలిక పంట. బ్రహ్మీ పంటను వరి పంటకు మాదిరిగానే దమ్ము చేసి, 2–3 అంగుళాల మొక్క కటింగ్‌ను నాటాలి. ఒకసారి నాటితే చాలు. 5 ఏళ్ల పాటు మళ్లీ నాటక్కర లేదు. 4 నెలలకోసారి పంట కోతకు వస్తుంది. అయితే, ఏడాది పొడవునా పంట పొలాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. పొలం అంతా బ్రహ్మీ మొక్కలు అల్లుకుపోతాయి కాబట్టి కలుపు సమస్య ఉండదు. అయితే, పంట కోతకు వచ్చినప్పుడు అవసరాన్ని బట్టి కలుపు తీసి, తర్వాత కొడవళ్లతో నేల మట్టానికి బ్రహ్మీ మొక్కలను కోస్తారు. ఆ తర్వాత కొంచెం ఎరువు చల్లి నీటి తడి ఇస్తే చాలు.. పంట మళ్లీ ఏపుగా పెరుగుతుంది. ప్రతి కోతకు ఎకరానికి 3,000–6,000 కిలోల పచ్చి బ్రహ్మీ మొక్కల దిగుబడి వస్తుంది. ఆరుబయట గచ్చు మీద ఎండబెడితే.. కొద్ది రోజుల్లో 600–700 కిలోల ఎండు బ్రహ్మీ సిద్ధమవుతుంది. దీని ధర మార్కెట్లో రూ. 40–50 వరకు ఉంటుంది. అంటే కోతకు రూ. 30 వేల చొప్పున.. ఏడాదిలో 3 కోతలకు.. రూ. 90 వేల వరకు రైతుకు ఆదాయం వస్తుంది. ప్లాంటింగ్ మెటీరియల్‌ను రైతులకు మొదటిసారి ఔషధ మొక్కల బోర్డు ఇస్తుంది. పెరిగిన పంట నుంచి తీసి 2–3 అంగుళాల ముక్కలను నాటుకుంటున్నారు. మొక్కలను ఎలా నాటుకోవాలో రైతులకు శిక్షణ ఇస్తారు. బ్రహ్మీ మొండి మొక్క. నిర్వహణ పెద్దగా అవసరం లేదు. ఒకటి, రెండు సార్లు కలుపు తీస్తే చాలు. ఎరువులు వాడాలని లేదు. జీవామృతం వాడినా సరిపోతుంది. వస.. 9 నెలల పంట పసుపు పంట మాదిరిగా వస (Bach-Acorus calamus) 2–3 అడుగుల ఎత్తున పెరుగుతుంది. 9 నెలల పంట. కొమ్ములను నాటుకోవాలి. మొక్కలు పెంచైనా నాటుకోవచ్చు. 9 నెలలకు కొమ్ములు తవ్వి తీసి, ఎండ బెట్టి, పాలిషింగ్ చేసి ఔషధ కంపెనీలకు విక్రయించాలి. 20–30 ఎకరాలకు ఒకటి చొప్పున పాలిషింగ్ మిషన్ అవసరం. ఎకరానికి 10–20 క్వింటాళ్ల వస కొమ్ముల దిగుబడి వస్తుంది. ఎకరానికి ఖర్చు రూ.20 వేలు పోను, రూ. 60 వేలు–లక్ష వరకు నికరాదాయం వస్తుంది. ఎకరానికి ఏటా రూ. 70 వేల నికరాదాయం అశ్వని శబారియా.. గొరెల్లా పెండ్ర మర్వాహి జిల్లా పెండ్ర పట్టణ శివారులో ఈ యువ రైతు 10 నెలల క్రితం 9 ఎకరాల్లో బ్రహ్మీ, 2.5 ఎకరాల్లో వస సాగు ప్రారంభించారు. బీకాం చదువుకున్న అశ్వని ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రైతుల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు. తిపాన్ నది ఒడ్డున దేవుడి మాన్యం నల్ల రేగడి భూమిని కౌలుకు తీసుకొని, బోర్ల ద్వారా నీటిని తోడుకుంటూ సాగు చేస్తున్నారు. బ్రహ్మీ నాటు మొక్కలు, వస విత్తన కొమ్ములను ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా తీసుకున్నారు. వర్మీ కంపోస్టు, వేపపిండి చల్లి దుక్కి చేసిన తర్వాత మొక్కలు నాటారు. తర్వాత ఎరువులేమీ వేయటేదు. వారానికి రెండు సార్లు తగుమాత్రంగా నీటి తడి ఇస్తున్నారు. ఈ రెండు పంటలకూ నీరు నిల్వ ఉండక్కరలేదు. మట్టిలో తేమ బాగా ఉంటే చాలు. బ్రహ్మీ పంటను అశ్వని 10 నెలల్లో 3 సార్లు కోసి, ఎండబెట్టి విక్రయించారు. బ్రహ్మీ సాగు ద్వారా ఎకరానికి ఏడాదికి 3 కోతల్లో రూ. 90 వేల ఆదాయం. అన్నీ కలిపి రూ. 20 వేల ఖర్చవుతోంది. రూ. 70 వేలు నికరాదాయమని అశ్వని తెలిపారు. బ్రహ్మీలో వరి కన్నా ఎక్కువ ఆదాయం వస్తున్నదన్నారు. బ్రహ్మీ కొనుగోలుదారులను ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు పరిచయం చేసిందన్నారు. ఆన్లైన్లో నేరుగా విక్రయించడానికి ఇండియామార్ట్. కామ్ వెబ్సైట్లో కూడా తాను రిజిస్టర్ చేసుకున్నారు. మార్కెటింగ్ సమస్య లేదంటున్నారు రైతు అశ్వని శబారియా (81203 57007). ప్రకృతి సేద్యంలో ఏపుగా బ్రహ్మీ డోమన్‌లాల్ సాహు.. బలోదబజార్ జిల్లా గైత్ర గ్రామంలో 25 ఎకరాల సొంత భూమిలో వరి, కంది, శనగ తదితర పంటలను 4 ఏళ్లుగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగు చేస్తూ రసాయనిక ఎరువులు వాడే రైతులతో సమానంగా దిగుబడులు తీస్తున్నారు. 6 నెలల క్రితం బోర్డు ద్వారా మొక్కలు తెప్పించి 2 ఎకరాల నల్లరేగడిలో నాటారు. పంట కోతకు సిద్ధంగా ఉంది. ఎకరానికి వర్మీకంపోస్టు 2 క్వింటాళ్లు, 100 కిలోల ఘనజీవామృతం చల్లి దమ్ము చేసి, బ్రహ్మీ మొక్కలు నాటారు. వర్మీవాష్, వేస్ట్‌డీకంపోజర్, ద్రవ జీవామృతం 15 రోజులకోసారి పిచికారీ చేస్తున్నారు. పంట ఆరోగ్యంగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు ద్వారా విక్రయిస్తానని సాహు (62651 71801) తెలిపారు. రూ. 50–60 వేల నికరాదాయం సుగత్‌సింగ్ (66) జాంజ్‌గిర్ ఛాంప జిల్లా ఖటోల గ్రామానికి చెందిన సింగ్ వందెకరాల్లో సేద్యం చేసే రైతు. వరి, గోధుమ, పప్పుధాన్యాలు పండిస్తారు. 2021 జూలైలో ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు సూచన మేరకు నల్లరేగడి భూమి 3 ఎకరాల్లో బ్రహ్మీ, 2 ఎకరాల్లో వస నాటారు. ఎకరానికి 4 క్వింటాళ్ల సిటీ కంపోస్టు దుక్కిలో వేసి, అవసరం మేరకు నీటి తడులు ఇస్తున్నారు. బ్రహ్మీ పంటను కోసి గచ్చుపై ఎండబెడుతున్నారు. వరిలో ఎకరానికి రూ. 30–35 వేలు నికరాదాయం వస్తుంటే.. బ్రహ్మీ, వసలో రూ. 50–60 వేల వరకు వస్తోందని సింగ్(83055 61057) తెలిపారు. మామిడి చెట్ల నీడలో సర్పగంధ మొక్కలను 16 నెలల క్రితం వేశారు. మరో 2 నెలల్లో కోతకు రానుంది. మార్కెటింగ్ సమస్య లేదు! ఔషధ మొక్కల సాగు ద్వారా రైతులు సాధారణ పంటలతో పోల్చితే అధిక నికరాదాయం పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వరి సాగు చేసే నల్ల రేగడి, లోతట్టు ప్రాంతాల్లో దీర్ఘకాలిక ఔషధ పంటలైన బ్రహ్మీ, వసను సాగు చేసుకోవచ్చు. ఎకరానికి రూ. లక్ష వరకు నికరాదాయం పొందే వీలుంది. విత్తనాలు, మొక్కలను బోర్డు ద్వారా అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాం. ఔషధాల తయారీదారులు, వ్యాపారులతో ముందే టైఅప్ చేసుకొని తగిన జాగ్రత్తలతో అవగాహన ఒప్పందం చేసుకొని మార్కెటింగ్ సమస్య లేకుండా చేస్తున్నాం. రైతుల ఉత్పత్తులకు మంచి ఆదాయం వచ్చేలా చేస్తున్నాం. ఎకరానికి ఏడాదికి రూ. పది లక్షల వరకు ఆదాయం వచ్చే ఔషధ పంటలు కూడా ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని రైతులకైనా, సంస్థలకైనా కన్సల్టెన్సీ సేవలు అందించేందుకు మా బోర్డు సిద్ధంగా ఉంది. – జె.ఎ.సి.ఎస్.రావు (96769 95404), సీఈఓ, ఛత్తీస్‌గఢ్ ఔషధ మొక్కల బోర్డు, పూర్వ ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్, రాయపూర్. -నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నిర్మాతల్నీ నవ్విస్తారా
సినిమా హిట్ అయినా నిర్మాత నవ్వని సందర్భాలు ఉంటాయి.కలెక్షన్లు కళకళలాడకపోతే ఏం నవ్వు? ఇంగ్లిష్‌లో ఒక వాడుక ఉంది. ‘లాఫింగ్ ఆల్ ది వే టు ద బ్యాంక్’ అని.అంటే ప్రయత్నం ఏం చేసినా చివరకు డబ్బు సాధించారు అని అర్థం.కమెడియన్లు హీరోలుగా చేసి ప్రేక్షకుల్ని నవ్వించిన సందర్భాలు ఉన్నాయి.హీరోలుగానూ ప్రేక్షకులతో పాటు నిర్మాతల్నీ నవ్విస్తే బాగుంటుంది. నవ్విస్తారని ఆశిద్దాం. విలన్ ఫేస్ మీద పంచ్ కొట్టే హీరో మాత్రమే హీరో కాదు. పొట్ట చెక్కలయ్యేలా పంచ్‌లేసే కమెడియన్ కూడా హీరోయే. ఎంత మెయిన్ రోడ్ అయినా ఫుట్‌పాత్ ఉన్నట్టే ఎన్ని పెద్ద హీరోల కథలు ఉన్నా కమెడియన్లకు సరిపడే కథలు ఉండనే ఉంటాయి. అందుకే గతంలో రేలంగి, నగేశ్, రాజబాబు, పద్మనాభం, చలం వంటివారు కమెడియన్లుగా చేస్తూనే హీరోలుగా కూడా రాణించారు. ఆ తర్వాతి తరంలో బ్రహ్మానందం, బాబుమోహన్, అలీ, వేణుమాధవ్, పృథ్వీలాంటి వారికి అవకాశం వచ్చింది. కృష్ణ భగవాన్ అయితే ఏకంగా సిమ్రాన్ పక్కనే హీరోగా నటించారు. కమెడియన్ వేషాలు ఎన్ని వేసినా హీరోగా మారితే వచ్చే క్యాషు, క్రేజు వేరని సునీల్ లాంటి నటులు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. స్క్రీన్ మీద కాసేపుంటేనే ఇంత నవ్వొచ్చిందే సినిమా అంతా ఉంటే ఇంకెంత నవ్వు వస్తుందో అని కమెడియన్ హీరోగా చేస్తే జనం వచ్చే అవకాశం ఉంది కానీ సినిమా అంతా నవ్వించడం, కథను పండించడం అంత సులువేమీ కాదని కొన్ని పరాజయాల వల్ల, కొందరు కమెడియన్ల బ్యాక్ టు పెవిలియన్ వల్ల అర్థమవుతుంది. అయినప్పటికీ కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త ప్రాజెక్ట్‌లు జనాన్ని సంతోషపెట్టడానికి కెమెరా ముందుకు వస్తున్నాయి. ఆ వివరాలను చూద్దాం. బ్రహ్మీ ఈజ్ బ్యాక్ బ్రహ్మానందం క్రేజ్ ఉధృతంగా ఉన్న రోజుల్లో జంధ్యాల ఆయనను హీరోగా పెట్టి ‘బాబాయ్ హోటల్’(1992) సినిమా తీశారు. అయితే విడుదలకు ముందు దానికి వస్తున్న క్రేజ్ చూసి ‘ఇది కామెడీ సినిమా కాదు’ అని ట్యాగ్ లైన్ పెట్టాల్సి వచ్చింది. కామెడీ లేకపోతే బ్రహ్మానందం సినిమాకు వెళ్లడం ఎందుకు అని జనం ఆ సినిమా చూళ్లేదు. ఆ తర్వాత బ్రహ్మానందం ఒకటి రెండు సినిమాల్లో హీరోగా నటించినా ఆయనకు మంచి వేషాలు దొరికిన ‘చిత్రం భళారే విచిత్రం’, ‘మనీ’ వంటి సినిమాలతోనే ఎక్కువ పేరొచ్చింది. 2013లో హీరోగా మళ్లీ ‘జఫ్పా’ అనే చిత్రంలో నటించారు. తాజాగా ఆయనతో ‘బ్రహ్మీ ఈజ్ బ్యాక్’ అనే సినిమా తెరకెక్కనుందని ప్రకటన వచ్చింది. శ్రీధర్ శ్రీపాన దర్శకత్వం వహించనున్నారని తెలిసింది. ఇందులో రా (రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ వింగ్) ఏజెంట్‌గా బ్రహ్మానందం నటించనున్నారట. అలీ.. అలాగే.. అలీ హీరోగా నటించిన ‘యమలీల’కు (1994) ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత ‘పిట్టల దొర’(1994), ‘ఘటోత్కచుడు’ (1995), ‘సర్కస్ సత్తిపండు’ (1997) ‘గుండమ్మ గారి మనవడు’ (2007), ‘అలీబాబా ఒక్కడే దొంగ’ (2013) వంటి సినిమాలు చేశారు. తాజాగా అలీ హీరోగా ‘పండుగాడి ఫోటో స్టూడియో’ సినిమా రూపొందింది. ‘వీడు ఫొటో తీస్తే పెళ్లయిపోద్ది’ అనేది ఉపశీర్షిక. దిలీప్ రాజా దర్శకత్వం. రిషిత హీరోయిన్. నాగదేవత శాపం వల్ల 40 ఏళ్లు దాటినా పెళ్లి కాని వ్యక్తి పాత్రలో హీరోగా అలీ నటించారు. శాపం ఉన్న హీరో ప్రేమలో పడితే అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నదే చిత్రకథ. షూటింగ్ పూర్తయింది. జూన్‌లో విడుదల. సప్తగిరి నం.3 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సప్తగిరి కెరీర్ ఎక్స్‌ప్రెస్ వేగాన్ని అందుకుంది. ‘పరుగు’ (2008), ‘ప్రేమకథా చిత్రమ్’ (2013) వంటి సినిమాలు అందుకు ఫౌండేషన్ వేశాయి. ఆ తర్వాత వరుస అవకాశాలను దక్కించుకున్న సప్తగిరి 2016లో ట్రాక్ మార్చారు. హీరోగా ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమా చేశారు. అది రిలీజైన ఏడాదికే ‘సప్తగిరి ఎల్ఎల్బీ’ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. ఇప్పుడు ‘వజ్ర కవచధర గోవింద’ తో మూడోసారి హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుణ్ పవార్ దర్శకత్వం. ఓ వజ్రానికి సప్తగిరి ఎలా కవచంలా నిలబడ్డారన్నదే కథ. యాక్షన్, ఫైట్లు కూడా చేస్తున్న సప్తగిరిని ఈ సినిమాలో చూడవచ్చు. షకలక లకలక టీవీ నుంచి సినిమాకి సినిమా నుంచి హీరో కుర్చీకి ఎదగడానికి ఒళ్లొంచి కష్టం చేస్తున్న నటుడు శంకర్. ‘రాజుగారి గది 2’, ‘ఆనందోబ్రహ్మ’ (2017) సినిమాలు శంకర్‌కు హాస్యనటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. దాంతో గత ఏడాది ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. ఆ తర్వాత హీరోగా ‘డ్రైవర్ రాముడు’ సినిమా చేశారు. రాజ్ సత్య దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇటీవలే హీరోగా తన మూడో చిత్రాన్ని కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లారు శంకర్. ‘నాలుగో సింహం’ టైటిల్‌తో జానీ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు ‘షకలక’ శంకర్. ముంబై బ్యూటీ అక్షయ శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. సినిమాల్లో కమెడియన్‌గా అవకాశాలు తగ్గడం వల్లనే తాను హీరోగా మారాల్సి వచ్చిందని ఓ సందర్భంలో శంకర్ పేర్కొనడం విశేషం. ప్రియ మల్లేశం ‘నా సావు నేను సస్తా... నీ కెందుకు’ బుక్ రైటర్ గుర్తున్నాడుగా! ‘పెళ్ళిచూపులు’ (2016)సినిమాలో ఫుల్‌గా నవ్వించిన కమెడియన్ ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్‌గా చేశారు. ఇప్పుడు ‘మల్లేశం’ అనే బయోపిక్‌లో హీరోగా నటిస్తున్నారు. నేతకు పనికి వచ్చే ఆసు మిషన్‌ను కనుగొని పద్మశ్రీ పురస్కారం పొందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణ యాస ప్రియదర్శికి కొట్టిన పిండి. కనుక ఈ సినిమాలో ఆయన ఆకట్టుకుంటారని ఆశించవచ్చు. చేదు మిఠాయి ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ స్నేహితుడిగా నటించి ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు రాహుల్ రామకృష్ణ. ఈ క్యారెక్టర్లో అటు కామెడీ చేస్తూనే సీరియస్ డైలాగ్స్ కూడా చెప్పారు. మహేశ్‌బాబు ‘భరత్ అనే నేను’ సినిమాలో మరో ముఖ్యపాత్ర దక్కింది. ఆ నెక్ట్స్ ‘సమ్మోహనం’(2018), ‘గీత గోవిందం’(2018) సినిమాల్లో మార్కులు పడ్డాయి. దాంతో డార్క్ కామెడీ ఫిల్మ్ ‘మిఠాయి’లో హీరోగా నటించారు రాహుల్ రామకృష్ణ. ఇందులో కమెడియన్ ప్రియదర్శి మరో లీడ్ క్యారెక్టర్ చేశారు. కానీ ఈ ‘మిఠాయి’ ప్రేక్షకులకు రుచించలేదు. అయితే రాహుల్ రామకృష్ణ ముఖ్యపాత్ర పోషించిన ‘హుషారు’ ప్రేక్షకులకు నచ్చింది. హాలీవుడ్ సినిమా ‘సిల్క్‌రోడ్’లో రాహుల్ ఒక కీలక పాత్రకు సెలక్ట్ కావడం కూడా ఒక మంచి వార్తే. ఇన్పుట్స్: ముసిమి శివాంజనేయులు మళ్లీ హీరోగా...! సునీల్ ‘అందాలరాముడు’ (2006) సినిమాతో హీరోగా మారారు. ఆ సినిమా హిట్. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ‘మర్యాదరామన్న’ సూపర్‌హిట్ సాధించింది. ఆ తర్వాత ‘పూలరంగడు’ (2012) కమర్షియల్‌గా సక్సెస్ కొట్టింది. నాగచైతన్యతో కలిసి ‘తడాఖా’లో లీడ్ రోల్ చేశారు. కమెడియన్‌గా ఏడాదిలో అరడజనుకు పైగా సినిమాలు చేసిన సునీల్ హీరో అయ్యాక ఏడాదికి ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో కొన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో సునీల్ హీరోగా జర్నీకి కామా పెట్టినట్లున్నారు. ప్రస్తుతం కమెడియన్‌గా ఫుల్ బిజీ అయ్యారు. కానీ ఆయనను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ఒకటి రెండు ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి. హీరోనే టార్గెట్‌నా? ‘వెంకీ’,‘ పోకిరి’, ‘ఢీ’, ‘బిందాస్’ వంటి సినిమాల్లో బాల హాస్యనటుడిగా భరత్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆడియన్స్ మాస్టర్ భరత్ అని పిలుచుకున్నారు. సునీల్ హీరోగా నటించిన ‘ఈడు గోల్డ్ ఎహే’ (2017)సినిమాలో హాస్యనటుడిగా కనిపించిన భరత్ రీసెంట్గా ‘ఏబీసీడీ’ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చైల్డ్ కమెడియన్‌గా సక్సెస్ అయిన భరత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సక్సెస్ అవుతాడా? లేక భవిష్యత్‌లో హీరోగా కూడా చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్నది చూడాలి. -
అసలు మా తాత అలా చేసి ఉండకపోతే!
ఒక మరాఠీ చిత్రానికి రిమేక్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్, స్ట్రెస్‌బస్టర్ అనిపించుకుంది. ప్రతి డైలాగులో నవ్వుల పువ్వులు పూసే ఈ సినిమాలో ప్రతి సీన్... నవ్వుల విందే! నవ్వుకు బ్రహ్మానందరథం పట్టిన ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం... వంటరూమ్‌లో కూర్చొని కూరల ఆరా తీస్తున్నాడు బ్రహ్మానందం. ఈలోపే భళ్లుమని పెద్దశబ్దం. వంటరూమ్ కిటికీలో నుంచి ఎవరో దూకారు. ‘దొంగా దొంగా’ అని భయంతో కళ్లు మూసి కళ్లు తెరిచాడు బ్రహ్మానందం. కళ్లు తెరిచిన టైమ్‌లో వాస్తవం కళ్లకు కట్టింది. వచ్చిన వాడు దొంగకాదు... తన క్లోజ్‌ఫ్రెండ్ రాజా! స్వీట్షాక్!!‘‘ఎన్నాళ్లకు కనిపించావురా. మేమందరం కలిసే ఉన్నాం. నువ్వు లేక లైఫంతా డల్‌గా, డిమ్‌గా, చద్దన్నంలో పెరుగేసుకొని తిన్నట్లుగా ఉంది’’ అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్నేహితుడిని రూమ్మెట్స్ మరియు పాతస్నేహితుల దగ్గరికి తీసుకువెళ్లాడు బ్రహ్మానందం. దొరలా కనిపిస్తున్న రాజా కిటికీలో నుంచి దొంగోడిలా ఎందుకు వచ్చాడు? బామ్మతో కలిసి పల్లెటూళ్లో ఉండే రాజా ఉన్నపళంగా పట్టణానికి ఎందుకు వచ్చాడు?అసలు ఏం జరిగింది?ఇప్పుడు మనం ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం:రాజా అంటే నాటకాలు పడి చస్తాయి. రాజా స్టేజి ఎక్కితే చప్పట్లే చప్పట్లు, ఈలలే ఈలలు. అలాంటి రాజా ఈసారి కూడా కప్పు కొట్టేశాడు.మండలాధ్యక్షుడు ఆ కప్పును రాజా చేతిలో పెడుతూ ఇలా స్పీచిచ్చాడు:‘‘ఈ కప్పును తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దీన్ని చూసుకుంటూ తుడుచుకుంటూ, తుడుచుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ చప్పట్లకు చాన్సు ఇస్తున్నాను. కొట్టుకోండి...కొట్టుకోండి’’ చప్పట్లే చప్పట్లు! ఆ చప్పట్ల వానలో తడిసి ముదై్దన రాజా మైక్ అందుకొని ముద్దు ముద్దుగా ఇలా మాట్లాడాడు:‘‘మండలాధ్యక్షుడన్న ఇచ్చిన ఈ వెండికప్పును బంగారుకప్పుగా భావిస్తున్నాను. ఇది జీవితాంతం అద్దాల బీరువాలో ఉండేట్లు చూసుకుంటాను. అది నా బాధ్యత. నా ధర్మం’’రాజా నోటి నుంచి ‘నా బాధ్యత, నా ధర్మం’ అనే మాటలు పూర్తయ్యాయో లేదో...రేయ్...’ అంటూ రాజా బామ్మ నార్త్‌కొరియా క్షిపణిలా స్టేజీ మీదికి దూసుకువచ్చింది. మనవడు రాజాను తప్పించుకుపోయిన దొంగలా ఇంటికి ఈడ్చుకొచ్చింది.అధ్యక్షా!రాజావారు చేసిన తప్పేమిటి?కళామతల్లి పాదల చెంత పడి ఉండటం తప్పా?నాటకాలు వేయడం తప్పా?చప్పట్లను ఆస్వాదించడం తప్పా?కప్పులు అందుకోవడం తప్పా?‘తప్పా! తప్పున్నరా’ అంటుంది బామ్మ. ఎందుకో ఆమె మాటల్లోనే విందాం:‘‘ఒరేయ్... ఒరేయ్... దొంగోడివైనా సంతోషిస్తానుగానీ ఇలా నాటకాల రాయుడివైతే మాత్రం భరించలేను... భరించలేను. నీకు తెలుసా? మీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగుల పిచ్చిలో పడే నాశనమయ్యారు. ఈ నాటకాల కోసం ఎకరాలకెకరాలు హారతి కర్పూరంలా కరిగించేశారు. ఈవేళ పూటకు గతి లేని స్థితికి వచ్చాం. వద్దురా వద్దు. ఆ వేషాల మోజులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ జీవితం కూడా బుగ్గిపాలు చేసుకోవద్దు. బాగా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకోరా. అది నీ వల్ల కాకపోతే... నేను ఎక్కడైనా బిచ్చమెత్తుకొనైనా సరే నిన్ను పోషిస్తా. అంతేకాని, బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి వెళ్లకు. ఒరేయ్...ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడావంటే ఆ స్టేజీ మీదే ఉరి పోసుకొని చస్తాను’’ మ్యాటర్ అర్థమైంది కదా...అదీ విషయం! బామ్మ మాటలకు మనవడు రాజా భోరుమన్నాడు. ఇలా కూడా అన్నాడు...‘‘గత్యంతరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. నన్ను ఇన్నాళ్లు పోషించిన నిన్ను పోషించాలనే బాధ్యత తప్ప రంగు పిచ్చి కాదే... ఆ...ఆ...అలాగే... రేపటి నుంచి నాటకాలు ఆడ్డాం మానేస్తా... హైదరాబాద్‌కు వెళ్లి ఏదో ఉద్యోగం ఎలాగో అలాగ వెదుక్కుంటా’’అలా వచ్చాడండీ రాజా హైదరాబాద్‌కి.ఇప్పుడు మళ్లీ ఫ్రెండ్స్రూమ్లోకి వెళదాం:రాజా అతని స్నేహితుడు రాఘవ హ్యాపీగా ఆలింగనం చేసుకున్నారు. ఆ తరువాత రాఘవ రాజాను కుశలం అడిగాడు..‘‘ఆ ఏమిటి సంగతులు. బాగున్నావు కదా!’’‘‘బాగుంటే కిటికిలో నుంచి ఎందుకు దూకుతానురా? నా పరిస్థితంతా పాతాళభైరవి అయిపోయింది. ఉద్యోగప్రయత్నాలకు ఇక్కడొచ్చి పడ్డాను’’ తాను ఎందుకు వచ్చింది సూటిగా చెప్పాడు రాజా.‘ఉద్యోగప్రయత్నం’ అనే మాట వినగానే భల్లుమని నవ్వాడు బ్రహ్మానందం.‘‘ఉద్యోగప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం చూసుకోవడం కంటే టికెట్ కొనుక్కొని లాటరీ కోసం ప్రయత్నించడం మంచిది’’ అని సలహా ఇచ్చి ‘హ్హా హ్హా హ్హా’ అని పెద్దగా నవ్వాడు బ్రహ్మానందం. ఈ నవ్వులు విని భయంగా పరుగెత్తుకు వచ్చిన మరో స్నేహితుడు సుధాకర్...‘‘కంకరరాళ్ల మీద రోడ్డు రోలర్లా ఏంట్రా ఆ నవ్వు? ఇంటి ఓనర్ పైకి వచ్చాడంటే కొంప మునుగుతుంది’’ అని హెచ్చరించాడు. ఈ వార్నింగ్ మాట ఎలా ఉన్నా...‘‘ఛ! వెధవ జీవితం. మనసారా నవ్వుకోవడానికి కూడా లేదు’’ అని మూతిముడిచి...‘‘తప్పు నీది కాదురా... అసలు మా తాత అలా చేసి ఉండకపోతేనాకీ ఖర్మ పట్టేది కాదు’’ విషాదం ఒలకబోస్తూ అన్నాడు బ్రహ్మానందం.‘మా తాత అలా చేసి ఉండకపోతే’ అనే మాట విని రూమ్‌లో పిడుగు పడ్డట్లు అదిరిపడ్డారు స్నేహితులు.‘‘మీ తాత ఏంచేశాడ్రా’’ ఆందోళనతో కూడిన ఆసక్తితో, ఆసక్తితో కూడిన ఆందోళనతో అడిగాడు రాజా.‘‘ఏం చేశాడా! ఏ బిర్లాలాగో బిజినెస్ చేసి ఉంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. మైసూర్ మహారాజులా దర్జాగా ఉండేవాడిని. వాడేమో రేషన్ షాప్‌లో గుమస్తాగా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో జీతం లేని సర్వరును అయ్యాను’’ అని దుఃఖంతో ముక్కుచీదాడు బ్రహ్మానందం.‘‘వార్నీ... మా తాత బాబరై ఉంటే నేను అక్బర్నై ఉండేవాడిని అని ఫీలయ్యేవాడిని నిన్నే చూస్తున్నాను’’ అని తెగ ఆశ్చర్యపోయాడు రాజా. -
ఈయన కరెంట్‌ను పట్టుకుంటారు..
పరకాల: కరెంటు సరఫరా అవుతున్న వైర్లు పొరపాటున తగిలినా ప్రాణాలు గాలిలో కలిసిపోవడం ఖాయం. కానీ, ఆయనకు మాత్రం కరెంటు అంటే భయం లేదు. కరెంటు సరఫరా అయ్యే వైర్లను ముట్టుకోవడమే కాదు.. ఏకంగా వాటిని నోట్లో పెట్టుకుంటాడు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం శని గరం గ్రామానికి చెందిన సెగ్గోజు బ్రహ్మానందం ఐటీఐలో డీజిల్ మెకానిక్ పూర్తి చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్ మండలం సింగపూర్ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నారు. సెలవురోజుల్లో వరంగల్ జిల్లా పరకాలలో ఫ్యాన్లు, కూలర్లు, విద్యుత్ మోటార్లును రిపేర్ చేస్తుంటాడు. కరెంటు సరఫరా అవుతున్న వైర్లను నోటిలో పెట్టుకొని చూపుతుంటారు. సరఫరా అవుతున్న వైర్లను పట్టుకున్న ఆయనకు టెస్టర్‌తో పరీక్షిస్తే దాని లైటు వెలుగుతుండడం విశేషం. ఎలక్రికల్ వస్తువులు రిపేరు చేస్తున్న సమయంలో అప్పుడప్పుడు వైర్లు తగిలినా షాక్ వచ్చేది కాదని, ఒకసారి వైర్లను ముట్టుకున్నా ఏమీ కాలేదని, అప్పటి నుంచి కరెంటు ఉన్న ైవె రును చేతితో పట్టుకోవడం ప్రారంభించానని చెబుతున్నారు. -
కామెడీ క్రాకర్స్
పొట్ట చెక్కలైతే అది.. ‘బ్రహ్మీ’ బులెట్ బాంబ్. డొక్కలు ముక్కలైతే అది... పృథ్వీ రాకెట్ షాట్. బాడీ మొత్తం షేకైతే అది... షకలక శంకర్ పాంబిళ్ల. పడీపడీ నవ్వుతుంటే అది.. అలీ గ్రౌండ్ చెక్కర్. కిందపడి కొట్టుకుంటే అది.. పోసాని విష్ణు చక్రం. రివ్వున గింగరాలు తిరిగితే అది... సప్తగిరి భూచక్రం. కితకితలొస్తే అది... శ్రీనివాస్‌రెడ్డి ఫ్లవర్ పాట్. కళ్లు తేలేసి తలకిందులైతే అది... సంపూర్ణేష్ లడీ. తెలుగు సినిమాల్లో లేటెస్టుగా ఇప్పుడు... సౌండ్ అదిరిపోతున్న కామెడీ క్రాకర్స్ ఇవి. హ్యావ్ ఎ నైస్ అండ్ నవ్వుల దీపావళి. కిల్ బిల్ పాండే @ రేసుగుర్రం ‘రేసుగుర్రం’లో రేసుగుర్రంలా పరుగులుపెట్టే పాత్ర నాది. అప్పటివరకూ సినిమా ఒక మూడ్‌లో నడిస్తే, నేనొచ్చాక ఇంకో మూడ్‌లో నడుస్తుంది. అసలు నా ఎంట్రీనే ఓ ఫ్రస్టేషన్ మూడ్‌లో ఉంటుంది. పోలీసాఫీసర్‌గా అన్నేళ్లు పనిచేసినా ఏం శాటిస్ఫేక్షన్ లేక చాలా ఫ్రస్టేషన్‌తో గడిపే కిల్‌బిల్ పాండే వేషం నాది. విలన్ ఇంటిలోకి నేను కారులో దూసుకె ళ్లడం, కదులుతున్న కారులో నుంచి దూకేయడం... ఇవన్నీ ఆడియన్స్‌కు బాగా నచ్చేశాయి. ముఖ్యంగా పిల్లలు నేనెక్కడ కనబడ్డా ‘కిల్‌బిల్ పాండే’ అని పిలవడం మొదలెట్టారు. ఈ మధ్యకాలంలో బాగా పేలిన పాత్ర అంటే ఇదే! - బ్రహ్మానందం బాయిలింగ్ స్టార్ బబ్లూ@ లౌక్యం ‘ఖడ్గం’ సినిమాలో నాపాత్రకు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అంటూ ఓ మేనరిజం ఉంది.అప్పట్నుంచీ నా ఇంటిపేరు ‘థర్టీ ఇయర్స్’ అయిపోయింది. ఆ తర్వాత చాలా పాత్రలు చేసినా, ఆ పేరు మాత్రం బ్రేక్ కాలేదు. ‘లౌక్యం’లో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ చేసేవరకు నా పరిస్థితి ఇంతే. ఈ సినిమా దెబ్బతో ఇప్పుడు నన్నందరూ ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ అనే పిలుస్తున్నారు. అంతలా లక్ష్మీ బాంబులా పేలిందా పాత్ర. స్క్రిప్టులో ఈ కేరక్టర్ రాస్తున్నప్పుడే రచయిత శ్రీధర్ సీపాన, దర్శకుడు శ్రీవాస్ ఇదేదో బాంబులా పేలేటట్లు ఉందే అనుకున్నారట. నిజంగానే ‘లౌక్యం’ రిలీజయిన వారానికే ఓవర్‌నైట్‌లో కమర్షియల్ కమెడియన్ని అయిపోయా. ఆ తర్వాత మిస్సైల్స్ లాంటి పాత్రలు వచ్చాయి... వస్తున్నాయి... వస్తాయి కూడా. - పృథ్వీ శుక్లాభాయ్@ నాయక్ నేను హీరోగా, డెరైక్టర్‌గా ‘బొంగుస్వామి’ పేరుతో ఓ సినిమాకు ప్లానింగ్ జరుగుతోంది. ఆ టైమ్‌లో దర్శకుడు వినాయక్ దగ్గర్నుంచి ఫోన్..‘‘ సార్.. ‘నాయక్’ సినిమాలో ఓ వేషం ఉంది. మూడురోజులు కాల్షీట్స్ కావాలి’’ అనడిగాడు. నాకు అలాంటి చిన్న వేషం వేయడం ఇష్టం లేదు. కానీ వినాయక్ కోసమని ఒప్పుకొని వెళ్లా. ఆ రోజు నా మీద కొన్ని సీన్స్ తీశారు. నా బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్ చూసి వినాయక్, కెమేరామెన్ ఛోటా కె.నాయుడు ఒకటే నవ్వులు. యూనిట్ సభ్యులు కూడా పగలబడి నవ్వుతున్నారు. దాంతో వినాయక్ వెంటనే రచయిత ఆకుల శివను పిలిచి-‘‘పోసాని గారు సెకండాఫ్ మొత్తం కనబడేట్టు స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చెయ్’’ అని ఆర్డర్ వేశారు. అలా 3 రోజులు అనుకున్న నా వేషం 13 రోజులకు వెళ్లింది. చివరకు క్లైమాక్స్‌లో కూడా నా పాత్రను ఇరికించారు. చిరంజీవి గారు రష్ చూసి నా పాత్రను బాగా ఎంజాయ్ చేశారు. రామ్ చరణ్‌తో ఈ సినిమా హిట్ అని ముందే చెప్పేశారట. నా పాత్ర ఇంతలా పేలుతుందని నేను కూడా అస్సలు ఊహించలేదు. రిలీజ్ తర్వాత ఫోన్ల మీద ఫోన్లు. దాసరి గారు ప్రత్యేకంగా నన్ను అప్రిషియేట్ చేశారు. అలాగే బ్రహ్మానందం గారు కూడా. ఆ దెబ్బతో రాత్రికిరాత్రే స్టార్ కమెడియన్ని అయిపోయా. ఈ ఒక్క పాత్ర వల్ల నాకు 37 సినిమాలు వచ్చాయి. దీంతో డెరైక్షన్ పక్కన పెట్టేశాను. ఇలాంటి పాత్ర ఇచ్చిన వినాయక్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. - పోసాని కృష్ణ మురళి మైదానం@ రాజు గారి గది ‘ఎమ్.వై దానం....ై మెదానం’... ఇప్పుడు ఎక్కెడికెళ్లినా నన్ను ఇలానే పిలుస్తున్నారు. ఇప్పటివరకూ నేను ఎన్ని సినిమాలు చేసినా, ఈ పాత్ర మాత్రం ప్రేక్షకుల హృదయాల్లోకి తారాజువ్వలా దూసుకెళ్లింది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒక ఎత్తయితే, నా సినీ కెరీర్‌ను మలుపు తిప్పిన పాత్ర మాత్రం ‘రాజు గారి గది’ లోని మైదానం పాత్రే. ‘గీతాంజలి’ తర్వాత ఫుల్‌లెంగ్త్ రోల్ చేసింది ఈ సినిమాలోనే. నా మొదటి సినిమా ‘రన్ రాజా రన్’. అందులో నాది కానిస్టేబుల్ వేషం. అది చూసి కోనవెంకట్‌గారు నాకు ‘గీతాంజలి’ సినిమాలో ఆరుద్ర పాత్ర ఇచ్చారు. ఆరుద్ర వల్ల ఈ మైదానం దక్కింది. ఈ మైదానం మాత్రం నాకే కాకుండా ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాడు. శ్రీను@ గీతాంజలి ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలన్నీ తెరపై బాంబుల్లా పేలినవే. ‘ఇడియట్’లో రవితేజ ఫ్రెండ్‌గా, ‘సోలో’ సినిమాలో నారారోహిత్ పక్కన నేను చేసిన కామెడీ నన్ను ప్రామిసింగ్ కమెడియన్ని చేశాయి. నా కెరీర్‌ను ఒక్కసారిగా తారాజువ్వలా తీసుకెళ్లిన సినిమా మాత్రం ‘గీతాంజలి’. తొలిసారిగా మెయిన్ రోల్ చేస్తూనే కామెడీ పండించే అవకాశం దక్కింది. ఇందులో నాది డెరైక్టర్ కావాలని కలలు కనే పాత్ర. అందులోనూ ఓ దెయ్యం కథ తయారు చేసుకుని నిర్మాత కోసం వెతుకుతుంటా. ఈ నేపథ్యంలో నిజంగా దెయ్యం రావడం... ఎందుకండీ నేను చెప్పడం ఆల్రెడీ మీరు చూశారు... ఎంజాయ్ చేశారు కదా. దెయ్యం సినిమాతో నవ్వించడం అంటే మాటలు కాదు కదా. మొత్తానికి డెరైక్టర్ శ్రీను పాత్ర నా లైఫ్ టైమ్ మెమొరీలో నిలిచిపోతుంది. - శ్రీనివాసరెడ్డి నెల్లూరు గిరి@ ప్రేమకథా చిత్రమ్ నేను మొదట్లో ‘పరుగు’లో నటించాను. ఆ తర్వాత ఇంకొన్ని సినిమాలు చేశా. కానీ నా కెరీర్‌ను మలుపు తిప్పి, టపాకాయ్‌లా పేలిన సినిమా అంటే ‘ప్రేమకథా చిత్రమ్’. అందులో నా పాత్ర పేరు ‘నెల్లూరు గిరి’. ఆత్మహత్య చేసుకోవడం కోసం హీరో బ్యాచ్‌తో కలిసి ఊరు చివరి గెస్ట్‌హౌస్‌కు వెళ్తాడు. అక్కడ కథ ఎలా మలుపు తిరిగిందో మీకు తెలుసు. అక్కడ నుంచీ నా కెరీర్ కూడా ఎలా మలుపు తిరిగిందో కూడా మీకు తెలుసు. - సప్తగిరి సంపూర్ణేశ్‌బాబు@ హృదయకాలేయం అందరికీ దొరకని అదృష్టం నాది. ఎవ్వరికీ దొరకనంత క్రేజ్ నాకు ఫస్ట్ సినిమాతోనే వచ్చేసింది. అదే ‘హృదయకాలేయం’. ముందు సోషల్ మీడియాలో సూపర్‌హిట్ అయ్యి, తర్వాత సెల్యులాయిడ్ మీద సూపర్‌హిట్ అయ్యా. మొదటి చిత్రమే నా కెరీర్‌కు యూటర్న్ అయిందంటే విచిత్రంగా ఉంది కదూ. నేను ఎన్ని సినిమాలు చేసినా, ‘హృదయకాలేయం’ సంపూర్ణేశ్‌బాబు అంటేనే చాలా మంది గుర్తుపడుతూ ఉంటారు. ఆ ట్యాగ్ ఇప్పటికీ, ఎప్పటికీ నాకు ప్లస్ పాయింట్. - సంపూర్ణేశ్‌బాబు రాజారత్నం @ శ్రీమంతుడు ‘‘బాబూ... నువ్వు రానంతవరకూ ఆవిడ తోటకెళ్తూనే ఉంటుంది’’ అని నేను ‘శ్రీమంతుడు’ సినిమాలో రాజారత్నం పాత్రలో చెప్పిన డైలాగ్‌కు థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఈ మధ్య కాలంలో నాకు బాగా పేరు తె చ్చిన పాత్ర అంటే ఇదే. అలాగే ‘బ్రూస్లీ’ సినిమాలో ఆమిర్ ఖాన్ స్కూప్ కూడా బాగా క్లిక్ అయ్యింది. - అలీ -
s\o. బ్రహ్మమూర్తి ... ఆస్తే విలువ
కొత్త అవతార్ సన్నాఫ్ సత్యమూర్తిలో ప్రకాష్‌రాజ్‌కి బదులు బ్రహ్మానందం ఉంటే! అల్లు అర్జున్ ఇంట్లోకి వెళ్లేసరికి మేనేజర్ తిడుతూ బయటికి వెళుతున్నాడు. తండ్రి బ్రహ్మానందాన్ని చూసి,అర్జున్ - ‘‘ఎందుకు నాన్నా వాడు బీప్ సౌండ్‌తో తిడుతున్నాడు’’. బ్రహ్మా - ‘‘అడిగినప్పుడు డబ్బులివ్వకపోతే వాడేంటి నువ్వు కూడా తిడతావు.’’‘‘ఇవ్వచ్చు కదా.’’ ‘‘వాడి భార్య ఆస్పత్రిలో ఉందని ఇప్పటికి ఆరుసార్లు చెప్పాడు. ఒకే భార్య ఎన్నిసార్లు ఆస్పత్రిలో ఉంటుంది?’’ ‘‘అంటే ఇప్పటికి ఆరుసార్లు డబ్బులిచ్చావా?’’ ‘‘ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఈ బ్రహ్మమూర్తి దేన్నీ నమ్మడు. బ్రహ్మను కూడా నమ్మడు. నీకు నాన్నా పులి కథ తెలుసా? ఏదో కొడుకు కదాని రెండుసార్లు నమ్మాడు. మూడోసారి నమ్మకపోవడం వల్ల బతికిపోయాడు. నమ్ముంటే కొడుకుతో పాటు తండ్రిని కూడా పులి తినేసేది. కథ కంచికి... పులి అడవికి.’’ ‘‘ఏంటి నాన్నా, కథ కొత్తగా చెపుతున్నావ్?’’ ‘‘బాగున్నప్పుడు కథలు చెప్పి, బాగా లేనప్పుడు నాటకాలు ఆడేవాడు కాదురా ఈ బ్రహ్మమూర్తి. ఏ కథైనా మొదట విన్నప్పుడు కొత్తగా ఉంటుంది. తరువాత రోతగా మారుతుంది. నేనో అమ్మాయిని చూశాను. అమ్మాయి ఆస్తి నాకు నచ్చింది. నీకు అమ్మాయి నచ్చకపోయినా పెళ్లి చేసుకో. ప్రపంచంలో సగం మంది నచ్చకుండానే పెళ్లి చేసుకుంటారు. మిగిలిన సగం మందికి పెళ్లయింతరువాత ఒకరికొకరు నచ్చరు. పెళ్లికి ముందు నచ్చి, పెళ్లికి తరువాత నచ్చితే వాళ్ల క్యారెక్టర్లో ఏదో మచ్చ ఉందని అర్థం. ఒక్క విషయం గుర్తుంచుకో. ఈ లోకంలో వస్తువులకే తప్ప మనుషులకు విలువలుండవు. ఆస్తికి విలువుంటుంది కానీ, విలువల వల్ల ఆస్తి రాదు, చిప్ప మాత్రం వస్తుంది.’’ ‘‘బ్రహమూర్తి కొడుకుగా నాకే విలువా లేదా?’’ ‘‘నాకు మూడొందల కోట్లు ఆస్తి ఉంది కాబట్టే నీకు విలువ. మూడొందల కోట్లు అప్పులున్నాయని తెలిస్తే నీకూ నాకూ శిలువ. ఒకవేళ నేను పోయినా ఎవరికీ రూపాయి అప్పు తీర్చద్దు.’’ ‘‘తీర్చకపోతే ఎలా నాన్నా?’’ ‘‘వొరే పిచ్చినాన్నా, ఈ దేశానికి లక్షల కోట్లు అప్పుంది. మన రాష్ట్రానికి అప్పుంది. చివరికి చెత్త ఊడ్చే మునిసిపాలిటీలు కూడా వరల్డ్ బ్యాంక్‌లో అప్పులు తీసుకుంటున్నాయి. అప్పు చేయడం దేశభక్తితో సమానం. మేరీ దేశ్ కీ ధర్తీ అని పాట పాడుతూ అప్పుజెయ్యి. అప్పుచేసేవాడు అప్‌కి వెళతాడు. తీర్చేవాడు డౌన్‌కి పోతాడు.’’ ‘‘గ్రేట్ వాల్యూస్ నాన్నా నీవి?’’ ‘‘గ్రేట్ కాదు, రేట్ వాల్యూస్. చూడు మనం ఎంతటి లంకానగరం నిర్మించినా, లంకిణిని కాపలా పెట్టినా, ఏదో ఒకనాడు తోక తిప్పుకుంటూ ఆంజనేయుడు వస్తాడు. వాడి తోకకి నిప్పు పెట్టడం నేర్చుకో. అర్థం కాలేదా ఆంజనేయుడంటే ఆదాయపు పన్నువాడు.’’ ‘‘సన్ ఆఫ్ బ్రహ్మమూర్తంటే గర్వంగా ఉంది నాన్నా.’’ ‘‘నువ్వు సన్వి కాదు, గన్ ఆఫ్ బ్రహ్మమూర్తి. రివాల్వర్‌లో ఇమిడిపోయే ఫిరంగి గుండువి.’’ - జి.ఆర్ -
బ్రహ్మానందంలో బయటపడిన రెండోకోణం
బ్రహ్మానందం అనగానే గతంలో తెలుగు లెక్చరర్ అని, ప్రస్తుతం హాస్యనటుడని మాత్రమే మనందరికీ తెలుసు. అయితే, ఆయనలో మనందరికీ తెలియని మరో కోణం కూడా ఉంది. కేవలం హాస్య కళ మాత్రమే కాక.. శిల్పాలు చేయడం కూడా మన బ్రహ్మానందానికి వచ్చు! ఈ విషయం ఇన్నాళ్ల పాటు ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. తాజాగా ఆయన బంకమట్టితో ఓ విగ్రహాన్ని రూపొందించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ బొమ్మను ఆయన జీవం ఉట్టిపడేలా తయారు చేశారు. ఈ విగ్రహాన్ని తయారుచేసే క్రమంలో ఉన్న ఫొటోలను కూడా బ్రహ్మానందం తన ఫేస్బుక్ పేజీలో అభిమానులందరికీ షేర్ చేశారు. దాంతో ఆయనలో్ ఉన్న రెండో కోణం కూడా అభిమానులకు తెలిసింది.