శిల్ప సంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతం, అపూర్వమని అమెరికాకు చెందిన సందర్శకుల బృందం స్పష్టం చేసింది. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూడడం జరిగిందని వారు తెలిపారు. అన్ని దేవాలయాల్లో శిల్పసంపద ఉంది. అపరూపమైన శిల్పాలను ధ్వంసం కాకుండా చూడాలని సూచించారు. గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. దేవాలయాలను నిర్మించిన కాకతీయుల గూర్చి అడిగి తెలుసుకున్నారు.