kakathiya
-
కింద పెద్దవాగు.. పైన కాకతీయ కాలువ..
మోర్తాడ్(బాల్కొండ): ప్రకృతి అందించిన పెద్దవాగు ప్రవాహానికి బ్రేక్ పడకుండా కాకతీయ కాలువ ద్వారా నీటి తరలింపునకు ఆటంకం లేకుండా అక్విడెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసిన ఇంజినీర్ల శ్రమ ఎంతో గొప్పది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి తరలింపు కోసం తొర్తి, వెంచిర్యాల్ మధ్యలో ఉన్న పెద్దవాగుపై అక్విడెక్ట్‌ను నిర్మించారు. కింద పెద్దవాగు, పైన కాకతీయ కాలువ చూడడానికి ఇదో అద్భుతంగా ఉంటుంది. ఇంజినీర్ల ప్రతిభకు అద్దంపట్టే అక్విడెక్ట్‌ను శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలోనే పూర్తిచేశారు. వర్షాకాలంలో పెద్దవాగు, కాకతీయ కాల్వలు రెండు ప్రవహించే సమయంలో పర్యాటకులను ఈ అక్విడెక్ట్ ఎంతో ఆకర్షిస్తుంది. డంగు సున్నం, కంకర, ఇనుము తది తర సామగ్రిని వినియోగించి అక్విడెక్ట్‌ను పూర్తి చేశారు. కాకతీయ కాలువ ద్వారా విడుదల చేసే నీటి ప్రవాహానికి అక్విడెక్ట్ తట్టుకుని ఉండే విధంగా లీకేజీలను ఏర్పాటు చేశారు. లీకేజీల వల్ల పెద్దవాగులో జలకళ సంతరించుకుని సా గునీటి సమస్యను కొంత మేర తీరుస్తుంది. నీటి తరలింపునకే కాకుండా రవాణాకు ఉపయోగపడే విధంగా అక్విడెక్ట్‌ను నిర్మించారు. అక్విడెక్ట్ కు రెండువైపులా వాహనాలు వెళ్లే విధంగా మా ర్గం ఉంది. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారికి అక్విడెక్ట్‌ను దాటడం సులభంగానే ఉంది. అక్విడెక్ట్‌కు చిన్న చిన్న మరమ్మతులు అవసరం ఉన్నాయి. అయితే అక్విడెక్ట్ నిర్మించి ఐదు దశాబ్దాలు దాటినా ఈ నిర్మాణం చెక్కు చెదరకుండా ఉండడంతో అప్పటి ఇంజినీర్ల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తుందని చెప్పవచ్చు. టెక్నాలజీ తోడవడంతో అద్భుత ఆవిష్కరణలు దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలాకీలకం. శాస్త్ర, సాంకేతిక రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ఇంజినీరింగ్ రంగానికి తోడు కావడంతో సాగునీటి ప్రాజెక్టుల ఆవిష్కరణలో ఆద్భుత ఫలితాలు సాధించుకుంటున్నాం. గోదావరి నదిపై చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేయడంలోనే తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభ ప్రపంచానికి తెలిసింది. ఇంజినీరింగ్ రంగంలో అద్భుత ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. – మధుకర్ రెడ్డి, ఈఈ నీటిపారుల శాఖ ప్రాజెక్టు డివిజన్, బోధన్ -
1151.. రూప బాణ క్షితి శశి!
సాక్షి, హైదరాబాద్: అది నాలుగు పదాల వాక్యం.. రూప బాణ క్షితి శశి! వీటిని కలిపి చదివితే అర్థమేమీ స్ఫురించదు. కానీ విడివిడిగా అర్థాలు చూస్తే.. రూప అంటే రూపం, బాణ అంటే బాణం, క్షితి అంటే భూమి, శశి అంటే చంద్రుడు. వాటికి అంకెల రూపమిస్తే.. 1511. కాస్త ఆశ్చర్యంగా, అయోమయంగా అనిపిస్తున్నా.. మన పూర్వీకుల భాషా విన్యాసా నికి ఇదో మచ్చుతునక. అంకెలను అంకెలుగా చెప్పకుండా సంస్కృత/తెలుగు పదాలతో వివరించటం, పదాలను అక్షరాలుగా కాకుండా అంకెల్లో చెప్పటం వారి భాషా ప్రత్యేకత. దానికి సజీవ నిదర్శనమే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామం లోని వీర గోపాలస్వామి దేవాలయంలో ఉన్న 15 అడుగుల ఎత్తున్న భారీ శాసనం. ఇదీ ఆ శాసనం కథ.. వీరగోపాలస్వామి ఆలయానికి కాకతీయుల కాలంలో కోటనాయకులు భారీగా భూమిని దానమిచ్చారు. స్వామికి వైభవంగా భోగాలు నిర్వహించటంతోపాటు స్వామిని అర్చిస్తున్న బ్రాహ్మణులకు ఈ భూములు సమర్పిస్తున్నట్టుగా ఓ భారీ శాసనాన్ని చెక్కించి ఆలయంలో ఏర్పాటు చేశారు. ఆ భూమి వివరాలతో కూడి న ఈ శాసనంలో అప్పటి కాలాన్ని కూడా పేర్కొన్నారు. శక సంవత్సర ప్రకారం దీన్ని ఏర్పాటు చేశారు. దాని ప్రకారం అది 1151 (క్రీ.శ. 1229). ఇక్కడే నాటి పాలకులు భాషా పటిమను ప్రదర్శించారు. సంవత్సరాన్ని సాధారణ పద్ధతిలో అంకెల్లో ఏర్పాటు చేయటం కంటే సంస్కృత పదాల్లో చెక్కిస్తే బాగుంటుం దని భావించారు. అందుకు శాతవాహనులకు పూర్వమే రూపొందినట్టుగా పేర్కొనే కాలమానిని అనుసరించారు. దీని ప్రకారం ఒక్కో అంకెకు అక్షరాలతో కూడిన పర్యాయ పదాలుంటాయి. అక్షరాలకు అంకెల రూపమిదీ.. శాసనంపై.. ముందుగా రూప అనే పదం ఉంది. రూప అంటే రూపం. సాధారణంగా మనిషి రూపం ఒక్కటే ఉంటుంది. దీన్ని ఒకటికి గుర్తుగా వాడారు. ఇక రెండో పదం బాణ. అంటే బాణం. మన్మథ బాణాలు ఐదుంటాయి. అందుకే ఐదుగా ఖరారు చేశారు. ఇక మూడో పదం క్షితి. అంటే భూమి. గ్రహాల్లో భూమి ఒక్కటే ఉంటుంది. ఇది ఒకటికి సూచిక. చివరి పదం శశి. అంటే చంద్రుడు. చంద్రుడు కూడా ఒక్కడే. ఇది కూడా ఒకటికి చిహ్నం. ఈ నాలుగు పదాలకు అంకెల రూపమిస్తే.. 1511. శాసనాల్లో అంకెలను పదాల్లో చెప్పే పద్ధతిలో మరో విచిత్రం కూడా దాగి ఉంది. అదే వామాంకగతిలో చదవటం. అంటే.. కుడి నుంచి ఎడమకు చదవాలి. ఇక్కడ 1511ని ఆ పద్ధతిలో చదివితే 1151 అవుతుంది. అదే నాటి సంవత్సరం. శక సంవత్సరం 1151లో ఈ శాసనాన్ని ఏర్పాటు చేశారన్న మాట! వేయించింది కోట కేతన పాలకులు ఇలా అంకెలను పదాల జతలతో రాయించిన శాసనాలు అరుదుగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన శాసనాన్ని రాజేశ్వరపురం గోపాలస్వామి ఆలయంలో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీరామోజు హరగోపాల్, మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస్, చంటి, రాగి మురళి తదితరులు గుర్తించారు. దాని భావాన్ని తర్జుమా చేశారు. దీన్ని కాకతీయుల సామంతులు, తర్వాత వారికి బంధువులైన కోటకేతన పాలకులు వేయించారు. కృష్ణానదికి దక్షిణాన 6 వేల గ్రామాలకు వీరు ప్రభువులని చరిత్ర చెబుతోంది. ఈ శాసనంలో ఆ వంశానికి చెందిన కేతన, భీముడు, కేశవభూపతి, బయ్యమాంబ పుత్రుడు మాధవ భూపతి, భేరుండ కేతన, అతని భృత్యుడు కామిరెడ్డి, వెర్రమ, కాట్రెడ్డి మాచిరెడ్డి, ధీరుడు గోపాలవర్ధనుడు, ప్రోలాంబిక పుత్రుడు మందడి ప్రోలుడుల పేర్లు ఉన్నాయి. భూమి వివరాలు చెప్పే చోట ‘ప’అన్న అక్షరాన్ని వాడారు. ప అంటే పట్టు అని, అది పెట్టికి పర్యాయపదమని శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. అంటే పుట్టెడు ధాన్యం పండే భూమి అన్న విషయాన్ని ‘ప’అక్షరంతో చెప్పారు. అలాగే వైశాఖ మాసాన్ని మాధవమాసంగా, శుక్రవారాన్ని కావ్యవారంగా ఇందులో పేర్కొన్నారు. శాసన స్తంభానికి రెండు వైపులా కలిపి 52 పంక్తులు చెక్కి ఉన్నాయి. భూమితోపాటు రాట్నపు బావిని కూడా ఏర్పాటు చేసినట్టు అందులో ఉంది. అది మోటబావిలాంటిదన్నమాట. నాటి పాలకులు దేవాల యాలకు మాన్యం, దాంతోపాటు వ్యవసాయానికి కావాల్సిన వసతులు కల్పించి ఆలయాలను పోషించేవారనడానికి ఇదో చక్కటి నిదర్శనం. -
చక్రవర్తి సల్లంగుండాలె!
సాక్షి, హైదరాబాద్ : నిజాం పాలన అనగానే నిరంకుశత్వం కనిపించేది.. ఆ పాలన ఎప్పుడు అంతమవుతుందా అని ప్రజలు ఎదురు చూసినట్లు తెలంగాణ పల్లెలు కథలుకథలుగా చెబుతాయి. కానీ అంతకుపూర్వం కుతుబ్ షాహీ జమానాకు ముందు పాలించిన కాకతీయుల కాలం దీనికి భిన్నం. చక్రవర్తి ఎవరైనా, పాలనలో ప్రజా సంక్షేమం వెల్లివిరిసింది. ఫలితం.. ప్రజలు కూడా పాలకులు చల్లగా ఉండాలని దీవించేవారు. ఇంట్లో శుభకార్యం జరిగినా, అశుభం అనంతరం చేసే కార్యక్రమాల్లోనైనా పాలకుల క్షేమాన్ని ప్రత్యేకంగా కాంక్షించేవారు. దీన్ని స్పష్టం చేస్తూ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం గ్రామంలో ఆదివారం ఓ శాసనం బయటపడింది. దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు రాగి మురళి గుర్తించగా, బృందం కన్వీనర్ శ్రీ రామోజు హరగోపాల్ వివరాలు వెల్లడించారు. కొడుకు చనిపోయినా.. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి హయాంలో ప్రస్తుత నల్లగొండ ప్రాం తాన్ని మహాప్రధాన రాయబొల్లయ్య పర్యవేక్షించారు. అంటే ఆయన స్థానిక పాలకుడన్నమాట. ఇక్కడ ప్రాంతీయ వ్యవహారాలు పర్యవేక్షించే చంగల్‌దేవుడి కుమారుడు గణపయ్య మృతి చెందడంతో కొడుకు పేరిట స్థానిక గణాధీశ్వర (గణపతి) దేవాలయానికి ఆయన దశబంధబలి ప్రకటించారు. అంటే.. చెరువు కింద తనకున్న భూమిలో పదో వంతు మాన్యం దానంగా ఇచ్చాడు. దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆలయ నిర్వహణ, నైవేద్యం, ఇతర భోగాలకు వినియోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆ సమయంలో ఆయన శాసనం వేయించారు. శైవ సంప్రదాయం అనుసరించేవారు ఇలాంటి మరణానంతర కార్యక్రమాలపై ఏర్పాటు చేయించే శాసనంపై నంది శిల్పం చెక్కించేవారు. ఈ శాసనం కూడా ఆ పద్ధతిలో ఉంది. దాన వివరాలు పొందుపరిచిన తర్వాత గణపతి దేవ చక్రవర్తి పుణ్యంగా ఉండాలని అం దులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. శాసనంలో ఏముందంటే.. రాజవంశం: కాకతీయ రాజు: గణపతిదేవ చక్రవర్తి కాలం: శాలివాహన శక సంవత్సరం 1,168 (క్రీ.శ.1,246), పరాభవ నామ సంవత్సరం భాద్రపద శుద్ధ పాడ్యమి వడ్డెవారం (శనివారం) అని ప్రారంభించారు. తెలుగు లిపిలో మొత్తం 39 పంక్తుల్లో శిలకు మూడు వైపులా అక్షరాలు చెక్కించారు. గతంలోనూ ఈ తరహాలో.. చక్రవర్తి పేరును ప్రస్తావిస్తూ సామాన్యులు చెక్కించిన శాసనాలు వెలుగు చూశాయి. తాజా శాసనం నాటి పాలకుల పట్ల ప్రజల అభిమానాన్ని స్పష్టం చేస్తోంది. సాధారణంగా పెద్దలు చనిపోతే పిల్లలు శాసనాలు వేయించిన దాఖలాలు వెలుగు చూడగా, కొడుకు పేరిట తండ్రి వేయించిన శాసనం వెలుగులోకి రావడం అరుదని హరగోపాల్ పేర్కొన్నారు. శాసనం సమీపంలో బాలసుబ్రహ్మణ్య స్వామి, భైరవుడు, గణపతి, ఆంజనేయుడు, లింగం లేని పానవట్టం ఉన్నాయి. ఇవి అప్పట్లో ఇక్కడున్న దేవాలయం ఆనవాళ్లు అయి ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. -
శిల్ప సంపద అద్భుతం
గణపురం : గణపేశ్వరాలయ శిల్పాలు అద్భుతం, అపూర్వమని అమెరికాకు చెందిన సందర్శకుల బృందం స్పష్టం చేసింది. జిల్లాలో పలు చోట్ల కాకతీయుల కట్టడాలను చూడడం జరిగిందని వారు తెలిపారు. అన్ని దేవాలయాల్లో శిల్పసంపద ఉంది. అపరూపమైన శిల్పాలను ధ్వంసం కాకుండా చూడాలని సూచించారు. గణపేశ్వరునికి పూజలు నిర్వహించారు. దేవాలయాలను నిర్మించిన కాకతీయుల గూర్చి అడిగి తెలుసుకున్నారు. -
మెట్లబావిలో తవ్వకాలు
ఖిలా వరంగల్ : గుప్త నిధుల కోసం మెట్లబావి లో తవ్వకాలు జరిపిన ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. వరంగల్ 19వ డివిజన్ శివనగర్‌లో కాకతీయుల కాలం నాటి మెట్ల బావి ఉంది. బావి మొదటి అంతస్తు ఈశాన్య భాగంలో గుప్త నిధులు ఉంటాయనే అనుమానంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపారు. భారీ రాళ్లు కదలకపోవడంతో మిషన్‌తో డ్రిల్ చేసి బాంబులతో పేల్చేశారు. పునాది రాయిని బాంబులతో పేల్చారు. ఆ రాయి కిందే గుప్తనిధి దొరికి ఉండవచ్చని స్థానికులు అనుమాని స్తున్నారు. తవ్విన చోట పైఫ్లోర్‌కు ఐరన్ కొండి ఉండడం వల్ల కాకతీయుల నిధులకు ఇదే సంకేతమని దుండగులు భావించి ఈ ఘటనకు పాల్పడినట్లు అనుకుంటున్నారు. పోలీసుల నిఘా లేకనే ఇలాంటì æఘటన చోటు చేసుకుంద ని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా చారిత్రక బావిని కాపాడాలని కోరుతున్నారు. -
మాదిరి ప్రశ్నలు
1. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదున్న వారు? 1) తిక్కన 2) విద్యానాథుడు 3) ఇందులూరి మల్లన 4) రేచర్ల ప్రసాదిత్యుడు 2. మాచల్దేవి అనే వార వనిత ఏ కాకతీయ రాజు ఆస్థానంలో ఉండేది? 1) రుద్రదేవుడు 2) గణపతిదేవుడు 3) ప్రతాపరుద్రుడు 4) మహాదేవుడు 3. గణపతిదేవుడు, పాండ్యరాజు, జటావర్మన్ సుందరపాండ్యుడుల మధ్య ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1) క్రీ.శ. 1199 2) క్రీ.శ. 1263 3) క్రీ.శ. 1323 4) క్రీ.శ. 1259 4. క్రీ.శ. 1323లో ప్రతాపరుద్రుడు నర్మదా నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనం పేర్కొంది? 1) ఖాజీపేట శాసనం 2) హనుమకొండ శాసనం 3) బయ్యారం శాసనం 4) రెడ్డిరాణి కలువచేరు శాసనం 5. గండికోట దుర్గ నిర్మాత ఎవరు? 1) ప్రతాపరుద్రుడు 2) కాయస్థ అంబదేవుడు 3) రేచర్ల రుద్రుడు 4) మనుమసిద్ధి 6. . క్రీ..శ. 1220లో బయ్యారం చెరువును ఎవరు తవ్వించారు? 1) రుద్రమదేవి 2) రుయ్యమ్మ 3) మైలాంబికాదేవి 4) ముమ్మిడమ్మ 7. త్రైలోక్యమల్లుడు అనే బిరుదున్న కాకతీయ రాజు? 1) మొదటి ప్రోలరాజు 2) రెండో బేతరాజు 3) గణపతిదేవుడు 4) రుద్రదేవుడు 8. ఓరుగల్లు కోట నిర్మాణానికి మొదట పునా ది వేసిన కాకతీయరాజు? 1) మొదటి ప్రోలరాజు 2) గణపతిదేవుడు 3) రుద్రమదేవుడు 4) రుద్రదేవుడు 9. ఆంధ్రదేశంపై మొదటిసారి మహమ్మదీ యులు ఏ కాకతీయ రాజు కాలంలో దండెత్తారు? 1) రుద్రమదేవి 2) ప్రతాపరుద్రుడు 3) గణపతిదేవుడు 4) రుద్రదేవుడు 10. కాకతీయుల రాజభాష ఏది? 1) సంస్కృతం 2) తెలుగు 3) ఉర్దూ 4) కన్నడ 11. క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ - ప్రతాప రుద్రుడి సైన్యాల మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది? 1) హనుమకొండ (వరంగల్ జిల్లా) 2) మోటుపల్లి (ప్రకాశం జిల్లా 3) ఉప్పరపల్లి (కరీంనగర్ జిల్లా) 4) కొలనుపాక (నల్గొండ జిల్లా) 12. కాకతీయుల రాజ లాంఛనం ఏది? 1) గరుడ 2) వరాహం 3) సింహం 4) చేప 13. సిద్దేశ్వర చరిత్ర రచయిత ఎవరు? 1) పోతనామాత్యుడు 2) శ్రీనాధుడు 3) పాల్కూరికి సోమనాధుడు 4) కాసెసర్వప్ప 14. ఆంధ్రదేశంలో చెన్నకేశవ దేవాలయం ఎక్కడ ఉంది? 1) సర్పవరం 2) రామతీర్థం 3) మాచర్ల 4) విజయవాడ 15. వరంగల్ పతనం తర్వాత, మహమ్మదీ యులు జరిపిన దురాగతాలను, దేవాలయ, అగ్రహారాల విధ్వంసం గురించి పేర్కొన్న శాసనం? 1) హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం 2) ఖాజీపేట శాసనం 3) మార్కాపురం శాసనం 4) విలస తామ్ర శాసనం 16. అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి (జనరల్) మాలిక్ కపూర్ ఏ సంవత్సరంలో వరంగల్‌పై దాడి చేశాడు? 1) క్రీ.శ. 1310 2) క్రీ.శ. 1303 3) క్రీ.శ.1295 4) క్రీ.శ.1306 17. కాకతీయ రాజుల్లో రుద్రదేవ మహారాజు పేరుతో సింహాసనం అధిష్టించినవారు? 1) రెండో బేతరాజు 2) గణపతిదేవుడు 3) రుద్రదేవుడు 4) రాణీ రుద్రమదేవి సమాధానాలు 1) 4; 2) 3; 3) 2. 4) 4; 5) 2; 6) 3;7) 1; 8) 4; 9) 2; 10) 1; 11) 3;12) 2 13) 4; 14) 3; 15) 4; 16)1; 17) 4.