1. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదున్న వారు?
1) తిక్కన 2) విద్యానాథుడు
3) ఇందులూరి మల్లన
4) రేచర్ల ప్రసాదిత్యుడు
2. మాచల్దేవి అనే వార వనిత ఏ కాకతీయ రాజు ఆస్థానంలో ఉండేది?
1) రుద్రదేవుడు 2) గణపతిదేవుడు
3) ప్రతాపరుద్రుడు 4) మహాదేవుడు
3. గణపతిదేవుడు, పాండ్యరాజు, జటావర్మన్ సుందరపాండ్యుడుల మధ్య ముత్తుకూరు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) క్రీ.శ. 1199 2) క్రీ.శ. 1263
3) క్రీ.శ. 1323 4) క్రీ.శ. 1259
4. క్రీ.శ. 1323లో ప్రతాపరుద్రుడు నర్మదా నదీ తీరంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ఏ శాసనం పేర్కొంది?
1) ఖాజీపేట శాసనం
2) హనుమకొండ శాసనం
3) బయ్యారం శాసనం
4) రెడ్డిరాణి కలువచేరు శాసనం
5. గండికోట దుర్గ నిర్మాత ఎవరు?
1) ప్రతాపరుద్రుడు
2) కాయస్థ అంబదేవుడు
3) రేచర్ల రుద్రుడు
4) మనుమసిద్ధి
6. . క్రీ..శ. 1220లో బయ్యారం చెరువును ఎవరు తవ్వించారు?
1) రుద్రమదేవి 2) రుయ్యమ్మ
3) మైలాంబికాదేవి 4) ముమ్మిడమ్మ
7. త్రైలోక్యమల్లుడు అనే బిరుదున్న కాకతీయ రాజు?
1) మొదటి ప్రోలరాజు
2) రెండో బేతరాజు
3) గణపతిదేవుడు 4) రుద్రదేవుడు
8. ఓరుగల్లు కోట నిర్మాణానికి మొదట పునా ది వేసిన కాకతీయరాజు?
1) మొదటి ప్రోలరాజు
2) గణపతిదేవుడు
3) రుద్రమదేవుడు
4) రుద్రదేవుడు
9. ఆంధ్రదేశంపై మొదటిసారి మహమ్మదీ యులు ఏ కాకతీయ రాజు కాలంలో దండెత్తారు?
1) రుద్రమదేవి 2) ప్రతాపరుద్రుడు
3) గణపతిదేవుడు 4) రుద్రదేవుడు
10. కాకతీయుల రాజభాష ఏది?
1) సంస్కృతం 2) తెలుగు
3) ఉర్దూ 4) కన్నడ
11. క్రీ.శ. 1303లో అల్లాఉద్దీన్ ఖిల్జీ - ప్రతాప రుద్రుడి సైన్యాల మధ్య యుద్ధం ఎక్కడ జరిగింది?
1) హనుమకొండ (వరంగల్ జిల్లా)
2) మోటుపల్లి (ప్రకాశం జిల్లా
3) ఉప్పరపల్లి (కరీంనగర్ జిల్లా)
4) కొలనుపాక (నల్గొండ జిల్లా)
12. కాకతీయుల రాజ లాంఛనం ఏది?
1) గరుడ 2) వరాహం
3) సింహం 4) చేప
13. సిద్దేశ్వర చరిత్ర రచయిత ఎవరు?
1) పోతనామాత్యుడు 2) శ్రీనాధుడు
3) పాల్కూరికి సోమనాధుడు
4) కాసెసర్వప్ప
14. ఆంధ్రదేశంలో చెన్నకేశవ దేవాలయం ఎక్కడ ఉంది?
1) సర్పవరం 2) రామతీర్థం
3) మాచర్ల 4) విజయవాడ
15. వరంగల్ పతనం తర్వాత, మహమ్మదీ యులు జరిపిన దురాగతాలను, దేవాలయ, అగ్రహారాల విధ్వంసం గురించి పేర్కొన్న శాసనం?
1) హనుమకొండ వేయి స్తంభాల గుడి
శాసనం
2) ఖాజీపేట శాసనం
3) మార్కాపురం శాసనం
4) విలస తామ్ర శాసనం
16. అల్లాఉద్దీన్ ఖిల్జీ సైన్యాధిపతి (జనరల్) మాలిక్ కపూర్ ఏ సంవత్సరంలో వరంగల్‌పై దాడి చేశాడు?
1) క్రీ.శ. 1310 2) క్రీ.శ. 1303
3) క్రీ.శ.1295 4) క్రీ.శ.1306
17. కాకతీయ రాజుల్లో రుద్రదేవ మహారాజు పేరుతో సింహాసనం అధిష్టించినవారు?
1) రెండో బేతరాజు
2) గణపతిదేవుడు
3) రుద్రదేవుడు
4) రాణీ రుద్రమదేవి
సమాధానాలు
1) 4; 2) 3; 3) 2. 4) 4; 5) 2; 6) 3;7) 1; 8) 4; 9) 2; 10) 1; 11) 3;12) 2 13) 4; 14) 3; 15) 4; 16)1; 17) 4.
మాదిరి ప్రశ్నలు
Published Tue, Aug 27 2013 11:36 PM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
Advertisement
Advertisement