
జర్మనీ, పోలాండ్ ముందుకు...
గ్రూప్ ‘సి’ నుంచి మాజీ చాంపియన్ జర్మనీ, పోలాండ్ జట్లు ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో జర్మనీ 1-0తో నార్తర్న్ ఐర్లాండ్‌పై గెలుపొందగా... పోలాండ్ 1-0తో ఉక్రెయిన్‌ను ఓడించింది. జర్మనీ, పోలాండ్ ఏడేసి పాయింట్లతో నాకౌట్ దశకు అర్హత పొందాయి. మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా జర్మనీ గ్రూప్ టాపర్‌గా నిలువగా... పోలాండ్‌కు రెండో స్థానం దక్కింది.
నార్తర్న్ ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆట 30వ నిమిషంలో మారియో గోమెజ్ జర్మనీకి ఏకైక గోల్ అందించాడు. ఉక్రెయిన్‌తో జరిగిన పోటీలో 54వ నిమిషంలో బ్లాస్‌జికౌస్కీ చేసిన గోల్‌తో పోలాండ్ విజయం ఖాయమైంది. యూరో టోర్నీ చరిత్రలో పోలాండ్ నాకౌట్ దశకు చేరుకోవడం ఇదే తొలిసారి.