కేన్సర్‌ నివారణే ప్రధానం | The goal is to cure cancer | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ నివారణే ప్రధానం

Published Sun, Jul 31 2016 10:36 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

కేన్సర్‌ నివారణే ప్రధానం

కేన్సర్‌ నివారణే ప్రధానం

దేవరకొండ : కేన్సర్‌ వ్యాధి నివారణే ప్రధానమని, వ్యాధి లక్షణాలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

దేవరకొండ : కేన్సర్‌ వ్యాధి నివారణే ప్రధానమని, వ్యాధి లక్షణాలు గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఆంకోటెలిగెంట్, నీలగిరి ఫౌండేషన్, యశోద కేన్సర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కేన్సర్‌ నిర్ధారణ శిబిరాన్ని ఆయన దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్‌ వ్యాధిని మొదట దశలోనే గుర్తిస్తే మేలు జరుగుతుందని అన్నారు. క్యాన్సర్‌ వ్యాధి నిర్ధారణ అయిన వారికి ప్రభుత్వం తరుపున చికిత్సకు కావాల్సిన సహాయాన్ని తన వంతుగా అందిస్తానని అన్నారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ మాట్లాడుతూ క్యాన్సర్‌ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్‌ మంజ్యానాయక్, వైస్‌ ఎంపీపీ దూదిపాల వేణుధర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ నల్లగాసు జాన్‌యాదవ్, పాశం రాంరెడ్డి, రేపాల హరి, తేలుకుంట్ల జయశ్రీ, సుజాత స్టీఫెన్, తాళ్లపల్లి రఘు, రాంబాబు, సుజాత, శ్రీకాంత్‌రెడ్డి, విజయ్‌కాంత్, కౌన్సిలర్లు ఆసిఫ్, వడ్త్య దేవేందర్, నాయకులు బండారు బాలనర్సింహ, చింతపల్లి సుభాష్, పొన్నెబోయిన సైదులు, చిత్రం ఏసోబు, బొడ్డుపల్లి కృష్ణ తదితరులున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement