సాక్షి, ముంబై: ఇండియన్ కార్పొరేట్ దిగ్గజం, మహీంద్ర అండ్ మహీంద్రా లేటెస్ట్‌గా మరో ఇంట్రస్టింగ్ వీడియోను షేర్ చేశారు. ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా వుండే ఆయన ట్వీట్ల ఖాతాలోకి మరో అర్థవంతమైన వీడియో చోటు సంపాదించుకుంది.
కార్లోంచి ఖాళీ వాటర్ బాటిల్ బైటికి విసిరేసిన కారు డ్రైవర్ అక్కడ ఉన్న ఒకమ్మాయి ఇచ్చిన చెంప దెబ్బలాంటి రిటార్ట్‌కు సంబంధించిన వీడియో ఇది కారులోంచి విసరిన బాటిల్ ని అంతే వేగంతో కాలితో తన్నింది. దీంతో అది నేరుగా కారు విండోలోంచి డైరెక్ట్‌గాలోకి దూసుకుపోయింది. ఈ ఉదంతంపై మురిసిపోయిన ఆయన ప్రముఖ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రోనాల్డో కంటే గొప్పగా గోల్ చేసిందంటూ ప్రశంసలు కురిపించారు. చూస్తే ఇలాంటి ప్రపంచ కప్ ఫుట్‌బాల్ మ్యాచుల్ని చూడాలనుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ‘‘ఆ కారు డ్రైవర్ ఆ అమ్మాయి మీద కోర్టుకెక్కరని ఆశిస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఆనంద్ మహీంద్ర పేర్కొనట్టు ఫుట్‌బాల్ లెజెండ్ రోనాల్డ్‌కే సవాల్ విసురుతున్న జపాన్ గాల్ ఈ సూపర్ గోల్‌ను మీరూ ఒకసారి చూసేయండి...
అలాగే నాలుగు అడుగుల లోతు వర్షపు నీటిలో కూడా మీ వాహనం టీయూవి 300లో సేఫ్‌గా డ్రైవ్ చేస్తున్నానంటూ ట్వీట్ చేసిన సౌమిత్ర జోషికి అద్భుతమైన సమాధానం ఇచ్చారు. జాగ్రత్తగా వెళ్లండి.. మీ అదృష్టాన్ని మరీ ఎక్కువ సేపు పరీక్షించుకోకండి .. ఆ వాహనం ఉభయచరం కాదంటూ చిన్న హెచ్చరిక కూడా చేశారు.
Now she ‘bent’ that ball into the ‘goal’ even better than Ronaldo.. This is the kind of World Cup I want to watch... (and let’s hope the driver doesn’t file a suit against her!😊) #whatsappwonderbox pic.twitter.com/aJxNqf2PRe
— anand mahindra (@anandmahindra) June 26, 2018
Comments
Please login to add a commentAdd a comment