
ఫిఫా ప్రపంచకప్-2022లో హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన బ్రెజిల్ బోణీ కొట్టింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం సాధించింది. బ్రెజిల్ యువ సంచలనం రిచర్లిసన్ రెండు గోల్స్‌తో బ్రెజిల్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.
కాగా మ్యాచ్ తొలి భాగంలో బ్రెజిల్‌ను సెర్బియా తమ అద్భుతమైన ఢిపెన్స్‌తో అడ్డుకుంది. ఫస్ట్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్స్ సాధించలేదు. సెకెండ్ హాఫ్ 63వ నిమిషంలో రిచర్లిసన్ బ్రెజిల్‌కు తొలి గోల్‌ను అందించాడు.
అనంతరం 73వ నిమిషంలో రెండో గోల్‌ను కూడా రిచర్లిసన్ సాధించాడు. దీంతో బ్రెజిల్ అధిక్యం 2-0 చేరుకుంది. అనంతరం బ్రెజిల్ పటిష్టమైన ఢిపెన్స్ సెర్బియాకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా గెలుపొందింది. తద్వారా గ్రూప్-జి నుంచి బ్రెజిల్ అగ్ర స్థానంలో నిలిచింది.
సంచలన గోల్‌తో మెరిసిన రిచర్లిసన్
ఈ మ్యాచ్‌లో రిచర్లిసన్ సంచలన గోల్‌తో మెరిశాడు. మ్యాచ్ సెకెండ్ హాఫ్ 73వ నిమిషంలో వినిసియస్ జూనియర్ పాస్ చేసిన బంతిని అద్భుతమైన అక్రోబాటిక్ సిజర్ కిక్‌తో రిచర్లిసన్ గోల్ సాధించాడు. దీంతో స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఒక్క సారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా రిచర్లిసన్ అద్భుతమైన గోల్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
RICHARLISON WHAT A GOALL! pic.twitter.com/9SyAhhCPGj
— TC (@totalcristiano) November 24, 2022
చదవండి: FIFA WC 2022: బోణీ కొట్టిన బెల్జియం.. కెనడాకు పరాభవం
Comments
Please login to add a commentAdd a comment