
హ్యుమే హ్యాట్రిక్: కోల్‌కతా విజయం
ముంబై: స్టార్ స్ట్రయికర్ ఇయాన్ హ్యుమే హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికోడి కోల్‌కతా ఘనవిజయం సాధించింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో భాగంగా ఆదివారం ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4-1 తేడాతో నెగ్గింది. 34వ నిమిషంలో హ్యుమే తొలి గోల్‌తో పాటు 45వ నిమిషంలో పెనాల్టీ కిక్‌తో రెండో గోల్ అందించాడు. ఆ తర్వాత 71వ నిమిషంలో ముంబై తరఫున బెనచౌర్ ఏకైక గోల్ సాధించాడు. 77వ నిమిషంలో ఫెర్నాండెజ్ కోల్‌కతా ఆధిక్యం మరింత పెంచగా 82వ నిమిషంలో హ్యుమే హ్యాట్రిక్ గోల్‌తో జట్టుకు తిరుగులేని విజయం దక్కింది. నేడు (సోమవారం) ఐఎస్‌ఎల్‌కు విశ్రాంతి దినం.