లక్ష్యసాధకులు సింగరేణీయులు
-
కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం
-
విడిభాగాల తయారీకి చిన్నతరహా పరిశ్రమల స్థాపన
-
దేశాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుదాం
-
స్వాతంత్య్ర వేడుకల్లో సీఎండీ శ్రీధర్
కొత్తగూడెం(ఖమ్మం) : యాజమాన్యం నిర్దేశించే ఎంతటి లక్ష్యాన్నైనా సింగరేణీయులు సమష్టి కృషితో సాధిస్తారు.. ఈ విషయాన్ని గతంలోనే రుజువు చేశారని సింగరేణి సీఎండీ నడిమట్ల శ్రీధర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా పరిధి ప్రకాశం స్టేడియంలో సింగరేణి నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతి«థిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్స్, సింగరేణి ఎస్‌అండ్‌పీసీ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడా రు. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా దేశానికి స్వా తంత్య్ర లభించిందని, వారి ఆశయాలు సిద్ధించేలా భారతావనిని మరింత గొప్పగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఫలాలు ప్రతీ భారతీయుడికీ అం దాలని ఆకాంక్షించారు. దేశ, రాష్ట్ర అవసరాల కోసమే ఈఏడాది సింగరేణి 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్ప త్తి లక్ష్యాన్ని నిర్దేశించుకుందని, దీనిని సాధించాలంటే రోజుకు కనీసం 2లక్షల టన్నుల బొగ్గు వెలికి తీయాల న్నారు. భారీ వర్షాల కారణంగా ఓపెన్‌కాస్టులలో ఉత్ప త్తి వెనుకబడిందని, రానున్న కాలంలో సమష్టి కృషితో లోటును పూడ్చాలని కోరారు. రాష్ట్ర ఇంధన అవసరాల కు కావలసిన బొగ్గును అందిస్తూనే విద్యుత్ అవసరాల ను తీర్చడానికి కంపెనీ జైపూర్‌లో నిర్మించిన 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఈనెల 7న ప్రధా న మంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించి జాతికి అంకితం చేసినట్లు గుర్తుచేశారు.
సౌకర్యాల మెరుగుకు మరిన్ని నిధులు
సంక్షేమ కార్యక్రమాల్లో సైతం యాజమాన్యం ఎల్లప్పు డూ ముందుంటుందని, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు 75 లక్షల మొక్కలు నాటే లక్ష్యాన్ని కేవలం 24 రోజుల్లో నే పూర్తి చేశామని సీఎండీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు 60,369 మందితో సామూహిక యోగా నిర్వహించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించామని తెలిపారు. మీ కోసం–మీ ఆరోగ్యం కోసంలో భాగంగా ఇంటింటికీ యోగా, సింగరేణి ఆణిముత్యాలులో భాగంగా 1200 మంది నిరుద్యో యువతీ యువకులకు పోలీస్, ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాలనీలు, గనుల్లో సౌకర్యాలు మెరుగుపర్చడానికి నిధులు ఇప్పటి కే మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని మంజూ రు చేస్తామన్నారు. సమీప గ్రామాల అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామని, సీఎస్‌ఆర్ కింద రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.
అన్ని ఏరియాల్లో చిన్నతరహా పరిశ్రమలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం సింగరేణి ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 5వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని, మరో 242 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలిపా రు. బొగ్గు ఉత్పత్తి ప్రక్రియలో కంపెనీకి అవసరమైన విడిభాగాల తయారీకి స్థానిక యువకులతో చిన్నతర హా పరిశ్రమలు స్థాపించాలని యోచిస్తున్నామని, అన్ని ఏరియాల్లో ఆసక్తిగల యువకులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. సింగరేణిలో ఉత్తమ కార్మికులు, ఉద్యోగులుగా ఎంపికైన వారిని సీఎండీ ఎన్.శ్రీధర్, ఆయన సతీమణి, డైరెక్టర్ల చేతులమీదుగా సత్కరించారు. డైరెక్టర్లు ఎ.మనోహర్‌బాబు, బి.రమేష్‌కుమార్, జె.పవిత్రన్‌కుమార్, రమేష్‌బాబు, జీఎం(పర్సనల్) వెల్ఫేర్ అండ్ సీఎస్‌ఆర్ జి.మురళీసాగర్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.