
Cristiano Ronaldo Stunning Goal.. పోర్చుగల్ స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డొ సూపర్ గోల్‌తో మెరిశాడు. మాంచెస్టర్ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డొ ఆట ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా గోల్‌తో మెరిసి జట్టుకు విజయం అందించాడు. అనంతరం షర్ట్ విప్పిన రొనాల్డొ గ్రౌండ్ మొత్తం కలియదిరుగుతూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. చాంపియన్స్‌లీగ్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా విల్లార్ రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మాంచెస్టర్ యునైటెడ్ 2-1 తేడాతో గెలుపొందింది. కాగా ఆట 53వ నిమిషంలో పాకో అల్కాసర్ తొలి గోల్ కొట్టి యునైటెడ్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. అయితే ఏడు నిమిషాల వ్యవధిలో విల్లార్ రియల్ ఆటగాడు అలెక్స్ టెల్లిస్ గోల్ చేసి స్కోరును సమం చేశాడు.
చదవండి: Viral Video: పారిస్ దద్దరిల్లింది.. పీఎస్‌జీ తరఫున తొలి గోల్ చేసిన మెస్సీ
ఇక చివరివరకు మరో గోల్ రాకపోవడంతో మ్యాచ్ డ్రా అయితుందని అంతా భావించారు. విల్లార్ రియల్ గోల్‌కీపర్ యునైటెడ్ ఆటగాళ్లు గోల్ కొట్టకుండా చక్కగా నిలువరిస్తున్నాడు. అయితే రొనాల్డొ ఇక్కడే మ్యాజిక్ చేశాడు. 45 డిగ్రీల కోణంలో రొనాల్డొ హెడర్‌తో కొట్టిన బంతి నేరుగా గోల్ పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఇంకేముంది రొనాల్డొ తన సంబరాలను షురూ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Incase you missed Ronaldo goal #MANVIL pic.twitter.com/Drel8Gpyqr
— 🌟 VARANE🌟 (@Saif07799953) September 29, 2021