ఇమ్రాన్ ఖాన్ యూటర్న్
ఇస్లామాబాద్: క్రికెటర్, రాజకీయవేత్త ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహరిక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) మాటమార్చింది. ఉత్తర వజీరుస్తాన్ లోని పాకిస్థాన్ కు చెందిన తాలిబాన్ మిలిటెంట్లపై మిలటరీ ఆపరేషన్ కు మద్దతు తెలుపాలని నిర్ణయించుకుంది.
పార్టీ కోర్ కమిటీ సమావేశంలో భేటి తర్వాత, సీనియర్ల లీడర్ల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తర వజీరుస్థాన్ లో మిలటరీ ఆపరేషన్ ను ఇమ్రాన్ వ్యతిరేకించింది. మిలటరీ ఆపరేషన్ నిర్వహిస్తే అదొక ఆత్మహత్యా సదృశ్యం అని ఇమ్రాన్ గతవారం వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రాంతంలో గత పదేళ్లలో జరిగిన హింసాత్మక సంఘటనల్లో 50 వేల మంది ప్రజలు మృత్యువాత పడినట్టు పాకిస్థాన్ రక్షణ శాఖ వెల్లడించింది. కరాచీ ఎయిర్ పోర్ట్ పై దాడి ఘటనలో 37 మంది మృతి చెందడానికి కారణమైన పాకిస్థానీ తాలిబాన్ గ్రూప్ పై ఆదివారం నుంచి పాక్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మిలటరీ ఆపరేశన్ నిర్వహించింది