ప్రధాని మోదీ, జెలెన్‌స్కీ షేక్‌హ్యాండ్ (పాత ఫొటో)
ఉక్రెయిన్ సంక్షోభ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ‍్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాలపాటు వీళ్ల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.
రష్యాతో ఒకవైపు పోరు కొనసాగిస్తున్నప్పటికీ.. నేరుగా శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్‌స్కీని ప్రధాని మోదీ అభినందించారు. అంతేకాదు భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు.
రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని, అందుకు సహకరించాలని మోదీ, జెలెన్‌స్కీని కోరారు. ప్రత్యేకించి సుమీ రీజియన్ నుంచి తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించాలని మోదీ, జెలెన్‌స్కీని కోరినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment