Operation Ganga
-
ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత వైద్యవిద్యార్థులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారతీయ వైద్య విద్యార్థులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు పలు దేశాలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, ఉక్రెయిన్ ప్రభుత్వం కూడా పలు సడలింపులు ఇచ్చిందని తెలిపింది. శాంతి, అహింసే భారత విధానమని మరోసారి స్పష్టంచేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ వ్యతిరేకమని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ నొక్కిచెప్పారు. ఒక పక్షం వైపు నిలబడాల్సి వస్తే.. అది శాంతి పక్షమేనని స్పష్టంచేశారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితులుపై లోక్‌సభలో చర్చ సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ నమ్మకాలు, విలువలు, జాతీయ ప్రయోజనం, వ్యూహం ప్రకారమే భారత వైఖరి ఉంటుందని చెప్పారు. బుచా మారణకాండ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఇది తీవ్రమైన అంశమని.. స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న వాదనకు మద్దతు పలుకుతున్నామని తెలిపారు. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలు పణంగా పెట్టడం ద్వారా.. ఏ సమస్యకు పరిష్కారం దొరకదని పార్లమెంట్ వేదికగా ఉక్రెయిన్, రష్యాలకు సూచించారు. చదవండి: (ఆడపిల్ల ఉన్న ప్రతిఒక్కరూ తప్పక తెలుసుకోవాల్సిన పథకమిదే..) ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన వైద్య విద్యార్థుల భవితవ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. లోక్‌సభలో కీలక ప్రకటన చేశారు జైశంకర్. విదేశీ విద్యార్థులకు సడలింపు ఇచ్చేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారత విద్యార్థులను అకామిడేట్ చేయడానికి.. హంగరీ, పొలాండ్, చెక్ రిపబ్లిక్ సహా పలు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోందని వివరించారు. రష్యా సైనిక చర్య నేపథ్యంలో అత్యంత క్లిష్టపరిస్థితుల్లో ఉక్రెయిన్ నుంచి కేంద్రప్రభుత్వం భారతీయులను తరలించింది. ఆపరేషన్ గంగ ద్వారా దాదాపు 25వేల మంది భారతీయ విద్యార్థులు, పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చింది. అయితే మెడికల్ స్టూడెంట్స్ చదువు అర్థాంతరంగా ఆగిపోవడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులను భారతీయ వైద్య కళాశాలల్లో అకామిడేట్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీలు పార్లమెంట్లో కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకుంటే చాలు .. రూ.లక్షల్లో ప్రమాద బీమా) -
దేశ భద్రత పై ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
-
మరో 674 మంది స్వదేశానికి..
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో చిక్కుకున్న భారత వైద్య విద్యార్థులను ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా అధికారులు శుక్రవారం స్వదేశానికి తరలించారు. సుమీ నుంచి పోలండ్‌కు చేరుకున్న 674 మందిని మూడు ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తీసుకొచ్చారు. మొదట ఎయిర్ ఇండియా విమానం 240 మంది విద్యార్థులతో ఉదయం 5.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. 221 మందితో ఇండిగో విమానం మధ్యాహ్నం 12.20 గంటలకు ఢిల్లీకి చేరింది. భారత వైమానికి దళానికి(ఐఏఎఫ్) చెందిన మూడో విమానం 213 మంది విద్యార్థులతో మధ్యాహ్నం 12.15 గంటలకు ఢిల్లీలోని హిండాన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది. సి–17 సైనిక రవాణా విమానంలో విద్యార్థులను ఢిల్లీకి చేర్చినట్లు అధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడడం ఒక అద్భుతమే రష్యా సైనిక దాడులతో దద్దరిల్లుతున్న సుమీ నగరం నుంచి క్షేమంగా బయటపడడం నిజంగా ఒక అద్భుతమేనని భారత వైద్య విద్యార్థులు చెప్పారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా వారు ప్రత్యేక విమానాల్లో శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో భావోద్వేగపూరిత దృశ్యాలు కనిపించాయి. సుమీ నుంచి వచ్చిన విద్యార్థులు తమ తల్లిదండ్రులను, బంధువులను ఆలింగనం చేసుకొని, కన్నీరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు తమ బిడ్డల మెడలో పూలమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భారత్ మాతాకీ జై అంటూ బిగ్గరగా నినాదాలు చేశారు. ఎయిర్‌పోర్టులో తన తల్లిదండ్రులను కళ్లారా చూడడం చాలా ఆనందంగా ఉందని ధీరజ్ కుమార్ అనే విద్యార్థి తెలిపాడు. యుద్ధభూమి నుంచి తాము ప్రాణాలతో స్వదేశానికి తిరిగిరావడం ఒక భయానక అనుభవమేనని పేర్కొన్నాడు. మార్గమధ్యంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని చెప్పాడు. సుమీలో సైరన్లు వినిపించినప్పుడల్లా వెంటనే బంకర్లకు చేరుకొనేవాళ్లమని ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని మహిమా వెల్లడించింది. భారత్‌కు తిరిగి వస్తామో లేదోనన్న భయాందోళన ఉండేదని తెలిపింది. స్వదేశానికి వచ్చిన తర్వాత ప్రాణాలు తిరిగొచ్చినట్లుగా ఉందని, ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నామని పేర్కొంది. సహకరించిన దేశాలకు ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు ఉక్రెయిన్ నుంచి తమ విద్యార్థుల తరలింపునకు సహకరించిన ఉక్రెయిన్, రష్యా ప్రభుత్వాలకు, రెడ్ క్రాస్‌కు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సుమీ నగరం నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియ పెనుసవాలు విసిరిందని శుక్రవారం ట్విట్టర్లో వెల్లడించారు. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా భారత విద్యార్థులను క్షేమంగా వెనక్కితీసుకురావడంలో ఉక్రెయిన్ పొరుగు దేశాలైన రొమేనియా, హంగేరి, పోలండ్, స్లొవేకియా, మాల్డోవా ఎంతగానో సహకరించాయని, ఆయా దేశాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి ఇప్పటిదాకా దాదాపు 18,000 మంది భారతీయులను కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. -
సంక్లిష్టమైన సవాలు
చదువు కోసం, బ్రతుకు తెరువు కోసం... ఉక్రెయిన్ వెళ్ళిన భారతీయ బాటసారులు అత్యధికులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటి ముఖం పడుతున్నారు. భయానక, బీభత్స దృశ్యాలెన్నో చూస్తున్న వేళ... యుద్ధక్షేత్రం నుంచి వందల సంఖ్యలో మనవాళ్ళు క్షేమంగా తిరిగి వస్తుండడం ఒకింత ఊరట. ముఖ్యంగా బాంబుల వర్షంలో బయటపడే మార్గం లేని సుమీ నగర భారతీయ విద్యార్థుల సంగతి. అక్కడ మూడు హాస్టళ్ళలో ఉన్న దాదాపు 700 మంది విద్యార్థులు మంగళవారం సురక్షిత మార్గంలో ముందుగా 175 కి.మీ.ల దూరంలో మధ్య ఉక్రెయిన్‌లోని పోల్టావాకు 12 బస్సుల్లో బయలుదేరారు. అలా ‘ఆపరేషన్ గంగ’ అతి క్లిష్టమైన ఘట్టానికి చేరింది. నిజానికి, సోమవారమే ఈ పని జరగాల్సింది. కానీ, కాల్పుల విరమణకు అంగీకరించినట్టే అంగీకరించి, ఇరుపక్షాలూ అందుకు కట్టుబడలేదు. దాంతో, భద్రతా కారణాల రీత్యా తరలింపు సాధ్యం కాలేదు. బస్సెక్కిన విద్యార్థులను సైతం సోమవారం మళ్ళీ హాస్టళ్ళకు వెనక్కి పంపేయాల్సి వచ్చిందంటే, సుమీలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. చివరకు ఐరాస భద్రతా మండలిలో భారత్ అసంతృప్తిని వ్యక్తం చేసి, దౌత్యపరంగా ఒత్తిడి పెంచడం ఫలితాన్నిచ్చింది. రష్యా, ఉక్రెయిన్ నేతలిద్దరికీ భారత ప్రధాని సోమవారం ఫోన్ చేసి, విద్యార్థుల తరలింపునకు సహకరించాలని కోరిన సంగతీ ప్రస్తావించాక ఎట్టకేలకు విద్యార్థుల నిరీక్షణకు తెర పడింది. మొత్తానికి, గత రెండు వారాల్లో 22500 మంది భారతీయులు ఉక్రెయిన్ నుంచి బయటపడితే, అందులో 16 వేల పైమంది ‘ఆపరే షన్ గంగ’లో భాగంగా ప్రభుత్వ విమానాల్లో వెనక్కి వచ్చారు. ఇలా ఉండగా, బుధవారం ఉక్రె యిన్‌లో బాధిత నగరాలు ఆరింటిలో 12 గంటల కాల్పుల విరమణకు రష్యా, ఉక్రెయిన్లు అంగీకరించడం చిన్న సాంత్వన. కీవ్, ఖార్కివ్, మారియాపోల్ల నుంచి పౌరులు తరలిపోయేం దుకు మానవీయ కారిడార్లకు అంగీకారం కుదిరింది. శరణార్థుల సంక్షోభం మాటెలా ఉన్నా, మానవతా కారిడార్లతో వేలమంది ప్రాణాలతో సురక్షిత ప్రాంతాలకు పోవడానికి వీలు కలిగింది. యుద్ధం మొదలయ్యాక 20 లక్షల మంది ఉక్రెయిన్ను వదిలిపోయారు. ఒక్క మంగళవారమే 7 వేల మందిని సుమీ నుంచి తరలించారు. ఈశాన్య ఉక్రెయిన్‌లో, రష్యా సరిహద్దుకు 60 కి.మీ.ల దూరంలోనే ఉంటుంది సుమీ నగరం. పశ్చిమ సరిహద్దుకు వెయ్యి కి.మీల దూరంలోని ఖార్కివ్ కన్నా, తూర్పు సరిహద్దు దగ్గరి సుమీ నుంచి ఆగని కాల్పుల మధ్య తరలింపు సంక్లిష్టమైంది. అక్కడి సుమీ స్టేట్ యూనివర్సిటీలోని వైద్య కళాశాలల్లో దాదాపు 700 మంది భారతీయ విద్యార్థులు చదువుతున్నారు. సంక్లిష్ట యుద్ధ క్షేత్రంలో నడిమధ్యన ఉన్న సుమీలో హాస్టళ్ళలోని బంకర్ల నుంచి బయటకొస్తే – ఎటు నుంచి ఏ క్షిపణి తాకుతుందో తెలియని పరిస్థితుల్లో, తిండీ నీళ్ళు కూడా కరవై, గడ్డ కట్టే చలిలో అవస్థ పడ్డారు. కాలినడకన కూడా పోలేని పరిస్థితుల్లో, వారికి ధైర్యం చెబుతూ, వారందరి తరలింపు కోసం చివరి దాకా శ్రమించిన ప్రభుత్వం సహా ప్రతి ఒక్కరినీ అభినందించాలి. 1986 జనవరిలో దక్షిణ యెమెన్‌లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ దేశీయులకు భిన్నంగా 850 మంది భారతీయులు తమ తరలింపు కోసం రోజులకొద్దీ వేచిచూశారు. భారత ప్రభుత్వం చివరకు ఓ వాణిజ్య నౌకను ఒప్పించి, మనవాళ్ళను స్వదేశానికి తేగలిగింది. 30 ఏళ్ళ తర్వాత 2015 ఏప్రిల్‌లో యెమెన్‌లో మళ్ళీ సంక్షోభం తలెత్తినప్పుడు ‘ఆపరేషన్ రాహత్’ ద్వారా 5 వేల మంది భారతీయులనూ, 41 దేశాలకు చెందిన వెయ్యి మంది పౌరులనూ భారత సర్కారు సురక్షితంగా తరలించింది. ఆ తర్వాత ఏడేళ్ళకు ఇప్పుడు మళ్ళీ ఉక్రెయిన్‌లో క్లిష్టమైన తరలింపు ప్రక్రియలో తలమునకలైంది. పాకిస్తానీ, బంగ్లాదేశీ, నేపాలీయులను సైతం రక్షించి, వారి మనసు గెలిచింది. ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా ఉక్రెయిన్ వెళ్ళి, మన వాళ్ళ తరలింపు ప్రక్రియకు తోడ్పడడం విశేషం. సాధారణంగా ఇలాంటి తరలింపులకు ప్రచారార్భాటం లేని దౌత్య నీతి అవసరం. కారణాలేమైనా ఈసారి ‘ఆపరేషన్ గంగ’ పేరుతో మోడీ సర్కార్ చేపట్టిన తరలింపు ప్రక్రియ విమానాల్లో మంత్రుల హడావిడికీ, ఎన్నికల సభల్లో ప్రసంగాలకీ తావివ్వడం విచిత్రం. ఇవాళ ప్రపంచమంతటా ప్రవాస భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 1.33 కోట్ల ౖపైగా భారతీయులు విదేశాల్లో ఉన్నారు. ఏటా 2 కోట్ల మంది అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడైనా ఉక్రెయిన్ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే, అక్కడి మన దేశస్థులను సకాలంలో రక్షించుకోవడానికి వీలుగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించు కోవడం అవసరం. అందుకు తగ్గట్టు సామర్థ్యాన్ని విస్తరించుకోవడం కీలకం. 1950ల నుంచి ఇప్పటి దాకా మన దేశం ఇలా 30కి పైగా తరలింపు ప్రక్రియలను నడిపింది. చరిత్రలోని అపారమైన ఆ అనుభవాన్నీ, అనుసరించిన పద్ధతులనూ, నేర్చుకున్న పాఠాలనూ కలబోసి వాటిని వ్యవస్థీకృతం చేయాలి. దౌత్య సిబ్బందికి కూడా విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ముందుగా ప్రత్యేక శిక్షణనివ్వాలి. యుద్ధక్షేత్రాల్లో పనిచేయాల్సి వస్తే ఉపకరించేలా విదేశాంగ సర్వీసు శిక్షణార్థు లకు ఆర్మీ, లేదంటే పోలీసులతో శిక్షణనిప్పించవచ్చు. అలా చేస్తే, దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా రాబోయే విపత్తులకు ముందుగానే సిద్ధమై ఉంటాం. సాధన, సన్నద్ధత ఉంటే... ఏ సమస్య నుంచైనా సులభంగా బయటపడగలమని వేరే చెప్పనక్కర లేదు. ఉక్రెయిన్‌లో గాలిలో కలసిపోయిన అమాయక భారతీయ విద్యార్థి ప్రాణాలు ఆ సంగతిని గుర్తు చేస్తూనే ఉంటాయి! -
మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. ట్రెండ్ సెట్టర్‌గా భారత ప్రధాని
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. 14 రోజులుగా రష్యన్ బలగాలు ఉక్రెయిన్‌పై మిస్సైల్స్, బాంబు దాడులతో విరుచుకుపడుతున్నాయి. బాంబు దాడుల నేపథ్యంలో విదేశాలకు చెందిన విద్యార్థులు తమ స్వదేశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బాంబు దాడుల్లో విదేశీ విద్యార్థులు సైతం మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టింది. దీనిలో భాగంగా ఇప్పటికే వేల సంఖ్యలో భారత విద్యార్థులను, పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తరలించింది. మరోవైపు ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. పాకిస్తాన్‌కు చెందిన ఆస్మా షఫీక్.. భారత ప్రభుత్వం, రాయబార కార్యాలయాలనికి, ప్రధాని నరేంద్రమోదీకి థ్యాంక్స్ చెప్పింది. ఉక్రెయిన్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేందుకు తనకు సాయం చేసిన ఇండియన్ ఎంబసీకి, నరేంద్రమోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఇది చదవండి: పుతిన్‌ను ఆపకపోతే ప్రపంచం మొత్తం పెనువిధ్వంసమే: ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య జెలెన్స్కా -
Ukraine Crisis: రష్యాకు బిగ్ షాక్.. పుతిన్‌కు మరో దెబ్బ!
Ukraine War Live Updates: ఉక్రెయిన్ ఆక్రమణ విషయంలో రష్యాను మరింతగా రెచ్చగొడుతోంది అమెరికా. ఒకవైపు యుద్ధం ఆపాలంటూ పిలుపు ఇస్తూనే.. మరోవైపు ఆంక్షలు విధిస్తూ ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. దీంతో రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్నాయి. యుద్ధం 14వ రోజు కూడా కొనసాగుతోంది. మరోవైపు ఇవాళైన చర్చల్లో పురోగతి ఉంటుందేమో అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు రష్యా-ఉక్రెయిన్ ప్రజలు. పిల్లల ఆసుపత్రిపై బాంబు దాడి.. ►ఉక్రెయిన్‌లో మారియూపోల్ నగరంలోని పిల్లల ఆసుపత్రిపై రష్యా బలగాలు బాంబు దాడికి పాల్పడ్డాయి. ఈ బాంబు దాడుల వల్ల ఆసుపత్రి ధ్వంసమైందని స్థానిక కౌన్సిల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం గురించి తెలియాల్సి ఉంది. రష్యా చేతిలో బందీలుగా 4 లక్షల మంది ఉక్రేనియన్లు.. ► ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు రెచ్చిపోతున్నాయి. ఉక్రెయిన్‌లోని మరియూపోల్‌లో 4 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా బందించినట్టు ఆ దేశ విదేశాంగశాఖ మంత్రి డిమిట్రో కులేబా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రష్యా దాడుల కారణంగా 3 వేల మంది నవజాత శిశువులకు సరైన వైద్యం, మెడిసిన్ అందక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రష్యాను ఉక్రెయిన్ పౌరులు, పిల్లలపై దాడులు ఆపాలంటూ ప్రపంచానికి విజ్ఞప్తి చేశారు. Russia continues holding hostage over 400.000 people in Mariupol, blocks humanitarian aid and evacuation. Indiscriminate shelling continues. Almost 3.000 newborn babies lack medicine and food. I urge the world to act! Force Russia to stop its barbaric war on civilians and babies! — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 రష్యాకు బిగ్ షాక్.. ► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాకు మరో బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాకు చెందిన సంస్థలతో ఉన్న అన్ని సంబంధాలను స్తంభింపజేస్తున్నట్టు తెలిపింది. అంతర్జాతీయ ఆంక్షలకు అనుగుణంగా ఆంక్షల జాబితాలో ఉన్నవారికి దావోస్‌లో జరిగే వార్షిక సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నట్టు పేర్కొంది. ప్రమాదంలో చెర్నోబిల్ న్యూ క్లియర్ ప్లాంట్.. ► ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్ న్యూక్లియర్ ప్లాంట్‌కు చెందిన పవర్ గ్రిడ్ పనిచేయడం ఆపేసిందని బిగ్ బాంబ్ పేల్చారు. నేషనల్ న్యూక్లియర్ రెగ్యులేటర్‌కు అందిన సమాచారం ప్రకారం.. చెర్నోబిల్‌లోని అన్ని కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నారు. అత్యవసర పరిస్థితుల కోసం ఏర్పాటు చేసిన జనరేటర్లకు కేవలం 48 గంటలకు సరిపడా డీజిల్ మాత్రమే ఉందని వెల్లడించారు. ప్లాంట్‌కు విద్యుత్ సరఫరా లేకపోతే.. న్యూక్లియర్ మెటీరియల్‌ను చల్లార్చే వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. ఈ క్రమంలో రేడియేషన్‌ను నియంత్రించడం కష్టమవుతుందన్నారు. దీంతో పెను ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రష్యా దాడుల కారణంగానే చెర్నోబిల్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆరోపించారు. రష్యా కాల్పుల విరమణ పాటిస్తేనే గ్రిడ్‌కు మరమ్మతులు చేసే అవకాశం ఉంటుందన్నారు. Reserve diesel generators have a 48-hour capacity to power the Chornobyl NPP. After that, cooling systems of the storage facility for spent nuclear fuel will stop, making radiation leaks imminent. Putin’s barbaric war puts entire Europe in danger. He must stop it immediately! 2/2 — Dmytro Kuleba (@DmytroKuleba) March 9, 2022 జెలెన్ స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడం మా టార్గెట్ కాదు.. ► రష్యా, ఉక్రెయిన్ మధ్య మూడో రౌండ్లో చర్చలు జరుగుతున్నాయి. ఈసారి చర్చల్లో రెండు దేశాల బృందాలు కొంత పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లోని జెలెన్స్కీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రష్యా ప్రయత్నించడంలేదని తెలిపింది. దేశాన్ని వీడుతున్న ప్రేయసి.. లవ్ ప్రపోజ్ చేసిన ఉక్రెయిన్ సైనికుడు ► యుద్ధం కారణంగా దేశాన్ని వీడుతున్న తన ప్రేయసికి ఉక్రెయిన్ సైనికుడు లవ్ ప్రపోజ్ చేశాడు. సడెన్‌గా ఇలా ప్రియుడిని చూసిన ఆనందంలో ఆమె ఒక్కసారిగా సర్ప్రైజ్ అయ్యింది. క్షణాల వ్యవధిలో ఆమె.. అతడిని హగ్ చేసుకొని తాను పెళ్లి రెడీ అన్న సంకేతంతో ముద్దుపెట్టింది. అనంతరం అతడు ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆ సమయంలో అక్కడున్న మిగతా సైనికులు, ఇతరులు ఆ జంటకు అభినందనలు తెలిపారు. #Watch#Ukraine️ pic.twitter.com/4DeRtEgivM — Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) March 7, 2022 సుమీ నుంచి రైళ్లలో భారతీయుల తరలింపు.. ► ఉక్రెయిన్‌లోని సుమీలో రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి అధికారుల సాయంతో సుమీ నుంచి భారతీయులను రైళ్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు ఉక్రెయిన్‌లోని భారత ఎంబసీ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ క్రమంలోనే భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడమే తమ కర్తవ్యమని ఎంబసీ తెలిపింది. 🇮🇳n students from Sumy on board the special train organised with assistance of 🇺🇦n authorities. Mission will continue to facilitate their movement westwards. Bringing back our students safely and securely will remain our priority. Be Safe Be Strong pic.twitter.com/lGNnHsfRs7 — India in Ukraine (@IndiainUkraine) March 9, 2022 రష్యా, బెలారస్‌పై ఈయూ మరిన్ని కఠిన ఆంక్షలు ► ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో ఇప్పటికే రష్యాపై పలు దేశాలు, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దాడుల వేళ రష్యాకు సహకరిస్తున్న కారణంగా బెలారస్‌పై, రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్‌లోని సభ్య దేశాలు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. 12వేల మంది రష్యా సైనికులు హతం.. ఉక్రెయిన్ ► ఉక్రెయిన్‌పై చేపట్టిన యుద్ధంలో ఇప్పటివరకు 12,000 మందికి పైగా రష్యా సైనికులు మరణించారని ఉక్రెయిన్ వెల్లడించింది. రష్యాకు చెందిన 303 యుద్ధ ట్యాంకులు, 1036 సాయుధ వాహనాలు, 120 శతఘ్నులు, 27 యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ వార్ఫేర్ సిస్టమ్స్, 48 యుద్ధ విమానాలు, 80 హెలికాప్టర్లు, 60 ఇంధన ట్యాంకులను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మోదీజీ మీ సాయానికి థ్యాంక్స్.. బంగ్లా ప్రధాని ► ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఆపరేషన్ గంగా కొనసాగుతోంది. ఆపరేషన్ గంగాలో భాగంగా కేవలం భారతీయులే కాకుండా బంగ్లాదేశీయులు, నేపాలీలు, పాకిస్తానీలు, ట్యూనీషియన్లు కూడా ప్రత్యేక విమానాల ద్వారా భారత్ చేరుకుని ఇక్కడి నుంచి తమ స్వదేశాలను వెళ్తున్నారు. కాగా, తొమ్మిది మంది బంగ్లాదేశ్ ప్రజలు.. ఆపరేషన్ గంగాతో ఇండియా నుంచి తమ దేశానికి చేరుకున్నారు. ఈ క్రమంలో తమ దేశ పౌరులను యుద్ద ప్రభావిత ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా తరలించినందుకు మోదీకి ఆమె థ్యాంక్స్.. అంటూ వ్యాఖ్యలు చేశారు. చెర్నోబిల్‌పై ప్రకటన ► ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) చెర్నోబిల్ గురించి కీలక ప్రకటన చేసింది. చెర్నోబిల్‌తో సంబంధాలు తెగిపోయినట్లు ప్రకటించింది. రెండు వారాలుగా అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదు. రష్యా బలగాలు చెర్నోబిల్‌ను స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి.. అక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. అక్కడి స్టాఫ్ పరిస్థితి మీద కూడా ఎలాంటి అప్డేట్ లేదు అని తెలిపింది. ఇదిలా ఉండగా.. 210 మంది టెక్నీషియన్ల సరిపడా ఆహారం, మందులు ఉన్నప్పటికీ.. పరిస్థితి విషమిస్తోందని అటామిక్ ఏజెన్సీకి ఉక్రెయిన్ ఒక నివేదిక ఇచ్చింది. IAEA says it has lost contact with Chernobyl nuclear data systems. The Chernobyl nuclear power plant is no longer transmitting data to the UN watchdog, the agency says, voicing concern for staff working under Russian guard at the Ukrainian facilityhttps://t.co/rzgZhLjAij pic.twitter.com/kaZvsTN7bn — AFP News Agency (@AFP) March 9, 2022 ► మరోసారి రష్యా కాల్పుల విరమణ. బుధవారం కూడా సేఫ్ కారిడార్ల నుంచి పౌరుల తరలింపునకు అనుమతి. ప్రధాన నగరాల నుంచి పౌరుల తరలింపు ముమ్మరం. అయినా రష్యా బలగాలు ఉల్లంఘనలతో దాడులకు పాల్పడుతోందని ఉక్రెయిన్ ఆరోపణ. రష్యా చేతిలోకి కీవ్! ► మరోవైపు, ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపానికి రష్యా దళాలు చేరుకున్నాయి. వాటి దూకుడు చూస్తుంటే మరికొన్ని గంటల్లో కీవ్ రష్యా సేనల చేతుల్లోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ► ఉక్రెయిన్ నగరమైన సుమీపై రష్యన్ సేనలు బాంబు దాడులకు దిగిన తర్వాత ఆ నగరం నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 5 వేల మందిని తరలించారు. రష్యన్ దళాల దాడిలో పలువురు మరణించినట్టు అధికారులు తెలిపారు. ► రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. 14వ రోజుకు చేరుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 మిలియన్ల మంది ఉక్రెయిన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టారు. అత్యధికంగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ► ఒకవైపు నాటో ప్రతికూల ప్రకటన, రష్యాతో సంధి కోసం పిలుపు ఇచ్చినట్లే ఇచ్చి.. యుద్ధం ఆపేదేలేదంటున్నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. రష్యా దాడిని ప్రతిఘటిస్తూనే ఉండాలని తమ పౌరులకు పిలుపునిచ్చారు. ► రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అలాగే, కోకా-కోలా, పెప్సీ కూడా రష్యాలో అమ్మకాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. తమ ఆదాయంలో ఒకటి నుంచి రెండు శాతం రష్యా, ఉక్రెయిన్ నుంచే వస్తున్నట్టు కోకా-కోలా తెలిపింది. ► ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా తూర్పు, సెంట్రల్ రీజియన్‌లో రష్యన్ యుద్ధ విమానాలు రాత్రంతా బాంబుల వర్షం కురిపించాయి. -
Ukraine Crisis: సేఫ్ కారిడార్లు ఎక్కడ? భారత్ అసంతృప్తి
ఉక్రెయిన్‌లోని ఐదు ప్రధాన నగరాల్లో రష్యా బలగాలు కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత కాలమానం ప్రకారం.. మధ్యాహ్నాం 12గం. 40ని. నుంచి విరమణ మొదలు కానుంది. రాజధాని కీవ్‌తో పాటు ఖార్కీవ్, మరియూపోల్, సుమీ, చెర్నీగోవ్ నగరాల నుంచి తరలింపునకు క్లియరెన్స్ ఇచ్చింది. అయితే.. మిగతా చోట్ల మాత్రం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సేఫ్ కారిడార్లపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సుమీలో చిక్కుకుపోయిన 700 మంది భారతీయులను తరలించే ప్రక్రియ ముందుకు సాగడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు కోసం భారత్.. ఆపరేషన్ గంగ నిర్వహిస్తోంది. ఇందుకు పూర్తి సహకారం ఉంటుందని అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ సైతం ప్రధాని మోదీకి తెలిపాయి. అయినప్పటికీ తరలింపు ప్రక్రియకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. దీంతో ఇక్కడున్న వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అన్ని శత్రుత్వాలకు తక్షణం ముగింపు పలకాలని భారతదేశం నిరంతరం పిలుపునిస్తోంది. సామరస్యంగా శాంతిపూర్వక చర్చలతో ఈ సంక్షోభం ముగియాలని భారత్ భావిస్తోంది. భారతీయుల తరలింపు సురక్షితంగా జరగాలని మేం కోరుకుంటున్నాం. అని యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి, భద్రతా మండలిలో ప్రసంగించారు. సేఫ్‌కారిడార్ కోసం పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా.. ఇరువైపు సానుకూల స్పందన వచ్చినట్లే అనిపిస్తోందని, కానీ, అది కార్యరూపం దాల్చట్లేదని ఆందోళన వ్యక్తం చేశారాయన. భారత్‌తో పాటు పలు దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రష్యా మరోసారి కాల్పుల విరమణ ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అయినా ఇవాళ(మంగళవారం) సుమీ నుంచి భారతీయ విద్యార్థులు, ఇతర దేశాల పౌరుల తరలింపు సురక్షితంగా పూర్తవుతుందేమో చూడాలి. సంబంధిత వార్త: సుమీ నుంచి తరలింపు.. అసలు సమస్యలు ఇవే! -
Ukraine War: 3 లక్షల మందిని రష్యా బందీలుగా ఉంచింది: ఉక్రెయిన్
Live Updates: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం 13వ రోజుకి చేరుకుంది. ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ పాటిస్తామని రష్యా మరోమారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే హ్యుమానిటేరియన్ కారిడార్ల పేరిట పౌరుల తరలింపునకు రష్యా పేర్కొన్న మార్గాల్లో అత్యధికం రష్యా, బెలారస్‌కు దారితీయడంపై ఉక్రెయిన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. రష్యా మధ్యయుగాల నాటి తంత్రాలను ప్రయోగిస్తోందని విమర్శించింది. సంక్షోభం తీవ్రస్థాయిలో ఉన్న మారిపోల్ తదితర నగరాల్లో ఇంతవరకు ఎలాంటి తరలింపులు నమోదు కాలేదు. ఒకపక్క కొన్నిప్రాంతాల్లో తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా బలగాలు మిగిలిన ప్రాంతాల్లో యథాతథంగా యుద్ధాన్ని కొనసాగించాయి. మైకోలైవ్ పోర్ట్‌లో చిక్కుకుపోయిన 75 మంది భారతీయ నావికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఉక్రెయిన్ భారత రాయబార కార్యాలయం తెలదిపింది. ఆదివారంమొత్తం 57 మంది నావికులను బస్సులు ఏర్పాటు చేసి తరలించినట్లు తెలిపింది. నేడు మిగిలిన 23 మంది నావికుల తరలింపును ఏర్పాట్లుఉ జరుగుతున్నాయని తెలిపింది. Mission intervened to evacuate 75 🇮🇳n sailors stranded in Mykolaiv Port. Yesterday buses arranged by Mission evacuated total of 57 sailors including 2 Lebanese & 3 Syrians. Route constraints precluded evacuation of balance 23 sailors. Mission is attempting their evacuation today pic.twitter.com/zxGxqKKeZX — India in Ukraine (@IndiainUkraine) March 8, 2022 ►మారియుపోల్‌లో రష్యా మూడు లక్షల మంది పౌరులను బందీలుగా ఉంచిందని ఉక్రెయిన్ విదేశాంగశాఖ మంత్రి దిమిత్రో కులేబా ఆరోపించారు. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వంతో ఒప్పందాలు ఉన్నప్పటికీ.. రష్యా ఈ తరలింపు ప్రక్రియను అడ్డుకుంటోందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేశారు. Russia holds 300k civilians hostage in Mariupol, prevents humanitarian evacuation despite agreements with ICRC mediation. One child died of dehydration (!) yesterday! War crimes are part of Russia’s deliberate strategy. I urge all states to publicly demand: RUSSIA, LET PEOPLE GO! — Dmytro Kuleba (@DmytroKuleba) March 8, 2022 ►రష్యా సైనిక చర్య నేపథ్యంలో ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 17 లక్షల మంది దేశం విడిచి వెళ్లిపోయినట్లు ఐరాస పేర్కొంది.. వీరందరూ పొరుగు దేశాల్లో శరణార్థులుగా ఉంటున్నట్లు తెలిపింది.. దాదాపు 10 లక్షల మంది ఉక్రెయిన్ పౌరులకు పోలాండ్ తమ దేశంలో ఆశ్రయం కల్పించిందని, ఉక్రెయిన్- రష్యా సంక్షోభానికి తక్షణమే తెరపడని పక్షంలో లక్షలాది మంది జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ ఆందోళన వ్యక్తంచేసింది. ►ఉక్రెయిన్‌లో సుమీలో కాల్పుల విరమణ కొనసాగుతుండటంతో అక్కడి భారతీయ వైద్య విద్యార్థులను తరలించేందుకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాంతంలో సుమారు 600 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని తెలుస్తోంది. రష్యా వైపు నుంచి నిరంతర కాల్పుల కారణంగా.. వారిని ఇప్పటివరకు ఖాళీ చేయలేకపోయారు. ► రష్యా బలగాలు మరో దారుణానికి ఒడిగట్టాయి. సుమీ ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్ భవనాలపై రష్యన్ బలగాలు 500 కిలోల బాంబుతో దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్ సాంస్కృతిక, సమాచార పాలసీ మంత్రిత్వ శాఖ మంగళవారం ట్విట్టర్ వేదికగా తెలిపింది. Last night Russian pilots committed another crime against humanity in Sumy. They dropped 500-kilogram bombs on residential buildings. 18 civilian deaths have already been confirmed, including two children.#StopRussia — Stratcom Centre UA (@StratcomCentre) March 8, 2022 ► గ్రీన్కారిడార్కు మార్గం సుగమం. సుమీ నుంచి పోల్టావాకు బస్సుల్లో పౌరుల తరలింపు. Green corridor from Sumy to Poltava. Keep an eye. More attention, less chances it will be shelled. pic.twitter.com/6zSyj5cdD5 — Nataliya Gumenyuk (@ngumenyuk) March 8, 2022 ► కొనసాగుతున్న కాల్పుల విరమణ.. సమస్యాత్మక ప్రాంతాల నుంచి ఇరు దేశాల సైన్యం నడుమే పౌరుల తలింపు. Oekraïners negeren de Russische voedselbonnen #Ukraine #UkraineCrisis #UkraineWar #StopPutin #StopRussianAggression #WarCrimes #CrimesOfWar #PutinWarCriminal pic.twitter.com/LRTQbLyX56 — Ꮆ乇尺卂尺ᗪ 🅺🆁🅾🅾🅽 (@kroon125) March 8, 2022 ► తూర్పు, మధ్య ఉక్రెయిన్‌లో రష్యా బలగాల దెబ్బకి రాత్రికి రాత్రే పలు నగరాల్లో బాంబుల వర్షం కురిసింది. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఓ కొలిక్కి రావాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ధృవీకరించారు. Destroyed column of enemy equipment near #Sumy. pic.twitter.com/03GdVoxqlB — NEXTA (@nexta_tv) March 8, 2022 ► ఎక్కడా దాక్కోలేదు.. ఇదే నా లొకేషన్ రహస్య ప్రాంతానికి పారిపోయాడంటూ వస్తున్న కథనాలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించాడు. తను ఎక్కడ ఉన్నానో తెలియజేసే లొకేషన్ ను ఇన్ స్టా గ్రామ్ పేజీలో జెలెన్ స్కీ షేర్ చేశారు. ‘‘నేను కీవ్ లోని బాంకోవా స్ట్రీట్ లో ఉన్నాను. నేను దాక్కోలేదు. నేను ఎవరికీ భయపడడం లేదు’’అంటూ పోస్ట్ పెట్టారు. మనం ఈ దేశ భక్తి యుద్ధంలో గెలవడానికి ఏదైనా కోల్పోవచ్చని వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న రష్యా యుద్ధం మొదలు పెట్టిన తర్వాత.. రష్యా దళాలు చేసిన మూడు హత్యా ప్రయత్నాల నుంచి జెలెన్ స్కీ తప్పించుకున్నట్టు కథనాలు వస్తుండడం తెలిసిందే. తనను చివరిగా చూడడం ఇదే కావచ్చంటూ కొన్ని రోజుల క్రితం ఆయన నిర్వేద ప్రకటన చేయడం గమనార్హం. ► మరికాసేపట్లో రష్యా కాల్పుల విరమణ.. ఉక్రెయిన్ పట్టణాల్లో అమలు కానుంది. అయితే మరోవైపు మిగతా ప్రాంతాల్లో రష్యా పెను విధ్వంసానికి పాల్పడుతోంది. పౌరుల భద్రతపై దృష్టి పెడుతున్న ఉక్రెయిన్.. యుద్ధంపై సరిగా ఫోకస్ చేయలేకపోతోంది. అయినప్పటికీ పౌరులు యుద్ధ రంగంలోకి దిగి.. రష్యా బలగాలను ప్రతిఘటిస్తున్నాయి. ► మరోసారి కాల్పుల విరమణ ప్రకటించిన రష్యా. ఈసారి ఐదు నగరాల్లో. మానవతా కోణంలో తరలింపునకు అంగీకారం. రాజధాని కీవ్‌ను సైతం చేర్చిన వైనం. మంగళవారం ఉదయం నుంచి ప్రారంభం కానున్న కాల్పుల విరమణ. ► కీవ్, ఖార్కీవ్ నుంచి రష్యా, బెలారస్‌కు పౌరుల తరలింపును రష్యా ప్రొత్సహిస్తోందని, ఇది ఆందోళన కలిగించే అంశమని ఉక్రెయిన్ వాదిస్తోంది. అయితే రష్యా ఈ ఆరోపణలను ఖండించింది. ఇందులో వాస్తవం లేదని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. ► 200 మంది భారతీయులు ప్రత్యేక విమానంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా చేరుకున్నారు. రొమేనియా నుంచి ఈ విమానం చేరుకుంది. A special flight, carrying 200 Indian evacuees from Ukraine, lands in Delhi from Suceava in Romania. "While we were traveling in the bus, there were no bombings. The government & our Embassy helped us a lot, we are very happy to be back" said a student who returned from Ukraine pic.twitter.com/9HVUcguWsp — ANI (@ANI) March 8, 2022 ► ఉక్రెయిన్ సంక్షోభ నేపథ్యంలో 723 మిలియన్ డాలర్ల గ్రాంట్ మంజూరు చేసిన ప్రపంచ బ్యాంక్. ► ఉక్రెయిన్ ప్రభుత్వానికి సాయం అందించేందుకు యూఎస్ కాంగ్రెస్(చట్ట సభ) సూత్రప్రాయంగా అంగీకారం. ► సుమారు 20 వేల మందిని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు సురక్షితంగా తరలించినట్లు భారత్ ప్రకటన. యూఎన్ అంబాసిడర్ టీఎస్ త్రిమూర్తి.. ఐరాస భద్రతా మండలిలో ప్రకటించారు. "They clearly shot to kill”: Swiss photojournalist Guillaume Briquet narrowly escaped bullets yesterday, fired by a Russian commando on a road in southern #Ukraine. The “press" markings were clearly visible on his car. 1/2 pic.twitter.com/beoz64VkRA — RSF (@RSF_inter) March 7, 2022 ► ఎవరికీ భయపడను యుద్ధం నేపథ్యంలో కీవ్ నుంచే తాను పని చేస్తున్నానని ప్రకటించుకున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మరోసారి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశాడు. మనమంతా యుద్ధ క్షేత్రంలోనే ఉన్నాం. కలిసి కట్టుగా పని చేస్తున్నాం అంటూ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారాయన. నేనేం దాక్కోను. ఎవరికీ భయపడను అంటూ 9 నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోలో ఆయన పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Володимир Зеленський (@zelenskiy_official) ► ఉక్రెయిన్ రెండో అతిపెద్ద నగరం ఖార్కీవ్లో జరిగిన యుద్ధంలో రష్యా మేజర్ జనరల్ అండ్రెయ్ సుఖోవెట్స్కీ చనిపోయినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. Russian Major General Andrei Sukhovetsky, commander in chief of the 7th division of the Russian army, was killed by Ukrainian army snipers. Sukhovetsky participated in the Russian military operations in Syria and was responsible for the deaths of thousands of civilians in Syria. pic.twitter.com/tIdfLf2RPl — Husam Hezaber (@HusamHezaber) March 4, 2022 ► రష్యా ఆయిల్‌పై నిషేధం దిశగా ఎలాంటి ఆలోచనలు చేయలేదని అమెరికా ప్రకటన. US says no decision made about ban on importing oil from Russia Read @ANI Story | https://t.co/rUEsPresvS#Ukraine️ #Russia #Oilprices pic.twitter.com/EUpJhbOQuW — ANI Digital (@ani_digital) March 7, 2022 ► రష్యా ఆయిల్ మీద నిషేధం విధిస్తే.. ధరలు విపరీతంగా పెరుగుతాయని మాస్కో వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ► ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధం విషయంలో రష్యా కీలక ప్రకటన చేసింది. మిలటరీ ఆపరేషన్ తక్షణమే నిలిపివేసేందుకు తాము సిద్ధమేనని వెల్లడించింది. అయితే, తాము విధిస్తున్న నాలుగు షరతులను ఉక్రెయిన్ అంగీకరిస్తేనే అది సాధ్యమవుతుందని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి సోమవారం తేల్చిచెప్పారు. తమ షరతు ల జాబితాను బయటపెట్టారు. అవి ఏమిటంటే.. ఉక్రెయిన్ సైన్యం వెంటనే వెనక్కి మళ్లాలని రష్యా అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఇరువైపులా కాల్పుల విరమణ పాటిద్దామని చెప్పారు. ఉక్రెయిన్ తటస్థ దేశంగానే ఉండాలని, ఆ మేరకు రాజ్యాంగ సవరణ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర దేశాల భూభాగాల్లోకి ఉక్రెయిన్ ప్రవేశాన్ని నిరోధించేలా ఈ రాజ్యాంగ సవరణ ఉండాలన్నారు. క్రిమియాను రష్యాలో ఒక భాగంగా అధికారికంగా గుర్తించాలని ఉక్రెయిన్‌కు సూచించారు. డొనెట్స్క్, లుహాన్స్క్లను సైతం స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తించాలన్నారు. రష్యా విధించిన షరతులపై ఉక్రెయిన్ ఇంకా స్పందించలేదు. యుద్ధం కారణంగా దాదాపు 17 లక్షల మంది ఉక్రేనీయులు శరణార్థులుగా మారినట్లు ఐరాస ప్రకటించింది. రష్యా, ఉక్రెయిన్ బృందాలు సోమవారం జరిపిన మూడో విడత చర్చలు ఎలాంటి తుది నిర్ణయాలు తీసుకోకుండానే ముగిశాయి. అయితే, చర్చల్లో పురోగతి కనిపించిందని ఉక్రెయిన్ వర్గాలు తెలపగా, రష్యా తోసిపుచ్చింది. గురువారం ఇరుదేశాల విదేశాంగ మంత్రులు టర్కీలో సమావేశం కానున్నారు. యుద్ధం కొనసాగుతుండడంతో పలు నగరాల్లో సైనికులు, పౌరులు కలిసి దిగ్బంధనాలు ఏర్పాటు చేస్తున్నారు. సైనికుల కోసం తాత్కాలిక వంటశాలలు ఏర్పాటు చేసి ఆహారం సరఫరా చేస్తున్నారు. ► 2 లక్షల మంది ఎదురుచూపులు కీలక మారిపోల్ నగరంలో దాదాపు 2 లక్షలమంది పౌరులు దేశం విడిచిపోయేందుకు తయారుగా ఉన్నారు. వీరిని తరలించేందుకు అక్కడ రెడ్‌క్రాస్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో ఆహారం, నీరు తదితర నిత్యావసరాల కొరత ఏర్పడింది. స్థానికులు కనిపించిన షాపులను లూటీ చేస్తున్నారు. తరలింపు కారిడార్ ప్రకటన వచ్చేవరకు ప్రజలంతా షెల్టర్లలోనే ఉండాలని పోలీసులు ప్రకటించారు. దక్షిణ ఉక్రెయిన్ సహా తీరప్రాంతంలో రష్యా బలగాలు చెప్పుకోదగ్గ పట్టుసాధించాయి. ఇతర ప్రాంతాల్లో మాత్రం రష్యాకు ముమ్మర ప్రతిఘటన ఎదురవుతోంది. మారిపోల్ స్వాధీనమైతే రష్యా నుంచి క్రిమియాకు భూమార్గం ఏర్పాటవుతుంది. అందుకే రష్యా సేనలు ఈ ప్రాంతంపై దృష్టి పెట్టాయి. ఇప్పటివరకు యుద్ధం కారణంగా 406 మంది పౌరులు మృతి చెందారని, నిజానికి ఈ సంఖ్య మరింత పెద్దదిగా ఉండొచ్చని ఐరాస మానవహక్కుల కార్యాలయం తెలిపింది. Only Kids can put a smile on your face in the middle of war#ukraine #UkraineWar pic.twitter.com/q2Qe9Z47v5 — Ivan (@coldshowwer) March 7, 2022 ► సమ్మతం కాదు రష్యా ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ తమకు ఆమోదయోగ్యం కాదని ఉక్రెయిన్ ఉప ప్రధాని ఇరినా వెరెషు్చక్ ప్రకటించారు. రష్యా ప్రకటించిన కారిడార్లలో అత్యధికం రష్యాకు, బెలారస్‌కు దారితీస్తున్నాయని, ఇది తాము అంగీకరించమని చెప్పారు. రష్యా సూచించిన ప్రణాళికను ఫ్రాన్స్ కూడా తిరస్కరించింది. రష్యాలో ఆశ్రయం పొందాలని ఎంతమంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటారని, ఇదంతా కేవలం కంటితుడుపు చర్యని ఫ్రాన్స్ వ్యాఖ్యానించింది.∙రష్యాతో చర్చలకు ఎప్పుడూ సిద్ధమేనని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చెప్పారు. రష్యా ఆక్రమణ ఆరంభించినప్పటినుంచి ఆయన పుతిన్‌తో 4సార్లు మాట్లాడారు. సంక్షోభ నివారణకు కృషి చేస్తామని మరోమారు ఆయన వెల్లడించారు. ఫ్రాన్స్‌తో పాటు ఇజ్రాయెల్ సైతం మధ్యవర్తిత్వ కృషి చేస్తోంది. రష్యా ప్రతిపాదిత మార్గాల బదులు 8 మార్గాలను ఉక్రెయిన్ ప్రతిపాదించింది. కీవ్ ప్రాంతంలో రష్యాతో తీవ్రమైన పోరు సాగుతోందని ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. ఇర్పిన్, మైకోలైవ్ ప్రాంతాలపై రష్యా విరుచుకుపడుతోందని, ఇక్కడ చాలావరకు రష్యా అధీనంలోకి వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. -
జెలెన్స్కీకి ప్రధాని మోదీ కృతజ్ఞతలు
ఉక్రెయిన్ సంక్షోభ పరిణామాలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో సోమవారం ఫోన్లో మాట్లాడారు. సుమారు 35 నిమిషాలపాటు వీళ్ల మధ్య సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. రష్యాతో ఒకవైపు పోరు కొనసాగిస్తున్నప్పటికీ.. నేరుగా శాంతి చర్చల నిర్ణయం తీసుకోవడంపై జెలెన్స్కీని ప్రధాని మోదీ అభినందించారు. అంతేకాదు భారతీయుల తరలింపు విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆపై ప్రస్తుత యుద్ధ పరిస్థితులపై ఇద్దరూ చర్చించుకున్నారు. రష్యా కాల్పుల విరమణ ప్రకటించిన నేపథ్యంలో.. భారత్‌లో చిక్కుకున్న విద్యార్థుల తరలింపును వేగవంతం చేయాలని, అందుకు సహకరించాలని మోదీ, జెలెన్స్కీని కోరారు. ప్రత్యేకించి సుమీ రీజియన్ నుంచి తరలింపు క్లిష్టంగా మారిన తరుణంలో అక్కడ ప్రత్యేకంగా దృష్టిసారించాలని మోదీ, జెలెన్స్కీని కోరినట్లు తెలుస్తోంది. -
నా భార్య గర్భవతి.. ఆమె లేకుండా నేను ఇండియా రాలేను.. ఓ ఎన్నారై ఆవేదన
యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల్లుతున్నాయి. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చనే భయం వెంటాడుతోంది. కానీ గుండెల్లో నిండిన ప్రేమ ముందు ఇవన్నీ బలాదూర్ అయ్యాయి. భారతీయుడై గగన్ ఉక్రెయిన్‌లో స్థిరపడ్డాడు. అక్కడి స్థానిక మహిళను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. అయితే అనుకోకుండా వచ్చిన యుద్ధంతో ఆ కుటుంబం చిక్కుల్లో పడింది. బాంబుల మోత, తుపాకుల గర్జన మధ్య బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్‌లో గడుపుతోంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకువచ్చేందుకు ఇండియా ఆపరేషన గంగాను చేపట్టింది. ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో ఇండియన్లను పొరుగున్న ఉన్న రొమేనియా, పొలాండ్, స్లోవేకియా, హంగేరిల మీదుగా ఇండియాకి వస్తున్నారు. ఈ క్రమంలో భారత అధికారులను గగన్ కలిశాడు. ఆపరేషన్ గంగలో కేవలం భారతీయులకే అవకాశం ఉందని భారత అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ వణిత అయిన అతని భార్యను తరలించేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు. గగన్ ఒక్కడితే ఇండియాకు తరలిస్తామన్నారు. కష్టకాలంలో గర్భవతిగా ఉన్న భార్యను వదిలి వచ్చేందుకు నిరాకరించాడు గగన్. కష్టమైనా నష్టమైనా ఆమెతోనే ఉంటానంటూ ఆపరేషన్ గగన్ అధికారులకు చెప్పాడు. రోజులు గడుస్తున్నా.. ఎంతకీ యుద్ధం ఆగకపోకపోవడంతో గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి కీవ్ నగరాన్ని గగన్ వీడాడు. ప్రస్తుతం పశ్చిమ దిక్కున ఉన్న లివివ్ నగరంలో స్నేహితుడి ఇంట్లో ప్రస్తుతం గగన్ , అతని భార్య ఆశ్రయం పొందుతున్నారు. త్వరలోనే తాము పోలాండ్ వెళ్లిపోతామంటూ చెబుతున్నాడు గగన్. I'm an Indian citizen, can go to India but not my wife, who is a #Ukrainian;have been told that only Indians will be evacuated;can't leave my family here. My wife is 8-months pregnant, will be moving to Poland. We're currently at a friend's place in Lviv:Gagan, who fled from Kyiv pic.twitter.com/r3hWJDbgNU — ANI (@ANI) March 6, 2022 -
మాట తప్పిన రష్యా: ‘ఆపరేషన్ గంగ’కు ఆఖరి దశలో అడ్డంకులు!
కీవ్: ఉక్రెయిన్ యుద్ధభూమి నుంచి భారత విద్యార్థుల్ని వెనక్కి తీసుకువచ్చే ‘ఆపరేషన్ గంగ’ ఆఖరి దశలో సంక్లిష్టంగా మారింది. రష్యా ఫిరంగులు నిప్పులు కక్కుతుండటంతో సుమీ నగరంలో చిక్కుకుపోయిన 700 మందిని తీసుకురావడం సమస్యగా మారింది. ఉక్రెయిన్‌లో మారియుపోల్, వోల్నోవాఖ నగరాల్లో పౌరులను సజావుగా ఖాళీ చేయించడానికి మానవతా దృక్పథంతో కాల్పులకు కాస్త విరామం ప్రకటిస్తున్నట్టు రష్యా శనివారం ప్రకటించింది. దాంతో సుమీలో చిక్కుకున్న మన విద్యార్థుల్ని వెనక్కి తీసుకురావచ్చని కీవ్‌లోని భారత రాయబార కార్యాలయం భావించింది. కానీ, రష్యా మాట తప్పి ఎడతెరిపి లేకుండా క్షిపణి, బాంబు దాడులకు దిగడంతో పరిస్థితి మొదటికొచ్చింది. తూర్పు ఉక్రెయిన్‌లో చిక్కిన విద్యార్థుల్ని సరిహద్దులకు చేర్చాలంటే మారియుపోల్, వోల్నోవాఖ నుంచే తీసుకురావాలి. కానీ, అక్కడ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఖర్కీవ్ సమీపంలోని పిసోచిన్, సుమీ నుంచి విద్యార్థుల్ని తీసుకురావడానికి సురక్షిత మార్గాలేవీ అందుబాటులో లేవు. రష్యాకు ఈశాన్యంగా ఉన్న సుమీ పరిసరాల్లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. పైగా రవాణా సాధనాలేవీ లేకపోవడం మరో సమస్యగా ఉంది. దాడులు ఆగిన తర్వాతే విద్యార్థుల తరలింపు సాధ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చిన్న హోటల్ గది నుంచి ఆపరేషన్ గంగ కోసం హంగరీ రాజధాని బుడాపెస్ట్‌లో ఒక హోటల్ గదిలో చిన్న కంట్రోల్ రూమ్ పెట్టి నడిపించారు. భారత రాయబార కార్యాలయంలోని మెరికల్లాంటి యువ ఐఎఫ్ఎస్ అధికారులు ఆపరేషన్ చేపట్టారు. 150 మందికి పైగా వలెంటీర్లను నియమించుకొని భారతీయ విద్యార్థులు ఎక్కడెక్కడున్నారో సమాచారం సేకరించారు. ఆపరేషన్ గంగ విజయవంతం: మోదీ ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ట ఎంతో పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. కాబట్టే మన పౌరులను ఉక్రెయిన్ నుంచి వేగంగా తీసుకొచ్చి ‘ఆపరేషన్ గంగ’ను విజయవంతం చేశామన్నారు. ఈ విషయంలో చాలా పెద్ద దేశాలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఆదివారం పుణెలోని సింబయాసిస్ వర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేడు భారత్‌కు హరజోత్ సింగ్ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో కొద్ది రోజుల క్రితం రష్యా దాడుల్లో గాయపడిన భారత విద్యార్థి హరజోత్ సింగ్ సోమవారం స్వదేశానికి రానున్నాడు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్ చెప్పారు. 24 గంటల్లో 2,500 మంది రాక.. గత 24 గంటల్లో 13 విమానాలు 2,500 మంది విద్యార్థుల్ని ఉక్రెయిన్ నుంచి భారత్‌కు చేర్చాయి. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటిదాకా 76 విమానాల్లో 15,920 మంది విద్యార్థులు క్షేమంగా తిరిగివచ్చారు. వచ్చే 24 గంటల్లో మరో 13 భారత వైమానిక దళ విమానాలు ఉక్రెయిన్ నుంచి విద్యార్థులతో బయల్దేరతాయి. ఉక్రెయిన్‌కు విమానాల రాకపోకలపై నిషేధం ఉండటంతో రుమేనియా, పోలండ్, హంగరి, స్లొవేకియా, మాల్డోవాల నుంచి విద్యార్థులను భారత్ వెనక్కు తీసుకొస్తోంది. హంగరీ నుంచి ఆఖరి విడతగా 13 విమానాలు రానున్నాయి. అందుకే హంగరీ సరిహద్దులకు చేరుకోవాలనుకునే విద్యార్థులంతా త్వరగా రావాలని భారత రాయబార కార్యాలయం సూచించింది. సోమవారం బుడాపెస్ట్ నుంచి ఐదు, సుకేవా నుంచి రెండు, బుఖారెస్ట్ నుంచి ఒక విమానంలో మరో 1,500 మందిని తీసుకు రానున్నారు. -
ఆపరేషన్ గంగా ద్వారా స్వదేశానికి మరో 798 మంది భారతీయులు
న్యూఢిల్లీ/ మాస్కో: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను వెనక్కి తీసుకువచ్చే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. గురువారం వైమానిక దళానికి చెందిన నాలుగు సీ–17 విమానాలు మొత్తం 798 మందిని ఢిల్లీకి తీసుకువచ్చాయి. ఆపరేషన్ గంగ ద్వారా 30 విమానాల్లో ఇప్పటి వరకు 6,400 మందిని వెనక్కి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో మరో 7,400 రానున్నట్లు తెలిపింది. అడ్వైజరీలు జారీ చేశాక సుమారు 18వేల మంది భారతీయులు ఉక్రెయిన్ వీడారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇదే సమయంలో, యుద్ధానికి దిగిన రష్యా కూడా భారతీయుల పట్ల సానుకూలత ప్రదర్శించిందన్నారు. సుమారు 130 బస్సుల్లో ఖర్కీవ్, సుమీల్లో చిక్కుకుపోయిన వారిని రష్యాలోని బెల్గోరోడ్‌కు తరలిస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. వచ్చే 24 గంటల్లో మూడు సీ–17 ఎయిర్‌ఫోర్స్ విమానాలతోపాటు మొత్తం 18 విమానాలను నడపనున్నామన్నారు. వీటిల్లో రొమేనియా నుంచి ఏడు, హంగరీ నుంచి ఐదు, పోలండ్ నుంచి మూడు, స్లొవేకియా నుంచి ఒకటి ఉంటాయన్నారు. (చదవండి: ఇంటికి తిరిగి వస్తామనుకోలేదు.. విద్యార్థుల ఆవేదన ఇదే..) -
రష్యా విధ్వంసం.. మూడో విడత చర్చలకు ఉక్రెయిన్ యత్నం!
Russia-Ukraine War Day 9 LIVE Updates: భారీ నష్టం జరుగుతున్నా.. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. గెరిల్లా తరహా యుద్ధవ్యూహాలతో రష్యా సైన్యం చొచ్చుకురాకుండా అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాయి. రష్యా సైన్యం కనీవినీ ఎరుగని రీతిలో బాంబులు, క్షిపణి దాడులతో హడలెత్తిస్తోంది. తొమ్మిదవ రోజూ యుద్ధం కొనసాగుతోంది. ► ఉక్రెయిన్‌లోని యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లిర్ ప్లాంట్ అయిన జిప్రోజియా న్యూక్లియర్ ప్లాంట్‌పై రష్యా బలగాలు దాడి నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి శుక్రవారం ఉదయం 11.30 నిమిషాలకు (న్యూయార్క్ కాలామాణం ప్రకారం) అత్యవసర సమావేశం కానుంది. ► ఈ వారాంతంలో రష్యా అధికారులతో మూడవ రౌండ్ చర్చలు జరపాలని ఉక్రెయిన్ యోచిస్తోందని ఆ దేశ అధ్యక్ష సలహాదారు పేర్కొన్నారు. మరోవైపు బెలారస్లో గురువారం జరిగిన రెండో విడత చర్చల్లో యుద్ధ ప్రభావిత ప్రాంతాల నుంచి పౌరులను సురక్షితంగా పంపించేందుకు వీలుగా సేఫ్ కారిడార్లను నిర్వహించాలని ఇరు వర్గాలు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పౌరుల తరలింపు సమయంలో ఆయా మార్గాల్లో కాల్పులు కూడా విరమించేందుకు అంగీకరించాయి. ► ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ దేశం విడిచి పారిపోయినట్లు రష్యా పేర్కొంది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో ఉన్నారని రష్యన్ మీడియా పేర్కొంది. అయితే ఇంతకముందు కూడా జెలెన్స్కీ దేశం విడిచిపెట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. కానీ ఈ ఈ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశారు. తాను రాజధాని కీవ్‌లోనే ఉన్నట్లు స్పష్టం చేశారు. మరీ ప్రస్తుత వార్తలు ఎంత వరకు నిజమో తేలాల్సి ఉంది. పూర్తి కథనానికి ఇక్కడ క్లిక్ చేయండి ► రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో దాదాపు 20 వేలకు పైగా భారతీయులు ఉక్రెయిన్ వీడినట్లు కేంద్ర విదేశాంగశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 18 విమానల్లో 4 వేల మంది స్వదేశానికి చేరుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ దేశంలో రెండు నుంచి మూడు వేల మంది భారతీయులు ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. వీరిలో కనీసం 1,000 మంది భారతీయులు.. తూర్పు ఉక్రెయిన్‌లో సంఘర్షణ ప్రాంతాలు సుమీలో 700 మంది, ఖార్కివ్‌లో 300 మంది చిక్కుకుపోయారని అంచనా వేసింది. వారిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడం ప్రస్తుతం అతిపెద్ద సవాలుగా మారిందని కేంద్రం శుక్రవారం తెలిపింది. అయితే చివరి వ్యక్తిని తరలించే వరకు తాము ఆపరేషన్ గంగాను కొనసాగిస్తామని వెల్లడించింది. . ►ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా ఉక్రెయిన్ ప్రజలు ఇతర దేశాలకు తరలి వెళ్లినట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది. వీరిలో దాదాపు అయిదు లక్షలమంది యువత ఉన్నట్లు తెలిపింది. ►ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్) అత్యవసరంగా స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి. ఈ మేరకు ఓటింగ్ నిర్వహించింది. ఈ కౌన్సిల్లో మొత్తం 47 దేశాలు ఉండగా. భారత్ మరోసారి ఈ ఓటింగ్ ప్రక్రియకుదూరంగా ఉంది. అయితే ఈ తీర్మానానికి అనుకూలంగా 32 ఓట్లు వచ్చాయి. భారత్, చైనా, పాకిస్థాన్, సుడాన్ సహా 13 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే అనుకూల దేశాలు ఎక్కువగా ఉండటంతో తీర్మానం ఆమోదం పొందింది. Le Conseil des droits de l'homme de l'ONU a décidé d'établir d'urgence une commission d'enquête internationale indépendante suite à l'agression de la #Russie contre l'#Ukraine. VOTE ✅ POUR : 32 ❌ CONTRE : 2 ➖ ABSTENTIONS : 13 pic.twitter.com/r4yfTsAyUS — UN Human Rights Council 📍 #HRC49 (@UN_HRC) March 4, 2022 ► రష్యన్ బలగాలు జరుపుతున్న దాడి కారణంగా ఉక్రెయిన్‌లోని నగరాలు శ్మశానాలుగా మారాయి. VIDEO: Devastation in Ukraine town of Borodianka after Russian artillery strikes. Images show numerous buildings destroyed or badly damaged by Russian artillery strikes in the town of Borodianka, 60km northwest of Kyiv on March 3 pic.twitter.com/9KiNd54c4K — AFP News Agency (@AFP) March 4, 2022 ప్రపంచంలోనే అతిపెద్ద విమానాన్ని ధ్వంసం చేసిన రష్యా.. ►ఉక్రెయిన్‌లోని హోస్టోమెల్ విమానాశ్రయంలో ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఆంటోనోవ్ యాన్-225 విమానాన్ని రష్యన్ బలగాలు ధ్వంసం చేశాయి. స్థానిక మీడియా దీనికి సంబంధించిన ఓ వీడియోని ట్విట్టర్లో షేర్ చేసింది. Video confirms the world's largest plane, the Antonov An-225, was destroyed at Hostomel Airport in Ukraine, ending days of conflicting reports pic.twitter.com/0geCjAHWaa — BNO News (@BNONews) March 4, 2022 ► ఉక్రెయిన్ సైన్యం చేతిలో 9,166 మంది రష్యా సైనికులు హతం.. 33 విమానాలు, 37 హెలికాప్టర్లు, 2 బోట్లు, 60 ఇంధన ట్యాంకులు, 404 కార్లు, 251 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ప్రకటన. ► న్యూక్లియర్ ప్లాంట్ స్వాధీనం.. రష్యా సైన్యం యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ జాపోరిజ్జియా న్యూక్లియర్ ప్లాంట్ సైట్‌ను స్వాధీనం చేసుకుంది. కాగా, శుక్రవారం ఉదయం ప్లాంట్‌పై దాడులు జరిపిన కొన్నిగంటల తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ► అణు విద్యుత్ కేంద్రంపై రష్యా దాడిని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ఈ దాడిపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి ఫోన్ చేసి దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంరతం అణు విద్యుత్ కేంద్రంపై దాడి రష్యాకు ఆమోద యోగ్యం కాదన్నారు. అక్కడ దాడులను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ► కొనసాగుతున్న ఆపరేషన్ గంగ. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు ముమ్మరం. హిండన్ ఎయిర్‌బేస్‌కు ఈ ఉదయం చేరుకున్న రెండు విమానాలు. ► యూరప్‌లోనే అతిపెద్ద న్యూక్లియర్ ప్లాంట్ అయిన జాపోరిజ్జియా న్యూక్లియర్ప్లాంట్పై రాకెట్ దాడులు జరిగాయి. దీంతో ప్లాంట్ అగ్నికీలకల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆ నగర మేయర్ ధృవీకరించారు. ఇది గనుక పేలితే చెర్నోబిల్ కంటే పదిరెట్లు నష్టం జరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Ukraine nuclear plant on fire after Russia shelling#UkraineRussianWar#RussianUkrainianWarhttps://t.co/JZmT5xs2ZG pic.twitter.com/yvuaaSNRKr — Economic Times (@EconomicTimes) March 4, 2022 ► ఎనర్హోదర్‌ను స్వాధీనం చేసుకునేదిశగా రష్యా. ఉక్రెయిన్‌కు నాలుగో వంతు కరెంట్ ఇక్కడి నుంచే ఉత్పత్తి. ► చెర్నిహివ్‌లో రష్యా దాడులు. 22 మంది దర్మరణం పాలైనట్లు చెర్నిహివ్ గవర్నర్ ప్రకటించారు. ► ఉక్రెయిన్ యుద్దంలో మరో విద్యార్థికి గాయాలయ్యాయి. రాజధాని కీవ్‌లో ఆ విద్యార్థి గాయపడి చికిత్స పొందుతున్నట్లు కేంద్ర మంత్రి వీకే సింగ్ వెల్లడించారు. కీవ్ నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించినట్లు గుర్తు చేశారాయ. యుద్ధ సమయంలో బుల్లెట్ అనేది జాతీయత, ప్రాంతీయత చూడదని ఆయన వ్యాఖ్యానించారు. ► నేరుగా తనతోనే చర్చలు జరపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోరాడు. అప్పుడే యుద్ధం ఆగే మార్గం దొరుకుతుందని అన్నారు. మరోవైపు యుద్ధం కొనసాగుతున్న తరుణంలో.. ప్లాన్లు ఇవ్వాలని, యుద్ధ విమానాలు, ఆయుధాలు అందించాలని పశ్చిమ దేశాలను కోరుతున్నాడాయన. ► యధాతధంగా రష్యా సైన్యం దాడులు కొనసాగుతాయని ఓ టెలివిజన్ ప్రసంగం ద్వారా పుతిన్ ప్రకటించారు. ► గురువారం ఉక్రెయిన్ రష్యా ప్రతినిధుల మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయి. పౌరులను సురకక్షిత కారిడార్ గుండా తరలింపునకు ఇరు దేశాలు అంగీకరించాయి. -
ఆపరేషన్ గంగను వేగవంతం చేసిన కేంద్రం
-
ఉక్రెయిన్-రష్యా యుద్ధం: ఫ్రాన్స్ అధ్యక్షుడికి పుతిన్ ఫోన్!
Ukraine Crisis Live Updates: ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు పెను విధ్వంసానికి దిగాయి. రెండు రోజులుగా గ్యాప్ లేకుండా విరుచుకుపడుతున్నాయి. ఎనిమిదవ రోజు సైతం విధ్వంసకాండ కొనసాగుతుండగా.. బెలారస్ బ్రెస్ట్ ప్రాంతంలో చర్చలు జరిగే అవకాశాలున్నట్లు సమాచారం. రష్యా తరపున సైనికులు, ఉక్రెయిన్ తరపున సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా భారీ సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. ప్రధాన పట్టణాలపై ఫోకస్ చేసిన రష్యన్ బలగాలు ఖార్కీవ్ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు యుద్ధంతో ఏడు లక్షల మంది దేశం విడిచి పారిపోతుండగా.. వాళ్లకు ఆశ్రయం ఇచ్చేందుకు చాలా దేశాలు విముఖత వ్యక్తం చేస్తున్నాయి. ►ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ ఫ్రాన్స్ అధ్యక్షుడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్‌లో పరిస్థితి మరింత దారుణంగా మారిందని పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ అర్థమైందని ఆయన అన్నారు. సుమారు వారు 90 నిమిషాలు మాట్లాడారు. ►ఎట్టికేలకు ఉక్రెయిన్, రష్యా మధ్య రెండో దశ చర్చలు బెలారస్- పోలాండ్ మధ్య చర్చలు జరిగాయి. చర్చలోకి వచ్చిన ఎజెండాలోని అంశాలు ఇవే 1. వెంటనే కాల్పుల విరమణ 2.యుద్ధ విరమణ 3. పౌరులు సరిహద్దులు దాటేందుకు వీలుగా చర్యలు ►మరో సారి ఉక్రెయిన్ రష్యా మధ్య చర్చలు.. మరో రెండు గంటల్లో ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలు జరగనున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. చర్చలు చర్చలే.. దాడులు దాడులేనని అంతవరకు పరిస్థితిలో ఏ మార్పు రాదని రష్యా చెప్తోంది. మా డిమాండ్లను ఇంతకు ముందే చెప్పం.. అది ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని రష్యా స్పష్టం చేసింది. దోనాస్క్ ల్యూనిస్క్లను వదిలేయాలని ఉక్రెయిన్ అంటోంది. ►యుద్ధం తర్వాత ఉక్రెయిన్ను పునర్నిర్మిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ప్రతిజ్ఞ చేశారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా రష్యా చేసిన ప్రతిదానికీ రష్యా తిరిగి చెల్లించేలా మా చర్యలు ఉండబోతున్నాయని తెలిపారు జెలెన్స్కీ. ►రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యన్ మేజర్ జనరల్ హతమైనట్లు వెల్లడించిన నెక్స్టా మీడియా ►రష్యాకు మరో గట్టి షాకిచ్చిన ఉక్రెయిన్ సైనికులు ప్రపంచంలోనే అత్యంత శక్తి సామర్ద్యాలు కలిగిన యుద్ధ విమానం సుఖోయ్ (ఎస్‌యూ-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్) రష్యా సైనిక పటాలంలో శత్రు దేశాలను ఇట్టే భయపెట్టే ఎయిర్ క్రాఫ్ట్. అయితే చిన్న దేశమైనప్పటికీ ఉక్రెయిన్.. తన గగన తలం మీదకు వచ్చిన రష్యా సుఖోయ్ విమానాన్ని ఒక్క దెబ్బకు కూల్చేసింది. ఈ మేరకు ఉక్రెయిన్ సైనిక బలగాల కమాండర్ ఇన్ ఛీప్ లెఫ్ట్ నెంట్ జనరల్ వాలేరీ జాలుజ్నియి కాసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ► ఉక్రెయిన్‌కు 2,700 యాంటీ ఎయిర్ మిస్సైల్స్ అందించనున్న జర్మనీ. ► ఖార్కీవ్లో పవర్ కట్. అంధకారంలోనూ ఆగని విధ్వంసం. ► ఉక్రెయిన్ ప్రధాన నగర దాడుల్లో రష్యా దళాలకు, ఉక్రెయిన్ రెబల్స్ చేతులు కలిపారు. ► ఉక్రెయిన్‌పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. ఉక్రెయిన్ దళాలు రష్యా బలగాలను ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతున్నాయి. ఈ ఉదయం నుంచి రష్యా బలగాలదే స్పష్టమైన పైచేయిగా కనిపిస్తోంది. ► స్కూళ్లు, మెట్రో స్టేషన్లే లక్ష్యంగా.. ప్రభుత్వ ఆస్తులు, కార్యాలయాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపిన రష్యా.. ఇప్పుడు పూర్తిగా పౌరులనే లక్ష్యంగా చేసుకుని విరుచుకుపడుతోంది. రష్యా దాడులు తీవ్రతరం చేసి ఆసుపత్రులు, పాఠశాలలు, భవనాలపై కూడా దాడులు జరుపుతుండడం కలకలం రేపుతోంది. మరోవైపు మెట్రో స్టేషన్లు అక్కడ అండర్ గ్రౌండ్ బంకర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆశ్రయం పొందుతున్న వాళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుపుతోంది రష్యా. ► గురువారం ఉదయం.. కీవ్‌లోని మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రుబీ నరోదివ్ మెట్రో స్టేషన్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. కీవ్ నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలకు స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా దాడులు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఖేర్సన్ నగరాన్ని తమ అధీనంలోకి తెచ్చుకుంది. ► ఒబ్లాస్ట్, లవీవ్, మైకొలివ్, చెర్నిహివ్, తదితర ప్రాంతాల్లో రష్యా వైమానిక దాడులకు సిద్ధమైంది. తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా సిద్ధమని రష్యా ఇప్పటికే ప్రకటించింది. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో వలసలు పెరిగాయని ఐక్యరాజ్య సమితి శరణార్థుల విభాగం తెలిపింది. నిన్నటి వరకు 7 లక్షలుగా భావించిన వలసదారుల సంఖ్యను.. ఇప్పుడు 10 లక్షలుగా ఒక నివేదికలో పేర్కొంది. మరోవైపు యూఏఈ సహా పలు దేశాలు ఉక్రెయిన్ వలసదారులకు ఆశ్రయాన్ని నిరాకరిస్తున్నాయి. ► ఇతర దేశాల జోక్యం పెరిగితే ఉక్రెయిన్‌తో యుద్ధంలో అణ్వస్త్రాలను వాడడానికి కూడా రష్యా వెనకాడబోదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అణుయుద్ధం విషయంలో దేశ బలగాలను రష్యా అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. రష్యా వద్ద 5,997 అణు వార్హెడ్లు ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ తెలిపింది. ► రష్యా దాడులు తీవ్రతరం చేసిన నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి విదేశీయులు నానా కష్టాలు పడుతున్నారు. పొరుగు దేశాలకు చేరుకునే క్రమంలో చాలా మందికి ఆహారం అందట్లేదు. జనావాసాలపై కూడా రష్యా దాడులు జరుపుతుండడంతో ఉక్రెయిన్ ప్రజలు తీవ్ర భయాందోళనల్లో ఉన్నారు. ► రష్యా ఆరోపణలు.. ఖండించిన భారత్ భారత విద్యార్థులను అడ్డుగా పెట్టుకుని ఉక్రెయిన్ తమతో పోరాడుతోందని రష్యా ఆరోపణలకు దిగింది. ఖార్కివ్ నుంచి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా.. ఉక్రెయిన్ బలగాలు భారతీయులను బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ నుంచి బెల్గ్రేడ్కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులను ఖార్కివ్‌లో ఉక్రెనియన్ అధికారులు బలవంతంగా నిర్బంధిస్తున్నారంటూ మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ ప్రకటించారు. భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయంటూ స్పష్టంచేశారు. కాగా.. ఈ ఆరోపణలపై ఉక్రెయిన్ స్పందించింది. భారత్, పాకిస్థాన్, చైనా విద్యార్థులను రష్యా బందీలుగా మార్చిందని ఉక్రెయిన్ పేర్కొంది. రష్యా ఆరోపణల అనంతరం ఉక్రెయిన్ విదేశాంగశాఖ ఈ ప్రకటన చేసింది. భారతదేశం, పాకిస్తాన్, చైనా ఇతర దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారంటూ ఆరోపించింది. ఈ పరస్పర ఆరోపణల నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. భారత విద్యార్థులను బందీలుగా తీసుకున్న విషయమేదీ తమ దృష్టికి రాలేదని ప్రకటించింది. రష్యా ఉక్రెయిన్లు పరస్పరం భారతీయుల విద్యార్థులను బందీలుగా చేసుకున్నారనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ, అలాంటి సమచారం ఏదీ మా దాకా రాలేదు. ఇప్పటివరకైతే అంతా క్షేమంగా ఉన్నారు. వాళ్లను భారత్‌కు తరలించే ఆపరేషన్ గంగ కొనసాగుతోంది అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్‌లో 498 మంది సైనికులు మృతి: రష్యా రక్షణ శాఖ ► ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడులు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ ప్రధాన నగరాలైన కీవ్, ఖర్వివ్‌పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ఉక్రెయిన్‌పై గత 8 రోజులుగా రష్యా దాడులు చేస్తోంది. జనావాసాలపై రాకెట్లు, క్షిపణులతో విధ్వంసం సృష్టిస్తోంది. మరోవైపు రష్యా అణు జలాంతర్గాములను సిద్ధం చేస్తోంది. బారెంట్స్ జలాల్లోకి అణు జలాంతర్గాములను తరలిస్తోంది. ► ఖెర్సాన్, బెర్డ్యాన్స్ ఓడరేవులను రష్యా స్వాధీనం చేసుకుంది. ఒడెస్సా, మరియూపూల్ స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం యత్నిస్తోంది. ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్‌లో 498 మంది సైనికులు మృతి చెందినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ► ఉక్రెయిన్ కీలక ప్రకటన.. ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్ రష్యా బలగాల చేతుల్లోకి వెళ్లిందని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. ► ఆపరేషన్ గంగ.. సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్ మూడోది 208 మంది భారతీయులతో పోలాండ్ నుంచి ఢిల్లీ హిందాన్ ఎయిర్‌బేస్‌లో ఈ ఉదయం దిగింది. సురక్షితంగా వచ్చిన ప్రయాణికులతో ఎంవోఎస్ డిఫెన్స్ అజయ్ భట్ కాసేపు మాట్లాడారు. I have brought my friend's dog with me from Ukraine. Many people who had dogs left them behind in Ukraine, but I brought back this dog along with me: Zahid, a student rescued from Ukraine, at Hindan airbase pic.twitter.com/bEslfEBI6L — ANI (@ANI) March 3, 2022 ► ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా ఖండించింది. ఉక్రెయిన్ స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఐరాస జనరల్ అసెంబ్లీ 76వ ‘అసాధారణ’ సర్వసభ్య సమావేశం ఈ మేరకు తీర్మానం చేసింది. ► ‘ఉక్రెయిన్‌పై దాడి’ పేరుతో రూపొందిన తీర్మానానికి మొత్తం 193 సభ్య దేశాల్లో 141 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. దౌత్యం, చర్చలు తప్ప వివాద పరిష్కారానికి మరో మార్గం లేదని ఈ సందర్భంగా అభిప్రాయపడింది. భారత్‌తో పాటు మొత్తం 35 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. తీర్మానం ఆమోదం పొందిన సందర్భంగా కరతాళ ధ్వనులతో సమావేశ ప్రాంగణం మారుమోగిపోయింది. #UN member states demanded today #Russia to stop its use of force and withdraw immediately from #Ukraine 🇺🇦. Result 141 to 5 demonstrates Putin's unprecedented isolation on the global stage. #StandWithUkraine pic.twitter.com/65ZuVyHrCq — Kaja Kallas (@kajakallas) March 2, 2022 ► అణ్వాయుధ విభాగాన్ని యుద్ధసన్నద్ధం చేయాలన్న రష్యా నిర్ణయాన్ని సమావేశం ఖండించింది. ఆ దేశానికి బెలారస్ మద్దతును కూడా తీవ్రంగా తప్పుబట్టింది. రష్యా తక్షణం యుద్ధాన్ని ఆపాలని, ఉక్రెయిన్ నుంచి తన బలగాలన్నింటినీ బేషరతుగా, సంపూర్ణంగా, తక్షణం ఉపసంహరించాలని డిమాండ్ చేసింది. ► ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను స్వతంత్ర హోదా ఇస్తూ రష్యా తీసుకున్న నిర్ణయాన్ని కూడా నిరసించింది. చర్చలు, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాన్ని తక్షణం శాంతియుతంగా పరిష్కరించుకోవాలని కోరింది. 15 మంది సభ్యుల ఐరాస భద్రతా మండలిలోనూ ఆదివారం ఇలాంటి తీర్మానాన్నే ప్రవేశపెట్టగా రష్యా వీటో చేయడం తెలిసిందే. ► ఈ నేపథ్యంలో జనరల్ అసెంబ్లీ అత్యవసర ప్రత్యేక సమావేశం నిర్వహించింది. కాల్పుల విరమణ తక్షణావసరమని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్.తిరుమూర్తి పేర్కొన్నారు. భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు భారీగా ఉక్రెయిన్‌లో చిక్కుబడ్డారని, ఒకరు కాల్పులకు బలయ్యారని ఆవేదన వెలిబుచ్చారు. Diplomats from #European countries left the hall of the #UN Human Rights Council before Lavrov's speech. Diplomacy in #Russia is dead pic.twitter.com/6UOsICDjU4 — NEXTA (@nexta_tv) March 1, 2022