న్యూఢిల్లీ/ మాస్కో: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను వెనక్కి తీసుకువచ్చే చర్యలను కేంద్రం వేగవంతం చేసింది. గురువారం వైమానిక దళానికి చెందిన నాలుగు సీ–17 విమానాలు మొత్తం 798 మందిని ఢిల్లీకి తీసుకువచ్చాయి. ఆపరేషన్ గంగ ద్వారా 30 విమానాల్లో ఇప్పటి వరకు 6,400 మందిని వెనక్కి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. వచ్చే రెండు రోజుల్లో మరో 7,400 రానున్నట్లు తెలిపింది.
అడ్వైజరీలు జారీ చేశాక సుమారు 18వేల మంది భారతీయులు ఉక్రెయిన్ వీడారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇదే సమయంలో, యుద్ధానికి దిగిన రష్యా కూడా భారతీయుల పట్ల సానుకూలత ప్రదర్శించిందన్నారు. సుమారు 130 బస్సుల్లో ఖర్కీవ్, సుమీల్లో చిక్కుకుపోయిన వారిని రష్యాలోని బెల్గోరోడ్‌కు తరలిస్తామని హామీ ఇచ్చిందని వివరించారు. వచ్చే 24 గంటల్లో మూడు సీ–17 ఎయిర్‌ఫోర్స్ విమానాలతోపాటు మొత్తం 18 విమానాలను నడపనున్నామన్నారు. వీటిల్లో రొమేనియా నుంచి ఏడు, హంగరీ నుంచి ఐదు, పోలండ్ నుంచి మూడు, స్లొవేకియా నుంచి ఒకటి ఉంటాయన్నారు.
(చదవండి: ఇంటికి తిరిగి వస్తామనుకోలేదు.. విద్యార్థుల ఆవేదన ఇదే..)
Comments
Please login to add a commentAdd a comment