Indians In Ukraine: Indian Man Refused To Leave Ukraine Without His Pregnant Wife - Sakshi
Sakshi News home page

కష్టమైనా నష్టమైనా నా భార్యతోనే.. యుద్ధం వేళ ఎన్నారై ఉక్కు సంకల్పం

Published Mon, Mar 7 2022 12:32 PM | Last Updated on Mon, Mar 7 2022 1:07 PM

Operation Ganga: NRI refuses to leave Ukraine without pregnant wife amid Ukraine Russia war - Sakshi

యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల​‍్లుతున్నాయి. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చనే భయం వెంటాడుతోంది. కానీ గుండెల్లో నిండిన ప్రేమ ముందు ఇవన్నీ బలాదూర్‌ అయ్యాయి. 

భారతీయుడై గగన్‌ ఉక్రెయిన్‌లో స్థిరపడ్డాడు. అక్కడి స్థానిక మహిళను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. అయితే అనుకోకుండా వచ్చిన యుద్ధంతో ఆ కుటుంబం చిక్కుల్లో పడింది. బాంబుల మోత, తుపాకుల గర్జన మధ్య బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్‌లో గడుపుతోంది.

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకువచ్చేందుకు ఇండియా ఆపరేషన​ గంగాను చేపట్టింది. ఉక్రెయిన్‌లో వివిధ ప్రాంతాల్లో ఇండియన్లను పొరుగున్న ఉన్న రొమేనియా, పొలాండ్‌, స్లోవేకియా, హంగేరిల మీదుగా ఇండియాకి వస్తున్నారు. ఈ క్రమంలో భారత అధికారులను గగన్‌ కలిశాడు.

ఆపరేషన్‌ గంగలో కేవలం భారతీయులకే అవకాశం ఉందని భారత అధికారులు చెప్పారు. ఉక్రెయిన్‌ వణిత అయిన అతని భార్యను తరలించేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు. గగన్‌ ఒక్కడితే ఇండియాకు తరలిస్తామన్నారు. కష్టకాలంలో గర్భవతిగా ఉన్న భార్యను వదిలి వచ్చేందుకు నిరాకరించాడు గగన్‌. కష్టమైనా నష్టమైనా ఆమెతోనే ఉంటానంటూ ఆపరేషన్‌ గగన్‌ అధికారులకు చెప్పాడు.

రోజులు గడుస్తున్నా.. ఎంతకీ  యుద్ధం ఆగకపోకపోవడంతో గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి కీవ్‌ నగరాన్ని గగన్‌ వీడాడు. ప్రస్తుతం పశ్చిమ దిక్కున ఉన్న లివివ్‌ నగరంలో స్నేహితుడి ఇంట్లో ప్రస​‍్తుతం  గగన్‌ , అతని భార్య ఆశ్రయం పొందుతున్నారు. త్వరలోనే తాము పోలాండ్‌ వెళ్లిపోతామంటూ చెబుతున్నాడు గగన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement