వణికిస్తున్న తుఫాను.. వేలాది మంది తరలింపు | cyclone could reach Category 4, evacuation of thousands of people | Sakshi
Sakshi News home page

వణికిస్తున్న తుఫాను.. వేలాది మంది తరలింపు

Published Mon, Mar 27 2017 11:41 AM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM

వణికిస్తున్న తుఫాను.. వేలాది మంది తరలింపు

వణికిస్తున్న తుఫాను.. వేలాది మంది తరలింపు

సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రజలను డెబ్బీ తుఫాను వణికిస్తోంది. తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ అధ్యయన కేంద్రాలు వెల్లడిస్తుండటంతో.. అధికారులు ముందు జాగ్రత్త చర్యలను ముమ్మరం చేశారు. సోమవారం వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ప్రస్తుతం మూడో కేటగిరీ ప్రమాదస్ధాయిలో ఉన్న డెబ్బీ తుఫాను మంగళవారం తీరం దాటనుంది. క్వీన్స్లాండ్లో తీరం దాటేసరికి నాలుగో కేటగిరీ ప్రమాదస్థాయి తుఫానుగా మారుతుందని అంచనావేస్తున్నారు. అధికారులు ఇప్పటికే 3,500 మందిని ఆ ప్రాంతం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. జెట్‌స్టార్‌, వర్జిన్‌, క్వాంటాస్‌ లాంటి విమాన సంస్థలు పలు విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించాయి. అత్యవసర సేవల విభాగం సిబ్బందిని భారీ సంఖ్యలో మోహరించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement