
ఆర్ట్స్ కళాశాలను తరలించొద్దు
ఆర్ట్స్ కళాశాల, ఓల్డ్ హైస్కూల్, ఉద్దూ మీడియం పాఠశాలల తరలింపును నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బోనగిరి మహేందర్ హెచ్చరించారు.
► ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
శాతవాహనయూనివర్సిటీ: ఆర్ట్స్ కళాశాల, ఓల్డ్ హైస్కూల్, ఉద్దూ మీడియం పాఠశాలల తరలింపును నిలిపివేయాలని, లేకుంటే ఆందోళనలు చేస్తామని ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, బోనగిరి మహేందర్ హెచ్చరించారు.
స్థానిక కమాన్‌చౌరస్తాలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యార్థులకు ఇబ్బంది కలిగే ఏ పనిచేసినా ఏఐఎస్‌ఎఫ్ చూస్తూ ఊరుకోదన్నారు. నగర కార్యదర్శి పులి రాకేష్, నాయకులు శ్రీనివాస్, సమ్మయ్య, రోహిత్‌రెడ్డి, రాజుకుమార్, పవన్, రవితేజ, ప్రవీణ్, యజ్ఞ పాల్గొన్నారు.
ఓల్డ్ హైస్కూల్‌ను తొలగిస్తే ఉద్యమిస్తాం: డీటీఎఫ్
కరీంనగర్‌ఎడ్యుకేషన్: స్మార్ట్‌సిటీ పేరుతో నగరంలోని పురాతన పాఠశాల, బాలికల హైస్కూల్, జూనియర్ కళాశాలలను తొలగించాలనుకుంటే ఉద్యమిస్తామని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్(డీటీఎఫ్) జిల్లా ఇన్‌చార్జి అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి కోహెడ చంద్రమౌళి, పట్టణ అధ్యక్షుడు ఎండీ రజాక్ ప్రకటనలో హెచ్చరించారు.
చారిత్రాత్మకమైన ఓల్డ్ హైస్కూల్‌ను తొలగించడం సరికాదని పేర్కొన్నారు. దశాబ్దాలుగా ఉన్న పురాతన పాఠశాలలో మహనీయులు విద్యనభ్యసించారని గుర్తు చేశారు. కళాశాలను దూరప్రాంతాలకు తరలించడం ద్వారా విద్యార్థులపై ఆర్థికభారం పడుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆలోచనను విరమించుకోకుంటే ఉపాధ్యాయ, ప్రజాసంఘాలతో కలిసి ఉద్యమించనున్నట్లు హెచ్చరించారు.