అమెరికాలో కార్చిచ్చు.. 20 వేల కుటుంబాల తరలింపు | Wildfire forces 20,000 evacuations near San Diego | Sakshi
Sakshi News home page

అమెరికాలో కార్చిచ్చు.. 20 వేల కుటుంబాల తరలింపు

Published Wed, May 14 2014 10:17 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

అమెరికాలో కార్చిచ్చు.. 20 వేల కుటుంబాల తరలింపు - Sakshi

అమెరికాలో కార్చిచ్చు.. 20 వేల కుటుంబాల తరలింపు

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాంతో దాదాపు 20 వేల కుటుంబాలను  అక్క్డడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఓ సంచార గృహం కాలిపో్యింది. విపరీతమైన వేడి, తీవ్రమైన గాలులు వస్తుండటంతో అక్కడ ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. ఖాళీ చేయించినవాటిలో చాలా ఇళ్లు నగరంలోను, ఉత్తర శాండియాగో కౌంటీలోను ఉన్నాయని శాండియాగో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. 280 హెక్టార్ల పరిధిలో ఉన్న అడవిలో మంటలు మంగళవారం ఉదయం చెలరేగాయి. తీవ్రంగా ఉన్న గాలులు వాటికి తోడయ్యాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లతో పాటు రెండు హైస్కూళ్లు, ఓ ప్రాథమిక పాఠశాలను కూడా ఖాళీ చేయించినట్లు పోలీసు డిటెక్టివ్ గేరీ హాసెన్ తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం లాస్ ఏంజెలిస్కు ఉత్తరంగా దావానలం చెలరేగింది. శాంటా బార్బరా కౌంటీలో చెలరేగిన ఈ మంటల వల్ల లాంపాక్ పట్టణంలో దాదాపు 150-200 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ మంటల ఫలితంగా లాస్ ఏంజెలిస్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 10 డిగ్రీలు ఎక్కువ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement