san diego
-
మరికొన్ని రోజులు అక్కడే ఉండనున్న ప్రభాస్
దాదాపు ముప్పై రోజులుగా ఫారిన్ ట్రిప్‌లో ఉన్నారు ప్రభాస్. ఈ ట్రిప్ ఇప్పటికే పూర్తి కావాల్సిందట.. కానీ మరికొన్ని రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ప్రాజెక్ట్ కె’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకొనె, దిశాపటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సి.అశ్వనీదత్ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ఇది. ఈ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని ‘శాన్ డియాగో కామిక్ కాన్ 2023’ వేడుకలో లాంచ్ చేస్తారు. ఈ నెల 20న (భారతీయ కాలమానం ప్రకారం ఈ నెల 21) జరగనున్న ఈ వేడుక కోసం ప్రభాస్ మరికొన్ని రోజులు అమెరికాలోనే ఉండి, ఆ తర్వాత ఇండియాకి తిరిగొస్తారట. అనంతరం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్: సీజ్ఫైర్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. కాగా మారుతి దర్శకత్వంలో ‘రాజా డీలక్స్’(ప్రచారంలో ఉన్న టైటిల్) అనే సినిమా చేస్తున్నారు ప్రభాస్. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే సినిమాకి ప్రభాస్ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. -
కామిక్–కాన్ 2023లో ప్రాజెక్ట్ కె
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న పాన్ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’ అరుదైన ఘనత సాధించింది. కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో నిర్వహించనున్న ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ వేడుకలో ‘ప్రాజెక్ట్ కె’ సినిమా టైటిల్, ట్రైలర్, సినిమా విడుదల తేదీని లాంచ్ చేయనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకోన్ హీరోయిన్. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అశ్వనీదత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఇండియా గొప్ప కథలకు, సూపర్ హీరోలకు నిలయం. మా ‘ప్రాజెక్ట్ కె’ సినిమా, కథ గురించి ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’ సరైన వేదిక అని భావిస్తున్నాం’’ అన్నారు. ‘‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో లాంచ్ అవుతున్న తొలి భారతీయ చిత్రంగా ‘ప్రాజెక్ట్ కె’ చరిత్ర సృష్టించనుంది. ప్రపంచపటంలో భారతీయ సినిమాను చూడాలని కోరుకునే భారతీయ ప్రేక్షకులందరికీ ఇది గర్వకారణం’’ అన్నారు అశ్వనీదత్. ఈ నెల 20న ప్రారంభమయ్యే ‘శాన్ డియాగో కామిక్–కాన్ 2023’లో కమల్‌హాసన్, ప్రభాస్, దీపికా పదుకోన్, నాగ్ అశ్విన్ తదితరులు పాల్గొంటారు. -
బెలూన్ వరల్డ్‌కప్.. క్రీడాకారిణి ప్రాణం మీదకు
బెలూన్ వరల్డ్‌కప్ ఒక క్రీడాకారిణి ప్రాణం మీదకు తెచ్చింది. సరదాగా మొదలైన ఆట ఆఖర్లో కాస్త ఉత్కంఠను రేపింది. విషయంలోకి వెళితే.. ట్విచ్కాన్ 2022 పేరిట అక్టోబర్ 8న సాన్ డీగోలో బెలూన్ వరల్డ్‌కప్ నిర్వహించారు. ఈ గేమ్‌లో చాలా మంది పాల్గొన్నారు. బెలూన్ గేమ్ అంటే ఏంటి? గాలిలోకి ఎగిరిన బెలూన్ కిందపడకుండా చేతితోనే కొడుతుండాలి. ఒక్కో రౌండ్ రెండు నిమిషాల పాటు ఆడాలి. ఈ క్రమంలో ఆటలో పాల్గొన్న క్రీడాకారుల్లో ఒకరినొకరు చేజ్ చేస్తూ ఎవరు ఎక్కువసేపు బెలూన్ను గాలిలోకి కొట్టగలిగితే వారిని విజేతగా నిర్ణయిస్తారు. ఇది క్లుప్తంగా బెలూన్ వరల్డ్‌కప్ గేమ్. కాగా బెలూన్ వరల్డ్‌కప్‌లో ట్విచ్ స్రీమర్ జుమ్మెర్స్ కూడా పాల్గొంది. జుమ్మెర్స్ ఇదివరకు చాలాసార్లు బెలూన్ గేమ్స్‌లో విజయాలు అందుకొని ఫెవరెట్‌గా మారిపోయింది. ఆమెకు అభిమాన దళం కూడా ఎక్కువే. ఇక మ్యాచ్‌లో జుమ్మెర్స్ ఆద్యంతం ఆధిపత్యం చెలాయిస్తూ చాలావరకు బెలూన్ను గాల్లోనే ఉంచింది. అయితే మరికొద్ది సెకన్లలో ఆట ముగుస్తుందనగా ఆమె సోఫాలో నుంచి జారి కింద పడింది. తల భాగం గట్టిగా తగలడంతో పెద్ద గాయం అయిందని అంతా భావించారు. కానీ జుమ్మెర్స్ కుడి చీలమండకు మాత్రం తీవ్ర గాయమైంది. వెంటనే నిర్వహాకులు ఆమెను స్ట్రెచర్‌పై తీసుకెళ్లి చికిత్స అందించారు. మూడువారాలు రెస్ట్ తీసుకుంటే కోలుకునే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయితే దీనికి సంబంధించిన వీడియోను ట్విచర్ జుమ్మెర్స్ కోరిక మేరకు తొలగించారు. ఇక జుమ్మెర్స్ గాయపడడంపై ఆమె అభిమానులు ట్విటర్ వేదికగా త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. చదవండి: ఏదైనా సాధిస్తేనే ఇంటికి రా..' -
రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు..
Armored Truck Spills Cash On Highway: కాలిఫోర్నియా: స్థలం: అమెరికాలో దక్షిణ కాలిఫోర్నియాలోని ఫ్రీవే రహదారి. సమయం: శుక్రవారం ఉదయం 9.15 గంటలు. దృశ్యం: రోడ్డుపై పెద్ద సంఖ్యలో పడి ఉన్న కరెన్సీ నోట్లు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ వాటిని జేబుల్లో నింపుకుంటున్న జనం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శాన్‌డిగో నుంచి కాలిఫోర్నియాలోని ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కార్యాలయానికి డబ్బు సంచులతో బయలుదేరిన వాహనం తలుపు మార్గమధ్యంలో అకస్మాత్తుగా తెరుచుకుంది. కొన్ని సంచులు కిందపడి పోయాయి. వాటిలోని డబ్బులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలావరకు ఒక డాలర్, 20 డాలర్ల నోట్లే ఉన్నాయి. గమనించిన వాహనదారులు వాటిని జేబుల్లో వేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇరువైపులా రోడ్డును దిగ్బంధించారు. వాహనదారులను అడ్డుకున్నారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆదేశించడంతో కొందరు ఇచ్చేశారు. చాలామంది అక్కడి నుంచి జారుకున్నారు. డెమీ బాగ్బీ అనే బాడీ బిల్డర్ ఈ దృశ్యాలన్నీ ఫోన్లో చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశాడు. ఎన్ని డబ్బులు పోయాయన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీసుకున్నవారు తిరిగి ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఇండియన్ నేవీలోకి రోమియోలొచ్చేశాయ్, ప్రత్యేకతలివే!
వాషింగ్టన్/న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్య ఘర్షణలతో దేశ భద్రత సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మన రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమైంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన బహుళ ప్రయోజనాలు కలిగే ఎంహెచ్–60ఆర్ రోమియో హెలికాప్టర్లు 24లో రెండు భారత్‌కి అందించింది. దీంతో దేశ నావికా చరిత్రలో ఒక కొత్త శకం మొదలైంది. అగ్రరాజ్యంలో శుక్రవారం శాన్‌డియోగోలో నేవల్ ఎయిర్ స్టేషన్లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రెండింటిని భారత్‌కు లాంఛనంగా అప్పగించింది. ఈ కార్యక్రమంలో అమెరికాలో భారత రాయబారి తారాంజిత్ సింగ్ సాంధు, అమెరికా నేవల్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నెత్ వైట్సెల్, భారత్ కమాండర్ రవ్నీత్ సింగ్, హెలికాఫ్టర్లు తయారు చేసిన లాక్‌హీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. వీటి చేరికతో అమెరికా, భారత్ మధ్య రక్షణ బంధం మరింత బలోపేతమైందని సాంధు అన్నారు. ఆకాశమే హద్దుగా అమెరికా, భారత్ స్నేహబంధం సాగిపోతోందని ఆయన ట్వీట్ చేశారు. గత నెలరోజులుగా హెలికాఫ్టర్ల వాడకంపై భారత్‌కు చెందిన 20 మంది అ«ధికారులు, సాంకేతిక నిపుణులకు అమెరికాలో శిక్షణా కార్యక్రమం జరుగుతోంది భారత్ రక్షణ వ్యవస్థ పటిష్టం 2020 ఫిబ్రవరిలో అప్పట్లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటనకు ముందు హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం కుదిరింది. అమెరికా విదేశాంగ శాఖ నిర్వహించిన సేల్స్‌లో భాగంగా 24 హెలికాప్టర్లని 240 కోట్ల డాలర్లు (ఇంచుమించుగా 18 వేల కోట్లు ) భారత్ కొనుగోలు చేసింది. హిందూ మహాసముద్రంలో చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తోంది. భారత్ చుట్టూ జలాంతర్గాముల్ని మోహరించింది. దీంతో ఇలాంటి అత్యాధునికమైన హెలికాప్టర్లు మన దగ్గర ఉండే అవసరం ఉందని భారత్ గుర్తించింది. కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి సీ కింగ్ హెలికాఫ్టర్లు మన దగ్గర ఉన్నాయి. అవి కదన రంగంలో మనకి ఉపయోగపడడం లేదు. దీంతో వాటిని కేవలం రవాణా అవసరాల కోసమే వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ హెలికాప్టర్ల రాకతో మన త్రివిధ బలగాలు మరింత బలోపేతం కానున్నాయి. హెలికాప్టర్ ప్రత్యేకతలు ► ఈ హెలికాప్ట్టర్ల పూర్తి పేరు ఎంహెచ్రోమియో సీహాక్ ► ప్రముఖ రక్షణ ఉత్పత్తుల కంపెనీ లాక్‌హీడ్ మార్టిన్ తయారు చేసిన ఈ హెలికాఫ్టర్లకు ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైనవని పేరుంది ► వీటిని యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ ఆయుధంగా కూడా వాడవచ్చు. అంటే త్రివిధ బలగాల్లోనూ వీటిని వినియోగించుకోవచ్చు ► హెల్ఫైర్ క్షిపణులు, ఎంకే 54 టార్పెడోస్లను మోసుకుపోగలిగే సామర్థ్యం దీని సొంతం ► ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో అయినా ప్రయాణించడానికి అత్యాధునిక సెన్సార్లు, రాడార్లు వాడారు. ► సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకల కదలికల్ని పసిగట్టి దాడులు చేయగలదు ► జలాంతర్గాముల్ని కూడా వెంటాడి ధ్వంసం చేసేలా డిజైన్ని రూపొందించారు ► గంటకి 267కి.మీ. వేగంతో దూసుకుపోతుందిప్రకృతి విపత్తుల సమయాల్లో ఈ హెలికాప్టర్లను సహాయ కార్యక్రమాలకు కూడా వినియోగించుకోవచ్చు ► సైనికులకు అవసరమయ్యే సామగ్రినిసరిహద్దులకి తరలించవచ్చు ► ప్రస్తుతం ఈ హెలికాప్టర్లను అమెరికా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు మాత్రమే వినియోగిస్తున్నాయి. -
సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు.. పళ్లు రాలగొట్టింది
వాషింగ్టన్: సీటు బెల్ట్ పెట్టుకోమన్నందుకు ఎయిర్‌హోస్టెస్ పళ్లు రాలగొట్టింది ఒక మహిళ. ఈ సంఘటన అమెరికా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో చోటు చేసుకుంది. ‘‘విమానం ల్యాండ్ అవ్వబోతుంది. సీట్ బెల్ట్ ధరించండి’’ అని చెప్పినందుకు సదరు ప్రయాణికురాలు ఇంత దారుణానికి తెగబడింది. విమానంలో ఉన్న ప్యాసింజర్ ఒకరు దీన్ని వీడియో తీసి షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. విమానం ల్యాండ్ అవబోతుందనగా ఎయిర్ హోస్టెస్ విమానంలో ఉన్న 28 ఏళ్ల ప్రయాణికురాలు వైవియానా క్వినోనెజ్ని సీట్ బెల్ట్ ధరించాల్సిందిగా కోరింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి లోననై క్వినోనెజ్ని ఫ్లైట్ అటెండెంట్ మీద దాడి చేసింది. ఆమె ముఖం మీద గట్టిగా కొట్టింది. పక్కనున్న ప్రయాణికులు ఆపడానికి ప్రయత్నించారు వీలు కాలేదు. ఓ ప్రయాణికుడు ఎయిర్ హోస్టెస్ మీద ఇలా దాడి చేయడం మంచి పద్దతి కాదని వారించాడు. కానీ ఆ ప్రయాణికురాలు వారి మాటలు వినిపించుకోలేదు. ఈ డాడిలో ఎయిర్‌హోస్టెస్ రెండు పళ్లు ఊడిపోయాయి, ఆమె ముఖానికి తీవ్ర గాయలైనట్లు తెలిసింది శాన్ డియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత క్వినోనెజ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఆమెను బ్యాటరీ కోసం అరెస్టు చేసినట్లు పోర్ట్ ఆఫ్ శాన్ డియాగో హార్బర్ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: ఎయిర్ హోస్టెస్ వ్యభిచార ప్రచారం: విమానంలో.. -
నావీ షిప్లో అగ్ని ప్రమాదం.. 17 మందికి గాయాలు
లాస్ ఏంజిల్స్ : కాలిఫోర్నియాలోని యునైటెడ్ స్టేట్స్ నావీ షిప్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. శాన్‌డియాగో ఓడరేవులో ఉన్న యూఎస్ బోన్హోమ్ రిచర్డ్, ఆన్ అంఫిబియస్ అసల్ట్ నౌకలో అనూహ్యంగా పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ దుర్ఘటనలో 21 మంది గాయపడినట్లు అధికారులు, స్థానిక మీడియా పేర్కొంది. దట్టమైన పొగ పీల్చడం ద్వారా 17 మంది నావికులు నలుగురు పౌరులు తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఘటన సమయంలో సుమారు 160 మంది నావికులు పోర్టులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. (ఐదురోజులుగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు) -
శ్రీనివాస్ ఎరవెల్లి మృతి పట్ల ఆటా సంతాపం
శాన్ డియాగో : ప్రముఖ సాప్ట్వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఎరవెల్లి ఆకస్మిక మృతి పట్ల అమెరికన్ తెలుగు సంఘం(ఆటా) దిగ్భాంత్రి వ్యక్తం చేసింది. కరీంనగర్లో పాఠశాల విద్యను అభ్యసించిన శ్రీనివాస్ 20 ఏళ్లుగా కాలిఫోర్నియాలోని శాన్ డియాగో నగరంలో నివసిస్తున్నారు. ప్రఖ్యాత కంపెనీ క్వాల్కామ్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి డైరెక్టర్‌గా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గణితం, కంప్యూటర్ సైన్స్‌లో శ్రీనివాస్‌కు ప్రావీణ్యం ఉంది. చిన్ననాటి నుంచి ఆయనకు గణితంపై ఉన్న కుతూహలమే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా అందుకునేలా చేసింది. అనంతరం ఆయన అరిజోనా స్టేట్ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఖాళీ సమయంలో శ్రీనివాస్ స్థానిక పాఠశాలలకు వెళ్లి గణితాన్ని బోధించేవారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మృతి పట్ల ఆయన కుటుంబానికి ఆటా ప్రగాఢ సానుభూతి తెలిపింది. శ్రీనివాస్ ఆటా రీజినల్ డైరెక్టర్లలో ఒకరైన వెంకట్ తుడికి సోదరుడు. కాగా, శుక్రవారం శాన్‌డియాగోలోని గ్రీన్ వుడ్ మెమోరియల్‌లో శ్రీనివాస్ భౌతికకాయానికి అంత్యక్రియలు జరగనున్నాయి. -
ట్రంప్ ర్యాలీలో ఘర్షణ
వాషింగ్టన్: డోనాల్డ్ ట్రంప్ ర్యాలీలో మళ్లీ ఘర్షణ. కాలిఫోర్నియాలోని శాండియాగోలో ట్రంప్ మద్దతుదారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం కేకలు వేసుకుని, నీళ్ల సీసాలు విసురుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి సుమారు 35 మందిని అరెస్టు చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినందుకు శాండియాగో పోలీసులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించారని ట్వీట్ చేశారు. జూన్ 7న కాలిఫోర్నియా ప్రైమరీలో ఎన్నికలు జరగనున్నాయి. మెక్సికో సరిహద్దు సమీపంలో ఆ ప్రాంతం ఉన్నందున ఆందోళనకారులు ట్రంప్ ర్యాలీని అడ్డుకున్నారు. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు మెక్సికో సరిహద్దులో గోడ కట్టనున్నట్లు గతంలో ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, విరాళాల సేకరణ కోసం చేసిన తొలి యత్నంలోనే ట్రంప్ రూ. 40 కోట్లు సేకరించారు. -
అతిపెద్ద మానవరహిత నౌక
శాన్ డియాగో(అమెరికా): డ్రోన్లు, డ్రైవర్ లేని కార్లలాగానే కెప్టెన్లు లేకుండా ప్రయాణించే నౌకలు వచ్చేస్తున్నాయి. ప్రపంచంలో అతి పెద్ద మానవరహిత నౌకను పెంటగాన్‌లో మంగళవారం ప్రదర్శించారు. 132 అడుగులున్న ఈ నౌక... నీటి లోపలున్న జలాంతర్గాములను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇది 10,000 నాటికల్ మైళ్ల వరకు ప్రయాణించగలదని సైనిక పరిశోధన విభాగం డిఫెన్స్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ తెలిపింది. నౌకను రెండు సంవత్సరాల పాటు శాన్‌డియాగో తీరంలో పరీక్షించనున్నారు. -
పసిబిడ్డను కొరికి చంపేసింది
శాన్ డియాగో: అమెరికాలో దారుణం జరిగింది. మూడేళ్ల పసిపాపను ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరిచి చంపేసింది. ఈ సమయంలో ఆ పాప తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని శాన్ డియాగోలో స్టాన్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో ఓ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ దంపతులు టీవీ చూస్తుండగా ఆ కుక్క పాపతోపాటే బెడ్ పై ఉంది. అదే సమయంలో టీవీ చూస్తున్న పాప తల్లి ఒక్కసారిగా బలంగా దగ్గడంతో ఆ చప్పుడుకు కంగారుపడిన కుక్క గాబరాతో పసిబిడ్డను కొరకడం ప్రారంభించింది. ఎట్టకేలకు వారు కుక్క నుంచి ఆ బిడ్డను వేరు చేసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆ కుక్కకు పిచ్చి తగ్గించి పది రోజులపాటు దాని నడవడికను పరీక్షించేందుకు ప్రత్యేక సెల్ లో పోలీసులు వేశారు. -
కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం!
కాలిఫోర్నియా: గతేడాది భార్యాభర్తలు కాల్పులు జరిపి 14మందికి పైగా అమాయకులను పొట్టనపెట్టుకున్న శాన్ డియాగోలో మరోసారి కలకలం రేగింది. మంగళవారం శాన్ డియాగో లోని నావల్ ఆస్పత్రిలో కాల్పులు జరిగి ఉండవచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసినట్లు తెలియగానే అధికారులు అప్రమత్తమయ్యారు. మెడికల్ సెంటర్లో ఓ షూటర్ తిరుగున్నాడని అధికారులు అనుమానిస్తున్నారు. షూటర్ వార్త స్థానికంగా కలకలం సృష్టించడంతో ఆస్పత్రిని మూసివేసినట్లు ఓ అధికార ప్రతినిధి తెలిపారు. ఆస్పత్రి సిబ్బందిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపి కొంత మందిని గాయపరిచినట్లు వివరించారు. ఆస్పత్రి బిల్డింగ్ వద్ద బలగాలు ఉన్నాయని, షూటర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. -
ఆ కవలలు పుట్టిన సంవత్సరాలు వేరు!
వాళ్లిద్దరూ కవల పిల్లలు. కానీ వేర్వేరు సంవత్సరాల్లో పుట్టారు. ఇదెలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? విషయం ఏమింటంటే కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతానికి చెందిన మారిబెల్ వాలెన్షియా అనే మహిళ 2015 డిసెంబర్ నెలాఖరులో ఆస్పత్రిలో కాన్పు కోసం చేరారు. అక్కడ ఆమెకు 31వ తేదీ రాత్రి జేలిన్ అనే అమ్మాయి తొలుత పుట్టింది. ఆ తర్వాత కొద్ది నిమిషాల తర్వాత.. అంటే, 2016 జనవరి ఒకటో తేదీ తెల్లవారుజామున 12.02 నిమిషాలకు లూయిస్ అనే కొడుకు పుట్టాడు. దాంతో కవల అక్కాతమ్ముళ్లు ఇద్దరూ వేర్వేరు సంవత్సరాలలో పుట్టినట్లు అయ్యింది. ఇది చూసిన ఆ తల్లిదండ్రుల సంతోషానికి పట్టపగ్గాలు లేవు. నిజానికి వీళ్లిద్దరూ కూడా జనవరి నెలాఖరులోనే పుడతారని వైద్యులు భావించారు. కానీ అలా జరగకుండా తమ తల్లిదండ్రులకు ఆనందం మిగిల్చారు. ఈ కవలల తల్లి శాండియాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యాషియర్‌గా పనిచేస్తుంటే, ఆమె భర్త లూయిస్ యునైటెడ్ స్టేట్స్ నేవీలో డీజిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. వీళ్లకు ఇప్పటికే మూడేల్ల ఇసబెల్లా అనే కూతురు కూడా ఉంది. -
పాపం గొరిల్లా...!
కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో జూలో తీసిన చిత్రమిది. సందర్శకులు జూ ఎన్‌క్లోజర్‌లోకి ఓ పెద్దసైజు నిమ్మపండును విసరగానే... ఇదిగో ఈ గోరిల్లా తన కండబలం చూపి మిగతా వాటిని తరిమేసింది. పండును దక్కించుకుంది. తిందామని కొరకగానే... నిమ్మరుచికి దాని ముఖంలో కనిపించిన హావభావాలివి... -
తొక్కేకదా అని తేలిగ్గా తీసేయకు....
కాలిఫోర్నియా: అరటి పండు తొక్కను తేలిగ్గా తీసుకొని పారేయకు. పండులోకన్నా తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ప్రసిద్ధి చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. తొక్కలో ఏ, బీ6,బీ12, సీ విటమిన్లతోపాటు మ్యాగ్నీషియమ్, పొటాషియమ్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఉన్నాయని శాండియాగోకు చెందిన లారా ఫ్లోర్స్, ఎల్లా ఆల్రెడ్ అనే పోషక విలువల నిపుణులు తెలియజేస్తున్నారు. ఏ విటమిన్ వల్ల పళ్లు, ఎముకలు ఆరోగ్యంగా తయారవుతాయి. పంటి చిగుళ్లు బలపడుతాయి. బీ6 విటమిన్ వల్ల శరీరంలో నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె, మెదడు ఆరోగ్యానికి దోహదపడుతుంది. బీ12 విటమిన్ మెదడుతోపాటు నాడీ వ్యవస్థకు బలం చేకూరుస్తుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడంతోపాటు బరువును తగ్గిస్తుంది. సీ విటమిన్ శరీరంపై గాయాలు మానేందుకు ఉపయోగపడుతుంది. కొత్త కణజాలం, లిగమెంట్ల అభివృద్ధికి దోహదపడుతుంది. ఫైబర్ వల్ల జీర్ణ వ్యవస్థ బలపడడమే కాకుండా శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నిద్ర లేమిని దూరం చేసేందుకు, మనసు ప్రశాంతంగా ఉండేందుకు పొటాషియం, మ్యాగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు దోహదపడతాయి. అరటి పండు తొక్కలో మరెన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారత్ లాంటి దేశాల్లో చర్మంపై దురదలు పోవడానికి, పులిపిర్లను నయం చేసేందుకు ప్రధానంగా ఉపయోగిస్తారు. దోమలు, ఇతర కీటకాలు కుట్టిన చోట తొక్కను ప్యాచ్‌లాగా వేస్తే చల్లదనానిచ్చి ఉపశమనం కలిగిస్తుంది. సిట్రిక్ యాసిడ్ కలిగిన నారింజ, నిమ్మ కాయల తొక్కల్లో కూడా పోషక విలువలు అధికంగా ఉంటాయని, అవి త్వరగా జీర్ణం కావు కనుక వాటిని ఆహారంగా తీసుకోలేమని నిపుణులు తెలియజేస్తున్నారు. అరటి పండు తొక్క త్వరగా జీర్ణమవుతుందని, నేరుగా తినలేనివాళ్లు ఉడకబెట్టుకొని, కొంచెం వేపుకొని కూడా తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. -
శాండియాగోలో కార్చిచ్చు
శాన్‌డియాగో: అమెరికాలోని శాండియాగో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కి.మీ. దూరంలో సైతం కార్చిచ్చు చెలరేగింది. అక్కడి నుంచి 1,200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. కార్చిచ్చు వల్ల ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కి మించి ఉండటంతో మంట లను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. శాండియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి. -
శాన్‌డియాగో చెలరేగిన మంటలు
శాన్‌డియాగో: అమెరికాలోని శాన్‌డియాగో ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కిలోమీటర్ల దూరంలో సైతం మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. అక్కడి నుంచి 1200 కుటుంబాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. మంటల కారణంగా ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఎవరూ గాయపడలేదు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి ఉండటంతో మంటలను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. మంటలను అదుపు చేయడానికి హెలీకాప్టర్ల ద్వారా నీటిని పోశారు. శాన్‌డియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి. మంటలు ఇళ్ల వరకు రావడంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడి వారిని హుటాహుటిన తరలించి, మంటలను అదుపు చేశారు. కొంత ప్రయాసపడ్డా, సాయంత్రంలోగా మంటలను సమర్థంగానే అదుపు చేయగలిగామని శాన్‌డియాగో అగ్నిమాపక విభాగాధిపతి జేవియర్ మయినార్ చెప్పారు. -
అమెరికాలో కార్చిచ్చు.. 20 వేల కుటుంబాల తరలింపు
అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దాంతో దాదాపు 20 వేల కుటుంబాలను అక్క్డడి నుంచి తరలించాల్సి వచ్చింది. ఓ సంచార గృహం కాలిపో్యింది. విపరీతమైన వేడి, తీవ్రమైన గాలులు వస్తుండటంతో అక్కడ ఉండటం దాదాపు అసాధ్యంగా మారింది. ఖాళీ చేయించినవాటిలో చాలా ఇళ్లు నగరంలోను, ఉత్తర శాండియాగో కౌంటీలోను ఉన్నాయని శాండియాగో ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్ తెలిపింది. 280 హెక్టార్ల పరిధిలో ఉన్న అడవిలో మంటలు మంగళవారం ఉదయం చెలరేగాయి. తీవ్రంగా ఉన్న గాలులు వాటికి తోడయ్యాయి. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లతో పాటు రెండు హైస్కూళ్లు, ఓ ప్రాథమిక పాఠశాలను కూడా ఖాళీ చేయించినట్లు పోలీసు డిటెక్టివ్ గేరీ హాసెన్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం లాస్ ఏంజెలిస్‌కు ఉత్తరంగా దావానలం చెలరేగింది. శాంటా బార్బరా కౌంటీలో చెలరేగిన ఈ మంటల వల్ల లాంపాక్ పట్టణంలో దాదాపు 150-200 ఇళ్లను ఖాళీ చేయించారు. ఈ మంటల ఫలితంగా లాస్ ఏంజెలిస్ ప్రాంతంలో ఉష్ణోగ్రత 33.5 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకుంది. ఇది సాధారణ ఉష్ణోగ్రత కంటే 10 డిగ్రీలు ఎక్కువ.