శాన్‌డియాగో: అమెరికాలోని శాండియాగో ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగడంతో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శాంతా బార్బరా కౌంటీకి 400 కి.మీ. దూరంలో సైతం కార్చిచ్చు చెలరేగింది. అక్కడి నుంచి 1,200 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ మంగళవారం కార్చిచ్చు చెలరేగింది. అయితే, రెండు ప్రాంతాల్లోనూ చీకటిపడే వేళకు మంటలు చల్లారడంతో సురక్షిత ప్రాంతాల్లో ఉన్నవారు తమ తమ ఇళ్లకు వెళ్లవచ్చని అధికారులు సూచించారు. కార్చిచ్చు వల్ల ఇళ్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ సీజన్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కి మించి ఉండటంతో మంట లను చల్లార్చేందుకు అగ్నిమాపక సిబ్బంది కొంత ప్రయాసపడ్డారు. శాండియాగో సమీపంలోని రాంకో బెర్నార్డో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు శరవేగంగా 280 హెక్టార్ల మేరకు విస్తరించాయి.